వ్రాసినది: mohanrazz | 2009/11/09

స్టార్ నైట్

హ్మ్..ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది..ఏం చేస్తాం..ఒకే వారం లో పాత కంపెనీ నుంచి రిలీవ్ అయిపోవడం, కొత్త కంపెనీ లో జాయినవడం, అక్కడ కొంత స్టెబిలైజ్ అవడం, పాత ఫ్లాట్ ఖాళీ చేయడం, వేరే ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవడం, కొత్త ప్లేస్ లో కొంత అడ్జస్టవడం, ఇంకా ఇతరత్రా పనులతో ఫుల్ బిజీ అయిపోయి- ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు- “నా పరిస్థితి ఇక్కడ ఇత్తడి మూకుడు లో మెత్తటి పకోడీ అయిపోయింది” 🙂 . అన్నీ సర్దేసుకుని వీకెండ్ ప్రశాంతంగా టీవీ9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాను. మొత్తానికి సినీ పరిశ్రమ తరపున దాదపు 5 కోట్ల పైచిలుకు వసూలు చేసి సిఎం ఫండ్ కి ఇచ్చారు. అభినందనీయమైన విషయం. ప్రోగ్రామ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్ని ప్రోగ్రామ్స్ కి బ్యాక్ గ్రౌండ్ లో నుంచి దాసరి గారు వ్యాఖ్యాత గా వ్యవహరించారు. మంచి పనైంది. లేదంటే ఒక్కొక్క ప్రోగ్రాం కీ మధ్య లో యాంకర్స్ వచ్చి సాగదీసి అసలు కంటే కొసరెక్కువయేలా చేసే వాళ్ళేమో. అయితే ఈ కార్యక్రమాన్నంతటినీ నిర్వహించింది దాసరి గారే కాబట్టి మొత్తం కార్యక్రమం మీద కూడా ఆయన ముద్ర కొంచెం బలంగానే పడింది.

సంగీత విభావరి తో మొదలెట్టారు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ వాళ్ళ ట్రూప్ తో వచ్చి పాటలు పాడించారు. కీరవాణి వచ్చి దాసరి ప్రేమాభిషేకం లోని “వందనం ” పాట పాడి ప్రేక్షకులని అలరిస్తే, మనో వచ్చి దాసరి లంకేశ్వరుడు లోని “జివ్వుమని కొండగాలి” పాటతో మెప్పించారు. శివారెడ్డి వచ్చి మిమిక్రీ మొదలెట్టి స్వర్గీయ NTR గారు ఈ ప్రోగ్రాం ని ఎలా ఆశీర్వదిస్తారో వివరిస్తూ – సందర్భానికి అంతగా అతక్కపోయినా – బెబ్బులు పులి లో ని కోర్టు డైలాగులు మిమిక్రీ చేసారు. కృష్ణం రాజు వచ్చి దాసరిగారి తాండ్ర పాపారాయుడు లోని “అభినందన మందారమాల” పాటకి నటి ప్రభ తో కలిసి అభినయిస్తే ఆ ప్రేక్షకుల్లో కూర్చున్న జయప్రద ఎంతగానో మురిసిపోయారు. ఇక దాసరి గారు రచించి కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిగా- జయసుధ, రోజా, మోహన్ బాబు నటించిన స్కిట్ లో అయితే – దాసరి గారి శివరంజని, సర్దార్ పాపారాయుడు సినిమాల్లోని డైలాగులతో స్కిట్ ని నింపేశారు. మాడా కి ఇచ్చిన 5 నిముషాల సమయం లో ఆయన/ఆమె – తన మెడలో మంగళసూత్రం కట్టిందీ, తన కడుపులోని బిడ్డకి తండ్రి అయిందీ దాసరి అని చెబుతూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసారు. ఇలా అడుగడుగునా దాసరి గారి బలమైన ముద్ర తో ప్రోగ్రామ్స్ అన్నీ సాగాయి. మిగతా ప్రోగ్రామ్స్ లో శ్రీహరి నటించిన ఒక సుదీర్ఘమైన స్కిట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే, బ్రహ్మానందం-సునీల్ లు చేసిన “ఒక్క రూపాయి” స్కిట్ ప్రేమకి వేళాయెరా సినిమాలో జనాలందరూ చూసేసిన గౌతం రాజు కామెడీ ట్రాక్ రిపిటీషన్. తెలంగాణా శకుంతల, కళ్ళు చిదంబరం లు నటించిన “గృహ హింస స్కిట్”, సుమ వేణుమాధవ్ ల “సుబ్బరాయుడ్ పెళ్ళి” స్కిట్ ఫరవాలేదనిపిస్తే, స్కిట్స్ లో అన్నింటికంటే ప్రేక్షకులని అద్భుతంగా అలరించిన ఘనత మాత్రం జై ఫేం వేణు, ఇతర నూతన నటులు చేసిన “స్మోక్ టీవీ” అనే స్కిట్ కి దక్కుతుంది. కొంత మంది ఆల్రెడీ మెయిల్ ఫార్వర్డ్స్ లో చదివిన -కుక్క కాలికి దెబ్బతగిలితే మీడియా చేసే హడావుడి ఇతివృత్తంగా సాగే “టీవీ9 పై సెటైర్” లాంటి అంశాన్ని అద్భుతంగా ఇంప్రొవైజ్ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక శివారెడ్డి మిమిక్రీ లో కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ మనమంతా విన్నవే ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని “బాత్రూం కామెడీ” లు ఉన్నా ప్రేక్షకులని నవ్వించగలగడం లో శివారెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక జూనియర్ NTR చేసిన స్కిట్ బేసిక్ త్రెడ్ యమదొంగ సినిమాలోనిదే అయినా సినిమాలో మనం చూసిన థ్రెడ్ మీద ఇది ఇంకొంచెం అప్ గ్రేడెడ్ వెర్షన్ అన్నట్టు. బాగా ఉంది అది క్రియేటివ్ గా. అయితే బాల కృష్న తదితరుల ఇంకొన్ని స్కిట్స్ సమయభావం వల్ల ప్రదర్శించలేకపోయారేమో అనిపించింది. ఇదండీ పరిస్థితి. ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి అని సమీక్షింది కేవలం ఆ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకుడిగా నా ఒపీనియన్ చెప్పడానికి మాత్రమే. ఏది ఏమైనా ఒక మంచి పని కోసం వీళ్ళందరూ చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఈ ఫండ్ అంతా అర్హులకి అవసరమైన వాళ్ళకి సవ్యంగా సంపూర్ణంగా చేరాలని ఆశిద్దాం.

స్టార్ నైట్ కి సంబంధించినది కాకపోయినా ఇంకో విషయం- ఇంతకు ముందు ఒకసారి వ్రాసాను- బెహ్రైన్ లో ఆన్ సైట్ లో ఉన్న మా తమ్ముడు, వాళ్ళ కొలీగ్స్ కలిపి ఒక డెబ్బై వేలదాకా ఫండ్స్ కలెక్ట్ చేస్తే మా నాన్న మరియు వాళ్ళ సహ ఉపాధ్యాయులు కలిసి ఇంకొంత కలిపి, ఇంకొంత సేకరించి ఆ మొత్తం తో నేరుగా ఆయా గ్రామాలకి వెళ్ళి సహాయాన్ని అందించారు అని. ఆ విషయానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ ని ఇక్కడ పంచుకుందామని..
(రౌండప్ లో మా నాన్న)

F.R.C.1


Responses

 1. దాసరి వల్లే స్టార్ నైట్ పాడయింది. ప్రోగ్రాం జరుగుఉంటే, కనీస మర్యాద లేకుండా మధ్య మధ్యలో మాట్లాడడం. మైక్ ని ఆఫ్ చెయ్యడం కూడా రాదేమో. ఇక స్కిట్ లు ఎక్కువ శాతం చెత్తగా ఉన్నాయి దాసరి పుణ్యమా అని. సినిమా ఫంక్షన్ అనే సరికి ఈయనే దిక్కుగా ఫీల్ అయిపోయి పాడు చేస్తాడు. సంగీత దర్శకులని ఓహ్ కంగారు పెట్టేసి చెత్త స్కిట్ లకి టైం వేస్ట్ చేయించారు.

 2. మొత్తానికి నేను స్టార్ నైట్ చూడలేకపోయానన్న బాధ పోయిందండీ మీ పోస్ట్ చదివాక. చక్కగా చిక్కు లేకుండా అన్ని details ఇచ్చేసారు 🙂

  మీ తమ్ముడికి మరియు అతని మిత్రులకి,, మీ నాన్నగారికి మరియు ఆయన సహొద్యోగులకి నా అభినందనలు !!!

 3. వాసు గారు అన్నట్లు గా దాసరి చెత్త గా చేసాడు. “Now ONLY ONE SONG”..cant he say “Now we are going to have one song from…”. స్టేజీ పైన మంచి ప్రోగ్రాము జరుగుతున్నా లేక ఎవరైనా మాట్లడున్నప్పుడు మద్యలో మాట్లాడ కూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. దీనికి తోడు మహా చెత్త ఇంగ్లిషోకటి.

  బాల కృష్ణ భువనవిజయం నాకు బాగా నచ్చింది, జొన్నవితుల వారి తెలుగు దండకం మరీ. వేణు టీవీ స్కిట్ చాల బాగుంది.

 4. మోహన్ !, చాలా రోజుల తర్వాత మీ టపా. ఆనందంగా ఉందండీ. స్మోక్ టివి స్కిట్ మాత్రం అలరించింది.

 5. దాసరి తన సాధారణ అతి తో తన ఓవర్ ఆక్షన్ modulation తో చంపేసాడు . అన్ని స్కిట్స్ మన తెలుగు సినిమా దౌర్భాగ్యానికి ప్రతీకలే .
  చెత్తగా వుంది .
  ఇంకో విషయం , సభా మర్యాదలు తెలీని దాసరి లాంటి వాళ్ళు మనలని వెర్రి వెధవలు చేయటమే ,
  ఉదాహరణ : సూర్య , ఒక వైపు మాట్లాడుతుంటే మద్యలో కట్ చేసి బాలయ్య రావాలి అంటూ అడ్డుపడటం ..
  తెలుగు సినిమా ప్రపంచం నిర్వహించిన ఈ కార్యక్రమం లో అంత ఇంగ్లీష్ లో మాట్లాడటం ..
  చివరికి రజనీకాంత్ కూడా చక్కటి తనకు తెలిసిన తెలుగు మాట్లాడడు
  అంతే సంగతులు చిత్తగించవలెను

 6. సత్యన్నారాయణ కోట శ్రీనివాస రావు లను పక్కన పెట్టి 75 సం ల పండగ చేసినప్పుడు
  ఈ దాసరిని సభ పేద్దగా పిలిచి చెత్త చేసారు
  ఇప్పుడు ప్రోగ్రాం ని బ్రష్టు పట్టేలా చేసారు

 7. ఫూల్స్ లాంటి సినిమాలు తీసే వాడికి రాజకీయ పలుకుబడి తో ఏమైనా చేయోచ్చు అని నిరూపించిన వ్యక్తీ
  నాకూ నచ్చలేదు ఈయన చేసిన ఓవరాక్షన్

 8. స్టార్ నైటుకి రాని వాళ్లని బ్యాన్ చేస్తామని ప్రకటించారు, మరి మహేష్, పవన్ కళ్యాణ్ లని బ్యాన్ చేస్తారేమో చూడాలి
  అని కన్నగాడు గారు చెప్పారు

  మరి త్రివిక్రం పూరి జగన్నాథ్ మిగతః ప్రోడుసుర్స్ ని బాన్ చేస్తాడా
  వాళ్ళ కొడుకే రాలేదు ఇంకా వేరే ఎవరు వచ్చేది

 9. సహాయ హస్తం అందించిన మీవారందరికీ అభినందనలు

 10. ముందుగా సహాయన్ని అందించిన వారందరికీ(మీ వాళ్లకి) అభినందనలు చెప్పండి!

  దాసరి ఓవరాక్షన్ మనకి కొత్త అయినట్లు మాట్లాడుతున్నారేంటి మీరంతా? అలవాటు పడ్డాంగా!

  మీరు చివరిదాకా చూశారో లేదో(నేను ఒన్లీ చివరి అరగంటే చూశా) చివార్లో ముఖ్యమంత్రికి చెక్కులిచ్చే ప్రహసనం భలే ఉంది! ఆ తర్వాత సుశీలమ్మ వచ్చి శ్రుతి మిస్ చేసి కొన్ని పాటలు పాడే “ప్రయత్నం” చేశారు.

  స్టార్ నైట్ చేసి డబ్బు పోగేశారు, బానే ఉంది. వీళ్ళలో చాలా మంది పారితోషికాలు భారీ స్థాయిలోనే పుచ్చుకుంటారు కదా! ఈ ప్రోగ్రాం కి టైం ఇవ్వడం కాకుండా స్వచ్ఛందంగా ఎంతో కొంత విరాళాలు ఎంత మంది ఇచ్చారంటారు?

  • // వీళ్ళలో చాలా మంది పారితోషికాలు భారీ స్థాయిలోనే పుచ్చుకుంటారు కదా! ఈ ప్రోగ్రాం కి టైం ఇవ్వడం కాకుండా స్వచ్ఛందంగా ఎంతో కొంత విరాళాలు ఎంత మంది ఇచ్చారంటారు?//..

   నిజానికి ఇదే ప్రశ్నని అప్పట్లో NTR ని అడిగారు..”మీరు జనాల వద్ద సమీకరించి జనాలకి ఇచ్చారే కానీ మీ జేబులోనుంచి ఇవ్వలేదే?” అని. ఆయనా దానికి”నా జేబు లోనుంచి ఇస్తానని గానీ ఇచ్చానని కానీ నేనూ చెప్పడం లేదు..ప్రజల డబ్బునే ప్రజలకి ఇచ్చాను..నేను కేవలం సంధానకర్తని మాత్రమే” అన్నారు..అయితే ఈసారి మాత్రం చాలా మంది స్టార్స్ సొంత డబ్బు కూడా ఇచ్చారు.

 11. ఆ తర్వాత సుశీలమ్మ వచ్చి శ్రుతి మిస్ చేసి కొన్ని పాటలు పాడే “ప్రయత్నం” చేశారు. >>
  కొద్దిగా ఆవిడ వయస్సు కన్నా గౌరవం ఇస్తే బాగుంటుంది, నేను ఇంతకూ ముందు కూడా చదివాను మీరు ఆమె గురించి రాసినది.

  • ఆవిడ వయసుకి, సంగీత పరిజ్ఞానానికి అపరిమిత గౌరవం ఇస్తాను. మీరు ఇంతకు ముందు చదివినపుడు తెలిసే ఉండాలి నేను ఆమె అభిమాని ని అని! ఇలా అపరిమిత సంఖ్యలో అభిమానులున్నపుడు కళాకారులు కొన్ని మర్యాదలు,జాగ్రత్తలు పాటిస్తే బావుంటుంది.

   ఈ మధ్య ఝుమ్మంది నాదం కార్యక్రమంలో బాలు చెప్పారు “పదహారేళ్ళ వయసులో పాడినట్లే ఇప్పుడు పాడారనే పొగడ్తల్లో నిజంలేదని మాకూ తెలుసు”అని! అది ఎంత నిజమో ఇలా 80 లోకి వచ్చిన గాయకులు గ్రహిస్తే బావుండు.

 12. బాలు గారు చెబితే అది ఆయన స్వంత అభిప్రాయం, మరి ఆయనే నిన్న నన్ను పాడటానికి పిలవటం మర్చిపోకండి అని జోకారు అది చూడలేదేమో మరి మీరు , ఆయన ఆవిడ ఏదో కమర్షియల్ ఆవకాశాలు రావటం లేదనో లేదా సినిమాల్లో పాడటానికో ఎగపడటం లేదే , ఏదో ఒక మంచి కారణం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన వంతూ గా చేయివేసారు. అంటే ఒక వయస్సు వస్తే మూల కూర్చోమనా మీ ఉదేశ్యం , ఆలాంటి వారు ఈలాంటి కార్యక్రమాలకు హాజరైతేనే తరవాత తరాల వారు నలుగురి లో ఎలా ఉండాలో నేర్చుకుంటారు కనీసం వారిలాంటి వాళ్ళను చూసి. మీరంతకు ముందు కూడా ఇదే విధంగా రాసారు కాబట్టే ప్రస్తావించాను .
  మోహన్ గారు మీ స్పేస్ వాడుకున్నందుకు క్షమాపణలు , ఈ విషయం లో ఇదే నా చివరి స్పందన.

  • బాలూ తన స్వంత అభిప్రాయం చెప్పినట్లే నా స్వంత అభిప్రాయం నేనూ చెప్పాను. కళాకారులు, ముఖ్యంగా గాయకులు ఒక వయసు వచ్చిన తర్వాత “మూల కూచోకపోయినా ” శ్రుతి లేకుండా పాడి అభిమానుల్ని ఇబ్బందికి గురి చేయడం మంచిది కాదు! ఇది కొన్నాళ్ళు పోతే బాలూకీ వర్తిస్తుంది. లతా కి ఆల్రెడీ వర్తించడ మొదలైంది. ఎవరికీ మినహాయింపు లేదు.

   పాత తరం గాయకుల్ని చూసి ఈ తరం గాయకులేం నేర్చుకున్నారో, ఏం నేర్చుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు.

 13. ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం గారు కూడా అలవాటు గా కొంచెం ఓవర్ గా పాడి మంచి ప్పతలని శ్రుతి లేకుండా కొంచెం చెత్తగా పాడారు, మధ్యలో ఈయన సొంత పైత్యం కొంత జోడించి ఎలా పడితే అలా పాడి గౌరవం పోగొట్టుకున్నారు.

  ఇక సుశీల గారి వయసుకి గౌరవం ఇవ్వచ్చు గాని పాడలేని స్థితి లో పాటలు పాడి కొంచెం ఇబ్బందికి గురిచేయటం మంచిది కాదు, ఇళయరాజా గారు సుశీల గారిచేత పాటలు పాడించక పోవటానికి కారణం ఏమై ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదు,

  ఆ దాసరి గారికి “worst anchor of the decade” గా ఒక గుర్తింపు అవార్డు ఇవ్వకపోవటం కొంచెం బాధాకరం, ఇక ప్రోగ్రామ్స్ అన్నీ కలగాపులగం గా ఉన్నాయి, దీని కంటే మామూలు నవరత్రికి ఊళ్ళల్లో పెట్టే మ్యుసికల్ నైట్ చాలా బాగుంటుంది అనే భావన కలిగింది

  మినహాయింపు: NTR, Bala krishna, Siva Reddy Mimicry , Smoke TV, ఇత్యాదులు

 14. ఎక్కడెక్కడి వాళ్లూ వచ్చినట్లున్నారు కానీ రాఁవులక్క మాత్రం రాలేదేంటో! ఇంతకు ముందు వజ్రోత్సవాలప్పుడూ కనపడలేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: