వ్రాసినది: mohanrazz | 2009/09/29

తారే జమీన్ పర్ :)

tzp

తారే జమీన్ పర్. నేల మీది నక్షత్రాలు. దాదాపు చాలామంది చూసే ఉంటారు ఈ సినిమాని. ఇందులో ఒక చిన్న కుర్రాడు ఉంటాడు. ఆ పిలాడికి learning disability ఉంటుంది. అది పూర్తిస్థాయి బుద్దిమాంద్యం కాదు కానీ కొంతవరకు అలాంటిదే. తల్లిదండ్రుల దగ్గరి నుంచీ అందరూ చిన్నచూపు చూసే ఇలాంటి పిల్లల్లో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుందని తెలియజెప్పే టీచర్ పాత్ర అమీర్ ఖాన్ ది. Every child is special అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా లో పసిపిల్లలు “నేల మీద నడిచే నక్షత్రాల్లాంటి” వారనీ అంత అపురూపమైన వాళ్ళని అంతే మురిపెంగా చూడాలనీ చెప్తాడు అమీర్ ఖాన్.

అయితే ఈ టపా కేటగరీ “సినీ పిచ్చాపాటి” కాదు, “పత్రిక” అనే కేటగరీ 🙂 . పత్రికల్లో వచ్చే హెడింగులు కొన్ని భలే క్రియేటివ్ గా ఉంటాయి. కొన్ని సార్లు మరీ ఒకే మూసలో ఉంటాయి. ఇంకొన్ని సార్లు అందరి హెడింగులూ ఒకేరకంగా ఉంటాయి. ఆ మధ్య శ్రీలంక ఆటగాళ్ళమీద పాక్ లో దాడి జరిగినపుడు- ఈనాడు, సాక్షి, వార్త, సూర్య – నాలుగు పత్రికల్లోనూ ఒకే బ్యానర్ హెడింగ్ వచ్చింది- “ఆటపై తూటా” అని. మరి నాలుగు పత్రికల్లోనూ- మరీ ఒకేలా ఎలా ఆలోచించారో అర్థం కాలేదు.

ఇక కొన్ని హెడింగులైతే క్రియేటివ్ గా ఉండి- ఆలోచింపజేస్తూనే – చిరుదరహాసాన్ని తెప్పిస్తాయి. పోయినేడాది లీమన్ బ్రదర్స్ బ్యాంక్ దివాలా తీసినమర్నాడనుకుంటా మార్కెట్ కుప్పకూలిపోయింది ఒకేరోజు. చాలా మంది విశ్లేషకులు – “free fall” అనీ, “blood shed” అనీ ‘black day’ అనీ వ్రాసాయి. అయితే టైంస్ ఆఫ్ ఇండియా లో వచ్చిన బ్యానర్ హెడింగ్ మాత్రం నాకు భలే నచ్చింది. అంత బాధలోనూ ఒక్కసారి నవ్వుతెప్పించింది. వాళ్ళు పెట్టిన హెడింగ్- “తారే జమీన్ పర్”. ఇందులో రెండు అర్థాలున్నాయి 🙂 జనాలకి “చుక్కలు” కనిపించాయి అనేది ఒకటయితే, మొన్నటిదాకా ఆకాశన్నంటే ధరలతో పైనెక్కడో ఉన్న షేర్లు కూడా దెబ్బకి నేలమీదకి దిగి వచ్చాయి అని రెండవది . భలే ముచ్చటగా అనిపించింది ఆ హెడింగ్ మాత్రం. 😀

ప్రకటనలు

Responses

  1. టైంస్ (మ కి స వత్తు ఇవ్వడం కుదరదా?) ఆఫ్ ఇండియా లోనే మన క్రికెట్ జట్టు ఓడిపోయినపుడు (సి)తారే జమీన్ పర్ అని వ్రాసాడు.

  2. ఏదో ఒకటి లెండి ఆల్రెడీ మోహన్ గారు చెప్పారు కదా ఆ విషయం


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: