వ్రాసినది: mohanrazz | 2009/11/10

నంది ఉత్తమ కథ-2008

అప్పుడెప్పుడో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా- “అందమైన మనసులో” అనే సినిమా కి వెళ్ళొచ్చానని చెప్తూన్నాడు. ఎలా ఉందని అడిగితే “థియేటర్లో జనాలు హాహాకారాలు” అని చెప్పాడు ఒక్కముక్కలో. అవునా, ఇంతకీ ఏంటి పాయింటు అని అడిగితే చెప్పాడు-

హీరో పీజీ చదువుతూంటాడు. క్లాస్ మేట్ ఒక అమ్మాయిని (హీరోయిన్) లవ్ చేస్తూ ఉంటాడు. ఆమె కూడా లవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఆమె సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు హీరోకి ఇక్కడ ఒక చిన్నపాప పరిచయమవుతుంది. తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి బ్లడ్ డొనేట్ చేస్తాడు హీరో. ఆ అమ్మాయి ఆ తర్వాత హీరోకి బాగా క్లోజవుతూంది. పసిపిల్లలాంటి ఆ అమ్మాయి మాటలు, ఆ అమ్మాయి స్నేహం హీరోకి ముచ్చటగా అనిపిస్తూ ఉంటే అటు ప్రక్క ఆ అమ్మాయి మాత్రం (బహుశా సినిమా మరియు ఇతరత్రా ప్రభావాల వల్ల కాబోలు) హీరో పట్ల ప్రేమ (ఆకర్షణ??) పెంచుకుంటుంది. హీరోకి ప్రపోజ్ కూడా చేస్తుంది. అయితే హీరో ఆ అమ్మాయిని మందలించి, అది కేవలం ఆకర్షణ అని నచ్చజెప్పి పంపించేస్తాడు. అక్కడ సెలవులకి ఇంటికి వెళ్ళిన కొన్ని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకుని అట్నుంచి అటే అమెరికా వెళ్ళిపోతుంది. అది తెలిసి డిస్టర్బ్ అయిన హీరో తన పీజీ పూర్తి చేసి, పీహెచ్ డీ చేస్తూ ఎవరినీ పెళ్ళి చేసుకోకుండా సంవత్సరాల తరబడి అలా ఉండిపోతే అవతల ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి మళ్ళీ వచ్చి తనని పెళ్ళి చేసుకోమని అడుగుతుంది. హీరోకి మనసొప్పదు. ఇదీ పాయింట్. మా ఫ్రెండ్ ఇదంతా చెప్పాక నాకనిపించింది- తన కళ్ళముందు పెరిగిన అమ్మాయిని ఆ తర్వాత కూడా పసిదాని లాగే చూస్తూ ఆమె ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోవడం హీరో వ్యక్తిత్వం లో ని గొప్పతనం అయితే, ప్రేమ కోసం జీవితాన్ని పాడు చేసుకోకుండా బుద్దిగా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అన్ని సంవత్సరాల పాటు తన ప్రేమని పదిలపరుచుకుని, ఆ తర్వాత వచ్చి తన ప్రేమని సక్సెస్ చేసుకోడానికి ప్రయత్నించడం హీరోయిన్ పాత్రలోని గొప్పదనం. రెండు పాజిటివ్ పాత్రలే అయి ఉండి కూడా చక్కని కాన్‌ఫ్లిక్ట్ ఏర్పడగలగడం మన ప్రేమకథల్లో కొంచెం అరుదైన విషయమే. అయితే నిజానికి ఇలాంటి తరహా పాయింట్ అదేదో వినోద్ కుమార్ సినిమాలో చూసినట్టు గుర్తు. మీనా వినోద్ కుమార్ కి మేనకోడలు. ఆ అమ్మాయి వినోద్ కుమార్ కంటే చాలా చిన్నది..తనని పెళ్ళి చేసుకోమని ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే – నా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయిని, నా చేతుల మీద పెంచిన ఆ అమ్మాయిని నేను చేసుకోను అని మొండికేస్తాడు. అయితే ఆ అమ్మాయి ని నీ కంటే ప్రాణంగా చూసుకునే వాడు దొరకడు అని..అలాంటిదేదో చెప్పి పెళ్ళి చేస్తారు..సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ పాయింట్ ఇదే. కానీ అందులో సొంత మేనకోడలు కావడం, ఇది మన కల్చర్ లో కూడా ప్రత్యేకించి పల్లెల్లో కొంతమంది ఐడెంటిఫై చేసుకునే పాయింట్. కానీ అందమైన మనసులో కథ అలా కాదు… పది పదకొండో తరగతి చదివే అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకున్నట్టు తీస్తున్న సినిమాల మధ్యలో, ముప్పై ఐదేళ్ళు పైన వయసున్న హీరో పదకొండో, పన్నెండో చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చూపించే కమర్షియల్ సినిమాల మధ్యలో ఈ పాయింట్ లో చాలా సెన్సిబిలిటీ ఉన్నట్టే అనిపించింది నాకు. కథ బాగానే ఉన్నట్టుంది కదా అని అంటే మా ఫ్రెండ్ నామీద ఇంతెత్తున ఎగిరాడు. “నీదేం పోయింది? నేను రెండున్నర నిముషాల్లో కథ మొత్తం చెబితే బాగానే అనిపిస్తుంది నీకు. థియేటర్ లో కూర్చుని చూడు తెలుస్తుంది..టీవీ సీరియల్ కంటే అధ్వాన్నంగా ఉందక్కడ, థియేటర్లో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు” అని.

ఆలోచించాను. బహుశా టేకింగ్ మరీ దారుణంగా ఉండి ఉంటుంది. సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా బిజీగా ఉన్న ఆర్పీ పట్నాయక్ ఆమధ్య తన రొటీన్ ట్రాక్ లో నుంచి బయటికి వచ్చి కొన్నిప్రయోగాలు చేసాడు ఆమధ్య. “శ్రీను వాసంతి లక్ష్మి” అనే రీమేక్ సినిమాలో హీరోగా చేయడం మొదటిది. ఆ తర్వాత “22 మినిట్స్” అనో అలాంటిదేదో అరగంట లోపు నిడివి గల ఒక సినిమా డైరెక్షన్ చేసాడు. ఆ తర్వాత ఈ “అందమైన మనసులో” అనే సినిమా. ఈ కథ లోని సెన్సిబిలిటీ ని స్క్రీన్ మీద చూపించడానికి దర్శకుడిగా తన కెపాసిటీ సరిపోకపోయి ఉండవచ్చనిపించింది. నేనైతే ఈ సినిమా చూడలేదు. కేవలం కథ విన్నాను. కొంత వైవిధ్యమైన పాయింటే అనిపించింది. పాయింట్ లోనూ కొంత నోబిలిటీ ఉంది. ఈ ఏడాది వచ్చిన మిగతా “కథలతో” పోలిస్తే ఈ కథకి నంది అవార్డివ్వడం రాంగ్ స్టెప్ అయితే కాదనిపించింది.


స్పందనలు

  1. ఆ ఫలానా వినోద్ కుమార్ సినిమా పేరు మీర్రాసిన టూకీ కథలోనే చూచాయగా ఉంది: ‘మేనమామ’

  2. భలే రాస్తావ్ మోహన్.. నువ్వే టాపిక్ రాసినా చదవాలనిపిస్తుంది.. 🙂

  3. నిజమే!

  4. ఈ సినిమా నాకు కూడా నచ్చిన సినిమా. మీ స్నేహితుడు చెప్పినంత ఘోరంగా అయితే ఉండదు. మొదట్లో ఆ రెండో అమ్మాయి ప్రేమన్నప్పుడు, అరే ఈ సినిమాతో ఇక చిన్నపిల్లలు పెద్ద వాళ్లని ప్రేమించడం మొదలవుతుంది అని కాస్త బాధవేసింది. కానీ ఆ అమ్మాయి హీరోని ఒప్పించిన తీరు, హీరో ప్రేమ అనగానే ఒప్పుకోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న తీరు నచ్చాయి.

  5. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మంచి టాకే విన్నాను. సినిమా బావుంది, కొత్త కథ అని అందరు చెప్పారు. నేను కూడా వెళ్ళి చూడాలనుకున్నాను. అప్పటికి మా యూనివర్సిటీ కి దగ్గరగా ఉండే ఒక హాల్ లో ఒకరోజు ప్రయత్నించాము, కాని టికెట్స్ దొరకలేదు. తరువాత‌ ఒక వారం లో ఆ సినిమా ఆ హాల్ నుండి తీసేసాడు. అందుకని చూడలేకపోయాను. ఆర్.పి. మంచి ప్రయత్నం చేసాడు అని విన్నాను. ఈ కథ కి నంది అవార్డ్ రావడం సమంజసమే.

    ఇకపోతే ఈసారి నంది అవార్డ్స్ నాకు ఆనందన్ని కలిగించాయి. గమ్యం కి best film award రావడం. చిన్న సినిమాలని గుర్తించడం (వినాయకుడు, 1940 లో ఓ గ్రామం), రవితేజ కి నేనింతే లో best actor award రావడం, అన్ని బాగున్నాయి.

    • భవిషత్ లో ఏదో సాధిస్తాడని ఒబామాకి నోబెల్ ఇచ్చినట్లే, నాడోడిగళ్ రీమేకు లో బాగా నటిస్తాడని రవితేజకి నందిచ్చారు.

      Anyway, he is an excellent actor.

  6. గొప్ప కథ కాదు, కథలో నిజాయితీ వుందని నా అభిప్రాయం. ఎంతో ఓపికతో చూస్తే క్లైమాక్స్ లో మంచి రిలీఫ్ ఇచ్చాడు. Nice and sincere attempt by R.P

    my view on this movie

    • ee cinema katha konchem kothaga undanipinchindi kaani… uthama katha rachayita award ichentha movie aithe matram kaadu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: