వ్రాసినది: mohanrazz | 2009/10/23

అనంతపురం సినిమా – “కథా” కమామీషు

 subramaniapuram

మొన్నీ మధ్యే అనంతపురం చూసాను. చాలా అద్భుతమైన రివ్యూలొచ్చాయీ సినిమాకి. అవన్నీ తెలిసే మొదలెట్టా సినిమా చూడటం.

 
కథ లోకెళితే – ముగ్గురు పనీ పాటా లేని యువకులు. ఒక లోకల్ రాజకీయనాయకుడైన ఒక పెద్దాయన చుట్టూ తిరుగుతూ ఆయనకి పనులు చేసిపెడుతూ పొద్దస్తమానం ఆయనింటి దగ్గరే పడి ఉండే ఈ ముగ్గురు- ఆయనకి రాజకీయాల్లో ఏదో బ్రేక్ వస్తే ఆయనే తమనీ చూసుకుంటాడనుకునే తరహా మనస్తత్వం. పనీ పాట లేకుండా తిరుగుతున్నందుకు ఇంట్లో వాళ్ళ ఈసడింపులు మామూలే. ఈ ముగ్గురి లో ఒకడు ఆ రాజకీయనాయకుడి కూతురికే లైనేస్తూ ఉంటాడు.ఆ పిల్లకీ వీడంటే ఇష్టమే. ఇంతే ఫస్టాఫ్. అయితే ఈ ఫస్టాఫ్ చివరిలో ఇచ్చిన ట్విస్ట్, మొత్తం ఫస్టాఫ్ మీద బలమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. రాజకీయాల్లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ పెద్దాయన్ని కాదని “అధిష్టానం” వేరే వాళ్ళకి టికెట్ ఇస్తుంది. ఈ పెద్దాయన తమ్ముడు- వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ- అవతలి వాడు “ఉన్నంత” వరకు – ఇక మనకింక రాజకీయ భవిష్యత్తు లేదు అంటాడు. అందులో “సటిల్” గా ఉన్న మెసేజ్ ని తీసుకుని వీళ్ళు ముగ్గురూ వెళ్ళి ఆ “సీట్ వచ్చిన అవతలి వాన్ని” లేపేస్తారు. ఇంటర్వల్. సెకండాఫ్ లో జైలు కెళ్ళాక తమ పెద్దాయన/వాళ్ళ తమ్ముడు వచ్చి విడిపిస్తారనుకుంటే వాళ్ళు పట్టించుకోరు. పెద్దాయనకి సీట్ రావడం, ఆయన రాజకీయాల్లో ఆయన బిజీ కావడం, మనం మోసపోయామని వీళ్ళు అనుకోవడం, ఈ లోగా జైల్లో పరిచయమైన ఇంకొ పెద్ద ఖైదీ వీళ్ళని బయటికి తీసుకురావడం, బయటికి తీసుకువచ్చినందుకు ప్రతిగా తనకి ఒక మర్డర్ చేసిపెట్టమని కోరడం, వీళ్ళు అది సక్సెస్ ఫుల్ గా చేసేయడం..ఇలా సెకండాఫ్ జరిగిపోతూంటుంది. అయితే తమని “మోసం చేసిన” ఆ పెద్దాయన తమ్ముణ్ణి లేపేద్దామని డిసైడ్ అవుతారు. ట్రై చేస్తారు. మిస్సవుతుంది. పెద్దాయన హాస్పిటల్ పాలవుతాడు. ఇక సెకండాఫ్ చివరలో రెండు-మూడు ట్విస్ట్లు పెట్టుకున్నాడు డైరెక్టర్. ఆ చివరి 20 నిముషాల్లో బలంగా పండిన ఆ ట్విస్ట్లు సినిమాకి ప్రాణం. “యజమాని తమని వంచించడం” అనేది ఇంటర్వల్ బ్యాంగ్ ట్విస్టైతే- ‘విధిలేని పరిస్థితుల్లో’ ప్రియురాలి వంచన, ‘డబ్బుకోసం’ స్నేహితుడి వంచన లతో రక్తసిక్తమయ్యే చివరి 20 నిముషాలే సినిమాకి ఆయువుపట్టు.

ఇక కమామీషు ఏంటంటే- ఈ కథలో సరిగ్గ ఇంటర్వల్ కి ముందు మొదటి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. అక్కడి దాకా జరిగే కథ నాకు కొంచెం బోరుగానే అనిపించింది. ఆ తర్వాత సెకండాఫ్ కూడా ఒక ఫ్లో లో సాగుతూ ఉంటుంది. మళ్ళీ చివరి 20 నిముషాల్లో వరసగా మూడు-నాలుగు ట్విస్ట్లున్నాయి. చాలా మంచి సినిమాయే కానీ బోరింగ్ మొమెంట్స్ చాలానే ఉన్నాయీ సినిమాలో. ఈ కథ ని డెవెలప్ చేసిన విధానం చూస్తే నాకు ఒక వ్యక్తిగత సంఘటన గుర్తొచ్చింది.

ఇంజనీరింగ్ లో ఉన్నపుడు నేను స్కిట్స్ కాస్త రెగ్యులర్ గానే వ్రాసే వాణ్ణి. ఫైనలియర్ లో ఉన్నపుడు ఒక స్కిట్ వ్రాసాను. అదీ కాంపిటీషన్స్ కోసం. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల నుంచి స్కిట్స్ కాంపిటీషన్ పెట్టి అందులోనుంచి ఒకటి సెలెక్ట్ చేసి “సౌత్ ఇండియ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ (Unifest)” కి పంపించారు. నా స్కిట్ మా యూనివర్సిటీ లెవెల్లో సెలెక్టై, Unifest లో మా యూనివర్సిటీ ని రిప్రజెంట్ చేసింది.  జనరల్ గా ఈ కాంపిటీషన్స్ లో స్కిట్ కి సుమారు 9 – 9.5 నిముషాలు సమయం ఉంటుంది. నిజానికి నేను స్కిట్ వ్రాసేటపుడు- నా దగ్గర “ఒక మంచి క్లైమాక్స్ ట్విస్ట్” మాత్రమే ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 2-2.5 నిముషాల సమయం, ఈ ట్విస్ట్ కి కావలసిన సరంజామా ని సెటప్ చేయడానికి మొదట్లో ఒక 3 నిముషాల సమయం సరిపోయింది. ఇక మధ్యలో 4 నిముషాల సమయం ఖాళీ. దాన్ని ఎలా నింపాలి, దేనితో నింపాలి అని ఆలోచించి- కథకి సంబంధం లేని కొన్ని సన్నివేశాలు, డైలాగులతో ఆ 4 నిముషాలు నింపాను. కానీ నేను జాగ్రత్తపడ్డ ఒకే ఒక్క అంశం ఏంటంటే- కథకి సంబంధం లేని ఆ అంశాలు కూడా నా పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీయకుండా, కొంత వరకూ నా బేసిక్ లైన్ కి రిలవెంట్ గా ఉన్న సన్నివేశాలతో నింపేశాను. సరే, స్కిట్ ప్రదర్శించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ మరునాడు నేనెందుకో క్లాస్ కి వెళ్ళలేదు. మా ప్రొఫెసరొకాయన- క్లాస్ లో అడిగార్ట- ఎవరు వ్రాసింది అని. తనకి బాగా నచ్చిందని చెప్పి- ఇంకోమాట అన్నాట్ట- “ఆ క్లైమాక్స్ కి నిజంగా నాకు ఒళ్ళు జలదరించడం అంటారు చూసారా, అలా అనిపించింది- అదీ కాక ఆ అబ్బాయి “కావాలనే” ఆ ట్విస్ట్ ఇచ్చేముందు కాసేపు కథ ని స్లో చేసాడు. అలా స్లో గా ఉండి ఒక్క సారి ట్విస్ట్ ఇవ్వడం తో ఆ క్లైమాక్స్ ఇంకా బాగా పండింది” అన్నాట్ట. నిజానికి నేను అంతకంటే బెటర్ గా ఎలా చేయాలో తెలీక, వీలుకాక అక్కడ కథని స్లో చేసాను.

నాకు అనంతపురం చూస్తున్నపుడు ఈ సంఘటన ఎందుకు గుర్తు వచ్చిందంటే- ఇందులోనూ ఫస్టాఫ్ లోనూ, సెకండాఫ్ లోనూ చాలా సన్నివేశాలున్నాయి. ఏ సన్నివేశమూ పాత్రౌచిత్యాన్ని దెబ్బతీయదు కానీ, ఆ సన్నివేశాన్ని తీసివేసినా సినిమా కి ఇబ్బందేమీ ఉండదు అనిపించే సన్నివేశాల్లాంటివన్నమాట. ఈ సినిమా మంచి సినిమాయే కానీ నాకు – ఒక పేకమేడ లో ఒక్క ముక్క ని తీసివేసినా- మొత్తం పేకమేడ కూలిపోతుందనిపించే లాగా సన్నివేశాలున్న సినిమా చూడాలని ఉంది. అనంతపురం అలాంటి సినిమా మాత్రం కాదు. అయితే రొటీన్ కమర్షియల్ సినిమా ల మధ్యలో బలమైన క్యారెక్టరైజేషన్స్ తో, బలమైన కథ తో వచ్చిన సినిమా అని మాత్రం చెప్పగలను.

                                                                                   -జురాన్


స్పందనలు

 1. విజిటర్స్ చదువుతున్నప్పుడు, సినిమాలోని లోపాలను చెపుతూ సినిమా చూడాలనిపించే విధంగా రివ్యూ వుండాలనేది నా అభిప్రాయం. మీ రివ్యూ నేను కోరుకునే విధంగా వుంది.

  thanks for sharing your view and will watch the movie.

 2. నేను ఇపుడే ఈ సినిమా చూసా.నాకు కూడా చాలా బాగా నచ్చింది.

 3. మీరు రాసిన స్కిట్స్ కూడా బ్లాగులో పెట్టండి. చదివి ఆనందిస్తాం.

 4. మొత్తానికి సుబ్రమణ్యపురం సినిమాని చాలా తేలిగ్గా చెప్పేసారు….any way, just mail me once. We need to discuss few things. my mail ID is mahesh.kathi@gmail.com

 5. రొటీన్ కి భిన్నంగానే ఉంది….ఇలాంటి సినిమాలు మనం తప్పకుండా ఆదరించాలి.

 6. హమ్మయ్య, ఈ సినిమా గురించి ఎవరూ ఏమీ మాట్లాడ‌డం లేదేమిటా అనుకున్నాను, మీరు మాట్లాడేసారు.
  ఈ సినిమా ని నేను తమిళ్ లో వచ్చిన మొదటి రోజులలోనే చూసేశాను. 2-3 సార్లు చూసానులెండి. కథ, కథనం అన్ని బాగున్నయి. 80’s కాలాన్ని బాగా చూపించారు. వాళ్ళ వస్త్రధారణ, అలంకరణ, నటన‌ అన్ని బాగున్నాయి.
  హీరోలని, నమ్మిన వాళ్ళు ఎన్ని రకాలుగా వంచించారొ బాగా చూపించారు. అయితే సినిమా చివరిలో హీరో శశికుమార్, పెద్దాయన తమ్ముడిని ఆటో లో తీసుకెళ్ళి బరబర తల నరకడం చూసినప్పుడు మాత్రం ఒళ్ళు జలదరించింది. ఈ సినిమా దర్శకుడు (శశికుమార్), తమిళ్ లో ఒక ఇంటర్వూ లో చెప్పాడు….”ఆ తల నరకడమే జనాలకి బాగా connect అయింది. దానివల్లే సినిమా హిట్ అయింది అని”.

  అయితే, ఈ సినిమా తమిళ్ ప్రజలకి connect అయినంతగా మన తెలుగు ప్రజలకే ఎందుకో అంతగా connect అవ్వలేదు. nativity మార్చేసరికి flop అయింది. తెలుగులో నరసింహనాయుడు ఎంత పెద్ద హిట్టో, తమిళ్ లో అంత పెద్ద ఫ్లాపు. nativity background ఉన్న సినిమాల గతి ఇంతేనేమో మరి !!!! లేదా బాంబుల మీద బాంబులు వేసి, కార్లు, జీపులు లేపేసి, వంద మంది ని తెగ నరికి, వారి శవాల‌ పై ఎక్కి కూర్చునే సినిమాలు చూసాక్ ఆటోలో తల నరకడం పెద్ద గొప్ప గా అనిపించలేదు కాబోలు మన వాళ్ళకి :).

  అదే దర్శకుని (శశికుమార్) చేతిలోనుండి వచ్చిన తరువాతి సినిమా “నాడోడిగళ్” (nomads, ఆదివాసులు). నాకు ఈ సినిమా అంతా బాగా నచ్చింది ఒక్క climax తప్ప. ఆ climax మొత్తం సినిమా బలాన్నే కిందకు లాగేసింది అనిపించింది. కాని సినిమా టైటిల్ కి సరిపోయేలా ఉంది అని రివ్యూలు వచ్చాయనుకోండి. ఇప్పుడు ఇదే సినిమాని, రవితేజ, సునీల్ తో తెలుగు లో మళ్ళీ తీస్తున్నరు. అందుకే ఇక్కడ‌ ఆ climax ఏమిటో చెప్పి మీ ఆశ‌లు నీరుగార్చను :). ఏది ఏమైనా, అనంతపురం లా డబ్ చెయ్యకుండా, “నాడోడిగళ్” ని రీమేక్ చేస్తున్నందుకు సంతోషం. ఈసారయినా తెలుగు ప్రజలకి connect అవుతుందేమో చూడాలి.

  • ఈ సినిమా ఒరిజినల్ విసిడి రిలీజైంది. మొన్నోసారి ఇంటికి వెళ్ళినపుడు- సిడి కొందామని వెళితే షాపతను “సార్ నాదగ్గర ఈ ఒక్క సిడి ఏ మిగిలింది, కావాలంటే అద్దెకు తీసుకెళ్ళండి” అన్నాడు. నేను ఏదో ఆలోచిస్తూ ఉంటే- “తీసుకెళ్ళండి సార్, కేక సినిమా” అన్నాడు.

   ఈ సినిమా ని థియేటర్లో చూసిన మా ఫ్రెండ్ చెప్తున్నాడు- ఈ సినిమాలో హీరోలు జైలుకెళ్ళినపుడు ఒక ఖైదీ వాళ్ళనడుగుతాడు-
   “ఏమప్పా ఎందుకు మర్డర్ జేసినారు, డబ్బు కోసమా, పగ కోసమ్మ్, కులం కోసమా” (ఇంచుమించు ఇదే డైలాగు)
   “అభిమానం కోసం”
   “మన ఊరోళ్ళేనప్పా (అనంతపురం) అభిమానం కోసం ప్రాణాలు తీసేది”

   ఈ డైలాగు కి కర్నూలు థియేటర్లో విపరీతమైన్ విజిల్స్ పడ్డాయని చెప్పాడు. ఈ సినిమాని చూసిన వాళ్ళంతా “కేక” అన్నారు, కానీ పబ్లిసిటీ లోపాల వల్ల చాలా తక్కువ మంది చూసారు.

 7. నవతరంగంలో ఈ సినిమా గురించీ నాడోడిగళ్ గురించీ చర్చలు “రచ్చరచ్చ”గా జరిగాయి. చూసుకోండి.
  http://parnashaala.blogspot.com/2009/10/manifesto-on-feminine.html
  http://navatarangam.com/2008/10/subramanyapuram-200/
  http://navatarangam.com/2009/07/naadodigal_review/

 8. http://navatarangam.com/2009/07/remakes_phantom-audience/

 9. @Mahesh,

  Your movie, my hero. Letz wait and see what happens. Anyway, I won’t see it.

 10. వీకెండ్ కష్టపడి ఈ సినిమా చూసా.

  ఈ సినిమాలో వాడిన ట్విస్ట్లు వాడుకొని నాలుగైదు కథలు వ్రాసుకోవచ్చు.

  యాక్టర్లను గుర్తు పెట్టుకోవడం ఒక పెద్ద ఎత్తు అయితే, డైలాగ్ కు తగ్గ ఎక్సప్రేషన్స్ లేకపోవడం మరో పెద్ద లోపం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: