వ్రాసినది: mohanrazz | 2009/10/05

ఏవండీ మళ్ళీ కొట్టేసి పెళ్ళిచేసుకోండి

 హెడ్దింగు లో పొరపాటేమీ లేదు.. 🙂 ఆమధ్య సుమన్, రమ్యకృష్ణ ల సినిమా ఒకటొచ్చింది- “ఏవండీ మళ్ళీ పెళ్ళి చేసుకోండి” అనే పేరు తో. అయితే సెన్సార్ లో చిన్న ఇబ్బంది వచ్చింది టైటిల్ కి. మళ్ళీ పెళ్ళి చేసుకోండి అని చెప్పడం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించేలా ఉందని సెన్సార్ వాళ్ళూ అభ్యంతరపెడితే టైటిల్ లో నుంచి ఆ “మళ్ళీ” అనే పదాన్ని తీసేసారు. అయితే ఆల్రెడీ ప్రింటయిన పోస్టర్లని ఏం చేయాలి? అందుకే పోస్టర్ లో “మళ్ళీ” ని కొట్టేసారు. ఆ రకంగా సినిమా టైటిల్ “ఏవండీ మళ్ళీ కొట్టేసి పెళ్ళి చేసుకోండి” అయిందన్నమాట 😀 .

 

ఇలాంటి బహుభార్యాత్వ సమస్యే “ఆయనకిద్దరు” అనే సినిమాకి వచ్చింది. “ఆయనకిద్దరు” అని కన్‌ఫర్మ్ గా చెప్తే ప్రాబ్లమైపోతుందని సెన్సారోళ్ళు అభ్యంతరపెడితే ఇవివి ఈ సినిమా టైటిల్ ని “ఆయనకిద్దరా” అని మార్చాడు. అయితే పోస్టర్ మీద “కొట్టేసే” ప్రోగ్రాములేమీ పెట్టుకోకుండా కొన్ని పోస్టర్స్ “ఆయనకిద్దరా” అని కొన్ని..అంటే ఆల్రెడీ ప్రింటైనవి ” ఆయనకిద్దరు” అనీ పోస్టర్స్ రిలీజ్ చేసారు.

 

అంతకుముందెపుడో బ్రహ్మానందం హీరోగా సినిమా ఒకటి వచ్చింది. “లోఫర్ మామ సూపర్ అల్లుడు” అని పెట్టారు టైటిల్ ముందు. అయితే సెన్సార్ దయతో “జోకర్ మామ సూపర్ అల్లుడు” అయింది టైటిల్. దీనికి కూడా పోస్టర్స్ మీద “లోఫర్” కొట్టేసి “జోకర్” అని వ్రాసుకున్నారు.

 
సెన్సార్ ప్రాబ్లెంస్ వల్ల కాకుండా ఇతరత్రా కారణాలవల్ల టైటిల్ మారిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. పోలీసు భార్య అని ఇంకో సినిమా ఉంది. నరేష్, సీత హీరోహీరోయిన్లు. ముందు “పోలీసోడి పెళ్ళాం” అని టైటిల్ పెట్టారు కానీ పోలీస్ వర్గాల నుంచి వచ్చిన నిరసనవల్ల టైటిల్ “పోలీసు భార్య” అని మార్చారు దర్శకనిర్మాతలు. అందుకె సగం పోస్టర్లు “పోలీసోడి పెళ్ళాం” అనీ సగం పోస్టర్లు “పోలీసు భార్య” అనీ, ఇంకొన్ని పోస్టర్లు “పోలీసోడి పెళ్ళాం” ని కొట్టేసి “పోలీసు భార్య” అనీ ఉండేవి. ఇలా బహుభార్యాత్వ సమస్యలో లేక ఇతరత్రా సమస్యల వల్లో టైటిల్ మారినవి కాకుండా అసభ్యంగా ఉందన్న కారణాల వల్ల టైటిల్ మార్చుకున్న సినిమాలైతే తెలుగులో కోకొల్లలు.

 
అయితే ఈమధ్య ఇలా టైటిల్ కొట్టేసే అవసరం పడ్డ సినిమాలేమీ లేవు కానీ ఒక ఆర్నెల్ల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. ఏదో చిన్నసినిమా అనౌన్స్ చేసారు- టైటిల్ ” నీక్కావలసింది నాదగ్గరుంది” క్యాప్షన్ – ప్రేమించే హృదయం. అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా టైటిలూ క్యాప్షనూ మారిపోయాయి. టైటిల్ : ప్రేమించే హృదయం క్యాప్షన్ – నీదగ్గర ఉంది. నిజానికి నేను వ్రాసుకున్న లైట్ రీడింగ్ పోస్ట్ “ఎర్రనిగాజులు” కి స్ఫూర్తి అదే!


Responses

 1. ఇలాగే వెనుకటికి గొల్లభామ అనే సినిమా టైటిల్ యాదవ సమాజాల అభ్యంతరాలతో భామావిజయం అని మార్చారు. పోస్టర్లమీద గొల్లభామ కొట్టేసి భామావిజయం అని ఉంది.

 2. Evandi malli pelli Chesukondi lo oka veturi paata, baguntundi, anta nachana aakalla kallodaa ani.

 3. gud observation

 4. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఒకటి (70’s లో అనుకుంటా) – రామరాజ్యంలో రక్తపాతం, రామరాజ్యంలో రక్తపాతమా?, రామరాజ్యంలో రక్తపాశం అని పోస్టర్స్ వచ్చేయి.

 5. అచ్చంగా కొట్టివేతలు కాకపోయినా, మొదట ప్రచారంలోకొచ్చిన పేరు సినిమా విడుదలయ్యేనాటికి మారిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి.

  రాజశేఖర్: రౌడీయిజం జిందాబాద్ -> రౌడియిజం నశించాలి
  విజయశాంతి: స్ట్రీట్ ఫైటర్ -> స్ట్రీట్ ఫైటర్-1995
  నాగార్జున: సిద్దార్ధ -> నేటి సిద్దార్ధ
  బాలకృష్ణ: సామ్రాట్ -> సాహస సామ్రాట్
  చిరంజీవి: జెంటిల్‌మేన్ -> ది జెంటిల్‌మేన్

  ఇలాంటివి ఇంకా బోలెడు. కొన్ని సార్లు సెన్సార్ అభ్యంతర పెట్టటం సమస్యైతే, చాలాసార్లు అదే పేరు ఇతరులు రిజిస్టర్ చేసుకుని ఉండటం సమస్య. అలాంటప్పుడు చాలామంది ఆ సంవత్సరం పేరో, లేకపోతే ‘నేటి’ అనే ప్రిఫిక్సో తగిలించి చేతులు దులిపేసుకుంటారు 😀 ఇలా కాక, పూర్తిగా మారిపోయిన పేర్లూ ఉన్నాయి. రాంగోపాల్‌వర్మ ‘షోలే’ సిప్పీలు అభ్యంతర పెట్టటంతో ‘ఆగ్’ ఐపోయింది. హాలీవుడ్‌లో సైతం ఈ సమస్యలున్నాయి. నాలుగైదేళ్ల కిందటొచ్చిన మనోజ్ శ్యామలన్ ‘ది విలేజ్’కి మొదట అనుకున్న పేరు ‘ది వుడ్స్’. ఆ పేరు వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకుని ఉండటంతో వీళ్ల సినిమాకి ‘విలేజ్’ అనే పేరు పెట్టుకున్నారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: