వ్రాసినది: mohanrazz | 2009/10/23

బంపర్ ఆఫర్… సినిమా కథ అదేనంట..!!

bumper-offer

ఇవాళ విడుదల కాబోతోన్న బంపర్ ఆఫర్ అనే సినిమా కథ గతం లో వచ్చిన చిరంజీవి సినిమా “ఛాలెంజ్” తరహా లో ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. ఛాలెంజ్ లో చిరంజీవి రావు గోపాలరావు తో పందెమేసి- 50 లక్షలు 5 సం|| లో సంపాదిస్తే- బంపర్ ఆఫర్ లో హీరో “నేను నీ కంటే ఎక్కువ సంపాదించడమే కాదు, నిన్ను ఈరోజు నేనున్నంత కింది స్థాయి కి దిగజారుస్తానని పందెమేస్తాడట. అంటే ఛాలెంజ్ లో చిరంజీవి కి ఒకే టాస్క్ అయితే బంపర్ ఆఫర్ లో హీరో కి రెండు టాస్క్స్. ఒకటి తాను ఎదగడం, రెండోది విలన్ ని పడగొట్టడం. ఈ రెండు టాస్క్స్ హీరో ఎలా నిర్వహించాడో తెలీదు కానీ “తమ్ముణ్ణి నిలబెట్టడం” అనే టాస్క్ మీద పూరీ మాత్రం బాగా కష్టపడుతున్నాడు. అయితే రూమర్ గా వచ్చిన ఈ కథ ఎంతవరకు నిజమో మనకి తెలీదు.

 

నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను- ఇట్లా రూమర్ గా వచ్చిన కొన్ని కథలు ఒక్కోసారి చివరిగా రిలీజైన ఒరిజినల్ కథ కంటే బాగుంటాయి. అసలు ఈ రూమర్ కథలు ఎవరు సృష్టిస్తారో అస్సలు అర్థం కాదు. ఆ మధ్య “పెళ్ళి చేసుకుందాం” టైం లో ఓ కథ రూమర్ గా వినిపించింది.ఒక కథ అన్నారు ముందు- ఇదేంటి అప్పుడెప్పుడో వచ్చిన నవవసంతం కథ లా ఉందే అనుకుంటే- తీరా చూస్తే పెళ్ళి చేసుకుందాం సినిమా కథ అది కాదు. అయితే ఆ తర్వాత వచ్చిన “ఇద్దరు మిత్రులు” కథ (రెండింటికీ భూపతిరాజాయే కథ అందించింది) అదే.  ఇక చిరుత సినిమా విడుదల కి ముందు వచ్చిన రూమర్ స్టోరీలకైతే కొదవే లేదు. చెప్పొద్దూ ఆ కథల్లో దేన్ని తీసినా సినిమా చిరుత కంటే ఇంకా పెద్ద హిట్టయుండేది ఖచ్చితంగా.

 

మొన్నీ మధ్య పూరీ కూడా ఇంటర్వ్యూ లో అంటున్నాడు- ఆ సినిమా లో విలన్ హీరో కి ఒక ఆఫర్ ఇస్తాడు, అయితే హీరో వెంటనే విలన్ కి ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తాడు. అదే సినిమా కథ అని. కథ గురించిన రూమర్స్ లో వాస్తవమెంతో తెలీదు కానీ ఆర్థిక మాంద్యం దెబ్బకి కుదేలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మీద సెటైరిక్ గా సాగే “రవణమ్మో” అనే పాట మాత్రం ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ లో ఉంది. మొదటి సారి సంగీత దర్శకత్వం వహించిన రఘు కుంచె, ఆవకాయబిర్యాని హీరోయిన్ బిందుమాధవి, హీరో సాయిరాం శంకర్ అందరూ దీనిమీదే ఆశలుపెట్టుకుని ఉన్నారు. చూడాలి ఏమవుతుందో!!


Responses

  1. కథ, సంభాషణలు మరీ ఆకట్టుకునే విధంగా ఉంటే తప్ప, సాయిరామ్ ని హీరో గా పెట్టుకుని ఈ సినిమా ఆడేది కష్టమే. అతనికి ఉన్న appeal కి, dailogue delivery కి సరిగ్గ సరిపొయే పాత్ర ‘నేనింతే’ లో ది మాత్రమే. ఆలాంటి పాత్రలకి తప్ప హీరో గా నెగ్గుకురావడం సాయిరామ్ కి గగనమేమో వేచి చూడాల్సిందే!!!

  2. కొంచం చిన్నగా(length) రాయండి.చాల రోజుల తరువాత మరలా చదువుతున్నాను.spark తగ్గింది కొంచం.this is far better compared to last 4-5 posts.

  3. కొంచం పెద్దగా (length) రాయండి.ప్రతి రోజు చిన్న పోస్ట్ లు చదువుతున్నాం .

  4. మీరు చెబుతున్న కథ టైటిల్ కి సరిగ్గా సరిపోయింది, అందునా పూరి అంటేనే పాత కథలను కొత్తగా చూపిస్తాడు కాబట్టి ఈసారి ఈ పుకారు నిజమయ్యే అవకాశాలెక్కువ

  5. సినిమా రిలీజైపోయి స్టోరీ బయటికి వచ్చేసింది,మనం పైన చెప్పుకున రూమర్ కొంతవరకు కరక్టే. హీరో, హీరోయింప్రేమించుకుంటారు. హీరోయిన్ తండ్రి అయిన విలన్ హీరోకి – “నా ఆస్తి లో సగం సంపాదిస్తే నీకు నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తా” అని అని ఆఫర్ ఇస్తే- “ఆస్తి లో అంతరాలే పెళ్ళి కి అడ్డమనుకుంటే, నేను నీ అంత ఆస్తి సంపాడించడం కాదు గానీ నిన్నే ఇప్పుడు నేనున్న పొజిషన్ కి తీసుకువస్తా” అని చాలెంజ్ చేస్తాడు హీరో. అదీకథ!

    అయితే నేను పైన వ్రాసినట్టు రెండు టాస్క్ లు కాదు. ఒకటే!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: