నాగార్జున లేటెస్ట్ మూవీ కి టైటిల్ ముందు రమ్మీ అని అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలీదు- మోసగాడు అని ఇంకో టైటిల్, మాయగాడు అని మరో టైటిల్ తెర మీదకి వచ్చాయి. రమ్మీ అన్న టైటిల్ లో ఉన్నంత ఈజ్, మాస్ (అవును, మాసే), నావెల్టీ మాయగాడు లో కానీ మోసగాడు లో గానీ కనబడలేదు నాకు. అయితే చివరికి “కేడి” అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. ఇది పలకడానికి కొంచెం ఈజీ ఉందని దీన్ని ఖాయం చేసామని నిర్మాత చెప్పాడు. అయితే రమ్మీ అన్న టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసారనీ, ఆ టైటిల్ ని ఇవ్వడానికి 12 లక్షలదాకా డిమాండ్ చేసారనీ నాగార్జున అంటున్నాడు. ఇలాంటిదే సేమ్ ప్రాబ్లెం గతం లో కూడా నాగార్జున ఫేస్ చేసాడు. (ఇక్కడ నొక్కండి).
అయితే ఆ రమ్మీ ప్రొడ్యూసర్- తనకి US లోనూ ఇక్కడా సాఫ్ట్ వేర్ కంపెనీలు, US లో హోటల్సూ ఉన్నాయనీ, రమ్మీ అనే టైటిల్ తో శివాజీ హీరోగా సినిమా తీస్తున్నామనీ, ముందుగా అనుకున్న డైరెక్టర్ బైక్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల సినిమా లేటయిందనీ, ఈలోగా కామక్షీ ఆర్ట్స్ వాళ్ళు లక్ష రూపాయలిస్తాము, టైటిల్ ఇచ్చేయమని అడిగితే మేము సినిమా తీస్తున్నాము కాబట్టి ఆ టైటిల్ అమ్మదలుచుకోలేదని చెప్పామనీ అంతే తప్పించి 12 లక్షలు డిమాండ్ చేయలేదనీ – అంటున్నాడు.
సరే, ఏదేమైతేనేం- డిసెంబర్ సీజన్ ని మాత్రం నాగార్జున వదిలిపెట్టడు. క్రిస్మస్ టైం లో సినిమా రిలీజ్ చేస్తే, మొదటి వారం (సినిమా కనీసమ్యావరేజ్ గా అయినా ఉంటే) కలెక్షన్లు పూర్తయే సరికి క్రిస్మస్ సెలవులు వస్తాయి, ఆ తర్వాత జనవరి 1స్త్ మళ్ళీ పది రోజులు పోతే సంక్రాంతి సెలవులు. సినిమా యావరేజ్ గా ఉన్నా హిట్ గా నిలబెట్టడానికి, హిట్ సినిమా కి సూపర్ హిట్ కలెక్షన్స్ తెప్పించడానికి ఇదే సరయిన సీజన్ (వేసవి సెలవులని మినహాయిస్తే). నాగార్జున మాస్, డాన్, కింగ్ లాంటి సినిమాలన్నీ సరిగ్గ క్రిస్మస్ సీజన్ లోనే రిలీజయి “హిట్టయ్యాయి”. ఈ సారి కేడీ కి కూడా ఇదే మ్యాజిక్ వర్కవుట్ అవుద్దేమో చూడాలి.
యెట్టా… అయన్నీ యిట్టయినయా? యాడబయా? 🙂
By: Indian Minerva on 2009/12/02
at 7:40 ఉద.
మీరు మరీ మస్, డాన్ ని కింగ్ ని ఒకే తాటికి కట్టేస్తే ఎలా?
king is far better than other two films.
నాగ్ fans (నేనే) hurt అవ్వరూ?
i hurt, i want to talk to martaamda right now 😀
By: sowmya on 2009/12/02
at 12:01 సా.
08942-278374, 08942-645664
By: satyam on 2009/12/02
at 3:29 సా.
బాబోయ్, భలే ఇరికించేసారే…..అంత సాహసం చేస్తాననే అనుకున్నారూ? 😀
By: sowmya on 2009/12/02
at 5:22 సా.
@Satyam ..
KEKA
@Sowmya .. ha ha ha
By: badri on 2009/12/02
at 6:07 సా.
ఎంత మోసం, ఎంత మోసం
బద్రిగారూ… మీరు నేను కూడా మోసపోయాం. ఈ దొంగ సత్యం ఎవరో కాదు మన మిత్రుడే
ఇవేవో పిచ్చి నంబర్లు 😀
By: sowmya on 2009/12/03
at 4:29 సా.
పిచ్చి నంబర్లు కాదు,పిచ్చోడి నంబర్లు
కావాలంటే కాల్ చేసి కెలకండి
By: Donga Satyam on 2009/12/03
at 5:59 సా.
వద్దులెండి జీవితంలో అంత పెద్ద రిస్కు తీసుకోవాలని అనుకోవట్లేదు 😀
By: sowmya on 2009/12/04
at 9:32 ఉద.
ha ha ha 😀
By: satyam on 2009/12/04
at 9:38 ఉద.
మాస్, డాన్ హిట్లా? అట్ల కాదు కానీ, ఇంకో మాట చెప్పండి.
By: రవి on 2009/12/02
at 12:24 సా.
ఇంకో మాట
🙂
By: lawrence on 2009/12/02
at 2:42 సా.
నా దృష్టిలో మాస్ అండ్ కింగ్ హిట్స్. డాన్ I doubt.
By: a2zdreams on 2009/12/02
at 8:53 సా.
i agree !
By: sowmya on 2009/12/03
at 3:21 సా.