వ్రాసినది: mohanrazz | 2009/12/07

అదుర్స్ ఆడియో లో మగధీర ప్రస్తావన…

అదుర్స్ ఆడియో ఫంక్షన్ లో షరామామూలుగానే వక్తలందరూ ఈ ఆడియో, ఈ సినిమా హిట్టవ్వాలని అభిలషిస్తూ మట్లాడారు. అయితే Jr NTR యాక్సిడెంట్ తర్వాత వస్తోన్న మొదటి సినిమా కాబట్టి యాక్సిడెంట్ నుంచి బయటపడి, డ్యాన్సులు అద్భుతంగా చేసిన తన విల్ పవర్ గురించీ మాట్లాడారు. అయితే రాజమౌళి మాట్లాడుతూ ఒక మాటన్నాడు- “ఇక్కడ అందరి మనసుల్లో ఒక మాటుంది, కానీ బయటపడటం లేదు..అదేంటంటే – ఈ సినిమా మగధీర రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేదే ఆ విషయం. ఈ సినిమా మగధీర రికార్డులు బ్రేక్ చేస్తుంది,ఎందుకంటే ఇది వివి వినాయక్ సినిమా. ఈ సినిమా ఆ రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాణ్ణి.”

తెలుగు ఇండస్ట్రీ లో మెగా, నందమూరి మధ్య పోటీ ఎప్పట్నుంచో ఉన్నదే కానీ ఇలా ఒకరి ఆడియో ఫంక్షన్ లో అవతలి వాళ్ళ సినిమా ని ప్రస్తావించడం మాత్రం ఇదే మొదటి సారి నాకు తెలిసి. అయితే ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ – “స్పర్థయా వర్ధతే విద్య అంటారు, కాబట్టి ఆరొగ్యకరమైన పోటీ ఎప్పుడూ మంచిదే, రాజమౌళి గారన్నట్టు ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేయాలి, అలాగే ఈ సినిమాని తలదన్నే సినిమా మళ్ళీ వేరేది రావాలి, అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది” అని హుందాతనాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత NTR మాట్లాడుతూ- “ఇందాక రాజమౌళి మాట్లాడుతూ రికార్డులు అవీ అని ఏదో మాట్లాడారు అయితే నాకు రికార్డుల కంటే ప్రేక్షకుల, అభిమానుల రివార్డులే నాకు ముఖ్యం” అంటూ పోటీలు గట్రా అన్నింటికీ అక్కడే తెరదించేసాడు తనవైపు నుంచి.

ఇక అదుర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే- వివి వినాయక్ కృష్ణ సినిమాలో పండించిన తరహా కామెడీ ఈ సారి మళ్ళీ ట్రై చేస్తున్నట్టనిపిస్తోంది కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా మినిమం గ్యారంటీ కి ఢోకా ఉండదు. అయితే కలెక్షన్ల పరంగా మగధీర రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేయకపోవచ్చని నా ఒపీనియన్. మన తెలుగు ఇండస్ట్రీ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలన్నీ “మాస్” సినిమాలే- మగధీర, పోకిరి, ఇంద్ర, సమరసింహారెడ్డి..ఇలా..ఖుషీ, హలో బ్రదర్ లాంటి యూత్ ఫుల్ లేదా కామెడీ సినిమాలు సూపర్ డూపర్ హిట్టయినా టాప్ గ్రాసర్స్ గా నిలబడినట్టు నాకయితే గుర్తు లేదు. అయితే ఏది ఏమైనా అదుర్స్ మంచి ఎంటర్టైనర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి.


స్పందనలు

  1. బాలక్రిష్ణ చాన్నాళ్ళతరువాత చాలాబాగా మాట్లాడాడు.

  2. మోహన్బాబు మళ్ళీ ఏదో కొంచెం రచ్చ చేసినట్టున్నాడు. పూర్తీగా చూడలేదు.

  3. బాలకృష్ణ హుందాగా మాట్లాడాడు. రాజమౌళి మాటలు వారి వారి అభిమానుల మధ్యలో లేనిపోని అపార్ధాలు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. మోహన్బాబు ప్రతిసారీ ఎక్కువ చేస్తుంటాడు.

    • //వారి వారి అభిమానుల మధ్యలో లేనిపోని అపార్ధాలు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి//
      చిచ్చుపెట్టడమంటూ ఏమీ లేదు…”మగధీర డైరెక్టరే ఈ సినిమా ఆ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని” అన్నాడని నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయితే, “నందమూరి వాళ్ళ ఫంక్షన్ లో కూడా మగధీర ని ప్రస్తావించారూ అంటే- మగధీర టాలీవుడ్ నం.1 అన్నదానిమీద ఎవరికైనా ఏ సందేహాలయినా ఉంటే అవి క్లియర్ అయ్యాయని” మెగా ఫ్యాన్సూ హ్యాపీ గా ఫీలవుతున్నారు..

      అయితే ఒక్కటి నిజం- పోటీ లేకపోతే ఇద్దరి సినిమాలకీ ఓపెనింగ్స్ ఉండవు. అదే ఇలాంటి పోటీ ఉంటే ఇద్దరి సినిమాలకీ ఓపెనింగ్స్ భీబత్సంగా ఉంటాయి. Its very simple business tactic అన్నట్టు..

      • ఏమో! బిజినెస్ టాక్తిక్ అయి ఉండవచ్చు.

  4. అదుర్స్ మగధీర రికార్డులు బ్రేక్ చెయ్యకపోటమే కాక, పెద్ద చెప్పుకోదగ్గ హిట్ కూడా అవదని నాకనిపిస్తుంది 🙂 ‘కంత్రీ’ లా లాగించబడొచ్చు.

  5. మందనూరి ఫ్యానులు దాడికొచ్చేసే లోపే చిన్న వివరణ: నేను కిలో స్టార్ గారబ్బాయి ఫ్యానుని కానే కాను. మృగవీర ఉత్తి హైప్ వల్ల హిట్టైన సినిమా అని నా అభిప్రాయం (Ofcourse, చరణ్ బానే చేశాడు + రెండో సగంలో కొన్ని కొన్ని సన్నివేశాలు, చిత్రీకరణ పరంగా, బాగా వచ్చాయి. అంతే)

  6. అబ్రకదబ్ర, ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఫార్ములా అదే సార్.

    ఓపినింగ్స్ కోసం హైప్,
    అభిమానుల కోసం డాన్స్ ,
    కథ ఎవరేజ్ అయినా పట్టుగా సాగే కథనం,
    ఒళ్ళు గగుర్పాటు కలిగించే హైలట్స్ ..

    దీనికి తోడు అదృష్టం(మిగతా సినిమాలన్నీ ప్లాఫ్) కలిసొస్తే ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ ..

    మగధీర రికార్డ్స్ బ్రేక్ చేయడం కష్టమైన పనే కాని, అసలు లేదు అనమాకండి.

    • బ్రేకయ్యే అవకాశం లేదనటం లేదు డ్రీమ్స్ 🙂 ‘అదుర్స్’ కి ఆ సత్తా లేదంటున్నానంతే. నా అపనమ్మకం ఎన్టీయార్ మీద కాదు, వీవీ వినాయక్ మీద.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: