వ్రాసినది: mohanrazz | 2009/09/18

గౌతం మీనన్ “మాయ”

 Gautam menon

వివి వినాయక్ సినిమాల్లో చాలావరకు హీరోయిన్ పేరు “నందిని” అని ఉన్నట్టు గౌతం మీనన్ సినిమాల్లోనూ హీరోయిన్ పేరు “మాయ” అని ఉంటుంది. గౌతం మీనన్ మొదటి సినిమా చెలి(మిన్నలే) నేను చూడలేదు. ఆ తర్వాత వచ్చిన కాక్క కాక్క (ఘర్షణ), వేట్టియాడు వెళియాడు (రాఘవన్), పచ్చకిళి ముత్తుచ్చ్చరమ్ (ద్రోహి పేరు తో డబ్ అయింది తెలుగు లో-రిలీజ్ అయిందో లేదో తెలీదు) సినిమాలు అన్నిట్లోనూ “మాయ” అనే పేరు రెఫెరెన్స్ ఉంటుంది. బహుశా కొంత మంది దర్శకులు కొన్ని పేర్లతో అటాచ్‌మెంట్ కలిగి ఉంటారు- వాళ్ళ జీవితం లోని కొన్ని వ్యక్తిగత సంఘటనలవల్లో లేక ఇంకెందువల్లో 🙂 . మొన్నీ మధ్య వచ్చిన గౌతం మీనన్ సినిమా సూర్య s/o కృష్ణన్ లో కూడా ఉంటుందేమోనని చూసా కానీ ఇందులో మాత్రం ఎక్కడా ‘మాయ’ రెఫెరెన్స్ లేదు.

 

మాయ రెఫెరెన్స్ అయితే లేకుండా చేశాడు కానీ “గౌతం మీనన్ స్టాండర్డ్” ఫార్ములా మాత్రం బ్రేక్ చేయలేకపోయారు ఈ సినిమాలోనూ. అవును. ఒక్కో దర్శకుడికి ఒక్కో ఫార్ములా ఉంటుంది. అప్పుడప్పుడూ ఫార్ములా లోనుంచి బయటికి వెళ్ళవచ్చు కానీ 90% సినిమాలు అదే ఫార్ములాలో ఉంటాయి. ‘కాక్క కాక్క’ లో హీరోయిన్- విలన్ చేతిలో దారుణంగా చనిపోతుంది (తెలుగు వెర్షన్ లో బ్రతికినట్లు చూపించారనుకుంటా ఘర్షణలో). ‘వేట్టియాడు వెళియాడు’ లో కమలినీ ముఖర్జీ చనిపోతుంది. క్లైమాక్స్ లో జ్యోతిక కూడా చనిపోయిందనే అనుకున్నాను(డబల్ ఢమాకా అన్నట్టు 😀 ) -ఈలోగా మళ్ళీ ఠకీమని ప్రత్యక్షమవుతుంది. అలాగే ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ లోనూ సమీరారెడ్డి ని చంపేస్తాడు గౌతం మీనన్ 🙂 .  ‘Derailed’ ఆధారంగా తీసిన పచ్చకిళి ముత్తుచ్చ్చరమ్ లో హీరోయిన్ ని చంపే అవసరం పడలేదు కథాపరంగా. ఇప్పుడు నాగచైతన్య తో సినిమా. మొన్న మా ఫ్రెండ్ అంటున్నాడు తమాషకి- “ఈసారి హీరోయిన్ ని చంపకుండా సినిమా తీస్తే హిట్టవుతుంది బాసూ…లేదంటే అంతేసంగతులు” 🙂


Responses

 1. derailed లాంటి సినిమా ని తెలుగులో తీస్తున్నారా హైదరాబాద్ మెట్రో లో బాబోయ్ !!
  హీరో ని చంపేస్తే కాస్త సింపతీ వుంటుందేమో నాగచైతన్య ని
  ఏమంటావ్ స+”మాయ “?

 2. ‘తేజ’ సినిమాలలో హీరోయిన్ పేరు ‘సుజాత’ ఉంటుంది.

  • చిత్రం సినిమా లో రీమా సేన్ పేరు “జానకి “

 3. వినయ్ ..జూరాన్ కి రాకుండా అక్కడ కామ్మేంటావ్ ముందు ఎందు ?

 4. @bonagiri garu

  జయం సినిమా నేను కొత్తల్లో చూడలేదు. తరవాతెప్పుడో టీ.వీ. లో చూసాను. అప్పుడు అందరూ నన్ను ‘సుజాత గారూ పట్టీలు పెట్టుకోండీ !” అంటూండేవారు. అర్ధం అయేది కాదు. ఆ సినిమా హిట్టు !

 5. ఆ సినిమా పేరు ‘పచ్చక్కిళ్ ముత్తుచరణ్’ కాదు.
  అది పచ్చకిళి ముత్తుచ్చ్చరమ్ (ముత్తుస్సరమ్). అంటే చిలుక దగ్గరి ముత్యాల హారం అన్న మాట. చిలుక ఎప్పుడైనా హారాన్ని కొరికి ముత్యాల్ని చెల్లాచెదురు చేసెయ్యొచ్చు. The film deals with such a delicate situation as the subject.

  ఈ సినిమాకి తెలుగులో ‘ద్రోహి’ అని పేరు పెట్టడం మన తెలుగు సినిమా వాళ్ళ ఆలోచనా పరిధికి నిదర్శనం. అప్పుడెప్పుడో మాసూమ్ సినిమా రీమేక్ చేసి దానికి ‘ఇల్లాలు-ప్రియురాలు ‘ అని పేరు పెట్టినట్టుందిది.

  • thanks for correcting..i have updated it now నాకు తమిళ్ అక్షరాలు చదవడం వచ్చు (స్కూల్ డేస్ అప్పుడు సరదాగా పుస్తకం తీసుకుని నేర్చుకున్నా 😉 ) కానీ తమిళ్ పదాలు ఒక 20-30 కి మించి తెలీవు. కాబట్తి మీనింగ్స్ పెద్దగా తెలీదు.. thanks for explaining

 6. రాజమౌళి సినిమాల్లో ‘ఇందు’ పేరు లాగా… సై, సింహాద్రి, మగధీర… 😉

  • విజయేంద్ర వర్మ మీద ఈమధ్య ఒకాయన తన చండేరి నవల ని కాపీకొట్టి ఈ సినిమా తీసారని కేస్ వేసినపుడు చెప్పాడు- చండేరి నవల లో హీరోయిన్ పేరు “ఇందు” అని. దాన్ని కూడా అలాగే కాపీకొట్టారని. విజయేంద్రవర్మ వచ్చి, తనకి “ఇందు” అనే పేరంటే ఇష్టమని అందుకనే తన సై, సింహాద్రి, యమదొంగ, మగధీర ల్లో హీరోయిన్ పేరు ఉంటుందని, చండేరి తాను చదవలేదనీ చెప్పాడు..ఏదేమైనా ఇందు అనే పేరు సెలక్షన్ విజయేంద్రవర్మదన్నమాట

 7. మోహన్, హీరోవిను ను చంపొద్దని మనం ఇంకో కారణం చేత కూడా అడగాలి. ఆ కారణం ఏమంటే, హీరోవిను ఛస్తే, వాడు నాగచైతన్య ఏడుస్తాడు/ఏడుపు ముఖం పెడతాడు. అప్పుడు మనం వాణ్ణి చూడలేము. ఫైట్లు చేసినప్పుడు, ఆ శబ్దాలు వింటూనో, విలన్లు గాల్లో గిరికీలు కొట్టడాన్నో చూస్తూ, సరేలే అనుకోగలం. పాటలప్పుడు, హీరోవిను ముఖాన్నో, వెనుక తెల్ల డాన్సర్ల ముఖాలనో చూస్తో కాలం గడపచ్చు.కానీ వాడు నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే చూసి, తట్టుకునే శక్తి మనకు ఇంకా లేదు. కాబట్టి హీరోవిను చచ్చిపోకూడదు!

 8. మంచి పరిశీలన. 🙂
  మీరు వ్రాసే విధానంలోని సున్నిత హాస్యం సూపర్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: