చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రాన్ని వివిధరకాల పథకాలతో ముంచెత్తాడు. ప్రజల వద్దకు పాలన నుంచి శ్రమదానం, జన్మభూమి అంటూ చాలా చాలా పథకాలు ప్రవేశపెట్టాడు. అయితే మనరాష్ట్రం లో ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా తేడా 1% లేదా 2% మాత్రమే ఉంటుందని ఆయనకి బాగా తెలుసు. తమకి ఆల్రెడీ ఉన్న ఓట్ బ్యాంక్ ని పదిలపరుచుకుంటూ ఒక పర్సెంటో రెండు పర్సెంటో కొత్త ఓటర్లని సంపదంచుకోగలిగితే ఎలక్షన్స్ గట్టెక్కడం సులభమవుతుంది ఏ పార్టీకైనా. కాబట్టి సహజంగానే మంచి వ్యూహకర్త అయిన బాబు ఒక మంచి స్కీం ప్లాన్ చేసాడు. “మేధావులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదు కాబట్టి, మేధావులని తటస్థులని రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా” అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఆ తర్వాత రవీంద్ర భారతి లో ఒక ప్రోగ్రాం పెడితే, అప్పటిదాకా టిడిపి కి బహిరంగంగా మద్దతివ్వని కొంతమంది సినీ ప్రముఖులు, ఇంకా ఇతరరంగాలవాళ్ళూ వచ్చారు. ఆ ప్రోగ్రాం బాగానే సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత ఆ సభకి మీరెందుకు వెళ్ళలేదని ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు నాగార్జునని. దానీ సమాధానమిస్తూ నాగార్జున అన్నాడు- “వాళ్ళు మేధావులని, తటస్థులని పిలిచారు. నేను మేధావిని కాదు కాబట్టి మేధావి కేటగరీ లో అక్కడికి వెళ్ళలేదు. ఇక తటస్థులని పిలిచారు. నేను తటస్థున్ని కాబట్టే తటస్థంగా ఉండిపోయాను”
నాగార్జున తెలివైన వాడు మాత్రమే కాదు. జోష్ ఆడియోలో బాలకృష్ణ చెప్పినట్టు నాగార్జున మంచి బిజినెస్ మాన్ కూడా.
సినిమా వాళ్ళ రాజకీయ ప్రవేశం వలన ప్రజలకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. మున్ముందు రాజకీయాల ద్వారా దోచుకోవడం అంత సులువు కాకపోవచ్చు.
By: a2zdreams on 2009/11/19
at 12:51 ఉద.
hey Mohan Raj
I love your website and follow all your posts. You mentioned you wrote some scripts for skits and plays. Me and few other friends, we do some skits in Diwali, Pongal and Ugadi celebration here in usa.
We are thinking of doing a skit for next pongal. If you can share any script with us, that will be great. I promise I will give you the credit for it :).
Thanks
Sri
By: Sri on 2009/11/19
at 1:00 ఉద.
pls check your mail.
By: mohanrazz on 2009/11/19
at 8:39 ఉద.
నాగార్జున తటస్థుడు కాదు, లౌక్యుడు – వాళ్ల నాన్న లాగా. గట్టిగా చెప్పాలంటే ఏ ఎండకా గొడుగు పట్టే రకం.
By: అబ్రకదబ్ర on 2009/11/19
at 4:25 ఉద.
నిజమే.
By: నరసింహారావు మల్లిన on 2009/11/19
at 5:17 ఉద.
నాగర్జున సంగతేమో కాని వాళ్ళ నాన్న నక్క జిత్తుల నాగేశ్వర రావు గారు రాజకీయ నాయకుల తో పోలిస్తె వారికన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. చంద్రబాబు గారిని ఒకటె పొగిడేవారు నేను అతనిని అల్లుడు అని పిలుస్తాను అది ఇది అని. నేను వారి నటనకి మంచి అభిమానిని, ఎందుకో ఈ ముసలి వారి కున్న ఆత్రం, దొంగ బుద్దులు చుస్తే నేటి తరం వాళ్లు ఇటువంటి వారిని చూసే ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్నారనిపిస్తుంది.
By: sri on 2009/11/19
at 9:01 సా.