వ్రాసినది: mohanrazz | 2009/11/24

శేఖర్ కమ్ముల లీడర్- మ్యాటరేంటి, మీటరేంటి??

                                 

 ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ – మూడింటిలో నాకు బాగానచ్చింది ఆనందే. అయితే హ్యాపీడేస్ రిలీజ్ కి ముందు శేఖర్ కమ్ముల మాట్లాడిన కొన్ని మాటలు బాగా నచ్చాయి. “ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన కాలేజ్ సినిమాలన్నిటిలోనూ కుర్రాళ్ళు ‘కాలేజీ బయట ‘ ఎంజాయ్ చేసినట్టు చూపించారు. ఈసారి మొదటిసారిగా నేను స్టూడెంట్స్ కాలేజ్ కి బంక్ చేసి ఎంజాయ్ మెంట్ చేసినట్టు కాకుండా కాలేజీ లో ఉంటూనే, తమచదువులు పాడు చేసుకోకుండా ఎంజాయ్ చేసినట్టు చూపిస్తున్నాను”. నిజమే, హ్యాపీడేస్ లో అలాగే చూపించాడు. సరే, ఇక లీడర్ గురించి శేఖర్ కమ్ముల చెప్పిన సంగతులు-
1. “హ్యాపీ డేస్ అప్పుడు ఆనంద్, గోదావరి సినిమాలు నా కూతుళ్ళ లాంటివి అయితే ఈ హ్యాపీడేస్ సినిమా నా కొడుకు లాంటి సినిమా అని అన్నాను. ఇప్పుడు లీడర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా నా తల్లి లాంటిది”. [బాగుంది. ఇంకా మనం తన అన్న లాంటి సినిమా, నాన్న లాంటి సినిమా, తన గ్రాండ్ మదర్ లాంటి సినిమా, తన తమ్ముడి లాంటి సినిమాలు చూడాలన్నమాట 🙂 . జస్ట్ కిడ్డింగ్. లీడర్ కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది లో నేనూ ఒకణ్ణి]

2. ఫైట్లు, మసాలాలూ లేకపోయినా ఇది మాస్ సినిమాయే. [శివ, గులాబీ లాగా ఛేజింగులూ, లేదంటే చిత్రం లాగా మసాలా సీన్లు లేకుండానే హ్యాపీడేస్ లాంటి యూత్ ఫుల్ తీసిన కమ్ముల ఈ సారి ఫైట్లు లేని మాస్ సినిమా బాగానే తీసివుండొచ్చనిపిస్తోంది ఆయన కాన్‌ఫిడెన్స్ చూస్తే]

3. నా సినిమా చూసి ఎప్పుడూ సరస్వతీదేవి తలమాత్రం వంచుకునిపోదు. అయితే ఈ సినిమా చూస్తే సరస్వతీదేవి నాట్యం చేస్తుంది.[అబ్బో, చూడాలి మరి.]

బాగా చదువుకున్న ఒక కుర్రాడు, రాజకీయాల గురించి ఏమీ తెలియని కుర్రాడు-అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వస్తే – రాజ్యాంగాన్ని చదువుకుని, ప్రజలకి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిజమైన “లీడర్” గా ప్రజలచేత శెభాష్ అనిపించుకోవడమే ఈ సినిమా కథ అంటున్నారు. 


Responses

 1. లీడర్ హీరోయిన్ పిక్ మీరు పెట్టకపోవడం అన్యాయం. రిచా – చాలా బావుంది – ప్రియాంకా దత్తా లాగా.

  • ప్రియాంకా దత్తా అని వ్రాసాను ఇంతకుముందు పొరపాటుగా. ప్రియాంకా చోప్రా.

 2. ఆవకాయబిర్యాని ఆయన తమ్ముడిలాంటి సినిమా అని చెప్పాడుగా శేఖర్ కమ్ముల.ఏదేమయినా ఈసారి ఆయన కాస్త ఎక్కువ మాట్లాడారనిపించింది.

  ఎంత మాట్లాడినా పర్లేదు మంచి సినిమా ఇస్తే చాలు చూడడానికి ఆయన అభిమానులు సిద్ధం గా వున్నారు/ము 🙂

  • ఎంత మాట్లాడినా పర్లేదు మంచి సినిమా ఇస్తే చాలు // well said..

 3. చూడాలి ఎలా తీసాడో కమ్ముల ఈ సారి. అతని సినిమాలలో ఉండే సోల్ మిస్ అవ్వకుండా ఉంటే కచ్చితంగా బావుంటుంది. హీరో బానే ఉన్నాడు.కొంచం హ్యాపీ డేస్ లో రాహుల్ కి పొడువు వెర్షన్ ల ఉన్నాడు. హీరోయిన్ స్తిల్ల్స్ లో నచ్చలేదు సినిమాలో చూడాలి. ఆడియో ఎప్పుడు విడుదల?

 4. ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి హైప్ వచ్చింది like మగధీర !

  interesting to watch political movie without voilence.

 5. ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి హైప్ వచ్చింది like మగధీర // yeah. 100% true

 6. ఏదో ఒకట్లెండి బాబూ, ముందు కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు. ఈ నాగార్జున కొడుకుని,మేనల్లుడు అతని పేరేంటీ ఆ..సుశాంత్, వీళ్ళిద్దర్నీ చూశాక ఈ ఫామిలీ అంటే దడ పట్టుకుంది.

  శెఖర్ కమ్ముల సినిమా అంటే , ఆక్వర్డ్ గా తెలుగు మాట్లాడే మనకు తెలీని నటులెందర్నో కూడా చూడొచ్చు. నేను తప్పక చూస్తా ఈ సినిమా!

 7. Telugu industry got one more good physic hero. He needs to be improved his body language and hope he will not make movies with IMAGE as others do.. Rana, hope he will follow his Babai as a hero. All the best. 🙂

  • hope he will not make movies with IMAGE as others do…//
   yeah..debut movie with shekher kammula..i think that itself talks about what kind of movies he is going to do..

 8. శేఖర్ గారి, వేటూరి గారి మాటలతో ఈ సినిమా expectations చాలా పెరిగాయి. నేను ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. సినిమా విడుదల ఎప్పుడో?

 9. శేఖర్ కమ్ముల చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే మంచి సినిమానే అనిపిస్తుంది. చూద్దాం ఎలాఉంటుందో! . ఆనంద్, గోదావరి బాగుంటాయి కానీ హ్యాపీడేస్ కి అంతలేదు అనిపిస్తుంది.

  • నాకూ మొదటిసారి చూసినపుడు హ్యాపీడేస్ పెద్దగా నచ్చలేదు. బహుశా ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ వల్లనేమో. అయితే ఇప్పటికీ శేఖర్ కమ్ముల సినిమాల్లో నా ఫేవరెట్స్ ఆర్డర్ – శేఖర్ కమ్ముల సినిమాలు తీసిన ఆర్డరే- నం.1 ఆనంద్, నం.2. గోదావరి నం.3 హ్యాపీడేస్. (డాలర్ డ్రీమ్స్ ని వదిలేసాను)

 10. లీడర్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవాళ్లల్లో నేనూ ఒకర్తిని
  నిన్న ‘అంతర్వహినీ’ లో లీడర్ మీద పోస్ట్ పడింది, ఇంకా మోహన్ గారు రాయలేదేమిటా అనుకుంటూ ఉండగానే ఇవాళ రాసేసరు 🙂

  శేఖర సినిమాలలో నాకు చాల నచ్చిన సినిమా గోదావరి, ఇప్పటికి ఒక 20 సార్లు చూసి ఉంటాను. మనసుకి అంత నచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు.
  నిజం-కొట్తుకోవడాలు, గూండాయిజం, కాలేజీకుర్రాళ్ళ తింగరి వేషాలు, లెక్చరర్సు ని మొద్దుల్లా, ఎందుకు పనికిరానివాళ్ళలా చూపించకుండా యూత్ కి నచ్చేలా నీట్ గా బాగ తీసాడు హాప్య్ డేస్ సినిమాని.

  లీడర్ మీద చాలా expectation ఉన్నాయి.

  //ఈ నాగార్జున కొడుకుని,మేనల్లుడు అతని పేరేంటీ ఆ..సుశాంత్, వీళ్ళిద్దర్నీ చూశాక ఈ ఫామిలీ అంటే దడ పట్టుకుంది// …very true 😀
  కానీ రానా బాగున్నాడు చూడ్డానికి.
  చాలారోజులయింది మనసుకి త్రుప్తి కలిగించే సినిమా చూసి…లీడర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో !

  • //నిన్న ‘అంతర్వహినీ’ లో లీడర్ మీద పోస్ట్ పడింది, ఇంకా మోహన్ గారు రాయలేదేమిటా అనుకుంటూ ఉండగానే ఇవాళ రాసేసరు // నేనూ నిన్న చదివాను.అందుకే అక్కడ ఆల్రెడీ చెప్పిన విషయాలు మళ్ళీ ఎందుకని స్కిప్ చేసా గమనించారా 🙂

   • హ హ గమనించాను…మీ తెలివితేటలపై నాకు ఏమాత్రం సందేహం లేదు 😀

 11. లీడర్ ఆడియో రిలీజ్ అయిందని తెలుసు కానీ పాటల లింక్స్ ఎక్కడ దొరకట్లేదు,ఎవరైన ఇవ్వగలరా? please

  • Doregama.com లో ప్రయత్నించారా?

   • online lo aithe andhravilas lo vinochu

    • Thanks పాటలు విన్నాను.
     మాతెలుగుతల్లికి పాట హ్రుద్యంగా వుంది.
     రీమిక్స్ తో ఎంతో refreshing గా వుంది.
     item song కూడా అందంగా వుంది 🙂

 12. పాటలు చాలా బాగున్నాయ్. ముఖ్యంగా టంగుటూరి సూర్యకుమారి (శంకరంబాడి సుందరాచారి) గారి మా తెలుగుతల్లి కి వినగానే మనసంతా పులకరించింది.రెహమాన్ శైలి ఆర్క్ స్త్రైజేషన్ తో మిక్కీ బాగా స్వరపరిచాడు. వేటూరి గారి లిరిక్స్ అదిరాయి.
  “హే సిఎం రాష్ట్రం నీకు ఓకె. 6 పిఎం ప్రాయం నీకు నాకె” కేక.

  • పాటలన్నీ బాగున్నాయి.
   “శ్రీలు పొంగిన జీవగెడ్డై”….అద్భుతంగా ఉంది.
   ఎన్నాళ్లయిందో ఈ పాట విని, ఎప్పుడో చిన్నప్పుడు రేడియో లో విన్నాను.

 13. అన్నీ బానే ఉన్నాయి కాని, హ్యాపీ డేస్ తో శేఖర్ కమ్ముల తెలుగు వాళ్ళకి “చ్చాలా” అని ఒక పెద్ద జబ్బు అంటించాడు. ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడినా (ఫర్ ఉదాహరణ, ఐడియా సూపర్ సింగెర్ లో సుమ) కనీసం రెండు మూడు “చాలా” లు లేకుండా వాక్యం పూర్తీ చెయ్యట్లేదు. మొన్న లీడర్ ఆడియో లో శేఖరే చాలా (పదో పరకో) “చాలా” లు వాడేడు :).


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: