వ్రాసినది: mohanrazz | 2009/10/15

రక్త చరిత్ర హిట్టైపోయినట్టే!!!

 rakthacharitra

పై పోస్టర్ చూడగానే ఒక ఐడియా వచ్చేసింది వర్మ ఎలా తీయబోతున్నాడు అనేది. పైగా, యధార్థ వ్యక్తులతో, యధార్థ సంఘటనలతో, యధార్థ ప్రదేశాల్లో, ఆయా యధార్థ కుటుంబాలతో మాట్లాడి మరీ తీస్తున్న “కల్పిత కథ” అంట 🙂 . ఇంకేముంది కావల్సినంత యధార్థమూ, కావల్సినంత కల్పితమూ రెడీ గా ఉంది కథకి ముడిసరుకుగా. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే ఈ కథ కి విపరీతమైన వర్మ మార్కు పబ్లిసిటీ వచ్చేసింది.


ఇక నటీనటులని సెలెక్ట్ చేసిన విధానం కూడా ఒక మాస్టర్ స్ట్రోక్. హిందీ మార్కెట్ కోసం వివేక్ ఒబెరాయ్+వర్మ, తమిళ్ మార్కెట్ కోసం సూర్య, తెలుగు మార్కెట్ కోసం “ఇద్దరు తెలుగు వాళ్ళ కథ”+ వర్మ. హిందీ లో శతృఘ్న సిన్హా మరియు తెలుగు లో మోహన్ బాబు చేస్తున్న ఒక NTR పాత్ర. ఒకేసారి త్రిభాషా చిత్రం. అసలు ఎలా తీసాడో చూద్దామనే ఉత్సుకత తో సగం మంది (మూడు భాషల్లో ) చూసినా చాలు- సినిమా సూపర్ హిట్టైనట్టే.


ఇక కథ గురించి. ఒక్కో దర్శకుడికి ఒక్కో తరహా కథలు తీయడం లో నైపుణ్యముంటుంది. అక్కడ హం ఆప్కే హై కౌన్ రిలీజవగానే అలాంటి “మ్యూజికల్” కాన్సెప్ట్స్ లో సిద్దహస్తుడైన రాఘవేంద్ర రావు నుండి ఇక్కడ పెళ్ళి సందడి వచ్చేసింది. దావూద్ ఇబ్రహీం-ఛోటా షకీల్ ల వైరాన్ని అరిగిపోయేంతవరకూ చూపించిన వర్మ కి పరిటాల రవి-సూరి కథ ని తెరకెక్కిచడం నల్లేరు మీద నడకే! కాబట్టి జస్ట్ వెయిట్ & సీ!!

ప్రకటనలు

Responses

 1. రక్త చరిత్ర ‘శ్రీరాములయ్య’కి సీక్వెల్ అనుకోవాలేమో.

  • నాకు తెలిసి వర్మ- చరిత్ర లోకి పెద్దగా వెళ్ళకుండా – అనంతపురం బ్యాక్ డ్రాప్ లో మరో “కంపెనీ” తీస్తాడేమో!!!

   • అనంతపురం బ్యాక్ డ్రాప్ గా “కంపనీ”?? 🙂 🙂 సూపర్ అవుడియా..

 2. ఆ, నేనొప్పుకోను! రాం గోపాల్ వర్మా కీ ఆగ్ కి ముందు కూడా ఇలాగే చెప్పారు. (మీరు కాదు)

  @అబ్రకదబ్ర,
  దీని తర్వాత సూరి సీక్వెలూ, తర్వాత మొద్దు సీను సీక్వెలూ వస్తాయేమో!

  • హహ.. అవును రాం గోపాల్ వర్మ కీ ఆగ్, థియేటర్ సే పెహ్లె భాగ్!! అన్నారు జనాలు అప్పట్లో 😀

 3. మా వాళ్ళను ఆ విధంగా చూపారు, ఈ విధంగా చూపారు అంటూ మళ్ళీ కులాల కుమ్ములాటలు మొదలవ్వవు కదా!

  • ఏ గొడవొచ్చినా నా సినిమా కి పబ్లిసిటీయే అనుకునే వర్మ ని ఇలాంటి గొడవలేమీ చేయలేవు!!!

 4. వర్మ ని ఏం చేయలేవు నిజమే. ఈ సినిమా వల్ల అనవసరంగా మళ్ళీ గొడవలు జరుగుతాయేమోనని నా సందేహం/భయం.

 5. i think verma is no the director of this movie, there are two new guys.

 6. వర్మ గారు రక్త చరిత్ర సిని చరిత్ర లొ మట్టి కరిపిస్తారేమో 😉

 7. వర్మ సినిమాలకొచ్చిన చిక్కల్లా జనానికి నచ్చే విధంగా ఆలోచించకుండా తనకు నచ్చిన విధంగా తీయడమే. అదేమంటే నా కోసం తీసుకున్న సినిమాలను మిమ్మల్నెవరు చూడమన్నారంటూ ప్రేక్షకుల మీదే తెగబడతాడు. శివ, క్షణక్షణం, రంగీలా, కంపెని…ఈ నాలుగు సినిమాలు మాత్రమే జనానికి నచ్చి తప్పు చేసినట్లున్నాయి. మిగతావన్నీ తన ఇంట్లో చూసుకోడానికి తీసుకున్నవే. అయినా తనకంతమంది ఫైనాన్సర్ ఫాన్స్ ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేస్తాడు. రక్తచరిత్ర 1,2,3,4….ఇలా తనకు ఓపిక ఉన్నంతవరకు తీసుకుని చూసుకుంటూనే ఉంటాడు.

 8. రాంగోపాలవర్మ హిట్ కోసం ఈ సినిమా తీయడం లేదు.

  ఫాక్షనిష్టుల మనసత్వం ఎలా వుంటుందో తన అభిప్రాయం చెపుతున్నాడు.

  మార్పు రాదు కాని, ఆలోచింపజేసే చిత్రం. మంచి ప్రయత్నం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: