వ్రాసినది: mohanrazz | 2009/11/17

మా సినిమా ఎందుకు ఫ్లాపయిందంటే-

సినిమా హిట్టయ్యాక ఫలానా ఫలానా కారణాల వల్ల ఈ సినిమా హిట్టయ్యిందనీ, అలాగే ఫ్లాపయినపుడు ఫలానా ఫలానా కారణాల వల్ల ఫ్లాపయిందనీ జనాలు, విమర్శకులు విశ్లేషిస్తూంటారు. జనాల సంగతి ప్రక్కన పెడితే, అసలు ఆ సినిమా తీసిన వాళ్ళు – అందులో నటించిన వాళ్ళు కానీ, సినిమా తీసిన నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఒక్కో సారి వాళ్ళ వాళ్ళ వివరణ చెబుతూంటారు. వాళ్ళు నిజాయితీ గా విశ్లేషించుకుని, అంతే నిజాయితీ గా ఫ్లాపవడానికి కారణాలు చెప్పినపుడు కొన్నిసార్లు జనాల అభిప్రాయం తో ప్రక్కాగా మ్యాచ్ అవుతాయి. కొన్ని సార్లు జనాల విశ్లేషణ కి మించి మరొక క్రొత్త కోణం లో వాళ్ళిచ్చే వివరణ ఉంటుంది. ఆలా కాకుండా వాళ్ళు నిజాయితీ గా కారణం చెప్పకుండా జనాల్ని మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తే మాత్రం జనాలకి సులభంగా అర్థమైపోయి వాళ్ళే నవ్వులపాలవుతూంటారు. కొన్ని సినిమాలు ఫ్లాపయినపుడు ఆయా సినిమాలకి సంబంధించి వాళ్ళు చెప్పిన విషయాలు మీ ముందు పెడుతున్నా. ఏవి నిజాయితీ గా చెప్పిన సమాధానాలో, ఏవి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నాలో కనిపెట్టే మహత్తర అవకాశాన్ని మీకే వదిలేస్తున్నా-

1. ఒక్కమగాడు-

ఈ సినిమా నాకు తెలిసి గత దశాబ్దం లో అతిపెద్ద డిజాస్టర్. పోకిరి వచ్చి ఇండస్ట్రీ హిట్టయ్యాక ఏ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం లో నందమూరి వీరాభిమాని అయిన వైవిఎస్ దర్శకత్వం వహించిన సినిమా కావడం, పాటలు బాగా ఉండటం, తదితర కారణాల వల్ల అంచనాలు భారీగా ఏర్పడ్డాయీ సినిమా మీద. అయితే ఆ తర్వాత, సినిమా దారుణంగా ఫ్లాపయ్యాక- బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో “వై విఎస్ మీద ఉన్న నమ్మకం తో కథ ఏమీ వినకుండా ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా ఫ్లాపయింది” అని సమాధానం ఇచ్చాడు. ఈ స్టేట్ మెంట్ మీద వైవిఎస్ ఏ కామెంటూ చేయలేదు.

2. అందరివాడు

చిరంజీవి ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియెట్ గా మళ్ళీ ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ గ్రాఫ్ పడిపోకుండా శంకర్ దాదా MBBS లాంటి హిట్ ఇచ్చాడు. ఇట్టాంటి హ్యాట్రి తర్వాత వచ్చిన ఈ సినిమా లో అక్కడక్కడా శ్రీనువైట్ల మార్కు కామెడీ ఉన్నా బేసిక్ స్టోరీ బాగా బోర్ కొట్టింది. ఈ సినిమా ఫ్లాపయ్యాక చిరంజీవి-“ఇలాంటి లైటర్ వీన్ సినిమాలు గతం లో (అన్నయ్య) హిట్ అవడానికి ప్రధాన కారణం, పాటలు బాగుండటం, ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడా తగ్గకపోవడం. ఈ సినిమాకి వచ్చేసరికి పాటలు బాగోకపోవడం, హీరోయిన్ తెలుగు ఆడియెన్స్ కి నచ్చకపోవడం అనేవి ఈ సినిమా ఫ్లాపవడానికి ప్రధాన కారణాలు అయ్యాయి”

3. మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది-

 ఈవివి : “ ఈ సినిమా ఫ్లాపవడానికి మొట్టమొదటి కారణం టైటిలే. మా ఆవిడమీద ఒట్టేసి మీ ఆవిడ మంచిది అని చెబితే జనాలు పాజిటివ్ గా తీసుకుంటారనుకున్నా కానీ వాళ్ళావిడ మంచితనం గురించి వీడేంటి చెప్పేది అని నెగటివ్ గా తీసుకుంటారని ఊహించలేదు”

4. ఆటోడ్రైవర్: సురేష్ కృష్ణ: “నేను గతం లో భాషా, ధర్మచక్రం, మాస్టర్ లాంటి సినిమాలు తీయడం వల్ల ఈ సినిమాకి ఆటో డ్రైవర్ అని టైటిల్ పెట్టడం వల్లా జనాలు ఒక మంచి మాస్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేసారు. అయితే అక్కడ ఒక క్యూట్ అంద్ స్వీట్ లవ్ స్టోరీ ఉండేసరికి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు”

5. స్నేహం కోసం- (ఇది ఫ్లాప్ కాకపోయినా సూపర్ హిట్టేమీ కాదు)

చిరంజీవి: “ఆ సినిమాలో డబల్ యాక్షన్ చేసినప్పటికీ, రెండు పాత్రలూ కూడా యజమానికి లొంగిఉండే పాత్రలే కావడం వల్ల జనాలు చిరంజీవి నుండి ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి”


Responses

 1. కొన్ని రొటీన్ కారణాలు:

  ‘మా హీరో ఇమేజ్‌కి సూటయ్యే కథ కాదు’ (ఆ హీరోకి అంతకు ముందు ఒకే సినిమా ఉండుంటుంది. దాంతోనే అతగాడికో ఇమేజ్ వచ్చేసిందనుకోవాలి. తారకరత్న లాంటి వాళ్లకైతే ఒక్క సినిమా కూడా చెయ్యకముందే బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంటుంది!)
  ‘పరీక్షల సీజన్లో విడుదల చేశాం’ (ఆడలేని మద్దెల యవ్వారం)
  ‘కొన్ని కారణాల వల్ల ముందు అనుకున్న విధంగా తియ్యలేకపోయాం’ (ఆ ‘అనుకున్న విధం’ ఏంటో వాళ్లకే తెలీదు)
  ‘ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాం’ (ఏ అంచనాలూ లేని సినిమాకీ ఇలాగే చెబుతారు. అంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో ఊహకీ అందదు)
  ‘టైటిల్ విని మహిళా ప్రేక్షకులు రాలేదు’ (‘పోకిరి’ లాంటి పేర్లు తెగ నచ్చి మహిళా ప్రేక్షకులు పరిగెత్తుకెళ్లారనుకోవాలి)
  ‘సినిమా అంతా బాగుంది కానీ, కామెడీ తక్కువైంది’ (చేప ఎండకపోటానికి కామెడీ పండకపోటం కారణమట. ఇవన్నీ ముందు తెలీదా?)

  • మీరు చెప్పీన రీజన్సు అదుర్సు.

  • 😀

   • పరీక్షల సీజన్లో విడుదల చేశాం’ (ఆడలేని మద్దెల యవ్వారం)
    // ilaantide inkokati- varshaalu paDaTam..

 2. అసలు ఒక్కమగాడు సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా దండగే. అట్టాంటి దారుణమైన సినిమా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. నేను బాలకృష్ణ, సిమ్రాన్ల ఓవర్ ఆక్షన్ చూసి తట్టుకోలేక ఒక 15 నిమిషాల కన్నా ఎక్కువ చూడలేక పోయాను ఆ సినిమా.

  • 15 నిమిషాలు చూశారా? మీరు “ప్రేక్షక రత్న” అవార్డుకు నామినేట్ అవుతారు.

   • మొన్న TV లో వచ్చింది ఆ సినిమా.
    10 min చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. భారతీయుడిని కాపీ కొట్టినా తిన్నగా కొట్తలేకపోయారు.

    • bharateeyudu ni copy kottaalanna basic thought e wrong ee cinema ki!!

     • అంటే లాస్ట్ లో ఓ పది నిముషాలు చూసాను, కొంచం అలా అనిపించింది. అంతే 🙂

      • శతాబ్దపు కామెడీ ఆ సినిమా. అది హిట్టవుతుందనుకున్నానని చెప్పటం బాలయ్య బాబు ఆస్కార్ అవార్డుకి అర్హుడని మనకి పట్టిస్తుంది.

 3. The best Ans was from EVV, he did’t missed his punch.

 4. సినిమా మొదలెట్టేటప్పుడు మా సినిమా లో అని బాగున్నయి, సూపర్ డూపర్ హిట్ ఔతుంది అని ప్రతీవాళ్ళు చెప్తారు. అవ్వగానే ఒకరిమీద ఒకరు చాడీలు చెప్తారు. మన రాజ్యం లో హీరో ని అనే దమ్ములు ఎవరికి లేవు కాబట్టి ఒకవేళ పొరపాటున అన్నా ఇక సినిమా ల మీద ఆశ‌ వదిలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి హీరో ని ఎవరూ ఏమీ అనరు. కాకపొతే హీరో దర్శకుడిని అంటాడు. అతని మీద నమ్మకంతో కథ ఒప్పుకున్న ఫ్లాపు అయింది అని. అలాగే దర్శకుడు హీరోయిన్ ని అంటాడు. అలా ఒకరినొకరు అనుకోవడమేపని.

  ఆ మధ్యెప్పుడో చదివాను. నాగ్ సినిమా అట్టర్ ఫ్లాపు అయ్యక సదా చెప్పింది…. నాకు చెప్పిన‌ కథ వేరు, తీసిన కథ వేరు. నటించినప్పుదే అనుకున్నను ఏమిటో ఇలా తీస్తున్నరు అని. ఇలాంటి సినిమా లో నటించవలసి వచ్చినందుకు బాధపడుతున్నను అని.

  అలాగే గోపిచంద్ కి సినిమా చేస్తున్నప్పుడే హిట్టా ఫట్టా ని తెలిసిపోతుందిత. దాన్ని బట్టె కలెక్షన్స్ చేస్తాడట‌

  ఏమిటో అంతా సినీ’మాయే’

  • *’నాగ’ సినిమా ఫ్లాపు అయినప్పుడు” (నాగ్ కాదు)

 5. ఒక్కమగాడు చిత్రం విడుదలయిన రెండు రోజులకు నేను వ్రాసిన సమీక్ష మీరంతా చదవాల్సిందే..ఇదిగో లింకు..

  http://yvs-yvs.blogspot.com/2008_01_13_archive.html


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: