వ్రాసినది: mohanrazz | 2009/10/27

చిరు పై నా మిత్రుడి పుస్తకం: కెరటం

27-Oct:2009

పూర్తి పుస్తకం ఇక్కడ చదవండి:

కెరటం

***********

aug-26-2009:

ప్రజారాజ్యం ఆవిర్భవించి ఈ రోజు కి ఒక సంవత్సరం అయింది. ఈ ఒక సంవత్సరమలో చిరంజీవి ఏమి సాధించాడు, ఏమి  కోల్పోయాడు అనే డిస్కషన్ ని ప్రక్కన పెడితే దాదాపు 9 నెలల కింద నా మిత్రుడు చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ పుస్తకం వ్రాసి దాన్ని చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసిన విషయాన్ని అప్పట్లో నా పాత బ్లాగ్ లో వ్రాసాను. దాన్నే ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను. అయితే ఈ ఒక సంవత్సరం లో చాలా మంది లో చిరంజీవి ఏదో చేస్తాడనే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఆ జోష్ కానీ తగ్గిపోయిన మాట వాస్తవం. రాజకీయాల్లో ఒకప్పుడు 2, 3 సీట్లు సాధించిన పార్టీలు కూడా తర్వాత విజయం సాధించిన సందర్భాలున్నాయి అంటాడు చిరంజీవి. ప్రజలకి చిరంజీవి మీద భ్రమలు తొలిగాయి అంటాడు వై.ఎస్. నెక్స్ట్ మేమే అంటాడు బాబు. ఏదీ చెప్పలేం. ఏదో తెలుగు సినిమా లో పరుచూరి/ఆత్రేయ/దాసరి/ముళ్ళపూడి/జంధ్యాల/త్రివిక్రం/దశరథ్/సత్యానంద్/తోటపల్లి మధు/ అబ్బూరి రవి వ్రాసినట్టు “కాలమే అన్నిటికీ సమాధానం” చెప్పాలి.

*****

Old post:

గిరిధర్ గోపాల్ రాజు అని, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాఫ్రెండ్. నిజానికి తను నాకు సీనియర్ అయినప్పటికీ, కూసింత కళా పోషణ మమ్మల్ని ఫ్రెండ్స్ ని చేసింది. కొన్ని స్కిట్స్ వగైరా నేను వ్రాసినవాటిని తను డైరెక్ట్ చేసాడు ఆ రోజుల్లో. సరే, ఈ “మరపు రావు కాలేజీ రోజులు” మాటలని కాస్త పక్కనపెట్టి విషయానికి వస్తే, గిరి కి మొదట నుంచీ కొంచెం కళాత్మకత,అంతకు మించి లైఫ్ లో ఏదైనా డిఫరెంట్ గా చేయలి అన్న తపన, ఈ రెండింటికి మించి చిరంజీవి మీద అభిమానం. సో, ఈ మూడు భిన్న ప్రవాహాలు వచ్చి ఒక త్రివేణీ సంగమం వద్ద కలిసి ‘కెరటం’ లా ఎగసి పడ్డాయనుకుంటా.

ఎవరి లైఫ్ లో వాళ్ళు,ఎవరి మెట్రో లో వాళ్ళు పడిపొవడం వల్ల గిరి ఈ పుస్తకం వ్రాయడానికి, దాన్ని పబ్లిష్ చేయించడానికి, రెండింటి కి మించి చిరంజీవి చేతుల మీదుగా నే ఈ పుస్తకం రిలీజ్ చేయించడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో,ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలీదు కానీ -వూహించుకోగలను.

బేసిక్ గా ఈ పుస్తకం చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించే యువత భావాలని ప్రతిబింబించే పుస్తకం .


Responses

 1. Giri,

  Congrats …

 2. Free online copy of the book will be published soon in a week… 🙂

  Thanks, Giridhar

  Thanks Raja and Mohan Raj…

 3. పరుచూరి/ఆత్రేయ/దాసరి/ముళ్ళపూడి/జంధ్యాల/త్రివిక్రం/దశరథ్/సత్యానంద్/తోటపల్లి మధు/ అబ్బూరి రవి వ్రాసినట్టు “కాలమే అన్నిటికీ సమాధానం” చెప్పాలి…….. hilarious

 4. అభిమానం వెర్రిది, కాదనను. ఎమీ ఆశించకుండా అంత కష్టపడి చేసిన పుస్తకంలో సారాంశం,దాని కోసం ఆ అభిమాని పడిన కష్టం చిరంజీవి మైండ్ లోకి ఎక్కించుకొనుంటే తాను చేసిన త్యాగం(సినిమా సింహాసనం వదిలేసి ప్రజా జీవితంలోకి రావడం) చాలా చిన్నది అని చిరంజీవికి తెలియాలి.

  • ఎమీ ఆశించకుండా అంత కష్టపడి >>
   add to that – అంత ఖర్చుపెట్టి ! But as a fan he never had any regrets abt that!

 5. JAI CHIRU.JAI PRAJA RAJYAM.MEGA STAR CHIRU,BEST OF LUCK. KUMARRRRR

 6. updated the post with full version – online copy !!!

 7. @మోహన్,
  కెరటం మీద కొడితే….”Sorry, the page (or document) you have requested is not available. Please check the address and try again.” అని వస్తున్నాది. ఒకసారి చూస్తారా?

 8. Link not working bro

 9. inni sarlu aa book gurinchi malla malla rayadam .. aa book advertisement laaga undi naaku

 10. లింక్ నేను ఓపెన్ చేస్తే అవుతోందే..!!
  ఒక వేళ పైన క్లిక్ చేస్తే ఓపెన్ కానట్టైతే ఈ లింక్ ట్రై చేయగలరు-

  Click to access keratam.pdf


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: