వ్రాసినది: mohanrazz | 2009/09/30

What women want

WWW

What women want. మెల్ గిబ్సన్ సినిమా. మన్మధుడు సినిమా షూటింగ్ లో ఉన్నపుడు ఒకటే రూమర్స్ వచ్చాయి- ఈ సినిమాని కాపీ కొట్టి మన్మధుడు తీస్తున్నారట అని. మరీ కాపీ అని చెప్పలెము కానీ కొంతమేరకు “స్ఫూర్తి”నిచ్చి ఉండవచ్చు మన్మధుడు దర్శకరచయితలకి ఈ సినిమా.

అయితే ఈ టపా మన్మధుడు సినిమా గురించో, వాట్ వుమెన్ వాంట్ అనే సినిమా గురించో కాదు. మొన్నామధ్య ఫ్రెండ్ కాల్ చేసాడు. అతనికి ఇప్పటిదాకా పెళ్ళికాలేదు. “కుర్రాడికి” ఇప్పుడు రమారమి ముప్పైరెండేళ్ళు. H1 మీద US లో జాబ్ చేస్తున్నాడు. తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు 😀 . నాకు చాలా యేళ్ళుగా తెలుసు. పాపం మంచోడు కూడా. ఎప్పటినుంచో పెళ్ళిప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ ఏదీ కుదరలేదు. మనిషికి కాస్త మంచితనం ఉండీ, చూడ్డానికీ బానే ఉండీ, ఊళ్ళో పొలాలుండీ, బ్యాంకులో డబ్బులుండీ, చేతిలో ఉద్యోగముండీ, ఇప్పటికీ ఏదీ సెట్ కావట్లేదని చెప్పుకుని బాధపడ్డాడు.

“ఎందుకు బాసూ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతావు, నువ్వే వెతుక్కోవచ్చు గా అమ్మాయిని” అన్నాను.  బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడనుకుంటా. అయితే, ఆ బాధలోనూ ఓ మంచి సెటైర్ వేసాడు.

“ఇప్పటి అమ్మాయిలు కూడా భలే తయారయ్యారు బాసూ. నాకు ఉద్యోగముంది, ఊళ్ళో పొలాలున్నాయి, బ్యాంకులో ఓ నాలుగు లక్షలున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ లో ఓ నాలుగు లక్షలున్నాయి, షేర్లలో ఓ నాలుగు లక్షలున్నాయి,  నన్ను పెళ్ళి చేసుకో అంటే కేర్ కూడా చేయరు. అదే – నా దగ్గర ఇందులో ఒక్కటి కూడా లేదు కానీ నీకోసం నేను ఏదైనా సాధిస్తా – అని సొల్లు కబుర్లు చెబితే మాత్రం ఊరికే పడిపోతారు :D”

మావాడి స్టేట్‌మెంట్ లో నిజానిజాల సంగతి ప్రక్కనపెడితే – అంత ఫ్రస్ట్రేషన్ లోనూ మావాడి సెన్సాఫ్ హ్యూమర్ మాత్రం బాగా నచ్చింది నాకు.

ప్రకటనలు

Responses

 1. “ఆడాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటే?” అన్న పాయింటొక్కటే లెండి రెండు సినిమాలకీ పోలిక!

  మీ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో హ్యూమరే కాదు, బోలెడంత నిజం కూడా ఉంది.

  • బోలెడంత నిజం కూడా ఉంది>>

   నాకూ ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం ఓ సారి ట్రెయిన్ లో మా స్కూల్ మేట్ ఒకమ్మాయి కనిపించింది. మాటల మధ్యలో “ఫలానా” అబ్బాయి ని పెళ్ళి చేసుకున్నాని చెప్పింది. ఆ కుర్రాడు నాకు పరిచయం లేకపోయినా ఊళ్ళో కొంచెం జులాయి అవడం వల్ల పేరు చాలా సార్లు విన్నాను. ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఇంటర్ కూడా చదవలేదు, ఆ అమ్మాయేమో ఎమ్మెస్సీ చదివింది . “అతన్ని చేసుకున్నావా?” అని అడుగుదామనుకుని బాగోదని ఊరికే ఉంటే- నా ఫేస్ ఫీలింగ్స్ అర్థమై అనుకుంటా, తనే అంది..”నాకు అతని కళ్ళల్లో ఒక రకమైన నిర్లక్ష్యం కనిపించింది, కరెక్ట్ గా మోటివేట్ చేస్తే ఏదన్నా సాధిస్తాడనిపించింది” అని.

   నాకు దిమ్మ తిరిగిపోయింది.

   • నాకు అతని కళ్ళల్లో ఒక రకమైన నిర్లక్ష్యం కనిపించింది, కరెక్ట్ గా మోటివేట్ చేస్తే ఏదన్నా సాధిస్తాడనిపించింది

    – బాబొయ్ అమ్మాయి ! సినిమా సరుకే !

  • I agree with sujatagaaru!

 2. good sense of humour 😉 😉

 3. >నాకు దిమ్మ తిరిగిపోయింది.
  నాక్కూడా. సినిమాలు ఎక్కువ చూస్తుందనుకుంటా. కరెక్ట్‌గా మోటివేట్ చేసిందో లేదో కొంచెం కనుక్కుని చెప్పరూ, ప్లీజ్? 🙂

 4. Advice him to not marry. 🙂
  Bhadram be careful brotheru… bharta ga maaraku bacheloru. 🙂

 5. సుజాత గారు చెప్పిందే నా అభిప్రాయం కూడా..అప్పుడప్పుడు ఆ విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు కొంతమంది. పాపం మీ ఫ్రెండుకి కూడా అలాంటి షాకులే తగిలాయేమో 😦
  మనందరం మీ స్నేహితుడికి మంచి అమ్మాయి భార్యగా దొరకాలని దీవించుదాం 🙂

 6. బాగా రాస్తున్నారు మీరు ఎప్పటి నుండొ కామెంటుదామని అనుకుంటు అలా వదిలేసా..చాలా మంది అమ్మాయిల అమాయకత్వమో, తెలివితక్కువతనమో గాని ప్రేమగానో సానుభూతిగానో నాలుగు మాటలు చెప్తే చాలు బాబూమోహన్ లో కూడా మహేష్ బాబుని చూసేస్తారు…తరువాత గొల్లుమని ఏడుస్తారు .. నాకు తెలిసిన ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి పక్కా పోకిరిని ప్రేమించి ఎవరు చెప్పినా వినకుండా పెళ్ళి చెసుకుని ఇప్పుడు బిడ్డ తల్లి అయినాక బాధ పడుతుంది.ఏంటో ఈ కాలం అమ్మాయిలు ..

 7. Have you heard of “Ladder theory” ?

  http://en.wikipedia.org/wiki/Ladder_theory

  ఇది చదివాక ఇలాంటి డౌట్లు చాలా తీరాయిలేండి 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: