వ్రాసినది: mohanrazz | 2009/09/22

శంకర్ ని గుండె మీద చేయి వేసుకుని చెప్పమనండి-దాసరి

dasari-shankar

ఆమధ్య దాసరిగారో స్టేట్‌మెంట్ ఇచ్చారు- శంకర్ భారతీయుడు సినిమా నా సర్దార్ పాపారాయుడు ని కాపీ కొట్టి తీయలేదు అని శంకర్ ని గుండె మీద చేయివేసుకుని చెప్పమనండి- అని. శంకర్ కి స్ఫూర్తి సర్దార్ పాపారాయుడో కాదో శంకర్ చెప్పలేదు. ఇలాంటి విషయాలు ఒక పట్టాన తేలేవి కాదు.

అయితే శంకర్ జెంటిల్మేన్ మొదటి సారి చూసినపుడు నాకు భలేదొంగ అనే బాలకృష్ణ సినిమా గుర్తొచ్చింది. అందులో బాలకృష్ణ దొంగతనాలు చేస్తూంటాడు. ఆ డబ్బుతో పేదల కోసం ఒక హాస్పిటల్ ఏదో కట్టాలని ప్రయత్నిస్తూంటాడు. బేసిక్ స్టోరీ లైన్లో పోలికలని ప్రక్కనపెడితే జెంటిల్మేన్ ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం భీబత్సమైన గ్రాండ్ స్కేల్ లో ఉంటుంది. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే విధంగా సన్నివేశాలు వ్రాసుకున్నాడు శంకర్ ఇందులో. భలేదొంగ లో- అప్పటి దాకా ఉన్న తెలుగు తమిళ కమర్షియల్ సినిమాల్లో లాగానే  హీరో దొంగతనాలు చేస్తుంటాడు- అంతవరకే చూపిస్తారు. శంకర్ వచ్చి- ఆ దొంగ డబ్బు ఎక్కడ దాచాలి, ఎలా దాచాలి, విద్యాలయాన్ని కట్టడానికి లీగల్ గా ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రజలతో 5 రూపాయల చందా తీసుకునే ప్రాసెస్ – ఇలా చాలా చాలా అంశాలతో కన్విన్సింగ్ గా తీశాడు. అంతకు ముందు వచ్చిన భలే దొంగ లాంటి సినిమాలు మాత్రమే చూసిన మన జనాలకి ఇది కొత్తగా అనిపించింది. ఇక భారతీయుడు లో సుభాష్ చంద్రబోస్ ప్రక్కన కమల్ హాసన్ ని నిలబెట్టినట్టు చూపించిన సీన్ చూస్తే- The magic of thinking big అనే self-help పుస్తకానికి సినిమాల్లో లైవ్ ఎగ్జాంపుల్ లా కనిపించాడు శంకర్.

శంకర్ తన కెరీర్ మొత్తమీద కలిపి పాతిక సినిమాలు కూడా తీయలేకపోవచ్చు. గిన్నీస్ రికార్డు సాధించిన దాసరి తో సంఖ్యా పరంగా పోటీ పడలేకపోవచ్చు. దాసరి లా పదిరోజుల్లో సినిమా తీసి వందరోజులు ఆడించలేకపోవచ్చు-అంతమాత్రాన శంకర్ దిగదుడుపే దాసరి ముందు అని చెప్పడానికి వీలు లేదు. అప్పటి తరాన్ని దాసరి సినిమాలు మెస్మరైజ్ చేస్తే ఇప్పటి తరాన్ని శంకర్ సినిమాలు మెస్మరైజ్ చేశాయి. ఎవరైనా వర్ధమాన దర్శకుడో, బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రచయితో వచ్చి ఫలానా పెద్దమనిషి నా ఐడియాలు కాపీ కొట్టాడు అంటే అర్థముంది కానీ దాసరి లాంటి లెజెండ్ – నన్ను శంకర్ కాపీ కొట్టాడు అని జనాలకి చెప్పుకోవాల్సి రావడమే – దాసరి స్థాయిని ఒకమెట్టు క్రిందకీ శంకర్ స్థాయి ని ఒకమెట్టు పైకి తీసుకెళ్తుంది.


Responses

 1. పిల్లితల గొరుగుట కత్తి విరుగుట కొరకే
  దాసరి శంకరుని కొరుకుట ____ కొరకే

 2. ఒక్క జెంటిల్మేన్ సినిమా ప్రక్కన పెట్టి,
  శంకర్ సినిమాలు చూస్తుంటే ఇంత అతి అవసరమా అని పిస్తూ వుంటుంది నాకు 🙂
  ఒక విధంగా చెప్పాలంటే మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ మూవీస్ ఇండియన్ మూవీస్ స్టాండర్డ్స్ (టెక్నికల్) పెంచితే, శంకర్ మూవీస్ నుంచే భారి బడ్జెట్ అని కొత్త కాన్సెప్ట్ ముందుకి వచ్చింది అనుకుంటా,

  శంకర్ ఒక లో/మీడియం బడ్జెట్ తో మూవీ చేస్తే చూడాలని ఆశ 🙂

 3. భలే దొంగ ఐనా సరే, పాపారాయుడు ఐనాసరే వాళ్ళెవ్వరూ “రాబిన్ హుడ్” నుండి ఇన్స్పైర్ అవ్వలేదని గుండెలమీద చేయివేసుకొని చెప్పమనండి. దాసరి ఒరిజినాలిటీ గురించి మాట్లాడ్డం పిల్లి ఎలుకలు పోతున్నాయని కంప్లైంట్ ఇచ్చినట్టుంది.

 4. బాగా చెప్పారు.

  // గిన్నీస్ రికార్డు సాధించిన దాసరి తో సంఖ్యా పరంగా పోటీ పడలేకపోవచ్చు. దాసరి లా పదిరోజుల్లో సినిమా తీసి వందరోజులు ఆడించలేకపోవచ్చు-అంతమాత్రాన శంకర్ దిగదుడుపే దాసరి ముందు అని చెప్పడానికి వీలు లేదు.

  అక్షరాలా నిజం. అసలు హితబోధ చేసే సినిమాలంటేనే ప్రేక్షకులకి అంత నచ్చవు. అలాంటి సబ్జెక్ట్స్ ని అన్ని వర్గాల వారికి నచ్చేలా తీయటమంటే మాటలు కాదు. ముఖ్యంగా ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్న ఈ కాలం ప్రేక్షకులను మెప్పించటం ఇంకా కష్టం. ఎంటరటైన్మెంట్ తో పాటు, ఎంతో కొంత మందిని ఆలోచింపచేసే విధంగా తీయటం నా దృష్టిలో గొప్పే.

 5. పాపారాయుడు సంగతేమో నాకు తెలీదు. అయితే, శంకర్ సినిమాల్లో కనిపించే నీతిబోధలు sugar coated pills. మామూలు సినిమాలకన్నా, వీటి వల్ల వచ్చే నష్టం ఎక్కువ. ప్రజలకు కొన్ని విలువల పట్ల ఇష్టం ఉంటుంది. దాన్ని కమర్షియలైజ్ చేసుకుని, తన సకెస్ కోసం వాడుకోవడం, అవకాశవాదము, నిబద్ధత లేకపోవడమూ అవుతుందే తప్ప గొప్పతనం కాదు. భవిష్యత్తు తరం వారు జెంటిల్మేను, శివాజీ ఇలాంటి సినిమాలను చూసి నవ్వుకుని మర్చిపోయే అవకాశం ఉంటుందేమో కానీ,
  ఓ మేఘ సందేశం లాంటి సినిమాను మాత్రం మర్చిపోలేరు.

 6. గ్రీకు వీరుడి విడాకులు ఏమయ్యాయ్యో ?శంకర్ ని చూసి నేర్చుకుంటే మంచిది tv9 చేసిన రభస అయితే శంకర్ కి లేదు

 7. శంకరం సినేమాలు భవిష్యత్తరాల వాళ్ళు చూస్తారో లేదో కానీ ఒక కొత్త సామెత మాత్రం తెలుసుకుంటారు…

  “హిట్లేని దాసరి శంకర్ మీద పడట్లు…”

  “పీవీ వెళ్తుంటే దాసరి మొరిగినట్లు…”

 8. పూర్తిగా విలువలను తుంగల్లో తొక్కేసి ,మరీ తీస్తూన్న సినీ సామ్రాజ్య సీమలో – ఎంతో కొంత నిబద్ధతతో, ప్రజలకు కొన్ని ఆదర్శాలను” మనసులకు నాటుకునేటట్లుగా తీయడము ,ఈ క్లిష్ట తరమైన కార్యాన్ని, దర్శకునిగా , “తనపైన నమ్మకము ఉంచి,కోట్లాది రూపాయలను పెట్టు బడిగా పెట్టిన నిర్మాతలకు ” జవాబు దారీగా నిలబడిన దర్శకత్వ ప్రతిభను మెచ్చుకొని తీరాల్సినదే!
  Thanks to Sankar .

 9. ANTHA GOPPA DIRECTOR INTHHAGOPPA DIRCTOR NI TELIVITHAKUVAGA MATLDAM KOCHEM BADAGA UNDI
  EVARI TALENT VALLDI


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: