వ్రాసినది: mohanrazz | 2009/11/25

జూనియర్ NTR అదుర్స్ సినిమా ప్రారంభం రోజున… :)

 
కంత్రి సినిమా రెండుమూడు రోజుల్లో రిలీజవుతుందనగా కొబ్బరికాయ కొట్టేసారు ఈ అదుర్స్ సినిమాకి. కంత్రి కాస్త యాక్షన్/మాస్ తరహా సినిమా కావడం వల్లా, కంత్రి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టవుతుందన్న కాన్‌ఫిడెన్స్
వల్లా ఈ సారి కొంచెం కామెడీ తరహాలొ ఉండే ఎంటర్టైనర్ చేయబోతున్నారు వివివినాయక్-NTR కలిసి అని అన్నారు ముందు. అదీ గాక వివి వినాయక్ ప్రీవియస్ ఫిల్మ్ కృష్ణ కూడా మంచి కామెడీ ఎంటర్టైనరే.

ఈ సినిమా మొదలెట్టిన రోజున అందరికీ తెలుసు ఇంకా వాళ్ళకి కథ ఏమీ రెడీ కాలేదు అని.NTR ని మీడియా వాళ్ళు అడిగితే చెప్పాడు- “ఇంకా కథాచర్చలు నడుస్తున్నాయి. నేనయితే కేవలం వివి వినాయక్ గారిమీద నమ్మకం తో మారు ఆలోచించకుండా ఈ సినిమా ఒప్పేసుకున్నాను” అని. బాగుంది. నిర్మాత కూడా ఇది మంచి సూపర్ హిట్ కాంబినేషన్ అనీ అలాంటిదేదో చెప్పాడు. ఇక వివి వినాయక్ వంతు వచ్చింది.

హీరో, నిర్మాతలయితే – ఇంకా కథాచర్చలు జరుగుతున్నాయి అని చెప్పినా నడుస్తుంది కానీ దర్శకుడు/రచయిత అలా చెప్పకూడదు. కానీ ఈ సినిమా ఇలా ఉంటుందనో, అలా ఉంటుందనో కామెడీ గా ఉంటుందనో, యాక్షన్ ఉంటుందనో ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఏం చెప్పాలన్నా అసలు కథ ఒక్క లైనైనా తయారయి ఉండాలి. చూస్తున్నా ఏం చెప్తాడా అని. వివి వినాయక్ చాలా సమయస్ఫూర్తిగా ఒకే ముక్క చెప్పాడు-

“ఈ సినిమా, ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించే ఒక యువకుడి కథగా తీస్తున్నాము, అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి” అని 🙂 . కేక. ఇంకేముంది, యాక్షన్ ఫిల్మ్ తీసినా, హీరోయిన్ ప్రేమ ని గెలుచుకునే సినిమా తీసినా, కామెడీ ఎంటర్టైనర్ తీసినా దేనికయినా సూటయ్యేలా ఉంది ఆయన చెప్పిన ఆ ఒక్క ముక్క. అదీ సంగతి.  అయితే మా ఫ్రెండ్ మాత్రం ఎన్నిసార్లు నిరూపిస్తారబ్బా ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అని..అంటూ నిట్టూర్చాడు!!

ప్రకటనలు

Responses

 1. I can already see the humor with that costumes, NTR following Bramha Nandam. But hopefully they will not mess it up, with extra enthu to elevate hero, And its a challenge to NTR action skills to get comedy timing right.

 2. ఇలా చేసిచేసే ఈ మధ్య సినిమాలలో సీన్లుతప్ప కథుండటం లేదు. మన ఖర్మ.

  • హ్మ్..కరక్టే..నాకు తెలిసి 1994, 95 దాకా కూడా తెలుగు సినిమాల్లో కథ – “కథ ఫార్మేట్” లో నే ఉంది..అయితే హం ఆప్కే హై కౌన్ ప్రభవం తో అన్ని భాషల్లోనూ లైటర్ వీన్ స్టోరీలు వ్రాయడం మొదలెట్టాక – పెద్ద కథ లేకుండా, ఒక లైన్ మాత్రమే స్టోరీ ఉండి మిగతా అంతా సీన్లతో లాగించేసి హిట్టు కొట్టడం మొదలైంది. సూపర్ డూపర్ హిట్టయిన తొలిప్రేమ లో కథ కంటే “సీన్లే” సినిమాకి ప్రాణం లా నిలిచాయి. అయితే శ్రీనువైట్ల “వెంకి” దగ్గరినుండి- బ్రహ్మానందం ఎపిసోడ్ మీద సినిమాలు నడిచేస్తున్నాయి.

   అయితే – ఒక్కటి భూమి గుండ్రంగా ఉన్నట్టే – సినిమా కథలూ మొదలెట్టిన చోటికి వస్తాయి, మళ్ళీ అక్కడినుంచి ముందుకెళతాయి.

 3. కథతో వచ్చిన పెద్ద హీరో సినిమా నాకు తెలిసి “అతడు” మాత్రమే. ఆ తరువాత ఏదీ వచ్చినట్టు లేదు.

  • hmmm పెద్ద హీరో ల సినిమాలు రాలేదు కాని, మంచి కథలతో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి.

   • అవును. ఆశ్చర్యం ఏమిటంటే, మంచి/ఓ మోస్తరు కథలతో వచ్చిన చిన్న సినిమాలు విజయాలను సాధిస్తున్నా కూడ అగ్ర హీరోలు, అగ్ర దర్శకులు, కథ లేకుండా, కొన్ని సీన్ల మీద, డవిలాగుల మీద, వైర్లతో వేలాడే ఫైట్లమీద అధారపడుతున్నారు. గొర్రెదాటు లక్షణం లా ఉంది.

    • నిజమే, కాని పరిస్థితి కొంత మారింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రజలు కూద చిన్న సినిమాలని గుర్తిస్తున్నారు. ఎక్కువ చిన్న సినిమాలు వస్తున్నాయి కూడా

 4. కథ అనేది బ్రహ్మ పదార్ధం . ఎమన్నా అంటే హిట్ ఐన సినిమాలని గౌరవిన్చాలంటారు …

  మన ఆలోచనా తీరు మారెంతవరకు ఇలాంటివి తప్పవు

 5. costume Malfunction alert:
  either NTR OR Bramhi got the ‘kanduva’ upside down, one got the Orange border down, one up … 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: