వ్రాసినది: mohanrazz | 2009/09/17

శంకర్ + జేమ్స్ బాండ్ = మల్లన్న :)

mallanna

ఇప్పటికే చాలా రివ్యూల్లో చదివో, టైం బాగోక సినిమాకి వెళ్ళో ఆల్రెడీ చాలా మందికి మల్లన్న సినిమా కథ తెలుసు. శంకర్ మొదటి సినిమా జెంటిల్మేన్ రిలీజ్ అయినప్పుడు ఎవరో వ్రాసారు- మణిరత్నం తరహా సామాజిక కథాంశానికి సెల్వమణి తరహా భారీ యాక్షన్ ని జోడిస్తే శంకర్ అని. నిజానికి అప్పట్లో సెల్వమణి భారీ యాక్షన్ చిత్రాలతో సౌత్ ఇండియాలో నే కాస్ట్లీయెస్ట్ డైరెక్టర్ గా కితాబులందుకుంటున్నాడు. మణిరత్నం విభిన్న తరహా సినిమాలతో ఎలైట్ ఆడియెన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఈ లెక్కన మణిరత్నం + సెల్వమణి = శంకర్ అనేది ఒక కొత్త దర్శకుడికి గొప్ప ప్రశంసే! కానీ ఆ తర్వాత తనదైన శైలి ని ఏర్పాటు చేసుకుని “శంకర్ తరహా కథ/ సినిమా” అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ బ్రాండ్ ఎంతలా ముద్రపడిపోయిందీ అంటే అజిత్ సిటిజన్ అనే ఒక విభిన్న కథాంశం తో సినిమా తీసినా(ఒక గ్రామం కనిపించకుండా పోతుంది ఈ సినిమాలో. 1970 దాకా ఇండియన్ మ్యాప్ లో ఉన్న గ్రామం – ఆ తర్వాత మ్యాప్ లో నుంచి కూడా అదృశ్యమవుతుంది), మురుగదాస్ అవినీతి మీద రమణ (మన “ఠాగూర్”) తీసినా- “ఈ కథ శంకర్ చేతిలో పడి ఉంటేనా” అని మామూలు జనాలు అనుకునేంత గా.

 

మణిరత్నం+ సెల్వమణి = శంకర్ లాంటి ఈక్వేషన్లు వ్రాయడం పెద్ద తప్పేమీ కాదు. అపరిచితుడు రిలీజ్ రోజు ఉదయం పదికల్లా రివ్యూలొచ్చేసాయి తమిళ సైట్లలో. చదివాక ఆ రివ్యూని ఫ్రెండ్స్ కొంతమంది కి మెయిల్ లో ఫార్వర్డ్ చేస్తూ సబ్జెక్ట్ గా – “Tell me your Dreams + భారతీయుడు = అపరిచితుడు” అని వ్రాసాను. మల్లన్న సినిమా చూసినతర్వాత అనిపించిందొక్కటే- శంకర్ సినిమా కథ కి జేమ్స్ బాండ్ తరహా ట్రీట్‌మెంట్ ఇద్దామన్న డైరెక్టర్ స్ట్రాటజీ బెడిసికొట్టిందని. సి.బి.ఐ లో పనిచేసే మల్లన్న అనే ఆఫీసర్ ఎంతో మంది బడాబాబుల బ్లాక్ మనీ సీజ్ చేసి- దాన్ని రాబిన్ హుడ్ తరహా లో పేదలకి పంచిపెట్టడం అనే కథని తీసుకుని- దానికి మల్లన్న గుడి ఒకదాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని – పేద వాళ్ళ దైవ భక్తి ని ఆసరా చేసుకుని- దేవుడే ఆ డబ్బు మనకి ఇస్తున్నాడని ప్రజల్ని నమ్మిస్తూ ముందుకు సాగే కథలో తప్పేమీ నాకు కనిపించలేదు నాకు. కానీ సన్నివేశాల్ని విపరీతంగా సాగదీసిన విధానం, సెకండాఫ్ లో మెక్సికో ఎపిసోడ్ లో ప్రేక్షకుల కంట రక్తకన్నీరు పెట్టించిన వైనం, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగుడుగునా ప్రేక్షకుడి మీద అరాచకాలే.

 

కానీ – శంకర్ తరహా కథని జేమ్స్ బాండ్ సినిమా తరహాలో చెప్పాలన్న బేసిక్ ఐడియా లో అయితే తప్పు లేదు అనిపించింది. కొన్ని సినిమాలు చూసినపుడు – దర్శకుడు ఏమి చెప్పి హీరో ని ఒప్పించాడు ఈ సినిమాకి అనిపిస్తుంది (సినిమా ఫ్లాపయిన తర్వాత హీరో వచ్చి, దర్శకుడిని నమ్మి- ఏమీ వినకుండానే ఒప్పుకున్నాను అని చెప్తాడు, అది వేరే విషయం 😀 ) . కానీ కొన్ని సినిమాలు ఫ్లాపయ్యాక కూడా- కథగా చెప్తే హీరోని ఒప్పించదగ్గ కథే ఇది అనిపిస్తుంది. మల్లన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ కాదు కానీ బేసిక్ ఐడియా చెప్తే దర్శకుడి మీద నమ్మకం ఉంటే ఒప్పుకోదగ్గ స్టోరీలైనే ఇది. కానీ పూర్తి స్థాయి కథ ని డెవలప్ చేసుకోవడం లో చేసిన పొరపాట్లవల్ల ప్రేక్షకులు త్రిప్పికొట్టారు ఈ సినిమాని.

ప్రకటనలు

Responses

 1. ఈ సినిమాను కసబ్ కు చూపించాలి. ఈ బాధకు తట్టుకోలేక ఛావాలి వాడు.

  • తట్టుకొని బతికితే చివరకి బాలయ్య సినిమా (లు)చాలు అనుకుంటా 🙂

 2. అబ్బ, ఈ మధ్యకాలం లో నేను చూసిన అతి దారుణమైన సినిమా ‘మల్లన్న’. ఇందులో కొత్తదనమేముందో నాకర్థం కాలేదు. జెంటిల్మన్ సినిమా కథ కి కొంచం అటు ఇటు గా మార్పు చేసి, దేముడి పేరు పెట్టి చూపించాడు అంతే. కథ సంగతి వదిలేయండి. ఆ కథనం, ఎడిటింగ్, ఫొటోగ్రఫి….అసలు సినిమా పూర్తయ్యేసరికి నా కళ్ళు పోతాయనిపించింది. ఆ క్లోజ్ అప్ షాట్స్ ఏమిటీ, ఆ కెమెరా లైటింగ్ ఏమిటీ…..పిచ్చెక్కింది నాకయితే. పోనీ పాటలు బాగున్నాయా అంటే…మన దేవిశ్రీ ప్రసాదేనా ఇలా చేసింది అనిపించింది. ఒక్క ‘మామా మామియా’ పాట ఫరవాలేదనిపించింది. ఇవి అని ఒక ఎత్తయితే శ్రీయ ఇంకో ఎత్తు. ఆ హీరోయిన్ పాత్ర ఏమిటో, ఎందుకుందో ఏమీ అర్థం కాలేదు. అసలు ఏ కోణం లో నుండి చూసినా ఈ సినిమా లో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. చూసినవాళ్ళకి మనస్థాపం కలిగి చిత్రవధ అనుభవిస్తారు.

  • సినిమాలో పాటలు- టార్చర్
   శ్రీయ పాత్ర – ఇంకా టార్చర్
   సెకండాఫ్ ని హ్యాండిల్ చేసిన విధానం- అల్టిమేట్ టార్చర్

   అందువలే ఆడియెన్స్ త్రిప్పికొట్టారీ సినిమాని.

   జెంటిల్మేన్ సినిమా బేసిక్ లైన్ తీసుకుని “రవితేజ వెర్షన్” లో తీసిన కిక్ సినిమా హిట్టు కొట్టింది. నవతరంగం లో ఈ మధ్య ఒక వ్యాసం లో డిఫరెంట్ జెనర్ కాంబినేషన్ లో తీసుకుంటే కొత్త కథలు కాకపోయినా కనీసం కొత్తగా చెప్పగల కథలు వస్తాయి అని వ్రాశారు. కరక్టే. నిజానికి జెనర్ కాంబినేషన్ కూడా కాదు- మణిరత్నం తరహా కథ కి సెల్వమణి తరహా భారీతనం అనేది శంకర్ మొదటి ముద్ర అయినట్టు గా శంకర్ స్టోరీ ప్లస్ జేంస్ బాండ్ తరహా ట్రీట్ మెంట్ కూడా బేసిక్ గా మంచి ఐడియానే కానీ ఆ ట్రీట్ మెంట్ లోనే అడుగడుగునా పప్పులో కాలేయడం వల్లే సినిమాకీ పరిస్థితి వచ్చిందని నా ఒపీనియన్.

   • మామూలు టార్చర్ కాదు బాబోయ్, పరమ‌ టార్చర్..చెప్పనలవి కాదు…చిత్రవధే !!

    మోహన్, మీరు చెప్పినది కరెక్టే, కథ కొత్తది కాకపోయిన, కథనం కొత్తగా ఉంటే చాలు…ప్రేక్షకులు అభినందిస్తారు.
    నా మటుకు నాకు కిక్ చాలా నచ్చింది. అందులోనా రవితేజ స్టైల్ లో, మంచి కామెడి తో కొత్త గా బాగుంది అనిపించింది.

    మల్లన్న తమిళ్ లో ఫ్లాప్ అయింది, అయినా తెలుగు లో కూడా డబ్ చేసారు. రెండు భాషలలోను ఒకేసారి విడుదల చేసారనుకుంటా…ఆ సినిమా మీద వాళ్ళకి ఎంత నమ్మకమో తెలుస్తోంది. అసలు ఈ సినిమా లో నటించడానికి విక్రం ఎలా ఒప్పుకున్నాడా అనిపించింది. పోనీ నటన పరం గా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. విక్రం, కళ్ళు, మూతి తప్ప ఇంకేం చూపించారు? కళ్ళని, నోరుని మార్చి మార్చి చూపించడంతోనే సరిపోయింది. ఇంక శ్రీయ కి కూడా అంతే. పదే పదే కళ్ళు చూపించడం, ఏదో మహ కళ్ళల్లో వివిధ భావాలు పలికిస్తున్నట్టు. పైగా రెండేళ్ళు తీసారీ సినిమాని.

    మోహన్, అడుగడుగునా పప్పులో కాలేయడం అని అంత ఈజీ గా అంటారేమిటండీ, పప్పులో కాదు పేడ లో కాలేసారు, కడుక్కున్నా వాసన పోదు 😀

    • నీకు తమిళ్ తెలుసు కదా !
     నువ్వు తమిళ్ లో చూసావా ??
     వాసనా అంటేను

     • చక్రవర్తి రా నాయనా ..

      • hahahah………నేను ఎందుకు praveen .
       ప్రొద్దున చదివాను this post .నేను తమిళ్ version చూసాను. నాకు ఎమీ అర్థం కాలేదు.
       as sowmya said
       “విక్రం, కళ్ళు, మూతి తప్ప ఇంకేం చూపించారు? కళ్ళని, నోరుని మార్చి మార్చి చూపించడంతోనే సరిపోయింది. ఇంక శ్రీయ కి కూడా అంతే. పదే పదే కళ్ళు చూపించడం, ఏదో మహ కళ్ళల్లో వివిధ భావాలు పలికిస్తున్నట్టు.”
       100% agree.

       release అయిన రోజే మంచి print దొరికిందని
       friends అందరం కలసి చూసి మంచిగా book అయ్యాము.

 3. నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఈ సినిమా చూడ్డం. అయితే మధ్యలో లేచి వచ్చేసి, ప్రాణాలు దక్కించుకున్నాను.

 4. 🙂 🙂

 5. నేనైతే, ఈ సినిమాని, ఫ్రీగా వచ్చిన ఫైరసీలో కూడా, అదీ చెత్త సీన్లను ఫార్వర్డ్ చేస్తూ కూడా పూర్తిగా చూడలేకపోయా. :).

  మామూలుగా అయితే, పైరసీలో ఎంత చెత్త సినిమా అయినా, చెత్త సీన్లను ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి, అన్ని సినిమాలు బానే ఉన్నట్టు అనిపిస్తాయి. కాని ఈ సినిమాని ఎందుకో భరించలేకపోయా.

 6. shankar’s first movie is not BHARATEEYUDU …it’s GENTLEMAN

  • hmm..i think its a typo 😀
   ఏదో ధ్యాస లో అలా పొరపాటు జరిగినట్టుంది.
   I have updated it now..

   • mohan…….u have one gud quality
    నువ్వు అందరి opinions కూడా consider చేస్తావ్.ఎదొ రాసేసి వాదనకు దిగవు.చాలా మంచి quality..
    even in navatarangam…. u resp to comments is nice………….(well balanced)

 7. ‘మల్లన్న’ లో 4 పాటలు విక్రం పాడాడు…అదొక్కటే నాకు పాజిటివ్ గా కనిపిస్తున్నాది…చెత్తపాటలైనా బాగానే పాడాడు !!!
  మాంమ్బో మామియా పాట బాగా పాడాడు. అది ఒక ఇటాలియన్ పాట అనుకోండి…దేవిశ్రీ ప్రసాద్ అందులోనుండి లేపాడు.

  • ఆరు పాటలూ పాడడానికి వాడేమన్నా రమణ గోగుల అనుకున్నావా !..:)
   కనిపిస్తున్నాది ఏంటి ?

  • సౌమ్యా! ఆ ఇటాలియన్ పాట లింకేదో ఇస్తే విని ఆనందించగలం. కొసరు కన్నా అసలెప్పుడూ ముద్దు కదా. 🙂

 8. మల్లన్న సినిమా స్వైన్ ఫ్లూ కన్నా భయంకరమైనది. మా ఊళ్ళో (టవును) కొత్తగా మల్టిప్లెక్స్ కట్టారని, అందులో సినిమా చూడాలని ఈ సినిమాకు వెళ్ళాము. మొట్టమొదటి సీనులో విక్రం కోడి లాగా వచ్చి చాలా సేపు ప్రాణం తీస్తాడు. అంతే! ఆ దెబ్బకు తలనొప్పి. తరువాత సినిమా అంతా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వెళ్ళాడు. ఇంటర్వెల్ తర్వాత మెక్సికో లో ఫైట్ తర్వాత లేచి వచ్చేశాను. ఆ తర్వాత రోజు జ్వరం, వాంతులు వచ్చాయి నాకు. బాలయ్య సినిమా, అదేదో పల్నాటి నాయుడు అని ఒకటుంది. అది చూసినప్పుడు కూడా ఇంత బాధ అనుభవించలేదు.

  ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళ కోసం TADA లాగా కొత్త చట్టం తీసుకురావడం అత్యవసరం.

  • హ హ హ 🙂

  • ఇది మాత్రం అక్షరాలా నిజం. మొదటి కోడి ఫైట్ చూసి నాకు టాపు లేచిపోయింది.

 9. wow .. పోయిన వారాంతం ఏంఈ తోచక మా స్థానిక థియెటర్లో ఏమున్నై అని చూస్తే ఇది కనబడింది. విక్రం కదా రిస్కు తీసుకుందామనుకున్నా గానీ, ఆ మధ్యాన్నం పోస్టులో నా నెట్ ఫ్లిక్సు సినిమా వచ్చి రక్షించింది. 🙂

  • కొత్తపాళీ గారు, మీ బుర్ర చెడిపోకుండా, కాపాడినందుకు మోహన్ రాజ్ కు, సౌమ్య, నేను మిగిలిన వ్యాఖ్యాతలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేసేస్తున్నాను.

   1 మల్లన్న = 3 * బాలయ్య సినిమాలు.

 10. రమణ గోగుల కాదూ, రమణ గోలా కాదు….రమణ గగ్గోలు !

 11. ఏది ఏమైనా శంకర్ “శివాజీ” కన్నా ముందు రిలీజ్ అయి ఉంటే ఓ మోస్తరు కలక్షన్లన్నా రాబట్టగలిగి ఉండేది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: