వ్రాసినది: mohanrazz | 2009/11/18

సంచలనం సృష్టిస్తున్న :) అనితా ఓ అనితా సాంగ్

మొన్నా మధ్య జీ టీవీ చూస్తున్నా. ఒక సంచలనమైన న్యూస్ చూపించాడు. ఏదో ఊళ్ళో ఎవరో గుర్తు తెలీని వ్యక్తి వ్రాసిన ఒక పాట విపరీతమైన ప్రాచుర్యం పొందుతోందనీ, ఆ ప్రైవేట్ ఆల్బం లో పాటలు వ్రాసిన, ఆ ఆల్బం కి సంగీతం సమకూర్చిన వాళ్ళెవరైనదీ తెలియలేదు కానీ ఆ పాట మాత్రం అందరి నోళ్ళలో విశేషంగా నానుతోందనీ, ఆ ఆల్బం రిలీజయిన ఆయా పల్లెల్లో సెలూన్లలోనూ, షేర్ ఆటోల్లోనూ ఈ పాటే మారుమ్రోగుతోందనీ, కొన్ని సార్లు ఆటోల్లో ఈ
పాట ఉన్న క్యాసెట్ లేదంటే ఆటోల్లో ఎక్కడానికి ప్రయాణీకులు సుముఖత చూపించట్లేదనీ ఇలా ఇంకా చాలా చాలా చెప్పి ఆ పాట ని వినిపించారు-

“అనితా ఓ వనితా నా అందమైన అనితా” అంటూ.

పాట బాగానే ఉంది. అద్భుతమైన సాహిత్యమేమీ కాదు గానీ చిన్న చిన్న పదాలతో వ్రాసిన సులభమైన పాట. వినగానే పాడుకోవడానికి సులభంగా ఉండే ట్యూన్. సినిమాల్లో పెట్టినా కూడా “దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే” లాగానో, “నువ్ యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణా” లాగానో ఒక చిన్న హీరో సినిమాలో పడితే కొన్ని రోజులపాటు హిట్ సాంగ్ లాగా నిలబడి ఉండేదేమో అని అనిపించింది. అంతవరకే. అంతే కానీ ఆ పాట లేకపోతే ఆటో ఎక్కము అని జనాలు అనడమూ, సెలూన్లలో 24 గంటలపాటు అదే పాట వినడమూ, జనాలందరూ ఈ పాట తప్ప వేరే ప్రపంచం అక్కర్లేదని కూర్చోవడమూ- ఇదంతా ఖచ్చితంగా టీవీ ఛానెల్ వారి ఒవరాక్షనే.

అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఈ పాట వ్రాసిన రచయిత ప్రేమ విఫలం కావడం వల్ల ఆత్మహత్య చేసికొని ఉండవచ్చన్న రూమర్స్ వినిపిస్తున్నాయనీ ప్రసారం చేశారు. ఆ మరునాడో రెండ్రోజులతర్వాతో, నాగరాజు అనే ఆ పాట వ్రాసిన యువకుణ్ణి బుల్లితెరపైకి తీసుకు వచ్చారు. ఆ పాట వ్రాసిన ఆ కుర్రాడితో ఇంటర్వ్యూలిప్పించారు. పాట ఎందుకు వ్రాయవలసి వచ్చిందో ప్రశ్నించారు. ఇలా ఈ తతంగమంతా మరో రెండు రోజులు నడిపాక నటుడు చరణ్ రాజ్ (మరిచిపోయిన వాళ్లకోసం..ఈయన జెంటిల్ మేన్ సినిమాలో ఇన్స్పెక్టర్)ని రంగం లో కి దింపారు.జీ టీవీ లో ఈ ప్రొగ్రాం చూసి, ఈ పాట వ్రాసిన కుర్రాడికి, సంగీతం సమకూర్చినతనికి తను తీయబోతున్న సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టుగా చరణ్ రాజ్ టీవీముఖంగా ప్రకటించేశారు. ఆయన నిర్మాతా లేక దర్శకుడా లేక నిర్మాత-దర్శకుడా ఈ సినిమాకి, ఆయన ఆల్రెడీ కథ అనుకుని తీయబోతున్న సినిమాకి వీళ్ళకి గీతరచయిత, సంగీత దర్శకుడు చాన్స్ ఇచ్చారా లేక వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికే ఆయన ఈ సినిమా మొదలెట్టారా అనే వివరాలు నాకు అర్థం కాలేదు కానీ ఈ కుర్రాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేస్తున్న దృశ్యాలు, చరణ్ రాజు తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ దృశ్యాలు ఇవన్నీ టీవీలో చూపించారు. ఇక ఆ తర్వాత టీవీ9 రంగం లోకి దిగింది. పాట వ్రాసిన కుర్రాడితో ఇంటర్వ్యూ చేసింది. రూరల్ జాక్సన్స్ అంటూ పల్లెల్లో ఉన్న ఇలాంటి టాలెంట్ మీద ఒక ప్రోగ్రామూ, “నాగరాజు కి అనిత ఇచ్చిన సమాధానమేంటి” అంటూ ఇలా ప్రేమ కోసం పాటలు వ్రాసుకుంటూ బ్రతికి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళ మీద ఒక ప్రోగ్రామూ చేసుకున్నారు. కానీ ఆ పాట వ్రాసిన కుర్రాడు మాత్రం మరీ అమాయకంగా మాట్లాడుతున్నాడు-“చరణ్ రాజ్ సార్ మమ్మల్ని చెన్నై వచ్చేయమన్నాడు. వచ్చాక ఇక్కడ మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, మేము – సార్ ఈ రోజు సినిమా కి వెళ్ళి వస్తాను అని అడిగితే, సరే అలాగే వెళ్ళి చూసిరమ్మని పర్మిషన్ ఇస్తున్నాడు” అని చెబుతున్నాడు. చరణ్ రాజ్ తో జీటీవీలో ముందే మాట్లాడుకుని స్క్రిప్ట్ ప్రకారం ఈ ఎపిసోడ్ ని నడిపి ఆయన్ని రప్పిచారో లేక నిజంగానే చరణ్ రాజే టీవీ చూసి వచ్చాడో మనకి తెలీదు, ఎలావస్తేనేమి సినిమా అయినా నిజంగా తీస్తే చాలు. అలా కాకుండా ఇది కూడా కార్పొరేట్ గేం అయితే మాత్రం ఆ కుర్రాళ్ళు అనవసరంగా ఇబ్బందిపడతారు.

http://www.youtube.com/watch?v=CTSoLfWC9FY&feature=related


Responses

 1. ROFL

 2. మా ఊరు అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీ యువకుడు ఆ పాట రాసి, సంగీతం రూపొందించి, కాలేజీ ఫంక్షన్ లో పాడాడని, ఆ తర్వాత వారం రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు విన్నాను. ఈ మధ్య మళ్ళీ, ఆ యువకుడు చనిపోలేదని అంటున్నారు.

  మధ్యలో టీవీ వాళ్ళూ బయల్దేరారా?

  • అయ్యబాబోయ్ ఇంత కథ జరిగిందా, ఈ గందరగోళమంతా నాకు తెలియనే లేదు :O

 3. //అయ్యబాబోయ్ ఇంత కథ జరిగిందా, ఈ గందరగోళమంతా నాకు తెలియనే లేదు //

  అవును…చాలా పెద్ద కథే జరిగింది 🙂 . యూట్యూబ్ లో “అనిత సాంగ్” అని సెర్చ్ కొడితే అన్ని వీడియోలు వస్తాయని నేనూ ఎక్స్పెక్ట్ చేయలేదు

  //మా ఊరు అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీ యువకుడు ఆ పాట రాసి, సంగీతం రూపొందించి, కాలేజీ ఫంక్షన్ లో పాడాడని, ఆ తర్వాత వారం రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు విన్నాను//
  ఈ పాట వ్రాసింది అనంతపురం అతననీ, శ్రీకాకుళం అతననీ, ఇంజనీరింగ్ కుర్రాడనీ ఇలా ఏవేవో చాలా చెప్పారు..కానీ అవేవీ కరెక్ట్ కాదు..ఆ కుర్రాడి ఇంటర్వ్యూ వీడియో చూడండి.

 4. నేను నిన్న బస్ లో వస్తుంటే ఈ సాంగ్ విన్నాను.నాకు అసలు నచ్చలేదు.ఏ సినిమాలోది అనుకొన్నాను.ప్రైవేట్ సాంగా..

 5. ee paata raasindi naagaraju khammam district kothagudem lo anubose engineering college lo engineering chaduvutunnadu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: