కథ ఏంటి?
1. అజయ్, ఆర్య ఇద్దరూ గీత ని ప్రేమిస్తారు.
2. గీత ఆర్య కంటే ముందు అజయ్ కి ఐ లవ్ యూ చెబుతుంది.
3. అయితే ఆ చెప్పడం మనస్ఫూర్తిగా కాక కొన్ని పరిస్థితుల్లో అలా చెప్పి ఉంటుంది.
4. గీత అజయ్ కి ఐ లవ్ యూ చెప్పిందని తెలిసి కూడా ఆర్య గీత వెంట పడుతూంటాడు. తన ప్రేమ గురించి చెప్తూ గీత ని ఇరిటేట్ చేస్తూంటాడు.
5. గీత అజయ్ లు పెళ్ళి చేసుకుందామనుకుంటే దానికి అడ్డంకులు వస్తే ఆర్య నే కాపాడుతూంటాడు.
6. చివరికి గీత అజయ్ ప్రేమ కంటే ఆర్య ప్రేమ గొప్పదని అర్థం చేసుకుని ఆర్య ప్రేమని అంగీకరిస్తుంది. శుభం.
పైన చెప్పిన పాయింట్లన్నీ ఆర్య సినిమాతోపాటు ఆర్య-2 కి కూడా వర్తిస్తాయి. మరి ఆర్య కి అదనంగా ఆర్య-2 లో ఏమున్నాయి-
1. అజయ్ కి, ఆర్య కి అక్కడ ఏ సంబంధం లేదు. ఇక్కడ ఇద్దరూ చిన్నపుడు అనాధాశ్రమం లో కలిసి ఉంటారు ఫ్రెండ్స్ గా.
2. అక్కడ గీత ఫ్యామిలీ కి కథాపరంగా పెద్ద ప్రాధాన్యం లేదు. ఇక్కడ గీత నాన్న ఫ్యాక్షనిస్ట్. సీమ ఎపిసోడ్ ఒకటి ఉంది.
3. సీమ ఎపిసోడ్ లో అజయ్, ఆర్య కాకుండా మూడో లవర్ ఒకడుంటాడు.
4. అన్నింటి కన్నా ముఖ్యం. ఇక్కడ- ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఆర్య గీత మెళ్ళో తాళి కడతాడు.
కథ సంగతి సరే- సినిమా పరిస్థితి ఏంటి-
కొన్ని సినిమాలు ఉంటాయి. బోర్ కొట్టడం వల్లా, తగినంత ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్లా ఫెయిల్ అవుతుంటాయి. ఇంకొన్ని సినిమాలుంటాయి. అసలు కథే లేకుండా సినిమాలొస్తున్న టైం లో జనానికి నచ్చేదో, నచ్చనిదో కథంటూ ఒకటి ఉంది. కథలో లాజిక్ కరెక్ట్ గా ఉంటుంది. కామెడీ బాగుంటుంది,పాటలు బాగుంటాయి, డ్యాన్సులు కేక ఉంటాయి, ఎంటర్టెయిన్మెంట్ – అన్నీ ఉండి కూడా బేసిక్ స్టోరీ జనాలకి పూర్తి స్థాయి లో కనెక్ట్ అవదు. కొంతమందికి కంపరంగా ఉంటుంది. ఆ స్టోరీ లోని పాయింట్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవకపోవడమే కాక ఆ పాయింట్ వల్ల ఇరిటేట్ అవడం వల్ల సినిమా ని తీవ్రంగా విమర్శిస్తారు. అలా ఎమోషనల్ గా తీసుకోకుండా సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి చూసినవాళ్ళు సినిమా సూపర్ అంటుంటే, బేసిక్ పాయింట్ వల్ల డిస్టర్బెన్స్ ఫీల్ అయినవాళ్ళు సినిమాని ఘోరంగా తిడుతుంటారు. ఈ సినిమా లో హీరోయిన్ కి ఆర్య తాళి కట్టిన తర్వాత కూడా – ఆర్య-అజయ్-గీత అంటూ గేమ్స్ ఆడుతూంటే కొంతమంది తీవ్రంగా హర్ట్ అయ్యారు. సినిమా బయటికొచ్చాక సోషల్లీ ఇర్రెస్పాన్సిబుల్ సినిమా అనీ, పైత్యమనీ తిట్టుకుంటూ వెళ్తూంటే, కేవలం కామెడీ, ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టకుండా సినిమా సాగిపోవడం గురించి చూసినవాళ్ళు బానే సాటిస్ఫై అయినట్టు గా చెప్తున్నారు. ఇదీ సంగతి. కొన్ని సైట్లలో విపరీతంగా విమర్శించిన వాళ్ళు బహుశా ఈ పాయింట్ వల్ల ఇరిటేట్ అయి ఉండచ్చు. అందువల్లే సినిమాని విమర్శించదగ్గదానికంటే విపరీతంగా విమర్శించారు. సినిమా వరకూ వస్తే కొన్ని ఎక్సలెంట్ ఫన్నీ మొమెంట్స్ ఉన్నాయి. ఒకట్రెండు టూమచ్ బోరింగ్ మొమెంట్స్ ఉన్నాయి.
మీరు ఏ కేటగరీ యో నిర్ణయించుకుని దాన్నిబట్టి సినిమా చూడాలావద్దా అనే నిర్ణయం తీసుకోండి.
పిడకల వేట:
హిట్టైన పాత సినిమా పేరొకటి పెట్టి అదే హీరోతో మరో సినిమా తీసేస్తే దాన్ని సీక్వెల్ అనొచ్చా?
By: అబ్రకదబ్ర on 2009/11/30
at 12:59 ఉద.
you know the answer 😀
By: mohanrazz on 2009/11/30
at 8:10 ఉద.
You always convince people to agree with your write up 😀
By: badri on 2009/11/30
at 1:37 ఉద.
🙂
By: mohanrazz on 2009/11/30
at 8:10 ఉద.
విమర్శించే వాళ్ళు బేసిక్ పాయింట్ మిస్సయ్యి అది డైరక్టర్ మీద నేట్టేస్తూన్నారు. మొదటిరోజు ప్రేక్షకులు ఆవేశంతో చూస్తారు కాబట్టి ఈ నెగటివ్ టాక్ వచ్చింది. చూస్తూ వుండండి, కచ్చితంగా సినిమా హిట్ కేటగిరిలోనే నిలబడుతుంది.
By: a2zdreams on 2009/11/30
at 1:46 ఉద.
డ్రీమ్స్ గారు,
మీకు చిరంజీవి మీదనే అభిమానం అనుకున్నా. ఆయన కుటుంబం మొత్తమ్మీదా అని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది 🙂
By: అబ్రకదబ్ర on 2009/11/30
at 6:55 ఉద.
సినిమా హిట్టాఫట్టా మాకు అనవసరమండీ, మాకు నచ్చిందా లేదా అనేదే ఇష్యూ! కిక్ కూడా హిట్టే నాకు నచ్చలేదు మరి!!
By: కె.మహేష్ కుమార్ on 2009/11/30
at 7:40 ఉద.
@a2z
సినిమా నచ్చకపోవడం అనేది- కొన్ని సార్లు సినిమా బోర్ కొట్టడం వల్ల జరిగితే కొన్ని సార్లు బోర్ కొట్టకుండా సినిమా అంతా సాగిపోయినా బేసిక్ పాయింట్ నచ్చకపోవడం వల్ల జరుగుతుంది. ఈ సినిమా నచ్చని వాళ్ళకి రెండో కారనం వల్లే నచ్చలేదు.
By: mohanrazz on 2009/11/30
at 8:14 ఉద.
నాకు సినిమా బోర్ కొట్టలేదు. వచ్చిన హాస్యం కూడా క్షణానికి ఒకసారి మనసు మార్చే హీరో ప్రవర్తన వలన. పాటలు, డాన్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కానీ , సినిమా నచ్చిందని చెప్పలేను. ఆర్య సినిమాతో నాకు తెలియకుండానే పోల్చటం వల్ల కాబోలు. హీరో అతి ప్రేమ పేరుతో ప్రేయసిని , స్నేహితుడిని ఇద్దరినీ ఇబ్బంది కి గురిచేస్తాడు. ఇదే ఆర్య సినిమాలో ఉన్నా , అది కన్విన్సింగా ఉంటుంది. హీరోయిన్ కి వ్యక్తిత్వం ఉన్నట్లు కనపడదు. ఈ సినిమా నాకు అంతగా నచ్చకపోయినా సుకుమార్ మీద గౌరవం మాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో కూడా కొత్తదనం కోసం అతను ప్రయత్నించాలి .
By: venkataramana on 2009/11/30
at 10:03 ఉద.
అబ్రకదబ్ర, yes sir .. I support చిరంజీవి కుటుంబం. But ఇక్కడ నేను సపోర్ట్ చేసేది ఆర్య2 ను.
mohanrazz, you are right. బేసిక్ పాయింట్ నచ్చకపోవడం వల్ల అని అంటే నో ప్రొబల్మం. డైరక్టర్ కన్‌ఫ్యూజ్ అయ్యాడు అంటే సినిమా పిచ్చోళ్ళం అని చెప్పుకునే వాళ్ళ మీద చిరాకేస్తుంది.
కె.మహేష్ కుమార్,
కలక్షన్సే నాకు కొలబద్ద for this kind of movies. Very few movies like బాణం will have exceptions.
venkataramana, your opinion makes sense. జనారంజంకంగా ఒక్క సీను కూడా వ్రాయలేని పోటుగాళ్ళు, సినిమా పొటుగాళ్ళుగా చెప్పుకుంటూ నోటికి ఇష్టం వచ్చ్ఝిన కామెంట్స్ చేస్తుంటే వాటిని చదివి ఏమి చేయలేని పరిస్థితి. దురదృష్టమేమంటే సినిమా హిట్ అయినా వారు ఒప్పుకోరు.
By: a2zdreams on 2009/11/30
at 5:38 సా.
ఇంతటి అవకతవక అస్థవ్యస్థ సినిమా నేనింతవరకు చూడలేదు….irritation తెప్పించే టెంపో సినిమా మొత్తం బాగానే మెంటైన్ చేసారు
By: sowmya on 2009/12/17
at 11:28 ఉద.
సినిమా చూసారన్నమాట. టాక్ లో wide variation ఈ సినిమా కి చూసినంతగా నేను వేరే ఏ సినిమాకీ చూడలేదీ మధ్య కాలం లో.
By: mohanrazz on 2009/12/17
at 1:02 సా.
మీ టపా చూసాకే చూడాలనిపించి చూసాను…బలి అయిపోయాను 🙂
అసలు అర్జున్ అదే ఆర్య పాత్ర కి అర్థంపర్థం లేదు. మొదటి నుండి నెగిటివ్ టచ్ లో చూపించి చివరికి మంచివాడయిపోతాడు. నవదీప్ మొదటి నుండి మంచివాడుగానే ఉంటాడు పాపం తనతప్పేమి ఉండదు ఎందులోను…కాని చివరికి చెడ్డవాడయిపోయి త్యాగశీలి అయిపోయాడు. బ్రహ్మానందం ఎందుకు ఉన్నాడో తెలీదు.మధ్యలో అక్కర్లేని ఫ్యాక్షనిజం ఒకటి.కాజల్ పాత్ర ఒక్కటే కాస్త ఫరవాలేదుగా అనిపించింది….ఏమిటో బాబోయ్ సినిమా చూసాక జుత్తుపీక్కోవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో నన్ను ఇంత విసిగించిన సినిమా మరోటి లేదు.
By: sowmya on 2009/12/17
at 1:33 సా.
హ్మ్…నేనూ చాలా సందిగ్దంగానే వ్రాసాను ఈ టపాని. నలుగురితో మాట్లాడితే ఇద్దరు సినిమా సూపర్ అనీ ఇద్దరు ఘోరమనీ అనడం ఈ సినిమాకి మాత్రమే చూసాను… ఏం పర్లేదులెండి ఇంకా సలీం కో, “కథ” కో వెళ్ళలేదు మీరు…
By: mohanrazz on 2009/12/17
at 2:48 సా.
అవునా :O
సలీం గురించి విన్నాను…కథ కూడా అంతేనా?
By: sowmya on 2009/12/17
at 3:11 సా.
సలీం, కథ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయిట. మూలిగే నక్క మీద తాటిపండు లా రాష్ట్రం లోని బందులు ఈ సినిమాల్ని షెడ్ కి పంపించేసినట్టేనని భోగట్టా..
By: mohanrazz on 2009/12/17
at 3:33 సా.
మూలిగే నక్క మీద తాటికాయ అని మనగురించి చెప్పుకోవాలండీ
అసలే ఈ రాజకీయాలతోటి, రాష్త్ర విభజనతోటి చిరాకుగా ఉంటే హాయిగా చూసి enjoy చెయ్యడానికి మంచి సినిమాలు కూడా లేవు.
TV చూస్తే చిరాకు, పేపర్ చదువితే విసుగు, పోనిలే అని సినిమా చూస్తే తలకే బొప్పి కడుతున్నాది
By: sowmya on 2009/12/18
at 9:53 ఉద.
good commedy and supertwistings and melodious music and exellent dance
By: m.rama mohan on 2009/12/22
at 7:39 సా.
నిజంగా చెప్తున్నారా లేక కామెడీయా 😦
By: sowmya on 2009/12/23
at 11:25 ఉద.