వ్రాసినది: mohanrazz | 2009/10/26

పళసి రాజా- మాస్టర్ పీస్??

14915399_pazhassirev340

పళసి రాజా- మాస్టర్ పీస్?? గతవారం విడుదలైన మళయాల సినిమా “పళసి రాజా” కి వచ్చిన రివ్యూలు చూస్తే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి.It would not be an exaggeration if we say that it is comparable to the best in Indian cinema. The action sequences remind us of the internationally acclaimed Chinese martial art movies of recent times like Crouching Tiger, Hidden Dragon and Hero. అని రీడిఫ్ లో వ్రాస్తే, Gems like these happen only once in a while and when it does, never give it a miss. Two big thumbs up for this masterpiece of our times! అని సిఫి లో వ్రాసాడు.

సరే, ఇక కథ విషయానికి వస్తే “పళసి రాజా” మన అల్లూరి సీతారామ రాజు లాగా స్వాతంత్ర్య సమరయోధుడు.1857 కంటే కూడా ముందుగా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ యోధుడు. మమ్ముట్టి ప్రధాన పాత్ర లో, శరత్ కుమార్ సహాయ పాత్ర లో నటించిన ఈ సినిమా కి స్క్రిప్ట్ MT వాసుదేవన్ నాయర్ అయితే దర్శకత్వం హరిహరన్. సంగీతం ఇళయరాజా అయితే సౌండ్ రికార్డింగ్ ఆస్కార్ విన్నర్ రసెల్ పోకుట్టి. ఇలాంటి దిగ్గజాలందరూ కలిసి రూపొందించిన ఈ సినిమా బడ్జెట్ 27 కోట్లు అంటున్నారు. ఈ బడ్జెట్ తో బహుశా మామూలు మళయాళ సినిమాలు పది తీయొచ్చు. దాదాపు 3:గం 20 నిముషాలు నిడివి కలిగిన ఈ మాస్టర్ పీస్ ని వీలు కుదిరితే చూడండి.

 అయితే ఈ సినిమా త్వరలో నే మిగతా భాషల్లోనూ డబ్ అవబోతోందంటున్నారు. మమ్ముట్టి ఇతరభాషల్లోనూ తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానంటున్నాడు. ఇక ఈ సినిమా కథని పరిచయం చేస్తూ మొదట్లో వచ్చే వాయిస్ ఓవర్ తెలుగు లో చిరంజీవి చెప్పబోతున్నాడని రూమర్స్ కూడా వస్తున్నాయప్పుడే!

ప్రకటనలు

Responses

 1. ఈ సినిమా గురించి నేనూ చాలా బాగావిన్నాను. చూడాలి.

 2. ఆసక్తికరం. తెలుగులో డబ్ అయితే చూడాలి.

 3. ఒకటి మర్చిపోయాం మనం …తెలుగు మాస్టర్ పీస్లు … నరసింహ నాయుడు , ఇంద్ర , మగధీర , సింహాద్రి , ఆర్య …లాంటివి ..

  ఈ సినిమా నేను చూసాను ..రెడిఫ్ వాడు చెప్పినంత పోలికలు లేవు ,
  40 కోట్లతో తీసిన మెగాధీర కన్నా 100 రెట్లు బావుందని మాత్రం చెప్పగలను …అదీ 27 కోట్లే ….

  ఏమంటారు ?

 4. I heard its worth watching.. Yet to watch it..!

 5. jatardamal,

  జనాలకు నచ్చిన సినిమాలు మీకు నచ్చలేదు అంతే కచ్చితంగా something wrong with you. I know you can’t agree with me.

  Language doesn’t matter, Learn to respect successful movies.

  మీకు నచ్చక పోవడం మీ వ్యక్తిగతం. జనాలకు నచ్చిన వాటిని ఎగతాళి చేయడం గొప్ప అనుకుంటే దేవుడే మీకు సమాధానం చెప్పగలడు.

  • ముందు ఒకరిని అనేటప్పుడు అవతలి వాడు ఏమన్నాడో అర్థం చేసుకోవాలి , నేను ఏ సినిమా బవోలేదని అనలేదు . మల్లి ఒక సారి కామెంట్ చూడండి .
   నేను చెప్పింది ఒకటే . అంత కర్చు పెట్టి తీసిన సినిమా కన్నా ఇది చాల బావుందని .

   దేవుడు ఎందుకండి మధ్యలో ? నేను ఎగతాళి చేసననుకోవటమే ఒక భ్రమ.

   మీకు అవి నచ్చి వుంటే మీరు పొగడండి . నాకు అభ్యంతరం లేదు . కాని నా అభిప్రాయం తప్పంటే I cant help you .

   • jatardamal,

    నాది భ్రమ అంటున్నారు కాబట్టి, I am really sorry అండి.. I have taken your comment in wrong way.

    “ఒకటి మర్చిపోయాం మనం …తెలుగు మాస్టర్ పీస్లు … నరసింహ నాయుడు , ఇంద్ర , మగధీర , సింహాద్రి , ఆర్య …లాంటివి ..”

    ఆ కామెంట్ ను చదివినపుడు తెలుగు ప్రేక్షకులను ఎగతాళి చేసినట్టు అనిపించింది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: