వ్రాసినది: mohanrazz | 2009/12/03

రామ్ చరణ్ కి గానీ ఆ సినిమా పడితే.. :)

 

ఆ మధ్య ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూంటే అంటున్నాడు ఈ విషయాన్ని. అతనసలే చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్. మగధీర విజయం బహుశా అతన్ని బాగా సంతృప్తిపరిచిందనుకుంటా. మగధీర లో రామ్ చరణ్ చేసిన గుర్రపు స్వారీ దృశ్యాలు, పోరాటాలు అభిమానుల్లోనే కాకుండా మామూలు ప్రేక్షకుల్లో కూడా ఒకవిధమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి చరణ్ కి. బహుశా ఆ ఇమేజ్ వల్లే అనుకుంటా, మా ఫ్రెండ్ అంటున్నాడు- “రామ్ చరణ్ కి ఇంకోసారి కరెక్ట్ ప్రొడ్యూసర్, కరెక్ట్ డైరెక్టర్ పడి, “ది రిటర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్” సినిమా మళ్ళీ మొదలు పెడితే కేక ఉంటుంది అసలు” అని.

చిరంజీవి ఇమేజ్ మంచి పీక్ లో ఉన్నపుడు కొంతమంది ఎన్నారైలు ప్రారంభించారు ఈ హాలీవుడ్ సినిమాని . ఏఆర్ రెహమాన్ సంగీతం. తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ డైరెక్షన్, ఇంగ్లీష్ వెర్షన్ కి మాత్రం అంతా హాలీవుడ్ టెక్నీషియన్స్. ఒక ట్రైలర్ తీసారు. దానికే దాదాపు కోటి రూపాయలయిందట. కొంత భాగం సినిమా తీసాక, బడ్జెట్ ప్రాబ్లెంస్ వల్ల సినిమాని అర్ధాంతరంగా నిలిపేసారు. చిరంజీవి కి ఒక ఇమేజ్ వచ్చింతర్వాత తన సినిమాలేవీ పెద్దగా షూటింగ్ స్టేజ్ లో ఆగిపోలేదు. అశ్వనీదత్ సినిమా ఒకటి – రెండుసార్లు ఆగిపోయింది(రాం గోపాల్ వర్మ ‘చీకటీ, సింగీతం ‘భూలోకవీరుడు ‘). అయితే ఆర్భాటంగా , హాలీవుడ్ సినిమా గా ప్రారంభమైన ఈ “ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాడ్” సినిమా ఆగిపోవడం అప్పట్లో చిరంజీవి అభిమానులకి కొంచెం బాధ కలిగించింది. అయితే మగధీర చూసాక- మళ్ళీ కొంతమంది అభిమానులు స్టార్ట్ చేసారు, ఆ ప్రాజెక్ట్ చేయగలిగే సత్తా రామ్ చరణ్ కి ఉంది అని. రామ్ చరణ్ కి ఉంది సరే, నిర్మాతకి కూడా ఉండాలిగా 🙂 .


స్పందనలు

  1. అప్పట్లో ఆ సినిమా మీద నాకు చాలా ఆశలుండేవి.

    రామ్ చరణ్!!!??? మళ్ళా ఏ రసెల్ క్రోవ్ వో, మెల్ గిబ్సన్ వో అరువు తెచ్చుకుంటాడు. ఎక్స్ప్రెషన్లు.

    • హ హ బాగా చెప్పారు. ఏం చేసిన ఏమి ప్రయోజనం, డైలాగు చెప్పడం సరిగ్గా రాకపోతే. మగధీర లో కూడా ప్రస్థుత జన్మ కథ లో చెప్పిన డైలాగ్సు ఫరవాలేదనిపించాయి. పూర్వ జన్మకొచ్చేసరికే నార్తీస్ట్ (north east) వాళ్ళు తెలుగు మాట్లాడినట్టుగా అనిపించింది. బాడీ లాంగ్వేజ్ సూట్ అయినా డైలాగు డెలివరి లాభం లేదు !

  2. మీకు భలే విషయాలు తెలుస్తాయండీ. పైన చెప్పిన విషయాలలో ఒక్కటి కూడా నాకు తెలీదు. మీరు భలే information సేకరిస్తారు సుమండీ 🙂

  3. http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/04/kcr-atmasakshi-palike/

  4. మోహన్‌రాజ్,

    ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి (06 Dec, Sunday magazine) లో ‘ఇన్‌బాక్స్’ పేజీ చూడండి. మీ లేఖ ఉంది 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: