వ్రాసినది: mohanrazz | 2009/11/16

ఇండియా నుంచి 2009 ఆస్కార్ నామినీ

harishchandrachi_factory

ఆస్కార్ అవార్డ్స్ లో “బెస్ట్ ఫారిన్ ఫిల్మ్” కేటగరీ లో పోటీ పడటానికి ప్రతి సంవత్సరం అనేక ఇతర భాషలనుంచి ఒక్కో సినిమా ని పరిశీలనకి పంపినట్టే మన దేశం నుంచి కూడా ప్రతి సారీ ఏదో ఒక సినిమాని పంపిస్తూనే ఉన్నారు. ఈ సారి ఆ కేటగరీ లో భారత్ నుండి పంపిస్తున్న చిత్రం “హరిశ్చంద్రాచ్చీ ఫ్యాక్టరీ” అనే లో బడ్జెట్ లో తీసిన ఒక మరాఠీ చిత్రం.

కథ విషయానికి వస్తే- ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే గురించి మనందరికీ తెలుసు. రాజా హరిశ్చంద్ర పేరుతో మొదటి భారతీయ పూర్తి నిడివి చలనచిత్రం (మూకీ సినిమా ) తీసిన వ్యక్తి. ఈయన భారతీయ సినీ పరిశ్రమకి చేసిన సేవలకి గానూ “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్” పేరుతో భారత ప్రభుత్వం నెలకొల్పిన అవార్డ్ సినీ పరిశ్రమ కి సంబంధించి అత్యుత్తమ అవార్డుగా భావింపబడుతోంది. అక్కినేని నాగేశ్వర రావు, ఎల్వీ ప్రసాద్ లాంటి తెలుగు వాళ్ళు ఈ అవార్డునందుకున్న తెలుగు వాళ్ళలో ఉన్నారు. ఈ హరిశ్చంద్ర ఫ్యాక్టరీ అనే సినిమా 1912లో “రాజా హరిశ్చంద్ర” అనే తొలి భారతీయ సినిమా తీయడానికి దాదాసాహెబ్ ఫాల్కే పడిన శ్రమ, అసలా సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే ని పురిగొల్పిన సంఘటనలు, దాని నేపథ్యమూ- ఇదీ “హరిశ్చంద్ర ఫ్యాక్టరీ” సినిమా ఇతివృత్తం. మరి హరిశ్చంద్ర “ఫ్యాక్టరీ” అని టైటిల్ పెట్టడానికి కారణమేంటంటే- సినిమాలంటేనే తెలీని ఆరోజుల్లో రాజాహరిశ్చంద్ర అనే సినిమాలో పనిచేస్తున్నామని చెప్పుకోవడం అవమానంగా, ఇబ్బందిగా ఫీలవుతూంటే నటులకీ టెక్నీషియన్లకీ – “ఎవరైనా అడిగితే “హరిశ్చంద్ర ఫ్యాక్టరీ” లో పనిచేస్తున్నామని చెప్పండి ” అని చెప్పేవాట్ట దాదాసాహెబ్ ఫాల్కే. 

     

దాదాపు అరవయ్యేళ్ళుగా సినిమాలు పంపిస్తూనే ఉన్నా ఇప్పటిదాకా ఎప్పుడూ మనకి ఆస్కార్ “బెస్ట్ ఫారిన్ ఫిల్మ్” అవార్డు రాలేదు మరి. అసలు మనదేశం నుంచి ఇప్పటిదాకా 60 కి పైగా సినిమాలు పంపిస్తే (వీటిలో స్వాతిముత్యం, దేవర్ మగన్ (క్షత్రియపుత్రుడు),నాయకన్,బాండిట్ క్వీన్ నుంచి పహేలి, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ దాకా ఉన్నాయి) అక్కడి స్క్రూటినీ లో ఫిల్టరయ్యాక ఆస్కార్ నానిమేటెడ్ ఫిల్మ్ గా నిలబడింది మదరిండియా, సలాం బాంబే, లగాన్ మాత్రమే. చూద్దాం ఈ హరిశ్చంద్ర ఫ్యాక్టరీ ఎక్కడిదాకా వెళుతుందో.


అయితే ఆస్కార్ ఎంట్రీ గా ఈ సినిమాని సెలెక్ట్ చేయగానే మహారాష్ట్ర నవనిర్మాణసేన అధ్యక్షుడు, ఎప్పుడూ అమితాబ్ మీద విరుచుకుపడే రాజ్ థాకరే ప్యానెల్ లో ఉన్న అమితాబ్ బచ్చన్ కి ధన్యవాదాలు తెలియజేసాడు 🙂


Responses

 1. ఫ్యాక్టరీ అని ఎందుకు పెట్టారో ఇప్పుడే తెలిసింది.
  ఈ రేస్ లో తెలుగు నించి గమ్యం కూడా పోటీ పడిందని విన్నాను. హత విధీ.

  • గమ్యమా?? ఇది తెలుగు వరకూ మంచి సినిమాయే కానీ దీన్ని ఆస్కార్ కి పంపిస్తే మోటర్ సైకిల్ డైరీస్ సినిమా అసలు నిర్మాత వచ్చి కాపీరైట్ కింద కేస్ వేసే వాడు కాబోలు.. 🙂

   • మీరు మరీనండి , కేసులు మన వాళ్లకు కొత్తా ? అలవాటై పోయింది … తోలుమందం …

    • కేసులు మన వాళ్లకు కొత్తా ?
     u mean mana blogu vallaka cinema vallaka 😀

     • ఇలా అర్థాలు తీసినందుకు మీపై గూడ కేసు … 😉
      బ్లాగుల్లో ఉండేవి వుతుతి కేసెస్ ..

      సినిమా వాళ్ళపై ఎప్పుడు ఏదో ఒక కేసు చూస్తూనే వున్నాం గా 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: