వ్రాసినది: mohanrazz | 2009/12/14

భాగ్యం పొద్దున ఓ కొత్త కథ చెప్పింది…

                                     

ఈ పాట ఎక్కడైనా విన్నట్టు గుర్తొచ్చిందా? దేవకట్టా డైరెక్షన్ లో “ఆనంద్” రాజా హీరోగా వచ్చిన “వెన్నెల” సినిమా లోది. ఆడియో రిలీజయినపుడు ఆడియో లో మొదటి పాట. ఆడియో లో అన్నింటికంటే బాగా హిట్టయిన పాట. తీరా సినిమా విడుదలయాక చూస్తే సినిమాలో ఈ పాట లేదు. బహుశా లెంగ్త్ ఎక్కువయిందని కట్ చేసారేమో అనుకున్నా..అయితే, లెంగ్త్ ఎక్కువయితే ఏదో ఒక పాట అంత బాగోలేనిదాన్ని కట్ చేయాలి కానీ అన్నింటి కంటే హిట్టయిన పాటని, ఆడియో లో కూడా మొదటి పాట గా పెట్టిన పాట ని ఎందుకు కట్ చేసారబ్బా అనుకున్నా..అయితే ఈ పాటనే కట్ చేయడానికో కారణముందని తర్వాత అర్థమయ్యింది.

 

నిజానికి ఈ సినిమా షూటింగప్పుడు రాజా అంటుండే వాడు- ఈ ఎన్నారైలు తమ జీవితం లో సంపాదించిన డబ్బంతా తెచ్చి ఈ సినిమా మీద పోస్తున్నారు, ఈ సినిమా హిట్టవ్వాలి, వాళ్ళకు లాభం వచ్చినా రాకపోయినా వాళ్ళు జీవితమంతా కష్టపడి సంపదించుకున్న డబ్బు లాస్ మాత్రం అవకూడదు అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని. ఈ సినిమలో నాకు బాగా నచ్చింది “క్యారెక్టరైజేషన్స్”. దేవకట్టా ఒకసారి ఇంటర్వ్యూ లో – స్టూడెంట్ కమ్యూనిటీ లోని 90% మేల్ స్టూడెంట్స్ ఈ మూడు కేటగరీల్లో (రాజా, శర్వానంద్, రవివర్మ) ఏదో ఒక దాంట్లో ఇమిడిపోతారు-అని. బహుశా నిజమే అనుకుంటా. బలమైన కేరక్టరైజేషన్స్(మిగతా తెలుగు సినిమాలకి రిలేటివ్ గా) ,కాస్తో కూస్తో కథా బలం, మంచి మ్యూజిక్ అన్ని ఉండీ కూడా సినిమా యావరేజ్ వెంచర్ అయిందే (బహుశా మార్జినల్ ప్రాఫిట్ అయివుండొచ్చు) తప్పించి సూపర్ హిట్ కాలేక పోయింది.

 

అర్బన్ యూత్, స్టూడెంట్స్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఫేట్ మీద “జీవి రేటింగ్” ప్రభావం కూడా బాగానే ఉంది. మామూలు బి సి సెంటర్లని టార్గెట్ చేసి తీసే మాస్ సినిమాలకి జీవి రేటింగ్ తో పనిలేదేమో కానీ ఈ సినిమా రిలీజయిన టైం లో ఇలాంటి అర్బన్ యూత్ ని, హై-క్లాస్ స్టూడెంట్స్ ని (అనగా పదో తరగతి, తొమ్మిదో తరగతి స్టూడెంట్స్ కాదు అని భావం)టార్గెట్ చేసే ఇలాంటి సినిమాలకి జీవి రేటింగ్ బాగానే “పని చేస్తుంది”. అందుకే దేవకట్టా విరుచుకుపడ్డాడు- “ఆయనకి (జీవి కి) లక్షో, లక్షన్నరో ఇస్తే తప్ప ఫేవరబుల్ రివ్యూ వ్రాయడు. మొత్తం వెబ్ రివ్యూలన్నీ పాజిటివ్ గా వస్తే, జీవి గారు, ఈనాడు లో సమీక్షించిన ఒకాయన మాత్రం నెగటివ్ గా వ్రాసారు. ఆ ఈనాడు లో సమీక్షించిన అతనితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆయన కుమారుడు US లో ప్రస్తుతం చదువుతుండడం వల్ల ఈ సినిమా కి పాజిటివ్ గా రివ్యూ వ్రాస్తే US లో స్టూడెంట్స్ గురించి నేను చూపిన కొన్ని అంశాలు వాళ్ళ కుమారుడికీ వర్తించినట్టవుతుందన్న భయం తోనూ, కట్నం రాదేమోనన్న భయం తోనూ ఈ సినిమా భారత సంస్కృతి ని దెబ్బతీస్తుందనీ ఏదేదో వ్రాసాడు…But this movie is just a love story..it is not a movie about indian culture or anything.. ”  
 అని పబ్లిక్ మీడియా ముందు విరుచుకుపడ్డాడు. అయితే ఏదైతేనేం సినిమాకి జరగాల్సిన డేమేజీ కొంతవరకూ జరిగిపోయింది.

సరే, ఈ పాట గురించి వస్తే ఈ పాట లిరిక్స్ లో ఇలా ఉంటాయి..


“నాయుడు గారి పాప రెడ్డిబాబు లవ్వూ
రెడ్డిగారి పాప నాయుడు బాబు లవ్వూ..


చౌదరిగారి పాప శాస్త్రిబాబు లవ్వూ
శాస్త్రిగారి పాప చౌదరిబాబు లవ్వూ..”     

http://www.youtube.com/watch?v=9b0Xft3UT5w


అయితే అసలే చిన్న సినిమా, ఈ లిరిక్స్ గనక సెన్సార్ లో ఇరుక్కుంటే రిలీజ్ లేటయి, మొదటికే మోసం వస్తుందేమోనని భయపడి యూనిట్ వాల్లే ఈ పాటని కట్ చేసార్ట. అదీ సంగతి.


ఏది ఏమైనా దేవకట్టా రెండో సినిమా “ప్రస్థానం” ట్రైలర్ చూస్తే బాగానే ఉన్నట్టనిపిస్తోంది.


స్పందనలు

  1. ఆ సినిమాలొ పాటలన్ని బావుంటాయి .అందులొ నాకు బాగా నచ్చింది ఈ పాటే.. (అసలు నచ్చింది ఈ లిరిక్స్ )

  2. ఈ జీవి రేటింగ్ గురించి నేను విన్నవీ కన్నవీ చూస్తే దర్శకుడు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకైతే. కొన్ని అబ్సర్డ్ సినిమాలకు మంచి రేటింగ్ ఇవ్వడం, స్టార్ సినిమాలు బాలేకపోతే( కాస్త గామున ఉండడం -సలీం చూడండి – గట్రా). మొదట్లో చూసేవాణ్ణి గాని ఇప్పుడైతే వరస్టుగా తయారైంది.

  3. http://priyamainamaatalu.blogspot.com/2009/12/blog-post_13.html

    congrats you are the No.1

  4. ఈ పాట నాకు ఇదివరకు రింగు టోను. సినిమా చూడలేదు.

  5. ఈ సినిమా బాగుంటుంది.. బహశా రేటింగ్స్ కూడా ఒకకారణమై ఉండచ్చు పెయిల్యూర్ కి.

  6. I like this movie a lot. I like “Preyasi kaavu. Nestam kaavu” song. I really felt the US life showin in this movie is really correct.

    Hit aite baagundedi bhaiyaa!

  7. […] లింక్ ఇక్కడ.. […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: