వ్రాసినది: mohanrazz | 2009/11/12

సలీం ఆడియో ఫంక్షన్ లో వేణు మాధవ్ తెలివి/జాగ్రత్త

saleem

వైవిఎస్ దర్శకత్వం లో విష్ణు, ఇలియానా తదితరులు నటిస్తున్న సినిమా “సలీం- దుమ్ము రేపుతాడు”. ఒక్కమగాడు లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత హిట్ కొట్టాలనే కసి తో వైవిఎస్, ఈ మధ్య హిట్లు లేక డీలా పడిన విష్ణు, ఇద్దరికీ బ్రేక్ ఇచ్చే బాధ్యత లక్ష్మీ ప్రసన్న బ్యానర్ మీద పడింది. ఆడియో ఫంక్షన్ బానే జరిగింది. వేణు మాధవ్ యాంకర్ గా చేసాడు ఈ ఫంక్షన్ కి. వేణు మాధవ్ కానీ ఆలీ కానీ ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడు స్టేజీ ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంటారు. అదే సునీల్ కానీ బ్రహ్మానందం కానీ ఇలా స్టేజ్ హ్యాండ్లింగ్ లో బాగా వీక్ అనుకుంటా. సరే, వేణు మాధవ్ కూడా – నితిన్ ని సీనియర్ హీరో అనీ, మంచు మనోజ్ ని బాగా ఓల్డ్ యాక్టర్ అనీ మోహన్ బాబు ని యంగ్ హీరో అనీ సంభోదిస్తూ యాంకరింగ్ చేసాడు. ఆ తర్వాత విష్ణు వైఫ్ వెరోనికా రెడ్డి(విన్నీ రెడ్డి) ని స్టేజ్ మీదకి పిలిచేటపుడు కానీ కాస్త హ్యూమరస్ గానే నడిపించాడు ఫంక్షన్ ని.

కానీ ఆ తర్వాత నితిన్ స్టేజ్ మీద మాట్లాడేటపుడు చిన్న జర్క్ మొదలైంది. నితిన్ మాట్లాడుతూ కాస్ట్యూం డిజైనర్ గా ఈ సినిమాకి విన్నీ రెడ్డి చేసారు అని అన్నాడు . అప్పుడు మోహన్ బాబు చకచకా నితిన్ దగ్గరికి వచ్చి నితిన్ చేతిలోని మైక్ తీసుకుని “ఇతని పేరు నితిన్ రెడ్డి, అందుకే విన్నీ ని విన్నీ రెడ్డి అంటున్నాడు, మనకెందుకమ్మా క్యాస్ట్ ఫీలింగ్స్” అన్నాడు సరదాగా.నితిన్ కూడా వెంటనే “”అబ్బే నాకసలు లేదు సార్ క్యాస్ట్ ఫీలింగ్” అన్నాడు. బానే ఉంది అక్కడిదాకా. అయితే ఒక్కటి మాత్రం అర్థమైంది-ఎవడు ఏ చిన్న ‘స్లిప్’ అయినా మోహన్ బాబు స్టేజ్ మీదే కుమ్ముతాడు అని.

ఇంతలో వేణు మధవ్ రాజమౌళి ని స్టేజ్ మీదకి పిలవాల్సివచ్చింది. పిలుస్తూ – హ్రీ హీ అని గుర్రం లా సకిలించాడు. మగధీర ని గానీ పొరపాటున ప్రస్తావిస్తాడేమో అనుకున్నా. ఎందుకంటే ఈమధ్య రాజమౌళి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మగధీరని వదలకుండా ప్రస్తావిస్తున్నారు. వేణు మాధవ్ కూడా మగధీర ని ఇండైరెక్ట్ గా గుర్తు చేసినట్టు రాజమౌళి ని పిలిచిన రెండు సార్లూ గుర్రం లా సకిలించాడే తప్పించి తెలివిగా/జాగ్రత్తగా ఎక్కడా ఆ పేరు ప్రస్తావించలేదు. ప్రస్తావించి ఉంటే గనక అయిపోయేవాడేమో. తక్కువలో తక్కువ- “అయిపోయిన సినిమాల గురించి మనకెందుకమ్మా, అవ్వాల్సిన సినిమాల గురించి మాట్లాడుదాం ” అనయినా అనుండేవాడనుకుంటా మోహన్ బాబు :)!!!


స్పందనలు

 1. 🙂

 2. హీరో కొడుకులు హీరోలు అవుతారు
  మోహన్బాబు వేరే వాళ్ళ ఫంక్షన్ లో వాళ్ళనే తిట్టే మనిషి
  సొంత ఫంక్షన్ కదా ఇంకా తిరుగులేదు
  ఇక్కడ తెలివి వేణుమాధవ్ ది కాదు మోహన్బాబు ది
  దాసరి ని పిలవలేదు కదా మొన్న స్టార్ నైట్ దెబ్బకు 🙂

 3. –“అయిపోయిన సినిమాల గురించి మనకెందుకమ్మా, అవ్వాల్సిన సినిమాల గురించి మాట్లాడుదాం ” అనయినా అనుండేవాడనుకుంటా మోహన్ బాబు —
  కరష్టే 🙂

 4. 😀

 5. no wonder everyone thinks twice before talking with/about Mohan Babu……

 6. సినేమా పరిశ్రమలో చాలా గొప్ప హీరో లతో పోలిస్తె మోహన్ బాబు నిజాయితీ గల వ్యక్తి. మిగతా వారంత బయటకు ఒకటీ లోన ఇంకోక విధంగా నడుచుకునే వారు. జనం అనుకునే తన నెగటివ్ పాయింట్స్ ఎక్కడ దాచి పెట్టుకోవాలని అందరి చేత ఎల్ల వేళల పొగిడించు కోవాలని అనుకోడు. కొంతమంది నా మిత్రులు మోహన్ బాబు నడిపే స్కుల్స్ లో క్రమశిక్షణ ఎక్కువా అని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడిని, టిచర్ల ని గౌరవం గా చూసుకుంటారని చెప్పారు.

 7. nijam gaane babu, mohan babu nadipe school bagane chusukuntaru andarini. idi oka angel lo aithe inko angel lo think cheyyaka povatam mana karma. Taj mahal kattatam super aithe daani koraku 20 vela mandi pani valla jeevitham nachanam cheyyatam inko angel. nijalu telusu ko nayana. manchi edhi ante, tanu pradhani ayyina tana koduku application koraku kodukune line lo nilabettnade aadhe nijayathi, manchi ante.

  • Hmm..I have so many friends who did their BTech or MCA at Mohan Babu School..I even had one of my students who worked at his school as faculty..

   This post is not a re-examination of Mohan Babu’s entire life or Mohan Babu’s school or any thing else..this post is JUST about ‘one incident’ in ‘one audio function’ ..!!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: