వ్రాసినది: mohanrazz | 2009/11/25

సాయికుమార్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక్క నంది కూడా ఎందుకు రాలేదు?? :)


తెలుగు లో డబ్బింగ్ కింగ్ అయిన సాయికుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది. రాజశేఖర్ కి సుమన్ కి ఇచ్చే వాయిస్ లో చిన్నపాటి వేరియేషన్ కూడా చూపించేవాడనిపించేది నాకయితే. ఇక డబ్బింగ్ సినిమాలకయితే అమితాబ్ బచ్చన్ (ఖుదాగవా డబ్బింగ్) నుంచి రజనీకాంత్ నుంచి సురేష్ గోపి, మోహన్ లాల్ ఇలా ప్రతి ఆర్టిస్ట్ తెలుగు లో సాయికుమార్ గొంతు తోనే వినిపించారు మనకి. అసలు రాజశేఖర్, సుమన్ లాంటి వాళ్ళ కెరీర్ కుంటుపడటానికి సాయికుమార్ డబ్బింగ్ మానేసాక కొంత కాలం పాటు జనాలు వాళ్ళని వేరే గొంతుల్లో చూడలేకపోవడం కూడా ఒక కారణమే అనుకుంటా. అయితే హీరో గా డీలాపడ్డాక మళ్ళీ ఈ మధ్య ఒకట్రెండు రాజశేఖర్ సినిమాలకి డబ్బింగ్ చెప్పాడు సాయికుమార్.


ఈమధ్య “వావ్” ప్రోగ్రాం కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సాయికుమార్ – ఆ కార్యక్రమమ లో భాగంగా గాయని సునీత తో మాట్లాడుతూ- మీరు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆరు నందులు గెలుచుకున్నారు అని చెబుతూ తన తమ్ముడు రవిశంకర్ కి కూడా ఈమధ్యే నంది వచ్చిందని(వదల బొమ్మాళీ) – నాకు మాత్రం ఒక్క నంది కూడా రాలేదు అన్నాడు. అని ఒక రెండు సెకన్లు పాజ్ ఇచ్చి, ఇన్ని సినిమాలకి పనిచేసిన సాయికుమార్ కి ఒక్కనంది రాలేదా అన్నట్టు సునీత ఆశ్చర్యపోతుంటే, మళ్ళీ తనే అన్నాడు- “నేను డబ్బింగ్ చెప్పడం మానేసాక డబ్బింగ్ ఆర్టిస్ట్ కి నంది అవార్డ్ ఇవ్వడం మొదలెట్టారు..అందుకే రాలేదు” అన్నాడు 🙂


Responses

 1. so sad 😦

 2. ఇప్పుడున్న పర్సనాలీటికి సరిపోయింది కాని, చాలెంజ్ సినిమాలో సాయి కిరణ్ కు ఇంత పవర్ ఫుల్ వాయిస్ అంటే నమ్మకాశ్యంగా వుండేది కాదు.

  వాయిస్ ఆయనకు దేవుడిచ్చిన వరం.

  • ఆయనొక్కడికే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ 🙂 వాళ్ళ నాన్న పిజె శర్మ గారి వాయిస్ కూడా కంచుకంఠమే. తమ్ముడు బొమ్మాళీకి చుక్కలు చూపించాడు..

 3. 1992 – 1999 మధ్యలో కొన్నేళ్లు అరువు గాత్రంతో నటించే నటీనటులకి, రీమేక్ సినిమాలకీ కూడా నంది అవార్డులు ఇవ్వకూడదని నియమం ఒకటి పెట్టారు. అందుకే ‘ఆశయం’లో విజయశాంతికి (అరువు గొంతు వల్ల) అవార్డు రాకుండా పోయిందనేవాళ్లు. దాని దెబ్బతో ఆమె ‘ఒసేయ్ రాములమ్మా’లో మొట్టమొదటి సారి సొంతగా డబ్బింగ్ చెప్పుకుని నంది అవార్డ్ కొట్టేసింది. ఆ తర్వాత ఆ నియమం ఎత్తేసినట్లున్నారు. ఇప్పుడు ఆ నియమం ఉంటే ‘ఉత్తమ నటి’ అవార్డే ఎత్తేయాలేమో 🙂

  • అవును. ఈ నియమం వల్ల నష్టపోయి, ఈ నియమాన్ని దుమ్మెత్తిపోసిన ఇంకో నటుడు మోహన్ బాబు. పెదరాయుడు రీమేక్ అవడం వల్ల “ఉత్తమనటుడు” గా మోహన్ బాబు పేరు ని పరిశీలించలేకపోయరప్పట్లో.

 4. ‘ఒసేయ్ రాములమ్మా’ లొ విజయశాంతి కి డబ్బింగ్ చెప్పింది జయసుధ కాదా ???

 5. 😦 😦


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: