వ్రాసినది: mohanrazz | 2009/10/27

అల్లరి నరేష్ హ్యూమర్ :)

 allarinaresh

అల్లరి నరేష్ సినిమాల్లో కామెడీ సంగతి ప్రక్కన పెడితే- బయట ఇంటర్వ్యూలప్పుడు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు తన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చుతుంది నాకు.

మొన్నీమధ్య లక్ష్మీ టాక్ షో లో వచ్చాడు. మధ్య లో విష్ణు కాల్ చేసి- “అరె, ఒక సారి- ‘సకుటుంబ సపరివార సమేతంగా ‘ అనరా నువ్వు అన్నాడు- సరదాకి, నీకు డైలాగులు చెప్పడం రాదు అన్నట్టుగా. వెంటనే అల్లరి నరేష్- “ముందు నువ్వనరా” అని కౌంటరిచ్చాడు.

గమ్యం సినిమాకి గానూ ఉత్తమ సహాయనటుడు గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది నరేష్ కి. చాలా మంది నటులు ఇలాంటి అవార్డులు వచ్చినపుడు స్టేజ్ పైన సెంటిమెంట్ పండిస్తూంటారు. తప్పనను. కానీ ఎవరైనా హాస్య నటుడు కి అవార్డ్ ఇచ్చినపుడు వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి – “ఈ కళామతల్లి” అని మొదలుపెట్టి, “అసలు హాస్యాన్ని కూడా మిగతా కళలతో సమానంగా గుర్తించినందుకు…” అంటూ ఏదేదో మాట్లాడుతూ…బాగా బరువైన డైలాగులు చెప్తూ ఉంటే ఎందుకో ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ అవదు. కమెడియన్స్ ఏ “స్టేజ్” ఎక్కినా ఎలాంటి “స్టేజ్” లో అయినా కామెడీ గానే మాట్లాడాలని కాదు కానీ కొంత హ్యూమర్ జతచేసి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని చెబితే – అందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తీసుకోగానే నరేష్- “మా నాన్న చాలా సినిమాలు డైరెక్ట్ చేసారు, మా అన్న చాలా సినిమాల్లో నటించారు. వాళ్ళకెవరికీ ఇంతవరకూ ఫిల్మ్ ఫేర్ రాలేదు. మా ఇంట్లో నాకే ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ 😀  ” అన్నాడు. చూస్తున్నవాళ్ళక్కూడా పెదాల మీద ఆటోమేటిగ్గా చిరుదరహాసం వచ్చేసింది అలా అనగానే. అదీ కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా, స్టేజ్ మీద గుండేలు పిండే ప్రోగ్రాం పెట్టుకునే బదులు” అలా సరదాగా మాట్లాడితేనే ఇష్టపడతారనుకుంటా.


Responses

 1. మనొడు బయట కూడ మంచి ఎనర్జిటిక్ గా మాట్లాడతాడు..అందుకే బావుంటుంది.. కాకపొతే..స్మిత తొ కలసి మాట్లాడితే కాస్త ఒవర్ చేస్తాడు.. (స్మిత ఇంకా ఒవర్ చేస్తుంది అనుకొండి)
  ఫొటొ మాత్రం బావుంది 🙂

 2. నరేష్ సోదేమో కానీ, ఆ అవార్డిస్తున్న అమ్మాయెవరండీ? అడ్రెస్ తెలిస్తే చెబుదురూ కాస్త పెద్ద చీర కొని పంపిస్తా. చాలీ చాలని పైట కొంగుతో ఒహటే ఇబ్బంది పడిపోతుంది పాపం.

  • తన పేరు శ్రియ

   రెండు పీస్ ల గుడ్డలతో వచేసింది అవార్డు ల ఫంక్షన్ కి ఛి

 3. Ha Ha. Abrakadabra gaaru, meeru manchi Kalaposhakulu andi, Papam Naresh Award chooda kunda, meeru aa ammayini choosthunnaru. Aaa ammayi evaro kadhandee, Mana Shriya Saran. Thagore, Santhosham, Arjun, Shivaaji fame. ;). meeru peddha cheera konichina aa ammayi kattukodhantaa.. Thanaki ave soukaryavanthamga untunnayi. Asale telugulu lo cinemalu levu. Kaneesam Sriya undhi ani anna gurthu pettukovali kadha choosina Janalannaaa.. LOL…

 4. మోహన్ గారు, మీరు చేసిన తప్పు ఇప్పటికి మీకు అర్థమయింది అనుకుంటాను.
  ఇక్కడ‌ మీరు నరేష్ గురించి, అతని హాస్యం గురించి రాస్తే, జనాలు శ్రీయ గురించి hot hot గా discuss చేసేసుకుంటున్నారు 🙂
  ఏతావాత తేలిందేమనగా….విషయం మంచిదయినా, present చేసే విధానం బాగుండకపోతే చెప్పిన విషయం జనాల‌కెక్కదు;) కాబట్టి urgent గా ఫొటో మార్చేయండి.
  మంచి point చెప్పాననుకుంటా..ఇక్కడ future directors ఎవరైనా ఉంటే ఈ point గుర్తుపెట్టుకోండి బాబు :

  • దేనిగురుండి డిస్కస్ చేసమన్న్నది కాదు.. డిస్కషన్ జరిగిందా లేదా 🙂

 5. ఇప్పుడు నేను నరేష్ గురించి మట్లాడకుండా వదిలేస్తే నేను కూడా ఆ కోవలోకే వస్తాను కాబట్టి ఏవో రెండు ముక్కలు చెప్పేస్తాను 😀
  నరేష్ సినిమాలకి ఏ మాత్రం జంకు లేకూండా రవితేజ‌ సినిమాలు చూసినంత హాయి గా వెళ్ళి చూడొచ్చు. రాజేంద్రప్రసాద్ తరువాత అంత స్థాయి కి ఎదిగే లక్షణాలు నరేష్ కి ఉన్నాయనిపిస్తుంది. EVV సినిమాలలో రెగ్యులర్ గా ఉండే బూతు డైలాగ్సుని కాస్త భరించగలిగితే నరేష్ సినిమాలన్ని ఆహ్లాదంగా చూసేయొచ్చు. గమ్యం సినిమాలో నరేష్ చాలా చాలా బాగా చేసాడు. నేను ఇంతకు ముంది Etv లో నూ, జెమిని TV లో నూ వచ్చిన నరేష్ ఇంటర్వూ లు చూసాను. చూస్తున్నంతసేపు ఆసక్తికరంగా వున్నాది. చాలా సరదాగా మాట్లాడతాడు. అసలు అతని posture, body language చాలా గమ్మత్తుగా, వెరైటీ గా ఉంటాయి.

  • రవి తేజ ఇప్పుడు బూతేజ అని పేరు మార్చుకున్నాడు కదా 😀

   • 😀 😀 😀

    • నేనింతే సినిమాలో నటనకి, రవితేజకి 2008 కి గాను బంగారు నంది (best actor) వచ్చింది. నాకీమధ్యకాలంలో బాగా నచ్చిన సినిమాలు నేనింతే. చాలా వాస్తవంగా తీసారు. ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదో తెలియదు కాని మంచి సినిమా.

  • నాకు నరేష్ అంటే ఇష్టమే బాగా చేస్తున్నాడు

 6. మోహన్ గారు మీ క్రి యే టి వి టి కుమ్మేసారు ఒక మాంచి ఫోటో పెట్టి

  • ఇందులో క్రియేటివిటీ ఏమీ లేదు… టపా ‘ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో నరేష్’ గురించి కాబట్టి నరేష్ ఆ ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకుంటున్న ఫోటో పెట్టా… ఫోటో మీద ఇంత డిస్కషన్ ఎక్స్ పెక్ట్ చేయలే!!

 7. 😀 😀

 8. 😀 😉 🙂

 9. Nice Show 😉

 10. Evarakkada. Charcha Naresh Acting meedhe konasaginchalsindhi gaa Sabhani theermanisthunnam. (Bloggers Andharu :)).

 11. Naresh manchi natudu.Nandulu konukkunna varu chusi natana nerchukunte baguntundi.photo kosam paiki velli chudalsi vachidi. kodaru ante.chebite vinaru ,tidite edusthru.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: