వ్రాసినది: mohanrazz | 2009/11/11

100 వ సినిమా నా .. ఎలా? how?

 mahtma

వచ్చే నెల రిలీజవనున్న మహాత్మ అనే సినిమా శ్రీకాంత్ కెరీర్ లో వందవ సినిమా అట. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే- శ్రీకాంత్ 98 వ సినిమా గా ప్రారంభమైన సినిమా, 99 వ సినిమా గా ప్రారంభమైన సినిమా ఇప్పటి దాకా రిలీజ్ కాలేదు. ఆ లెక్కన మహాత్మ శ్రీకాంత్ యొక్క 98 వ సినిమా అవుతుంది కానీ 100 వ సినిమా కాదు. కానీ దీన్ని 100వ సినిమాగానే ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రారంభమైన సినిమాల్ని లెక్కేస్తే ఇది శ్రీకాంత్ యొక్క “ప్రారంభమైన 100వ సినిమా”యే.

 

ఇలాంటి గోలే బాలచందర్ కి జరిగింది. “పరవశం” అనే సినిమా బాలచందర్ 100 వ సినిమా అని చెబితే ఆ తర్వాత కొందరు- టీవీ సీరియల్స్ ని కూడా లెక్కిస్తే అది వందవది అయింది కానీ సినిమా గా అది 100వ సినిమా కాదు అన్నారు. ఇంకొందరు ఆ రకంగా చూసినా ఇది 100వది కాదు అన్నారు. ఈ మధ్యలో పరవశం వచ్చి “పోయింది”. కోడి రామ కృష్ణ గారిది ఇంకో డిఫరెంట్ కేస్. 90 సినిమాలయ్యాక అనుకుంటా నా వందవ సినిమా “జెండా” అనే పేరుతో ఉంటుంది, అంకుశం, భారత్ బంద్ ల కంటే పవర్ ఫుల్ గా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత “జెండా” పేరు తో ఒక సినిమా తీశాడు కానీ అది వందవ సినిమా కాదన్నాడు. మరి వందవ సినిమా ఏది అంటే- నేను 100 వ సినిమా ఇప్పట్లో తీయను, 99 వ సినిమా తర్వాత డైరెక్ట్ గా 101వ సినిమా తీస్తా సరైన కథ దొరికిన తర్వాత ఎపుడైనా 100 వ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీస్తానన్నాడు 🙂  . కె రాఘవేంద్ర రావు కి అయితే గంగోత్రి 100 వ సినిమా అనుకుంటా. 100 వ సినిమా అంటూ ప్రత్యేక శ్రద్ద, ప్రత్యేక పబ్లిసిటీ చేసి ప్రత్యేక ఒత్తిడి పెంచుకోకుండా – అలా కానిచ్చేసారాయన. నిజానికి ఇదే కరక్టేమో. దాసరి నారాయణ రావు 100వ సినిమా లంకేశ్వరుడు, చిరంజీవి 100 వ సినిమా త్రినేత్రుడు, జనాలు ఎక్స్‌పెక్ట్ చేసినంత ఫలితాల్నివ్వలేదు. రామానాయుడు కూడా మొదట్లో తన వందవ సినిమా ని చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో తీద్దామనుకుంటున్నట్టు, కథ కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పాడు ముందు. ఆ తర్వాత కథ దొరక్క ప్రాజెక్ట్ డ్రాపయింది అన్నాడు. ఏది 100 వ సినిమానో చెప్పకుండా అలా లాగించేసాడాయన కూడా!బహుశా “విజయం” అనే సినిమా 100వది అయి ఉండవచ్చనుకుంటా.

ఏది ఏమైనా ఈ రోజుల్లో 100 మార్కు ని టచ్ చేయడమనేదే ఏ నిర్మాతకైనా దర్శకుడికైనా,hero కైనా ఒక పెద్ద అచీవ్‌మెంటే. ఆ అచీవ్‌మెంట్ ని మరింత మెమొరబుల్ గా మలచుకోవాలనే వాళ్ళ ప్రయత్నాన్ని తప్పు పట్టలేము కానీ అందుకై చేసే ప్రయత్నం లో మొదటికే మోసం తెచ్చుకోకుండా చూసుకుంటే చాలు. ఇక రాబోయే రోజుల్లో 100 మార్కు ని టచ్ చేసే స్కోప్ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారూ అంటే (దర్శకులు-నిర్మాతల్లో) కొంచెం టైం పట్టవచ్చు కానీ ఉషాకిరణ్ మూవీస్ ఒకటి, రాం గోపాల్ వర్మ ఒకడు – వీళ్ళిద్దరికీ ఆ స్కోప్ ఉంది. చూద్దాం.


Responses

 1. mmmmmmkodanda ramireddy 98 movies direct chesaadu……..99 chestunnadu anukunta marala ….

 2. 100 వ సినిమా మాట ఎలా ఉన్నా, క్రిష్ణ లాగ 300 ల పైచిలుకు సినిమా లలో నటించి, 100 వ సినిమా, 200 సినిమా, 300 సినిమా కూడా హిట్ కొట్టే ఏ ఆర్టిస్టు మళ్ళీ పుట్టడేమో అనిపిస్తున్నాది!!!

  • ఇప్పటి హీరోలు ఏడాదికొకటి రెండేళ్ళకొకటి చేయడం చూస్తే 100 కాదు కదా ఒక 20-25 సినిమాలైనా కెరీర్ మొత్తం మీద కలిపి తీస్తారా అనేది అనుమానమే. కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, 200వ సినిమా ఈనాడు(ఇది మళయాళ సినిమా రీమేక్) పెద్ద హిట్లు. అయితే 300వ సినిమా తెలుగువీరలేవరా..విషయం లో అంచనాలు తలక్రిందులయ్యాయి. ఆ తర్వాత ఎంకౌంటర్ అనే సినిమా వచ్చింది కృష్ణది – 310 వ సినిమా అనుకుంటా- దాని రిలీజ్ కి ముందు – ఇది నా 300 వ సినిమా అయి ఉంటే బాగుండేదనిపిస్తోందన్నాడు కృష్ణ. అయితే అది కూడా పెద్ద విజయం సాధించలేదు…

  • nt 378 kada…………

 3. వందవ సినిమా ఏంటి మోహన్ బాబు లా ప్రతి సినిమా ఫ్లాప్ కాకుంటే మంచిది

 4. 500 సినిమాలు 1000 హీరోయిన్స్ హి ఇజ్ ఎ లెజెండ్ [:)]

  • సంఖ్యాపరంగా చూస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్స్ చేసిన సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బ్రహ్మానందం, మనోరం లాంటి వాళ్ళ సినిమాల సంఖ్య అటూ ఇటూగా వెయ్యి ఉంటుంది. మోహన్ బాబు 500 చేశాడంటే..మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడమే ఇందుకు కారణమనుకుంటా. అల్లుడుగారి తర్వాతే మళ్ళీ హీరో అయ్యాడు. అలా హీరోగా చేసినవి మాత్రమే లెక్కెడితే తక్కువే ఉంటాయి మోహన్ బాబు సినిమాలు కూడా. కానీ కృస్ష్ణ అలా కాదు హీరో గానో, అధమం సెకండ్ హీరోగానో చేస్తూ 300 తెసాడు.

 5. ఇప్పటి తరం నాయకులలో అల్లరి నరేష్ , శివాజి లు మాత్రమే హీరోలుగా 100 సినిమాలు పూర్తి చేయగలరు అని అనిపిస్తోంది.

 6. లోకంలో సినిమా లోకం బాధలు అవి.

 7. నటుడి బాధ్యత నటించడంవరకే. అతని సినిమా రిలీజు అవుతుందా లేక మధ్యలో ఆగిపోతుందా అనేది అతని చేతుల్లో ఉండదు, ప్రత్యేకించి శ్రీకాంత్ లాంటి నటుల చేతుల్లో. ఓక్క సీను నటించినా, వంద సీన్లు నటించినా ఒక్క సినిమా కిందే లెక్క. ఇందులో అంత తర్కించే కారణం కనిపించడం లేదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: