వ్రాసినది: mohanrazz | 2009/10/30

యూనివర్సిటీ లో “సంధ్యాసమస్యలు”

(శ్రీ శ్రీ రాసిన సంధ్యాసమస్యలు కి పేరడి )


ఇటుచూస్తే లేడీస్ హాస్టల్
అటుచూస్తే ఎస్పీడబ్ల్యూ!
ఎటకేగుటొ సమస్య తగిలిందొ
క బీట్-టెక్ స్టూడెంట్ కి!!

 అటు చూస్తే తొలిప్రేమ,
ఇటు చూస్తే చందమామ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక నవ యువకుడికి !!

ఆ సాయంత్రం ….
అమ్మాయి పలకరింపు,
మనసంతా పులకరింపు!
స్నో ఫీల్డ్ కి పిలుచుకుపోవడమో,
బ్రెడ్ వరల్డ్ కి తీసుకెళ్ళడమో —
సమస్యగా ఘనీభవించిందొక గ్రీకు వీరుడికి !!

 

(ఇది నేను తిరుపతి SVU లో ఇంజినీరింగ్ చదివేటపుడు రాసింది-కాలేజీ మేగజైన్ లో ప్రచురింపబడిందప్పట్లో.

ఎస్పీడబ్ల్యూ – తిరుపతి వుమెన్స్ కాలేజి;

స్నోఫీల్డ్ ఐస్ క్రీం పార్లర్ ,  చందమామ వైన్స్, బ్రెడ్ వరల్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గర్లో ఉండేవి -తిరుపతి లో అవి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు)


శ్రీ శ్రీ గారి అసలు కవిత ఇదీ –

సంధ్యాసమస్యలు
——————-

రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎట కేగుటొ సమస్య తగిలిం
దొక విద్యార్థికి!

ఉడిపీ శ్రీకృష్ణవిలాస్‌లో —
అటు చూస్తే బాదం హల్వా,
ఇటుచూస్తూ సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి!

ఆ సాయంత్రం…
ఇటు చూస్తే అప్పులవాళ్ళూ,
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో —
సమస్యగా ఘనీభవించిందొక సంసారికి!


Responses

 1. బ్లాగులోకానికి స్వాగతం.

  మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.

  జల్లెడ

  http://www.jalleda.com

 2. బ్లాగులోకానికి స్వాగతం.

 3. hii,
  perady chala bagundi..

 4. cenema assessment unte kooda bagundedi anukuntunna

 5. site bagundi
  cenema assessment unte kooda bagundedi

 6. Republished

 7. అది స్నోఫీల్డ్ కాదు స్నోవర్ల్డ్ అనుకుంటా..కళ్యాణీ టాకీస్ పక్కన …

  • హ్మ్..మీకూ తిరుపతి తో బానే పరిచయమున్నట్టుంది..అయితే అది స్నో ఫీల్డే..! అన్నట్టు కళ్యాణి థియేటర్ అంటే గుర్తొచ్చింది..”ఆత్మరాగం” సినిమా (చంద్రముఖి మాతృక మణిచిత్ర థాజు కి తెలుగు డబ్బింగ్ వెర్షన్) ని కొనిపడేసి గ్యాప్ వచ్చినప్పుడల్లా వేసేవాడు..నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లొ నాలుగేళ్ళలో ఒక ఆరేడుసార్లు వేశాడీ సినిమాని…దాదాపు ప్రతీసారీ చూసానీ సినిమాని అప్పట్లో..!

 8. ఆత్మరాగం నేనూ చూశా…అక్కడ కాదు లెండి. అన్నట్టు మాది వాయల్పాడు. ప్రతి సమ్మరూ తిరుపతిలో సినిమాల కోసం దిగిపోయేవాళ్ళం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: