వ్రాసినది: mohanrazz | 2009/10/02

ఏంటి ఈ తిర”క్కథ” ??

thitakkatha 

ఈయేటి ఫిల్మ్ ఫేర్ అవార్డులు చూస్తూ ఉంటే- మళయాళం లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ నటి(ప్రియమణి) తో పాటు ఇంకో రెండు మూడు కేటగరీల్లో ఐదో ఆరో అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ తిరక్కథ అనే సినిమా కథేంటో చూద్దామని సరదాగా గూగ్లింగ్ చేసా. కథ చదివాక దీని మీద టపా వ్రాయాల్సిందేననిపించి…

మన శివరంజని, రంగీలా లాగా సినిమా వాళ్ళకి సంబంధించిన కథ ఇది. ఇక కథేంటంటే- అక్బర్ అహ్మద్ (మళయాళ పృథ్విరాజ్) అనే ఒక దర్శకుడు తన మొదటి సినిమా తోనే హిట్టు కొడతాడు. నిర్మాతలు అతని వెంట క్యూ కడితే అతను మాత్రం తనని ఇన్స్పైర్ చేసే కథ దొరికే వరకు మళ్ళీ సినిమా తీయనని తన ఊరికి వెళ్ళిపోయి అక్కడ తన పాత క్యాంటీన్/కాఫీ బార్ ని నడుపుకుంటూ ఉంటాడు.(నిజానికి మళయాళం లో కొంత మంది డైరెక్టర్స్ ఇలాగే చేస్తారని విన్నాను..ఒక సినిమా తీయడం..వాళ్ళ ఊరెళ్ళిపోయి పొలం పనులో, టీచరుద్యోగమో, బిజినెస్సో చూసుకోవడం….కొత్త కథ తయారు చేసుకుని మళ్ళీ రావడం…). దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలుతున్న ఒక హీరో సినిమా 100 డేస్ ఫంక్షన్ కి అటెండ్ అయిన అక్బర్ కి అక్కడొక కథ స్ఫురిస్తుంది. దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలుతున్న హీరో అప్పట్లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన మొదటి భార్య (అప్పట్లో హీరోయిన్) ఇప్పుడెక్కడ ఉందో ఏం చేస్తోందో కూడా ఎవరికీ తెలీదు. ఆమె కథని తెరకెక్కించాలనుకున్న అక్బర్ ఎంతో హోం వర్క్ చేసి ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటాడు..ఈ క్రమం లో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి…అయితే ఈకథ తెరకెక్కకుండా చేయడానికి ఆ హీరో ప్రయత్నిస్తాడు..స్థూలంగా ఇదీ కథ.

కొన్ని సైట్స్  లో ఇది కమల్ హాసన్- శ్రీవిద్య ల కథ ఆధారంగా రూపొందిందన్న రూమర్స్ నీ ఈ సినిమా పోస్టర్స్ లోనూ శ్రీవిద్య కనిపించడాన్నీ ప్రస్తావించారు. శ్రీవిద్య కేన్సర్ తో చనిపోయే చివరి రోజుల్లో కమల్ ఆమె ని కలిసినపుడు కొంతమంది వీరిద్దరి మధ్య అప్పటి బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఏ ఒక్క హీరో మీద అని కాదు కానీ- లైం లైట్ లో ఉన్న ఒక పెద్ద హీరో- ఇప్పుడు అంధకారం లో ఉన్న -ఒకప్పటి హీరోయిన్ అయిన – ఆయన అప్పటి ప్రియురాలు/భార్య – అనేది నిశ్చయంగా చాలా మంచి సబ్జెక్టే!!!

పూర్తి రివ్యూ కావాలంటే – ఇక్కడ!


Responses

  1. తిరక్కథ తిక్కథ లా ఉన్న లా ఉన్న ప్రయొగాత్మకంగా ఉందని అనిపిస్తుంది.. బాగా సేకరించారు. 😉

  2. తిన్నదరక్క రాసిన సొద, తీసిన కథ 🙂 మలయాళం వాళ్లూ మూసగాళ్లేనన్నమాట. ఈ మధ్య వరసగా సినిమాధారిత సినిమాలు తీస్తున్నారు. కాకపోతే అవి స్లోవోవోవోవోవోగా సాఆఆఆఆఆగి అవార్డులెగరేసుకుపోతాయి.

  3. @అబ్రకదబ్ర: ఈ సినిమా మీరు చూశారా?

  4. mmmmmm


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: