వ్రాసినది: mohanrazz | 2009/09/18

నేటితో మగధీర 50 రోజులు-301 కేంద్రాల్లో

చిన్నపుడెపుడో ఘరానా మొగుడు అనే సినిమా 56 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందట అంటే..అబ్బో 56 కేంద్రాల్లోనా అనుకునేవాళ్ళు జనాలు. ఆ తర్వాత చాలా రోజుల పాటు చాలా సినిమాలు 50-60 కేంద్రాల్లో ఆడుతూ ఉంటే-సమర సింహారెడ్డి వచ్చి 72 కేంద్రాల్లో 100 రోజులు ఆడి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక 100 కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా నరసింహనాయుడు అయితే ఇప్పటి దాకా అతి ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా ఠాగూర్- 194 కేంద్రాల్లో. పోకిరి సినిమా బ్లాక్ బస్టరే అయినప్పటికీ – వీరభద్ర, బంగారం, పౌర్ణమి చిత్రాలతో పాటు రిలీజవడం తో ఒకేసారి ఎక్కువ  థియేటర్లలో విడుదల కాలేక పోవడం వల్లా ప్లస్ రిలీజ్ కి ముందు (పూరీ అప్పుడు ఫాం లో లేకపోవడం వల్ల) మరీ క్రేజ్/హైప్ లేకపోవడం వల్లా – హయ్యెస్ట్ సెంటర్స్ రికార్డులజోలికి పోలేకపోయింది.

ఇప్పటివరకు తెలుగులో 50, 100, 175 డేస్ లో ఎక్కువ కేంద్రాల్లో ప్రదర్శింపబడిన చిత్రాలు-
50డేస్- తులసి – 226 కేంద్రాలు
100డేస్- ఠాగూర్- 194 కేంద్రాలు
175డేస్- సింహాద్రి-  55 కేంద్రాలు

తమిళనాడు కంటే దాదాపు 1000 థియేటర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కావడం వల్ల – కర్ణాటక, కేరళలో అంతకంటే తక్కువ థియేటర్లుండడం వల్ల – ఈ తెలుగులో రికార్డులే సౌత్ ఇండియా మొత్తానికీ రికార్డులు అవుతాయి. ఈ లెక్కన సౌత్ ఇండియాలోనే అత్యధిక కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శింపబడిన చిత్రం మగధీర అవుతుంది. ఇప్పుడు మగధీర దాదాపు 301 కేంద్రాల్లో 50 రోజులు ఆడినట్టుగా (ఇది సరికొత్త రికార్డు) సూపర్ హిట్ మేగజైన్ లో ఇచ్చిన ప్రకటన ఇది. మరి 194 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఠాగూర్ ని (కేంద్రాలపరంగా) అధిగమిస్తుందా లేదా అనేది- ఇంకో 50 రోజుల్లో తెలుస్తుంది.

Today is 50th Day for Magadheera-

MD-super hit-scan


Responses

 1. 58కోట్లు వచ్చాయంటే మాటలు కాదు 80కోట్లు వస్తాయా 100 రోజులు అయ్యేసరికి
  226 కేంద్రాలా! తులసి అది అంత మంచి సినిమా కాదె
  నరసింహనాయుడు టాగోర్ సింహాద్రి కి ఆర్హత వుంది

  • తులసి 226 అనేది ఈ మధ్యే తెలిసింది.. ,నాకూ షాకే.. 🙂

 2. మగధీర సినిమాలో అన్ని రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉంది.

 3. అనిపిస్తోంది, మరో 50 రోజులు తర్వాత సమాధానం దొరుకుతుంది 🙂

 4. cinema చాలా బాగుంది … కానీ మనము ఈ Records గొడవలలోనే ఉంటామా ?

 5. ఒక రికార్డు ముచ్చట.. అడవిరాముడు శతదినోత్సవానికనుకుంటా అందులోని పాటకు అనుగుణంగా వాల్‌పోస్టర్లలో వేసారు.. “ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు 32 కేంద్రాల్లో శతదినోత్సవం” అని. అప్పట్లో 32 కేంద్రాలు రికార్డు కాబోలు!

  • అడవిరాముడు 1977 లోనే, 32 కేంద్రాల్లో ఆడిందా?? చాలా గ్రేట్ అన్నమాట.

 6. సినిమా వాళ్ళ రికార్డుల సంరంభం ఇట్టాగుంటే, రాజకీయాల్లో మరో రకమైన రికార్డు గురించి కలకలం రేగుతోంది.

 7. బాబు జురాన్, ఈ సినెమా రికార్డ్స్ గురించి తెలియ జేసినందుకు చాలా సంతోషం. కాని నేను చూసిన 5 అతి చెత్త సినేమాలలో హిట్ ఐన సినెమా ఇదే. తెలుగు వారి చెత్త టేస్టి కి ఈ మగధీర ఒక నిదర్శనం.తెలుగు వారు ఒక విధమైన ఉన్మాదానికి లోను కావడం ఈ మధ్య ఎక్కువైంది అని నాకు అనిపిస్తున్నాది. రాజకీయాల లో, సినేమా ల లో ఆంధ్రుల హడావుడి పాత కాలపు జాతరలు, గొర్రెలను బలి ఇవ్వటం లాంటి వి గుర్తుకు తెస్తున్నాయి. సినెమా రీలిజ్ కి ఒక 5 గురు చచ్చారు, మళ్ళీ శతదినొత్సవమని ఇకొంతమంది ని చంపుతారు. ఆంధ్రులు బావి లో కప్పలు, పక్క వారికి తెలియదు వీరి గొప్పతనం గురించి. ఈ రికార్డ్లు నాలిక గీకొవటానికి కూడా పనికి రావు. ఒక్క జాతీయ అవార్డ్ కొట్టలేదు ఈ సారి. ఈ సినెమా లో సెట్టింగ్స్ తప్పిస్తె ఒక్కతైనా బాగుందా. పిచ్చి సినెమా పిచ్చ హిట్టూ!!!

  • తొలిప్రేమ అనె సినిమా చూసివచ్చాక ఫ్రెండ్స్ అందరూ బాగా నచ్చింది అంటూంటే -ఒకబ్బాయి మాత్రం తనకి ఇంతలా తలబొప్పి కట్టించిన సినిమా ఈ మధ్యలో వేరే ఏదీ లేదన్నాడు. ఎంత సూపర్ డూపర్ హిట్టయిన సినిమా కూడా అందరికీ నచ్చాలని లేదు. ఇవాళ మనం భారతీయ కమర్షియల్ సినిమాకి తలమానికం గా చెప్పుకునే షోలే నచ్చలేదని చెప్పిన వాళ్ళు అప్పట్లో చాలా మందే ఉన్నారని ఒకసారి ఒక పెద్దాయనతో మాట్లాదుతూంటే అన్నాడు. ఆశ్చర్యమనిపించింది. అంతవరకూ ఎందుకు- అరుంధతి సినిమా భాదితుల సంఘమొకటి నవతరంగం లో ఏర్పడిందామధ్య. పోకిరి ని ద్వేషించే వాళ్ళకీ కొదువే లేదు..కాబట్టి మనం కేవలం ఎంత పర్సెంటేజ్ జనాలకి నచ్చిందో చూడాలి కమర్షియల్ సినిమాల్లో.అంతవరకే. పోకిరి, అరుంధతి లు తెలుగు లో ఇవాళ్టి టాప్ 10 గ్రాసర్స్ లో ఉన్నాయి. మగధీర టాప్ 1 గ్రాసర్ ఆల్రెడీ అయ్యేసిందని కొందరు….ఇంకా అవ్వలేదు కొన్నిరోజులు టైం పడుతుందని కొందరు అంటున్నారు..ఏదేమైనా కొద్దిరోజుల్లో ఇది టాప్1 గ్రాసర్ గా నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది..

  • ఇక జాతీయ అవార్డుల గురించి- జాతీయ అవార్డులేవీ తెలుగు సినిమాకి రాలేదు కాబట్టి-ఇలా కలెక్షన్స్ గురించి గొప్పలు చెప్పుకోవడం మానేసి జాతీయ అవార్డు తెలుగు సినిమాకి రానందుకు చింతించాలని కొందరంటున్నారు. ఒక వ్యక్తి కి చెస్ బాగావచ్చు, క్రికెట్ తెలీదని బాధపడుతూంటాడు. ఇంకొకతనికి క్రికెట్ తెలుసు, మ్యూజిక్ గురించి తెలీదని ఫీలవుతూంటాడు. ప్రతివ్యక్తికీ, ప్రతి వ్యవస్థకీ లాగే- ప్రతి ఇండస్ట్రీ కి కూడా కొన్ని బలాలు, బలహీనతలుంటాయి. ఒక మళయాళీ కొలీగ్ ఈమధ్య – మగధీర కలెక్షన్స్ గురించి చెప్తే అన్నాడు-“we can not even imagine such revenues in our malayaalam” . ఇంకో కన్నడ డైరెక్టర్ (అగ్ని శ్రీధర్) తనకి 18 కోట్లు ఇస్తే మగధీర ని మించిన సినిమా తీస్తాను కన్నడలో అన్నాడు. కానీ 18 కోట్లంటే చాలా ఎక్కువ కన్నడకి. ఎవరూ స్పందించలేదు ఆయనకి 😀 . తెలుగు సినిమా పరిశ్రమ సౌత్ లోనే పెద్దది. తమిళ్ కంటే 1000 థియేటర్లు ఎక్కువ మనకి. ఇలాంటి కలెక్షన్స్ హిందీ తర్వాత మనకి మాత్రమే సాధ్యం. ఎప్పుడూ బలహీనతల మీదే కాన్సంట్రేట్ చేయడం ఎందుకు. జాతీయ అవార్డు రావాలని ఆశిద్దాం.కానీ రాలేదని -ఇంక దాన్నే పట్టుకుని కృంగిపోనవసరం లేదు.

 8. రాజమౌలి ప్రతిభ ఎమిటంటె సినేమాకి కోత్త డిజైన్లో కత్తులు,గొడ్డళ్ళు తయారుచెయటం. అటువంటి వాటిని చూసి అనుషా ను చంపే లాంటి వారు తయారు కావడం అంతకు మించి మనసుకు హత్తుకున్నె ఒక్క దృశ్యం ఒక్కటి కూడా లేదు. 2000 సం|| తరువాత నుంచి ఆడవారి లో తీవ్రమైన మార్పులు చొటు చెసుకున్నయి ఈ సినెమా హీరోయిన్ దానికి ఒక ఉదాహరణ. ఇటువాటి పాత్రలను ఆరోజులలో ప్రేమనగర్ లో జ్యొతిలక్ష్మి పాత్రకి అవె భావలు, గుణాలు ఉండేవి. ఆ సినేమా లో ఆమే ఉంపుడు గత్తె ఈ సినేమాలో అమే పాత్ర హీరొయిన్ గా మార్చారు.

 9. keka pagili poye cinima. ilanti cinima telugu cinima charitrake talamanikam

  • అబ్బ ఛా!!

  • జగనన్నా, మేరు ఇలా నిజలు చెప్పకూడదు.

 10. ఏంటండీ నేను గారూ, మీరు సిద్ధార్ధా? లేపోతే తమన్నా ఫానా?

  • nenu praveen sarma fan ni..chaala inka emaina kaavaala?

 11. praveen sarmaa? aadevadu?

  • pandu gadi thammudu cherasala rachayatha

  • i think ur new to telugu blogs having less knowlege abt blog rachayithalu..evari perru chebbithe ***************************
   ***************************
   u will get the answer soon

 12. mohanrazz- your response to Sri’s comment is quite convincing .

 13. జురాన్ మీరు ఇక్కడ సినెమా ని కలెక్షన్స్ ని బట్టి అంచనా వేస్తున్నారు. కాని ఫండమెంటల్ గా సినెమా అనేది చాలా కళల సంగమం. అందువలన దాని గురించి మాట్లడేటప్పుడు కలెక్షన్స్ కన్నా కళల గురించి చర్చించుకుంటె/చెప్పుకుంటె బాగుంటుంది. అది చుసిన వారికి ఏవిధమైన అనుభూతిని కలిగించింది అని కూడా మీరు రాయ వచ్చు. మీరేమొ అది అంత కలేక్ట్ చేసింది, మలయాల మిత్రుడు అభిప్రాయము, కన్నడ డైరెక్టర్ 18 కోట్ల గురించి రాస్తున్నారు. డబ్బు వసూల్ చేయడమే ప్రాతిపదిక అయితె మట్కా జూదం కూడా చాలా బిజినేస్ చేస్తుంది. అందువలన మనం దానిని గొప్ప కళ అని అంటామా? కలేక్షన్స్ సినెమా చూసే ప్రేక్షకులకి కి సెకండరి. అది వ్యాపారం చేసుకొనే నిర్మాతకి ముఖ్యం కావచ్చు కాని ప్రెక్షకులకి కాదు. ఇలా డబ్బు గురించి మాట్లాడానికి ఆ వూరిలో కోది పందేలు, క్రికెట్ మీద బెట్తింగులు చెసుకుంటూ బ్రతికేవారు మాట్లాడుకుంటుంటారు.చదువుకొని మంచి రంగం లో ఉద్యొగం చేసుకునే మీలాంటి వారు కూడా వారిని అనుకరిస్తె ఎలా? కనీసం క్వాలిటి సినెమాలు రావాలని దానిని ప్రజలు ఆదరించాలని మీలాంటి వారు కోరుకొక పొతె ఎలా? ఎదో ఆంధ్రాలో సినెమా హాళ్ల సంఖ్య ఎక్కువ అందువలన ఎక్కువ డబ్బులు వస్తాయి కనుక అదొక ఉత్తమ చిత్రం నంబర్ 1 అని వాదించటం ఎమీ బాగలేదు. మర్క సారి మగధీర లో సెట్టింగ్స్,కాస్ట్యూంస్ తప్పించి మిగతా వన్ని ఏమాత్రం గొప్పగా లేవు.

 14. గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు అనే సినిమా నాకు బాగా నచ్చింది-కానీ అది “లాస్ వెంచర్” అని గోపీచంద్ అన్నాడు. నేను పూర్తిగా చూడలేకపోయిన శౌర్యం “ప్రాఫిట్ వెంచర్” అట. సినిమా కలెక్షన్స్ అనేవి- ఎంత “ఎక్కువమంది తో” సినిమా కనెక్ట్ అవగలిగింది అనేదానికి నిదర్శనం. రాజమౌళి తీసిన సినిమాల్లో చాలావరకూ క్లాస్ ఆడియెన్స్ మి నచ్చవు. యమదొంగ ని చూడలేక మధ్యలో లేచివచ్చానన్నాడు మా ఫ్రెండొకతను. కానీ యమదొంగ టాప్ గ్రాసర్స్ లో ఒకటి ఇవాళ. మీకూ నాకు కనెక్ట్ కాని సినిమాలు సో కాల్డ్ మాస్ ప్రేక్షకులకి ఎక్కడో కనెక్ట్ అయ్యాయి. అవే కలెక్షన్స్ లో ప్రతిఫలిస్తున్నాయి.

  మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ “మెజార్టీ” దే ముఖ్యపాత్ర. మనకి నచ్చని పార్టీ అధికారం లోకి వచ్చిందని ఓటర్లందరూ వెర్రి వెంగళప్పలు అని తిట్టడం ఎలా అమాయకత్వమో, మనకి నచ్చని సినిమా ఎవర్నో ఆకట్టుకుందని వాళ్ళ అభిరుచి ని కించపరచడమూ అంతే తప్పు.

  చివరగా- వాదనల్లో, చర్చల్లో -అభిప్రాయాలు మారవు. మారాల్సిన అవసరమూలేదు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. అభిప్రాయాల్లోని వైవిధ్యమే ప్రజాస్వామ్యానికి ఊపిరి. అందరి అభిప్రాయాలూ ఒకే మూసలో, జిరాక్స్ కాపీల్లా ఉంటే ప్రపంచం ఎప్పుడో బోర్ కొట్టి ఉండేది.

  • @వాదనల్లో, చర్చల్లో -అభిప్రాయాలు మారవు. మారాల్సిన అవసరమూలేదు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. అభిప్రాయాల్లోని వైవిధ్యమే ప్రజాస్వామ్యానికి ఊపిరి. అందరి అభిప్రాయాలూ ఒకే మూసలో, జిరాక్స్ కాపీల్లా ఉంటే ప్రపంచం ఎప్పుడో బోర్ కొట్టి ఉండేది.

   WELL SAID !

 15. annaa nuvvu rajakiyalloki ra anna. super cheppavu.

 16. మొహన్ రాజు, మీరు సినేమాని తీసుకెళ్లి ప్రజాస్వమ్యం తో ఎలా పోలుస్తారు? సినేమా అనేది ఒక కళ ప్రజలు ఆనందించటానికి వారిలో మార్పు తేవటానికి కళలు ఉపయొగ పడతాయి. ప్రజలని ఉద్దరించటానికి మంచి సందేశం ఇవ్వలేక పోయినా (టి. కృష్ణా సినెమా లా)మాములు సినెమాలు తీయవచ్చు. ఇక్కడ మాములు అంటె ప్రజలను బ్రష్ట్టు పట్టించకుండా ఉండె సినెమా అని నా అర్థం. ఈ సినెమా లో లోపాలు రాయాలంటె ఒక పుస్తకం రాయ వచ్చు. ఈ పుచ్చు సినెమా మీద మళ్ళి రాయడం కూడా అనవసరం. మీ పేలవమైన వాదన చుస్తుంటె తెలుగు వాళ్ళ ఇంటెలెక్యూల్ (బుర్రలో గ్గుజు ఎమాత్రం లేదని) లేదని అర్తమౌతున్నాది. ఎందుకంటె అంత పెద్ద హిట్ చెసిన సగటు తెలుగొడి ఉన్న బుర్ర గురించి, దానిని వెనకేసుకొస్తున్న మీ చదువుకున్న మిత్ర బౄందం వాదన విని దానితో పాటు మీ ఈ వ్యాఖ్య చదివి * చివరగా- వాదనల్లో, చర్చల్లో -అభిప్రాయాలు మారవు*. చదువు కొన్న ఆంధ్రా జనాల మారని మానసిక పరిస్థి అర్థమౌతున్నాది.

 17. sri-
  ఇక్కడ ఒక పది మంది ఒకలాగా.. మీరొక్కరు ఒకలాగ వాదించడం చూస్తుంటె.. ఎవరిది పేలవమయిన వాదన?
  బుర్రలో గుజ్జు విషయానికి వస్తే.. అది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.. మీరెదొ పెద్ద ఇంటెలెక్యూల్ ఫీల్ అయ్యిపొతున్నారు 🙂
  జనాలని రంజింపజెసెదే సిసలయిన సినిమా.. ఇంక తప్పులు గురించి పుస్తకాలు రాయల్సి వస్తే అన్ని సినిమాలమీద రాయొచ్చు.. అదెమి పెద్ద విద్యేమి కాదు. ఇక మంచి సినిమా అంటే ఒక్కొడికి ఒక్కొ డెఫినిషన్ వుంటుంది. మీ డెఫినిషన్ అందరూ ఒప్పుకొవాలనేది మీ మూర్ఖత్వం.
  ఒక సినిమా హిట్ అయ్యి , ప్రజలు ఎగబడి చుస్స్తుంటె మీ బాద ఎంతొ అర్ధం కాదు.. 🙂 .. ఎవడి ఇస్టం వాడిది..
  సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఒన్లి కల్లక్షన్స్ మీదె అదారపడి వుంటుంది. సగటి ప్రెక్షకుడు సినిమా నుండి వినోదాన్ని కూరుకుంటాడు కానీ , క్లాస్ పీకడం కాదు.

  Mohan- your answers are quite convincing.. i don’t see any point in Sri’s comments other than jealousy 🙂

 18. Prasad,
  నేను మీ అంత ఇంటెలెక్త్యుల్ కాదు. మీ లాగా నేను అమెరికా లో పని చేయటం లేదు. నా డెఫినిషన్ అందరూ ఒప్పుకొవాలని నేనెక్కడైనా చెప్పానా? మీరు అమెరికా లాంటి డెవలప్డ్ దేశం లో ఉంటూ కూడా ఆంధ్రాలో సగటు మనిషి భావజాలాన్ని సినేమా విషయం లో మాత్రం పట్టుకొని అదె గొప్ప అనడం చుస్తె చాలా కామేడి గా ఉంది.
  ఎంతసేపు హిట్ ఫట్ ల గురించి మాటల్డటం తప్పితె ఆ సినేమాలో ఉన్న నాలుగు మంచి ముక్కలు రాయ లేదు. మీరంతా నిర్మాతలు లాగా మాట్లాడుతున్నరు తప్ప ఒక స్రిన్ ప్లే, పాటలు, సంగీతం, మొ|| ఒక్క మాట రాయ లేదు ఇక్కడ వాదించే వాళ్ళు. మీరు నిర్మాతలు అయితె నాకెమీ పెద్ద అబ్యంతరం లేదు, నా వ్యాఖ్యలు నేను వాపస్ తీసుకొంటాను. తొలగించ వచ్చు.

 19. >>మీరు సినేమాని తీసుకెళ్లి ప్రజాస్వమ్యం తో ఎలా పోలుస్తారు? >>నేను అక్కడ ప్రజాస్వామ్యాన్ని పోల్చిన కాన్‌టెక్స్ట్ బహుశా మీకర్థం కాలేదనుకుంటా.

  >>ఈ సినెమా లో లోపాలు రాయాలంటె ఒక పుస్తకం రాయ వచ్చు>>
  ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ లో కూడా సవాలక్ష లోపాలుంటాయి.
  http://www.rediff.com/movies/2009/jan/09review-slumdog-millionaire-sumit.htm
  వ్రాయాలంటే దేనిమీదైనా వ్రాయొచ్చు.

  >>స్రిన్ ప్లే, పాటలు, సంగీతం, మొ|| ఒక్క మాట రాయ లేదు>>ఇవన్నీ ఆల్రెడీ నవతరంగం లో సమీక్షలో వ్రాసాను. మళ్ళీ ఇక్కడెందుకని వ్రాయలేదు

  >>చదువు కొన్న ఆంధ్రా జనాల మారని మానసిక పరిస్థి అర్థమౌతున్నాది>>వాళ్ళ అభిప్రాయానికి మీరు ఎలాగైతే మారలేదో- వాళ్ళూ మీ అభిప్రాయానికి అలాగే మారలేరు

  >>తెలుగు వాళ్ళ ఇంటెలెక్యూల్ (బుర్రలో గ్గుజు ఎమాత్రం లేదని) లేదని అర్తమౌతున్నాది>>
  మీరెందుకు ఇంత చిన్నవిషయానికి బుర్ర, గుజ్జు అంటూ విలవిలలాడిపోతున్నారో నాకర్థం కావడం లేదు.సర్లెండి, మగధీర చెత్త సినిమా. కేవలం కాస్ట్యూమ్స్ తప్ప ఇంకేమీ బాగోలేని సినిమా 🙂 . ఆంధ్రప్రేక్షకులు కేవలం మీ అంత ఐక్యూ లేకపోవడం వల్లో, లేక కేవలం కాస్ట్యూమ్స్ మాత్రమే బాగున్న ఆ సినిమాని ఆ కాస్ట్యూమ్స్ చూడటానికో ఇన్నేసి సార్లు చూస్తూండవచ్చు 😀 ..ఆంధ్రప్రేక్షకుల్ని క్షమించేసి, ప్రశాంతంగా ఉండండి.

 20. కాజల్ అగర్వాల్ బావుంది కదా
  తెలుగు వాళ్ళు త్రీ హండ్రెడ్ సినిమా చూడలేదు ఇంతవరకు అందుకే అన్ని సార్లు చూస్తున్నారు
  గుజ్జు లేకపోతే ఇక్కడెందుకు కామెంటుతాం..లూప్ హోల్స్ అని రాయడానికి ఆయినా గుజ్జు వుండాలి కదా..అది మాకు కావలసినంత వుంది 🙂

 21. @ శ్రీ..
  బుర్ర .. గుజ్జు .. ఇంటెలెక్ట్యూలిటి అని పెద్ద పెద్ద పదాలు వాడింది నువ్వు.. నేను దానికి సమాదానం చెప్పానంతె.
  ఇక పొతే.. ఈ సినిమా.. కాస్ట్యూమ్స్ కొసమొ.. చేసింగ్ ల కొసమొ.. కాజల్ కొసామొ , చరణ్ కొసమొ.. ఇంకా దేని కొసమొ తెలీదు కాని మొత్తం మీద అంధ్ర జనాలు పడి పడి చుసారు. అంధ్రలొ అయినా అమెరికా లొ అయినా,, ఈ కలెక్షన్స్ ఒన్లి రిపీటడ్ ఆడియన్స్ వుంటెనే వస్తాయి. నీకు నచ్చని సినిమా చూసిన వాళ్ళందరు వెదవలు అంటె ఎలాగా బాసు.
  నాకు ఈ సినిమా పిచ్చగ నచ్చింది అని చెప్పను కాని.. మన తెలుగు సినిమా స్తాయిని వెరె లెవెల్ కి తీసుకు వెళ్ళింది అని అంటాను.

  ఒకవెళ నువ్వన్నట్టు ఇది పిచ్చి సినిమానె .. మన తెలుగు ప్రెక్షకులు అందరు వెర్రివాళ్ళె ..ఒకె.. బహుశ ఇండియా లొ చాలామంది వెర్రివాళ్ళు వున్నరనుకుంటా ..అందుకె వెరే బాషల్లొ రీమెక్ రైట్స్ కొసం కొట్టుకుంటున్నారు..

 22. @ Sri
  నువ్వు చెప్పేది ఈ సినిమా గురించి కాకుండా జనరల్ గా చూస్తె కొంత నిజం వుంది.. మన సినిమాల క్వాలిటి బాగొదు. అది డెవెలొప్ చెయ్యకుండా మన వాళ్ళు ఎప్పుడు క్రెజి కాంబినషన్స్.. కలక్షన్స్ , 100 డెస్ సెంటర్స్ , స్టార్ ఇమెజ్ (బాబు కల్చర్ ), అదే రొటీన్ స్టొరి లైన్స్.. మూస ఫార్ములా, చెత్త చెదారం గురించి మాట్లాడతారు. ఈ విషయం చాలా సార్లు బ్లాగుల్లొ డిస్కషన్ వచ్చింది.

 23. *అందుకె వెరే బాషల్లొ రీమెక్ రైట్స్ కొసం కొట్టుకుంటున్నారు.*

  Magadhira paristi kooDaa inte

  http://telugu.greatandhra.com/cinema/20-09-2009/deela_22.php

 24. ha ha.. may be.. my comment *అందుకె వెరే బాషల్లొ రీమెక్ రైట్స్ కొసం కొట్టుకుంటున్నారు.* is correct. I don’t comment on result as I don’t care..

  In fact I don’t like Hindi movies.

  All i say is ..respect other people choices/tastes..
  If you don’t like them.. that’s your taste.. don’t expect all others to have the same taste as yours. Don’t treat others as fools if their tastes are not same as yours (especially when others are majority).

  I suggest you to use strong words like ‘brain /intelligence/maturity levels’ carefully.

 25. Please ignore my above comment.
  ప్రసాద్ నువ్వు ఎదో తెగ బాధ పడుతున్నావు తెలుగు సినెమా గురించి. అసలికి తెలుగు వాళ్ల గొప్పతనం గురించి నాలుగు మాటలు చెప్పండి. పోని తెలుగు వాళ్ల లో ఉన్న గొప్ప వారిని ఆంధ్రా ప్రజలు ఎవరైనా గుర్తించారా? తెలుగు జనం లో 98% ఒక పరిక్షలో 35% మార్క్స్ తో పాసు అయే లాంటి వారు. మీ వాదన ఎలా ఉందంటె వీరు మెజారిటి కాబట్టి ఎవ్వరు వీరికి సూచనలు,సలహాలు చేయకుడదు అని అంట్టున్నారు. ఎవరైనా అలా చేస్తె వారిని వ్యతిరెక వర్గం గా చిత్రికరిస్తున్నారు. బాబు క్వలిటి లేని వారు కనీసం మెరుగు పరచుకోవలసిన అవసరం ఉంది. మీరు దానిని కూడా తిరస్కరించి మేము బావిలో కప్పలం మా జన సంఖ్య,థియేటర్ల సంఖ్య ఎక్కువ దాని వలన కలేక్షన్స్ ఎక్కువ అది మీ వాదన. ఈ విషయమేకాదు చాల విషయాలలో తెలుగు వాళ్ళకి గొర్రెల మంద సైకాలజినె, దానిని మీరు గొప్ప గా భావిస్తె నాకేమి అభ్యంతరం లేదు.

  • తెలుగు వాళ్ల గొప్పతనం గురించి నాలుగు మాటలు చెప్పండి. పోని తెలుగు వాళ్ల లో ఉన్న గొప్ప వారిని ఆంధ్రా ప్రజలు ఎవరైనా గుర్తించారా?>>Do u really know what u r talking. do u think it is relevant to this post. You are really testing the limits of my patience. That’s why i told in the very beginning itself- వాదనల్లో, చర్చల్లో -అభిప్రాయాలు మారవు.

   If u really bother abt quality of telugu cinema…write what needs to be done to improve that quality..or go and make a movie and show what do u mean by quality…simply typing on keyboard and yelling that telugu cinema quality is poor – will get no one anywhere….

   Also remember i just mentioned the collections of this movie – and never told this is a high quality movie – then what is ur problem….??? U are saying – as the quality of this movie is not that good- nobody should talk positively about the collections of the movie….Do u think it makes sense..

   Again I am saying – వాదనల్లో, చర్చల్లో -అభిప్రాయాలు మారవు…U need to understand one simple thing. as u are not willing to change ur mind – other ppl also will not like to change their mind…As u feel ur opinions are superior to others – (as u write తెలుగు వాళ్ళకి గొర్రెల మంద సైకాలజినె, దానిని మీరు గొప్ప గా భావిస్తె నాకేమి అభ్యంతరం లేదు) other ppl also think the same way!!!

   I write this blog – just to have some fun….just to share somethings..NOT TO ARGUE with anyone. బాబూ..ప్రజలందరూ అఙ్ఞానం లో ఉన్నారు..మీరు మాత్రం ఙ్ఞానం లో ఉన్నారు అని మీరనుకుంటే..వాళ్ళ అఙ్ఞానానికి వాళ్లని వదిలేసి మీ ఙ్ఞానం లో మీరుండండి….!!!

   • mohanrazz,
    ఇన్ని చెపుతున్న మీరు, శ్రీ అభిప్రాయాన్ని మీరు మార్చలేరు అనే విషయం గ్రహించక పోవడం ఆశ్చర్యంగా వుంది.

    • ha ha.. గ్రహించకపోవడమంటూ ఏమీ లేదు బాసూ..నేను మొదటినుంచీ చెబుతున్నదీ అదే – చర్చల్లో వాదనల్లో అభిప్రాయాలు మారవు అని… still — తెలుగు వాళ్ళకి గొర్రెల మంద సైకాలజినె, బుర్రలో గ్గుజు ఎమాత్రం లేదని,ఇక్కడ గొర్రెలని వెనకేసుకు వస్తూ, బావిలో కప్పలం, ఆంధ్రా జనాల మారని మానసిక పరిస్థి — అంటూ ఉంటే – కొంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది- బహుశా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాదనలు చేయకపోవచ్చు నేను..మీరేమో హ్యాపీగా కామెంట్స్ సెక్షనే లేపేసి కూర్చున్నారు ప్రశాంతంగా 😀

 26. మా సినేమాల క్వాలిటి ఇంతే అని అనుకున్నప్పుడు ఇతరుల తో మేము పొల్చుకోము అను కున్నపుడు అలానె ఉండాలి కాని మీరు ఇక్కడ కలేక్షన్స్ ఈ సినేమాకి ఎక్కువ రావడంతో మీ గొప్పతనం అందరు గురితించాలని ఇతర బాషల సినేమా కలెక్షన్స్ తో పోల్చటం మొదలు పెట్టారు. మీరెమొ అమెరికాలో కూచొని ఇక్కడ గొర్రెలని వెనకేసుకు వస్తూ వారిని శాశ్వత అజ్ఞానం లో ఉంచాలను కుంట్టున్నరు.

 27. సాయ్ లెన్స్!!
  ‘మగధీర ‘ ఒక గొప్ప సినిమా ( ఎవరికి?)
  Gladiator,Troy,300,Jodhaa akbar లాంటి సినిమాలు చూడని వారికి (సినిమా ప్రేక్షకుల్లో 80% మందికి అనగా మెజారిటీ) అందుకనే అన్ని రికార్డులు .
  తక్కిన 20% మందికి ఇది మామూలు సినెమాయె అయినా కొత్తగా తెలుగులో ఇంత పెద్ద రికార్డులు చూసి అబ్బురమనిపిస్థొంది అంతే….

  మళ్ళీ సాయ్ లెన్స్!!

  • sai lens?

 28. నేను తెలుగు వాడిని అయినా నాకు తెలుగు వాళ్ళా సైకాలజి చుస్తె తిక్కరేగుతుంది. నాకు తెలుగు వాళ్ళని తిట్టడానికి అవకాశం కలిపించిన మీ అందరికి అభినందనలు.

 29. @ sri

  I don’t think you red my message on 9/22 at 8:54 PM. okay

  నేను తెలుగు వాడి గా పుట్టినందుకు చాల గర్వ పడుతువుంటా..

  *** అసలికి తెలుగు వాళ్ల గొప్పతనం గురించి నాలుగు మాటలు చెప్పండి. పోని తెలుగు వాళ్ల లో ఉన్న గొప్ప వారిని ఆంధ్రా ప్రజలు ఎవరైనా గుర్తించారా? తెలుగు జనం లో 98% ఒక పరిక్షలో 35% మార్క్స్ తో పాసు అయే లాంటి వారు ***

  నువ్వు ఈ అభిప్రాయం తొ వున్నావని నాకు తెలీదు. అలా అయితే నేను నీతొ వాదించపోదును. మీ ఇంటెలక్యూలిటీ తెలుగు ప్రజలందరికి రాలేదు .. ఎమి చెస్తాం..మా లెవెల్ ఇంతే మరి..

 30. I think this will never end- Comments Off

 31. @శ్రీ,
  మీ కామెంట్స్ అన్నీ చూసాక ఒకటే అనిపించింది. ప్రపంచం లో అందరూ మీలాగే జీవిస్తారని, మీ లాంటి అభిరుచులే కలిగి ఉంటారనేది మీ అభిప్రాయం. ఒకవేళ అలా లేకపొతే వాళ్ళందరు మూర్ఖులని అనుకుంటున్నారు.
  భారతదేశం లో 50% పై గా ప్రజలు కష్టించి ఒడలు అలసిపోయెలా పనిచేసేవాళ్ళే. అలంటి వారికి సరద గా సినిమా చూద్దామనుకున్నప్పుడూ, వారు నిజజీవితం లో చేయలేనివి, కని విని ఎరుగనివి చూడాలనిపిస్తుంది. వాళ్ళకి నీతులు చెప్తూ సినిమా చూపిస్తే విసుగొస్తుంది.అన్ని రకాలుగ, ఆర్థికం గా, సామాజికం గా, రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్న దేశాల వాళ్ళకి నీతులు చెపే కథలు కావాలి. కాని ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళకి కాదు. చెమటోడ్చి పనిచేసేవాడికి తన కష్టాన్ని మరచిపోయె కథ, హాయి గా relax అవ్వగలిగే కథ కావాలి. ఏ/సి రూమ్ లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కూర్చునే మీలాంటి వాళ్ళు మంచి కథ, నీతులు అని ధర్మోపన్యాసాలు చేసేవాళ్ళు చాలా తక్కువమంది మన దేశం లో, మన రాష్ట్రంలో. అన్ని రకాలుగా అంటే మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ గారి గురించి తెలియని భారతీయుడుండడ‌ని నా అభిప్రాయం. ఆయన ఒకసారి ఇంటర్వూ లో చెప్పారు…’నాకు ఫైట్సు, డాన్సులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నిజ జీవితం లో అవి నేను చెయ్యలేను కనుక” అన్నారు. మరి అలాంటి మహానుభావుడికే మాస్ సినిమాలు ఇష్టమయితే సామాన్య తెలుగు ప్రేక్షకుడికి ఎందుకు నచ్చదు? ఉదయఘ‌డ్ కోటనో, జైపూర్ కోటనో స్వయంగా వెళ్ళి చూసే ఆర్థిక స్థోమత మీలాగ అందరికి ఉండదు. అది మగధీర లో చూపిస్తే ఆనందంగా చూస్తారు, సినిమా ని హిట్ చేస్తారు. ఆ సెట్టింగ్స్ అన్ని బెన్‍హ‌ర్ లోనో, గ్లాడియేటర్ లో నో ఉన్నాయని, డైహార్ద్ 4 లో ఉన్న సీను ఇందులో ఉంది అని ఎంత‌మంది తెలుగు ప్రేక్షకులకి తెలుసు? ఎంతమంది కి అలాంటి ఇంగ్లీష్ సినిమాలు చూసే అవకాశం వస్తుంది?నా మటుకు నాకు మగధీర సినిమా నచ్చింది. అందులో కొద్దో, గొప్పో లోపాలు ఉండొచ్చుగాక. మాయాబజార్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. చిన్నప్పుడు నేను ఆ సినిమా ని అందులో చూపించే మాయలు, మంత్రాల కోసమె చూసేదన్ని. పెద్దయ్యాక‌ దానిలో ఉన్న మిగతా విలువలని గ్రహించాను. ఇప్పటీకి నా favorite ఆ సినిమా నే. ప్రతీ సినిమాకి విమర్శలు ఉంటాయి. పోనీ మీరు ‘గొప్ప’ అనుకున్న సినిమా కి విమర్శలు ఉండవు అని మీరు ప్రూవ్ చెయ్యగలరా? ప్రపంచం లో అసాధ్యమనేది ఎదీ ఉండ‌దు. తనని తన్నెవాడూ ఒకడైతే, తల తన్నెవాడూ ఇంకొక‌డుంటాడట‌. తెలుసుకోండి. ఉత్తమ చిత్రాలు, మంచి కథ తో కూడిన సినిమాలు వస్తే మాకూ సంతోషమే. అంతమాత్రాన మాస్ సినిమాలని అభిమానించే సగటూ ప్రేక్షకుడిని అవనిస్తామా? ఎవరి అభిప్రాయలు, అభిరుచులు వాళ్ళకి ఉంటాయి. అవతలి వ్యక్తి అభిరుచిని, అభిప్రాయన్ని గౌరవించడమనేది మనవత్వం (కొంచం పెద్దమాట అయినా వాడక తప్పట్లేదు) అనిపించుకుంటూంది. మీకు అది లేదని అర్థమవుతున్నది. కొంతమంది ప్రతీదాన్ని criticise చెయ్యడం గొప్ప అనుకుంటారు. మీరూ ఆ కోవ కి చెందిన వారే. ఇక్కడ ఇంతమంది ఎదుటీ వ్యక్తి ని గౌరవించేవాళ్ళూ ఉన్నారు, కాని వారితో అర్థంపర్థం లేకుండా, పై గా దీనివల్ల తెలుగు వాళ్ళమీద అభిమానం పోయిందని వ్యాఖ్యానిస్తూ అవాకులు చవాకులు పేలడం అంత మ‍చి పద్దతి కాదు. ఇక్కడ వాదనలు ఇంక అనవసరం అని మోహన్ గారు అన్నరంటే అది మీ విజయమనుకుంటున్నారేమో, కాని అది మీ పరాజయమని గ్రహించండి.

 32. […] […]


వర్గాలు

%d bloggers like this: