వ్రాసినది: mohanrazz | 2009/10/08

కర్నూలు..

కోలుకోలేదింకా. అదృష్టవశాత్తూ మా ఊరిలో ఏ ప్రాబ్లెమూ లేదు కానీ, మా బంధువులు చాలా మంది కర్నూలు టౌను లో ఉన్నారు. కట్టుబట్టలతో మిగిలారు. దేవుడిదయవల్ల ఆస్తి నష్టం తప్ప ఇతరత్రా ఏ నష్టమూ జరగలేదు. కానీ టీచర్లుగానో లెక్చరర్లుగానో పనిచేస్తూ జీవితకాలం రెక్కల కష్టం తో ఇంట్లోకి సమకూర్చుకున్నవన్నీ మునిగిపోతుంటే కట్టుబట్టలతో బయట పడాల్సిన పరిస్థితి.

మా ఇంటికి ఫోన్ చేస్తే – మా డాడీ, వాళ్ళ మిత్రులు కలిసి మంత్రాలయం, ఇంకా ఇతర పల్లెలకు రోజూ ఇక్కడి నుంచి దాదాపు వంద కేజీల బియ్యం, ఇంకా పప్పు వగైరా తీసుకెళ్ళి అక్కడే వండించి వీలు కుదిరిన రీతిలో సాయం చేసి వస్తున్నార్ట.

అయితే నాకు తెలిసినవాళ్ళలోనూ తెలిసిన వాళ్ళ కుటుంబాల్లోనూ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు కానీ మా ఫ్రెండు కి తెలిసిన ఫ్యామిలీ లో ఒకతని పరిస్థితి మాత్రం ఘోరం. ఆ రోజు రాత్రి ఇంటి మిద్దె పడిపోయి వరద ప్రవాహం లో కొట్టుకుపోయి చివరకి ఒక చెట్టు- అదీ దాదాపు మునిగిపోయినది- కొమ్మని పట్టుకుని వేళ్ళాడుతూ దాదాపు రాత్రి అంతా ఉన్నాట్ట. ప్రవాహం ఎంతకీ తగ్గక పోవడం తో అతని బంధువులందరూ ఒక మిద్దె మీద నుండి ఇతన్ని చూస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రంతా చెట్టుకి వేళ్ళాడిన అతను దాదాపు తెల్లవారుఝామున ఇక నా వల్ల కాదని చెప్పి తన వాళ్ళకి చేయి ఊపి- రెండు చేతులూ వదిలేశాట్ట. నాగులదిన్నె అనే ఊళ్ళో జరిగిన ఈ సంఘటన వింటూంటేనే – కకావికలమైపోయింది మనసు.   

నేను పుట్టి బుద్దెరిగాకే కాదు, మా పెద్దోళ్ళు కూడా పుట్టి బుద్దెరిగాక ఏనాడూ చూసి ఎరుగని భీబత్సమిది.


Responses

 1. కర్నూలుకి వరదలంటే మీరూ, మీ పెద్దలే కాదూ .. టీవీల్లో చూసేదాకా బయటి వాళ్లూ నమ్మలేకపోయారు. సీమ జిల్లాలు కరువు పేరుతో వార్తల్లో ఉండటం చూట్టానికి అలవాటు పడ్డవాళ్లకి, ఇప్పుడిలా వరదల్లో కొట్టుకుపోయాయని వింటే నమ్మటం కష్టమే కదా. ఇది రాజకీయ నాయకులు చేసిన పనే. ప్రకృతి చేసిన పని కాదు. అయితే, తమ కర్మని నిందించుకుంటూ కూర్చోటమే తప్ప ఎందరు ప్రజలు ఈ విషయం గుర్తిస్తారన్నదే ప్రశ్న.

 2. very sad to happen.

  ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు మారతారో ? అధికారం అంటే బాద్యత అని ఎప్పుడు తెలుసుకుంటారో ?

 3. కడప పేరు ఎటూ మార్చారు, భవిష్యత్తులో కర్నూల్ ను పూర్తిగా ముంచినందుకు జగన్ దో, KVP దో పెట్టుకోవటానికి కర్నూల్ ను reserve చేసి పెట్టాలని జగన్ సేన ఇప్పటినుండే కోరకపోతే అదే పదివేలు.

 4. శత్రువు కి కూడా రాకూడదురా బాబు ఈ కష్టం అనిపించేలా ఉంది కర్నూలు పరిస్థితి. నిన్న రేపల్లె పరిస్థితి TV లో చూడగానే ఏడుపు వచ్చింది. కరువు ప్రాంతం గా ఎరిగిన కర్నూలు లో వరదలంటే జీర్ణించుకోలేని విషయం. అక్కడి ప్రజల పరిస్థితి దారుణం. మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి ఎన్నినాళ్ళు పడుతుందో, ఎన్నేళ్ళు పడుతుందో!!! ఈ భీభత్సం మరోసారి ఏ ప్రాంతానికి రాకూడదు అని కోరుకుని చేతనైనంత సాయం చేయగలం త‌ప్ప ఇంకేమి చెయ్యగలం. Krishna గారు చెప్పినట్టు కర్నూలు ని జగన్ జిల్లా గా మర్చకుండా వుంటే చాలు.

 5. Mana Rashtram ekkadiki pothundho artham kavatam ledhu. Deenni bagu cheyyadaniki evaru vastharo kooda theliyatam ledhu. Ila Prakruthini sasinche rajakeeya nayakulu poraaa, ee varadallo. veellaki PAPA BHEETHI anedhi undadha? Veellu chese arachakaalanu veella kutumbha sabhyulaina aaparaaa.? God Bless Andhra and AP poeple.

 6. వరదలు వస్తాయి పోతాయి
  వరదల్లో సాయం చేసిన మీ పెద్దవాళ్ళకు అభినందనలు
  చేయి ఇలాంటి సమయాల్లోనే తోడూ వుండాలి అప్పుడే కాస్త వూరట ఇచ్చిన వాళ్ళం అవుతాం

 7. రాత్రంతా కొమ్మని పట్టుకొని ఉండి, ఇక తన వాళ్ళ కాదని చేతులు వదిలేసాడా! . అయ్యో. వినటానికే ఎంతో కష్టంగా ఉంది

 8. రాత్రంతా కొమ్మ పట్టుకుని వేలాడి, తనవాళ్ళకి చేతులు ఊపి చివరి చుపులు చూసిన క్షణం లో ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ని తలుచుకుంటే ఒళ్ళూ జలదరిస్తోంది. కళ్ళెదుటే బిడ్డ వరదలో కొట్టుకుపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు, బంధువులకు ఎలా వుండి వుంటుందో కద. అటువంటి కష్టం ఇకపై ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నాను.

 9. కొమ్మ పట్టుకొని ఆ తర్వాత నిస్సహాయుడై శక్తీ చాలక ఆ బాధ అనుభ వించలేక కళ్లారా అంత మంది ని ఎదురుగ చూసి ఏమి చెప్పాలో తెలియక ఒక పక్క వర్షం వరద కలిగించే ప్రేషుర్..గాలి అంత వుంటే ఆ బాధ వర్ణనాతీతం ..శత్రువు కి కూడా ఈ కష్టాలు రాకూడదు

 10. కర్నూలు లో వరదలు అనగానే బ్లాగర్లలో నాకు గుర్తు వచ్చింది మీ పేరే. అయితే నేను ఆ సమయంలో మా ఊర్లో ఉండటంతో మెయిల్ చెయ్యలేకపోయాను. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే మెయిల్ చేశాను. మీ కుటుంబానికి ఏ ప్రమాదం జరగలేదని సంతోషించాను.

  • అవును…మీ మెయిల్ చూసి నేనూ ఆశ్చర్యపోయాను మొదట…థాంక్యూ!!!

   • మేమూ చేయ్యలనుక్కున్నాం కాని మాకు మీ మెయిల్ ఐ డి తెలియదు

 11. మీరు చెప్పిన సంఘటన చదువుతుంటే గుండె పగిలినట్లు అనిపిస్తోంది. ఎంత ఘోరం అతని స్థితి, అతన్ని చూస్తూనే పోగొట్టుకున్న కుటుంబసభ్యుల మానసిక స్థితి?

 12. మీ ఈ టపా చదువుతూనె నాకు ఇలా అనిపించింది..

  కర్నూలు జీవులు కాకావికలమైన చితులు
  ప్రకౄతి కోపాలు ప్రజలకు సంకెళ్ళూ..

  తల్లడిల్లిన హ్రుదయాలు తలక్రిందులైన బతుకులు
  నోరులేని జీవాలు వూరూర విగత జీవులైన వైనాలు

  వడి వడిగా వచ్చిన వరదలు వూపిరైనా తీసుకోనివ్వని ఉప్పెనలు ..
  వురుకులు పరుగులతో జనాలు చెట్టుకో పుట్టకో చేరినోల్లు..

  హాహాకారాలతో మొదలు.. అనంతలోకాలకు పయనాలు ..
  పడిన మిద్దెలు, మిద్దెలనెక్కిన పెద్దలు, పెద్దల భుజాన పిల్లలు

  దిక్కులేని పేదలు కూలిన గుడిసెలు..
  కల్లముందే కనుమరుగై పోతున్న కన్నోల్లు..
  కన్నీల్లు కరువైన కళ్ళు కదలలేని కాల్లు..

  కరిగే మనసులు కాపాడే దైవాలు..
  సహాయం కోసం చూస్తున్న ఎదురు చూపులు.. చేయూతనివ్వాలి ఎన్నారైలు ..

  చంద్రశేఖర్


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: