వ్రాసినది: mohanrazz | 2009/09/23

కొత్త సంప్రదాయం- రివ్యూల మీద విరుచుకుపడుతున్న దర్శక నిర్మాతలు

నాకు గుర్తున్నంతలో వెబ్ రివ్యూల మీద విరుచుకుపడటం- కృష్ణవంశీ మొదలెట్టాడు- తన డేంజర్ సినిమాకి సరైన రేటింగ్ ఇవ్వలేదని. అదీ (సైట్ పేరు చెప్పకపోయినా) స్పెసిఫిక్ గా ఐడిల్ బ్రెయిన్ మీద. మీకు నిజంగా అంత టాలెంట్ ఉంటే మీరే వచ్చి సినిమా తీయండి అని కృష్ణవంశీ సవాల్ చేసాడు. తెలుగు సినిమా ప్రేక్షకులకి రివ్యూలు, రేటింగుల మీద బాగా గురి ఏర్పడేలా చేసింది ఈ సైటే. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఈయన రేటింగ్ ని చూసి సినిమా హిట్టా ఫట్టా అనేది డిసైడయ్యేవాళ్ళు జనాలు కూడా. కాబట్టి ఇలాంటి సైట్ లో నెగటివ్ రివ్యూ వస్తే బిజినెస్ దెబ్బతింటుందనే స్థాయికి ఫిల్మ్ మేకర్స్ వెళ్ళిపోయారు అంటే అది కూడా ఆ రోజుల్లో ఆయన  రివ్యూలకి జనం లో ఉన్న క్రెడిబిలిటీ కి నిదర్శనమే. అయితే ఎవరైనా మానవమాత్రులే. ఈయన రివ్యూల్లో, రేటింగుల్లో కూడా కొన్ని బ్లండర్స్ ఉన్నాయి. కొన్ని దారుణమైన డిజాస్టర్స్ కి 4/5 ఇచ్చాడు రేటింగ్. కృష్ణవంశీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి లో విరుచుకుపడిన వ్యక్తి వెన్నెల దర్శకుడు- దేవకట్ట.

దేవకట్ట – వెన్నెల అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మెయిన్ గా యూత్ ని, అర్బన్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసారు. దీనికి 2.75 రేటింగ్ ఇచ్చాడు జీవి. నిజానికి ఆ తర్వాత వెన్నెల సినిమా నేను చూసాక, జీవి మిగతా సినిమాలకి ఇచ్చిన రేటింగులతో పోల్చి చూసాక- ఇంకొంత బెటర్ రేటింగ్ ఇచ్చివుండొచ్చు ఈ సినిమాకి అనిపించింది. అదీ కాక సినిమా లో మొదటి అరగంట కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఆతర్వాత సెకండాఫ్ లో వచ్చే సీన్స్, మరీ ముఖ్యంగా శర్వానంద్, రవివర్మ (సయ్యద్) పాత్రల మధ్య వచ్చే డైలాగ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. అదీకాక ఈనాడు పత్రికలోనూ, ఐడిల్ బ్రెయిన్ లోనూ తప్పిస్తే మిగిలిన అన్ని సైట్లలో బానే ఇచ్చారు రివ్యూలు, రేటింగులు. దేవకట్ట- ఇంటర్వ్యూ ఇస్తూ కేవలం ఇద్దరే ఇద్దరు తక్కువ రేటింగ్ ఇచ్చారు ఈ సినిమాకి. ఒకాయనేమో పాజిటివ్ రివ్యూ వ్రాయడానికి లక్ష -లక్షన్నర తీసుకుంటాడు. ఇంకొకాయన (ఈనాడు రివ్యూయర్) కొడుకు అమెరికా లా ఉండటం వల్ల- ఈ సినిమాకి పాజిటివ్ గా వ్రాస్తే తనకి కట్నం తగ్గుతుందనే ఒక మిస్-కాన్సెప్ట్ లో ఇలా వ్రాసాడు అని డైరెక్ట్ గా విరుచుకుపడ్డాడు.

ఇవన్నీ ఒకయెత్తు అయితే – ఆ తర్వాత వచ్చిన కుబేరులు సినిమా నిర్మాతలు కూడా రివ్యూల మీద విరుచుకుపడ్డారు క్యామిడీగా. ఇక సత్యమేవజయతే గురించి అయితే జీవితారాజశేఖర్ వచ్చి- సినిమాకి రివ్యూలు బాగ వ్రాయనందుకు విరుచుకుపడ్డారు. రివ్యూలు నెగటివ్ గా వ్రాసినా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంది అని చెప్పారు..మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్నా కలెక్షన్స్ పెద్ద గా రావట్లేదెందుకో అని వాళ్ళే వాపోయారు మళ్ళీ. ఇదేం లాజిక్కో…!!

ఇంకొంత మందేమో ఈ రివ్యూలు మొదటి రోజు రాకూడదనీ ఒక నెలో రెణ్ణెళ్ళో అయ్యక వస్తే ప్రాబ్లెం లేదనీ అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ.ఆ మధ్య ఒక డైరెక్టర్- మొబైల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ – ఇదంతా రావడం వల్ల సినిమాలో మెలోడ్రామా మిస్సవుతోంది అన్నాడు. అంటే హీరోయిన్ కి, హీరో కి మధ్య అపార్థాలు వచ్చినపుడో ఇంకొకపుడో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అట్లాగే ఉంటే వీళ్ళు వాటిని ఆసరా చేసుకుని మంచి మెలోడ్రామా సీన్లల్లుకునేవారప్పట్లో. మొబైల్స్ వచ్చిన తర్వాత వీటికి అవకాశం లేకుండా పోయిందే అని బాధపడ్డాడో దర్శకవర్యుడు. ఈ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని మరిన్ని కొత్త తరహా సీన్లు అల్లుకోనే అవకాశమొస్తే దాన్ని గుర్తించకుండా అప్పట్లో లా మెలోడ్రామా సీన్లు వ్రాసుకోలేకపోతున్నామే అని బాధపడటం హాస్యాస్పదం కాక మరేమిటి. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని ఎలాగూ ఆపలేం. దాన్ని మనకి పనికొచ్చేలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలే కానీ- ఆ టెక్నాలజీ వల్లే మాకీ కష్టాలు అంటే ఇక చేసేదేమీ లేదు. రివ్యూలు నెల రోజులు ఎవరూ వ్రాయకూదదు అని చెప్పడం కూడా ఇలాంటిదే.


Responses

 1. మీడియా అంటే ఒక వ్యాపారంగా మారింది. only GOD can save from this situation.

  no fault of jeevi. idlebrain ఇప్పుడు ఒక commercial site.

  డబ్బులతో కొనుక్కోనో , భయపెట్టో jeevi ని లొంగదీసుకోవాలి తప్ప చెయ్యగల్గింది లేదు.

 2. ఒహ గొప్ప సలహా చెప్పనా? అసలుకి అందరం కట్ట గట్టుకుని కొత్త తెలుగు సినిమాలు చూడ్డం మానేద్దాం!!

 3. హు..ఆ జీవి రాసేది బేసికల్ గా ఇంతే
  1)First half లేదా second half mediocre
  2)ఎడిటింగ్ ఆవరేజ్ లేదా OK
  3)కొత్త హీరో అయితే..he needs to improve in bla bla…వాళ్ళు improve అయినా కాకపొయినా, ఇప్పుడు మనం ఎంత మంది వారసులను భరించి..అభిమానించటం లేదు?

  -ప్రవీణ్

  • good observation 🙂

  • అన్నయ్యా! పెద్ద హీరో సినిమా అయితే ఆ సినిమాకి ఈరోనే హైలైటంటాడు. ఈవెన్ భలయ్య బాబు సినిమా అయినా.

   నిన్నే కేబుల్టీవీలో ఒక్కమగాడూలోని సూపర్ కామెడీ సీన్ చూస్శాను. క్లైమాక్స్. దాంట్లోనూ బాలయ్యే హైలైటంటా.

 4. మీరు పూరి జగన్నాధ్ ని మర్చిపొయారు.. జీవి కూడా చాలాసార్లు తప్పుడు రేటింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు ఈ రివ్యు, రేటింగ్ అన్ని నిర్మాత ఇచ్చె డబ్బు మీదే అదారపడి వుంటాయని తెలిసినప్పటినుండి నేను వాటిని నమ్మడం మానెసి ఒన్లి మౌత్ పబ్లిసిటి నే నమ్ముతున్నాను.
  అయినా ఈ రివ్యు, రేటింగ్ ప్రపంచంలొ అన్ని చొట్లా వున్నదే కదా.. ఇదెదొ మన తెలుగు సినిమాకె ఎఫ్ఫెక్ట్ అన్నట్టు మాట్లాదతారు. సరైయిన సినిమాలు తియ్యడం చేతకాక..

  • నిజంగానే మరచిపోయానే..! సినీ ఇండస్ట్రీ లో ఉన్న ఎన్నో లోపాల్ని- కొత్త ఆర్టిస్టులని పేరున్న దర్శకనిర్మాతలు, కొత్త నిర్మాతలని పెద్ద ఆర్టిస్టులు exploit చేయడం దగ్గరినుంచి ఇంకా ఎన్నో అంశాలుండగా సినీ ఇండస్ట్రీ లోపల ఉంటే వాటన్నిటి వదిలేసి- రివ్యూయర్ల మీద, ఫ్యాన్స్ మీద మాత్రమే సెటైర్ వేసిన- నేనింతే సినిమా గురించి ప్రస్తావిద్దామనుకుని – ఎందుకో మరిచిపోయా. 🙂

 5. “ఆడకపోతే రివ్యూ బ్యాడన్నట్లు”

 6. చెత్త సినిమాలకు కూడా డబ్బులిచ్చి, సూపర్ అని రాయించుకున్న కొన్ని నాగార్జున సినిమాలు ఉన్నాయి. ఓ రెండు మూడు సార్లు బలయ్యిన తర్వాత తెలివొచ్చింది.

  • its not just nagarjuna…everybody has their own share in it!

  • అయితే మీ లిస్టు లో బాస్ అనే సినిమా తప్పకుండా వుంటుంది 🙂

 7. ఆడలేక మద్దెల ఓడన్న సామెత మనదగ్గరున్నదే కదా!

  కానీ ఈ జీవీ అనే జీవి విషయంలో నా కోపం నాకుంది. అసలాడి రివ్యూస్ ఛండాలంగా ఉంటాయి.

 8. ‘ నేనింతే’ సినిమా లో అన్నట్టు ఈ రివ్యూ అనేది సినిమా మీద ఆసక్తి కల్పించేంత వరకే అయితే బావుండేది.కానీ మనం రేటింగ్ బట్టి సినిమా చూస్తున్నాము. పాటలు విని ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళటం లేదు.ఎందుకంటే ట్రైలర్ మాత్రమే బావున్న సినిమాలు ఉన్నాయి కనుక . ఏది ఏమయినప్పటికీ రివ్యూల కంటే పొస్టుమార్టం లాంటివి మంచివని నా అభిప్రాయం

 9. ఖాళీబుర్ర.కామ్‌లో రాసేవి రివ్యూలా? నాకైతే అవి కామెడీ వ్యాసాల్లా ఉంటాయి. ఆ జీవికి ఉన్నది ఒకటే టెంప్లేట్. దాన్నే అటూ ఇటూ చేసి అన్ని ‘రివ్యూలు’ రాసిపారేస్తాడు (అసలు సినిమా చూసి రాస్తాడా, చూడకుండానే రాస్తాడా అని నాకో గొప్ప అనుమానం. ఉదాహరణకి, 27 Dresses హాలీవుడ్ సినిమా గురించి అయ్యవారు రాసిన సమీక్ష చదవండి. మొట్టమొదటి వాక్యమే Jane (‘Katherine Heigl) is a professional bridesmaid’ అట !! Either he didn’t see the movie, or he didn’t understand it :D.).

  Heroine xxxx is wasted. yyyy is adequate in character role. zzzz’s comedy is ok – ఏ రివ్యూ చూసినా ఇవే వాక్యాలు (అసలు, wasted అంటే వెంటనే తట్టే అర్ధం ఏంటో కూడా తెలీదు గురుడికి :D). ఈ రివ్యూలూ, ఈ రేటింగులూ ఒకప్పుడైనా నమ్మినోళ్లున్నారంటే వింతే.

 10. Chandra mukhi cinema aayanaki ardham ayina vidhanambettidanina…

  “Why would Chandramukhi ghost do not attempt anything against Eeswar and Tantrik who are in mansion to see the end of ghost.”

  nayana yerri jeevi..ghost endee ghost end chudatam endee..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: