వ్రాసినది: mohanrazz | 2009/12/18

7 habits of highly effective people లో :)

 


ఇంటర్మీడియెట్ లో ఉన్నపుడొకసారి యండమూరి మీద అభిమానం తో విజయానికి 5 మెట్లు
అనే పుస్తకాన్ని చదివాను. అందులో ప్రస్తావించాడీ పుస్తకాన్ని. “స్టీఫెన్ రాబర్ట్
కోవే వ్రాసిన ఈ 7 habits of highly effective people అనే పుస్తకాన్ని తెలుగులోకి
అనువదించడానికి రైట్స్ కోసం ఆయనకి ఉత్తరం వ్రాసాను, ఆ పర్మిషన్ వచ్చేయగానే
ఆ పుస్తకాన్ని తెలుగులో అందిస్తాను” అని. అయితే యండమూరి నుంచి ఆ తర్వాత ఆ
పుస్తకం ఏదీ రాలేదు మరి. సరే, యండమూరి ప్రస్తావించాడు కదా అని ఆ
పుస్తకాన్ని చదువుదామని ప్రయత్నిస్తే పుస్తకం దొరకలేదప్పట్లో మా వూరి
పరిసరప్రాంతాల్లో. ఇక నేనూ ఆ విషయాన్ని మరిచిపోయాకెప్పుడో- ఇంజనీరింగ్ లో
ఉన్నపుడు దొరికింది ఈ పుస్తకం. సరే, చదివాను. ఈ పుస్తకం ఎలా ఉంది, మిగతా
సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలకీ దీనికీ తేడా ఏమిటి, ఇది ఎందుకు ఆ రోజుల్లోనే పది
మిలియన్లకి పైగా కాపీలు అమ్ముడుపోయింది లాంటి విషయాల మీద
తర్వాతింకెప్పుడైనా తీరిగ్గా లోతుగా చర్చిద్దాం కానీ ఇప్పుడింకో చిన్న డౌట్ మీతో
పంచుకుంటా 🙂


ఆ పుస్తకం చదువుతున్నపుడు మా రూం కి వచ్చిన జూనియర్ ఒకబ్బాయి- “భయ్యా
భయ్యా నీ దగ్గర భలే పుస్తకాలుంటాయి, నువ్వు చదివాక నాకూ ఇవ్వవా, నేనూ
చదివిస్తా” అనడిగాడు.అసలే ఆ అబ్బాయి మనల్ని కాస్తో కూస్తో- తన ఫ్రెండ్ కం
ఫిలాసఫర్ కం గైడ్ కం కొశ్చెన్ బాంక్ కం టెస్ట్ పేపర్ గా భావిస్తాడు కాబట్టి-
చదవడం అయిపోగానే ఆ అబ్బాయికి పుస్తకమిచ్చేసాను. ఆ అబ్బాయి
తిరిగిచ్చేటపుడడిగాను..ఎలా ఉందీ పుస్తకం అని. “పుస్తకం బాగానే ఉంది కానీ
భయ్యా పుస్తకం లో నాకో డౌట్ ఉంది” అన్నాడు. మతాబులా వెలుగుతున్న మా వాడి
ముఖాన్ని చూస్తే ఏదో క్యాచ్ చేసినవాడిలాగున్నాడు అనిపించింది నాకు 😀


నిజానికి ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తకం లో ఒక పాయింట్ చెప్తాడు కోవే Win/Win గురించి. ఒక త్రిభుజం లో భూమి మీద ఉన్న రెండు శీర్షాల లాగా ఇద్దరు వ్యక్తులు/రెండు సమస్యలు 
ఉన్నార(య)నుకుందాం. అవతలి వ్యక్తి కి మనదారిలోకి రావడం ఇష్టం లేదు, మనకి
అవతలి వ్యక్తి దారిలోకి రావడం ఇష్టం లేదు. నిజానికి అలాంటుపుడు ఇద్దరూ కలిసి
విన్/విన్ మెంటాలిటీ తో ఆలోచిస్తూ పరిష్కారం వైపు పయనిస్తే అప్పుడు త్రిభుజం
లోని మూడో శీర్షం ఎలాగైతే ఈ భూమి మీద ఉన్న ఈ రెండు శీర్షాల దారిలో
కాకుండా – రెండింటి కంటే ఉన్నతమైన ఒక శిఖరాగ్రం మీద ఉంటుందో- అలా
ఇద్దరికీ కూడా వాళ్ళకి కావల్సిన దాని కంటే ఉన్నత ప్రతిఫలం లభిస్తుంది అని
విశదీకరిస్తాడు. ఆ ఎగ్జాంపుల్ చాలనట్టు ఇంకో “లైవ్ ఎగ్జాంపుల్” కూడా ఇస్తాడు- ఒక
ఫ్లాట్ లో ఇద్దరు వ్యక్తులుంటున్నారు, వాళ్ళిద్దరికీ చిన్న గొడవెప్పుడూ- కిటికీ
తెరవమని ఒకడు, కిటికీ మూయమని ఒకడు. ఆ తర్వాత ఇద్దరూ విన్/విన్ మెంటాలిటీ
తో ఆలొచించి చర్చించుకున్నారు. “అసలు నువ్వు కిటికీ ఎందుకు మూయాలనుకుంటున్నావ్”
అడిగాడు మొదటి వాడు. “నాకు వెలుతురు పడటం ఇష్టముండదు, ఇంతకీ నువ్వెందుకు
తెరవాలనుకుంటున్నావ్” అడిగాడు రెండోవాడు. “నాకు ఫ్రెష్ ఎయిర్ కావాలి” అన్నాడు
మొదటివాడు. ఇద్దరూ కలిసి ఒక విన్/విన్ పరిష్కారానికి వచ్చారు. కిటికీ తెరిచి
దానికి కర్టెన్స్ వేసారు. ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కానీ వెలుగు రాదు. ఇదీ
విన్/విన్ పరిష్కారం. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చాలకపోతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా
ఇచ్చాడు కోవే, తన పర్సనల్ లైఫ్ లోనుంచి. కోవే వాళ్ళ అమ్మ కోవే ఫ్యామిలీ ఉండే ప్లేస్
నుంచి ఒక గంట కార్ డ్రైవ్ దూరం లో ఉంటుంది వేరే ఫ్లాట్ లో. కోవే రోజూ అమ్మతో
మాట్లాడుతూంటాడు ఫోన్ లో, ప్లస్ వారానికోసరి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఓ గంట
తనతో స్పెండ్ చేసి, చూసి వస్తూంటాడు. అయితే పోనూ గంట, రానూ గంట + అక్కడ
ఒక గంట అలా వారం లో మొత్తం మూడు గంటలు వాళ్ళమ్మ కోసం స్పెండ్ చేస్తుంటే- కోవే
వాళ్ళావిడ- కోవే తనతో స్పెండ్ చేస్తున్న సమయం తగ్గిపోతున్నందుకు కాస్త
ఫీలయ్యిందట. అప్పుడు కోవే విన్/విన్ మెంటాలిటీ తో ఆలోచించి ఒక పరిష్కారం
కనుక్కున్నాడీ సమస్యకి. బుధవారం కోవే వాళ్ళావిడ చర్చ్ లో Choir కి వెళ్తుంది.
తను వెళ్ళడానికి, అక్కడ కాయిర్ చూసుకుని తిరిగి రావడానికీ అంతా కలిపి
రమారమి మూడు గంటలు పడుతోంది. సో వెంటనే కోవే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళే తన
ప్రోగ్రాం ని బుధవారానికి మార్చేసుకున్నాట్ట. అలా వాళ్ళావిడ కి తన టైం
తగ్గించకుండా వాళ్ళమ్మకి తన టైం ని కేటాయిస్తూ విన్/విన్ పాటించాట్ట.


మా జూనియర్ కూడా ఇదే విషయమై తన సందేహాన్ని వెలిబుచ్చాడు- “భయ్యా నాకు
తెలీకడుగుతా… కోవే ఏమో వాళ్ళమ్మని తెచ్చి ధైర్యంగా తనింట్లో పెట్టుకోలేడు.
ఎందుకంటే తన మూడు గంటల టైం తీసుకుంటేనే “అఫెండ్” అయిన కోవే వాళ్ళావిడ
వీళ్ళ ఫ్లాట్ లో ఒక రూమిస్తే కోవే ని కుమ్మడం ఖాయం..సరే..అమ్మని తెచ్చి ఇంట్లో
పెట్టుకోకపోతేమాన్లే…ముసలావిడ అక్కడెక్కడో ఒక్కటే ఉంటోంది..వారం మొత్తమ్మీద
ఒక మూడు గంటలు కోవే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు… ఆమె ఎలాగూ ఈయనతోపాటు
రాదు..ఆ మూడు గంటలు కూడా తన టైం లోంచి పోకూడదు అని ఆమె కక్కుర్తి పడితే  
దానికి ఈయన విన్/విన్ సొల్యూషన్ చూసేదేంది భయ్యా 😦 ..దానికి మళ్ళా ఎఫెక్టివ్,
హైలీ ఎఫెక్టివ్ ఏంది భయ్యా నాకర్థం కాక..” అన్నాడు…నేను కామ్ గా ఉంటే..”చెప్పు భయ్యా ఏమంటావ్
నువ్వు..” అన్నాడు మళ్ళీ.


ఇంకేమంటాం..క్లైమాక్సయ్యాక రావుగోపాల్ రావు చిరంజీవికిచ్చే ఎక్స్ప్రెషన్ లాంటిదొకటిచ్చి
తన చేతిలోనుంచి బుక్ తీసుకుని గూట్లో పెట్టా 🙂 . అదీ సంగతి.


స్పందనలు

  1. //తన ఫ్రెండ్ కం
    ఫిలాసఫర్ కం గైడ్ కం కొశ్చెన్ బాంక్ కం టెస్ట్ పేపర్ గా ….//
    😀

    //.క్లైమాక్సయ్యాక రావుగోపాల్ రావు చిరంజీవికిచ్చే ఎక్స్ప్రెషన్ లాంటిదొకటిచ్చి
    తన చేతిలోనుంచి బుక్ తీసుకుని గూట్లో పెట్టా//
    😀 😀

  2. రసపట్టులో తర్కంకూడదని అందుకే అంటారేమో!!!

    • హ హ హ బాగా చెప్పారు

      రసపట్టులో తర్కం కూడదు కానీ భాధ్యతకి సమయాసమయాలు కూడదు కదా 🙂

  3. ఓ సారి ఇక్కడికెళ్ళండి.

    • @ Ravi.. అక్కడ ఈ కామెంట్ (ఫిబ్ర 23, 2009) నాదే బాసూ..
      //బాగుంది. ఆల్ మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో పోస్ట్ వ్రాయబోతూ దీన్ని చూసాను. కాకతాళీయం.//

    • కత్తిలా రాసారండి మురళీగారు…చచ్చాను నవ్వలేక 😛 😀

  4. హ హ హ నిజమే కదా…వారనికి మూడు గంటలు కూడా గడపలేడా అమ్మతో. ఆ మూడు గంటలు కూడా భార్యకి భయపడి చావాలా?

    నాకెందుకో ఈ కోవే బ్రతకనేర్చినవాడనిపిస్తుంది..

    చేసిన చెత్తపనిని గొప్పగ, ఏదొ మీ జూనియర్లాంటి వాళ్ళకి తప్ప అర్థంకాని విధంగా పుస్తకంలో ప్రచురించాడంతే ఈ కోవె మాహా గొప్ప లౌక్యుడు సుమండీ 😀

  5. నా దృష్టిలో మాత్రం వ్యక్తిత్వ వికాస మన్నది మన ఆలోచనల్లోంచి పుట్టాలంటాను. అందుకనే నేను వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవను, ఒక వేళ చదవడం జరిగితే అలా చదివి మరిచిపోతాను.

  6. “విజయానికి ఐదు…” రచయితగారి ప్రతిభ ఇంకా ఉంది. Of course ఈ విషయం చాలామంశదికి తెలిసేఉండొచ్చు. ఈయనగారు ఆంగ్ల నవలలే కాదు. మన యుద్దనపూడి సులోచనారాణి నవలలను ghost nameతో తమిళంలోకి అనువదించి డబ్బుచేసుకున్నాడు. తర్వాత ఆ విషయం బయటపడి యుద్దనపూడి కోర్టులో దావా వేస్తే క్షమాపణ చెప్పి…ఆమెకు కొంత పరిహారం కట్టి తప్పించుకున్నాడు. ఈ విషయం అప్పట్లో హిందూ పేపర్లో కూడా వచ్చింద

    –శ్రవణ్

    • అవును ఈ విషయం నేను పేపర్లో చదివాను. యద్దనపూడి వారి నవలలు అక్రమంగా అనువదించాడో లేక కొంత మంది ఇతర రచయితల చేత అనువదింప చేసాడో అని ఆరోపణ వచ్చింది. ఆమెకు క్షమాపణ చెప్పి, జరిమానా కట్టాడన్న తెలియదు.

    • ఓహో ఆ కథ కూడా నడిచిందన్నమాట! ఏవరో అమ్మాయి ప్రేమ పేరుతో ఈయన వెంటబడి చివరకు ఆత్మహత్య చేసుకుందని కూడా ఓ కథ విన్నా నేను.

  7. boy! so many judgemental people around here 🙂 how can you judge humanrelations/people in a different culture from the eyes of your culture? Its plain wrong.
    వాళ్ళ సంస్కృతిలో మనలా అమ్మలూ, నాన్నలూ పద్దెనిమిదేళ్ళు రాగానే ఇంట్లోంచి తన్ని తగలేస్తారు(చాలా మట్టుకు). అలాగే మనలా ఇరవై దాటాకా ఉద్యోగం చేస్తూ కూడా అమ్మానన్నలతో ఉంటే ఒక loserగా భావిస్తారు. మరి అది సరైనదేనా? infact,ఐశ్వర్యారాయ్ జేలెనో షోకి వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటి ప్రశ్నే అడిగారు. ముప్ఫయేళ్ళైనా ఇంకా అమ్మానాన్నలతో ఉంటావా? ఆడియెన్స్ అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు మరి. 🙂 సో, ప్రస్తుతానికి కోవె ని క్షమించి వదిలేయండి..

    • సారీ..పైన అభిప్రాయంలో..మనలా తరువాత ఒక లైన్ ఎగిరిపోయింది. what I meant was వాళ్ళ సంస్కృతిలో అమ్మా నాన్నలు చదివించి, ఉద్యోగం వచ్చే వరకు ఇంట్లో ఉంచుకొని పోషించరు. పద్దెనిమిది దాటగానే బయటకి పంపిస్తారు.

  8. I am not sure where the author is exposed to US culture or not, but what “budugoy” said is true. You have to see the author from his own perspective and from his cultural view. You cannot judge Covey from your viewpoint.

    • I am not sure where the author is exposed to US culture or not//

      ఈ ఇన్సిడెంట్ నా ఇంజనీరింగ్ టైం లో జరిగింది అని చెప్పడం జరిగింది- కాబట్టి- ఇంజనీరింగ్ పూర్తవక ముందయితే నాకు US ఎక్స్పోజర్ లేదు 🙂 అయినా – the content I posted is supposed to be a lightervein stuff rather than a debate on cultural differences ..!!! let’s just chill out !!!

  9. మీ ఫ్రెండ్ కు నా సమాధానం:
    మన పేరెంట్స్ ను “మాపై ప్రేమ ఎక్కువా ? మీ పేరెంట్స్ పై ప్రేమ ఎక్కువ ?, ఇద్దరూ సమానమే అని మాత్రం అనవద్దు” అని అడిగితే ఏమి సమాధానం వస్తుంది ?

    వారు చెప్పిన సమాధానం మనం చెపితే మన పేరెంట్స్ ఒప్పుకోరు.

    అలాగే, భార్య – తల్లి మధ్య మగాడు ఎప్పుడో ఒకప్పుడు ఒత్తిడికి లోను కావాల్సిందే.

    అది ఆ పుస్తకం వ్రాసిన రైటర్ అనుభవం. అటువంటి అనుభవమే అందరికి వుండాలని రూల్ లేదు. కాని భార్య – తల్లి లకు సంబంధించి ఏదో ఒక ఒత్తిడి వుంటుంది. చిన్న చిన్న కాంప్రమైజస్ తో ఎక్కువ ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు అనేది రైటర్ భావం.

  10. ha ha ha .. good question. Your junior should send that question to Covey.

    BTW, an official Telugu version of this book (being Marketed by Covey’s own company) is now available in book stores. Forgot to check who did the translation.

  11. 🙂
    కోవీ చాలా బాధ్యతాయుతమైన కొడుకులా అనిపిస్తుంది 🙂
    తెలుగులో అనువాదంలోనైనా స్థానిక ఉదాహారణలు ఇచ్చారో లేదో మరి!!

  12. కేక!

  13. chala bagundi, nenu kuda ee pustakam chadivanu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: