వ్రాసినది: mohanrazz | 2009/10/27

ఘటికుడు = కిల్లర్

Ghatikudu

మొన్నోరోజు రాత్రెపుడో పన్నెండున్నరకి ఒక ఫ్రెండ్ SMS పెట్టాడు..ఒకే ముక్కలో – ghatikudu = killer అని. బహుశా సెకండ్ షో చూసాక ఇంటికెళుతూ పెట్టి ఉంటాడా మెసేజ్ ని.కానీ ఆ ఒక్క ముక్కలో కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయింది.

ఉదయం ఫోన్ చేసి మాట్లాడుతూంటే అన్నాడు-” అసలా టైటిల్ చూసాక సినిమా కి వెళ్ళకూడదనే అనుకున్నా, ఎందుకో వెళ్ళాల్సి వచ్చింది. ఈ మధ్య డబ్బింగ్ సినిమాల్ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు మనవాళ్ళు. అట్ లీస్ట్ మంచి టైటిల్ పెట్టి మాస్ ని అట్రాక్ట్ చేసే ప్రోమోలతో వస్తే డబ్బింగ్ సినిమాలు చాలా సులభంగా ప్రాఫిట్ వెంచర్స్ అవుతాయి. వారం రోజుల్లో పెట్టిన డబ్బంతా వచ్చేసి, లాభాలు కూడా వస్తాయి. టైటిలే ఘటికుడు అంటే ఇంకేం చేస్తాం.” సూర్య కి కూడా గజనీ తర్వాత సరైన హిట్ పడలేదు. గౌతం మీనన్ తీసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ నాకు బాగా నచ్చింది. కానీ కొంచెం స్లో సినిమా. కాస్త ఓపిగ్గా చూడాలి అక్కడక్కడా. అయితే చాలా “మెచ్యూర్డ్ స్టోరీ”. కానీ ఫ్లాపైంది. ఆ తర్వాత వచ్చిన వీడొక్కడే సినిమా మంచి యాక్షన్ ఫిల్మ్. యాక్షన్ ఫిల్మ్స్ లైక్ చేసే వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. అయినా రకరకాల కారణాల వల్ల తెలుగు లో ఫ్లాపైంది తమిళ్ లో హిట్టైనప్పటికీ. కె.ఎస్. రవికుమార్ కి కూడా ఈ మధ్య హిట్స్ లేవు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఘటికుడు.

సూర్య ఇందులో ఒక ప్రొఫెషనల్ కిల్లర్. ఒకాయన్ని చంపడానికి అగ్రిమెంట్ కుదురుతుంది కానీ ఆయన మీద చేసిన మర్డర్ ట్రయల్ ఫెయిలవడం తో ఆయన ఇంట్లోకే చేరతాడు. తర్వాత తెలుస్తుంది ఆయన తన సొంత తండ్రే అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు ఇప్పటికీ ఆసక్తి గా ఉంటే ఆలస్యం చేయకుండా అర్జంటుగా ఘటికుడు ప్రదర్శింపడుతున్న థియేటర్ కి పరుగెత్తండి.  😀


Responses

 1. డబ్బింగ్ చాలా చండాలంగా ఉందని విన్నాను. కనీసం లిప్ సింక్ కూడా కేర్ తీసుకోలేదట. ఈ సినిమాకు వెళ్ళిన మా మిత్రుడు మద్యలో హాలు గేట్లు తీయక అలా కూర్చుండిపోయాడట గానీ లేకపోతే బయటకు వచ్చేసేవాడట. అదీ సంగతి.

  • హ హ.. మా వాడిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి 🙂

   • అందుకే, మంచి టాక్ వస్తేగానీ మేము అలాంటి సినిమాలకి వెళ్ళం. మాకు కాస్త ముందు జాగ్రత్త ఎక్కువలెండి 🙂
    లేదా ముందే వాటిని తమిళ్ లో చూసేస్తాం. అయన్ (వీడొక్కడే) సినిమా ని తెలుగు లో రిలీజ్ అవ్వకముందే తమిళ్ లో చూసేసా, కాబట్టి తెలుగు లో చూడాల్సిన ప్రారబ్ధం తప్పింది 😀

 2. Ayithe ee cinema ni ventane nenu choodali. eeroje oka pirated DVD konta. Aa budgette ekkuva anukunta ee cinema ki.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: