వ్రాసినది: mohanrazz | 2009/12/21

అవతార్ ఎలా ఉంది….

ఒక సినిమా ని సమీక్షించడం అనే ప్రక్రియ పర్పస్ – సినిమా చూడవచ్చా లేదా అని పాఠకుడికి కొంచెం ఇంఫర్మేషన్ ఇవ్వడమే అయితే- ఈ సినిమాకి సమీక్ష అక్కర్లేదు, ఒక్క ముక్క చాలు 🙂 – “అర్ఝంటుగా వెళ్ళి చూసేయండి. మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్లో”.  

నిన్న చూసానీ సినిమాని. మీకు గ్రహాంతరవాసుల సినిమాలంటేనే పరమ ఎలర్జీ, అసహ్యం, సైన్స్ ఫిక్షన్ అంటే భరించలేనంత తలనొప్పి, గ్రాఫిక్స్ అంటే ఏవగింపు – బలంగా ఉంటే తప్ప ఈ సినిమా మీకు నచ్చకుండా పోయే అవకాశం లేదు. మహా అంటే కొంత మందికి కొంచెం ఎక్కువ గా నచ్చితే, ఇంకొంతమందికి కొంచెం తక్కువగా నచ్చవచ్చు.

సినిమా కథేంటి, అదెలా ఉంది అనే విషయాలు ప్రక్కన పెడితే- ఒకటి గుర్తు చేయాలి. ఆ మధ్య బాలీవుడ్ లో “బ్లూ” సినిమా రిలీజైనపుడు..లేదా ఇంకొన్ని బాలీవుడ్ సినిమాలు రిలీజయినపుడు- తెలుగు లో మగధీర లాంటి సినిమాలప్పుడూ, తమిళ్ లో కొన్ని శంకర్ సినిమాలప్పుడూ – మనకి ఒక మాట వినిపిస్తూంటుంది సాధారణంగా- “ఈ సినిమా టెక్నికల్ గా హాలీవుడ్ స్థాయి లో ఉంది” అని. ఇంక ఈ “అవతార్” సినిమా చూసిన తర్వాత మరో ముప్పై ఏళ్ళు (తక్కువలో తక్కువ ఇరవై ఏళ్ళు??) ఇండియాలో ఇంకెవరూ – మా సినిమాలో టెక్నికల్ వాల్యూస్ హాలీవుడ్ స్థాయి లో ఉన్నాయి అని అనరు . అంతవరకూ గ్యారెంటీ 😀

 
మామూలుగా గ్రహాంతరవాసుల సినిమాలంటే- ఎప్పుడూ – గ్రహాంతరవాసుల వల్ల భూమికి ప్రమాదమున్నట్టు, మానవజాతికి ప్రమాదమున్నట్టు, మనిషి తనని తాను గ్రహాంతరవాసుల నుంచి రక్షించుకోవడానికి పోరాడినట్టూ- ఇంతే ఉండేవి మన ఆలోచనలు. అలా కాకుండా- మనిషి వల్లే గ్రహాంతరవాసులకి ప్రమాదుమున్నట్టూ..వాళ్ళ గ్రహానికి ప్రమాదమున్నట్టు.. వాళ్ళు తమని తాము రక్షించుకోవడానికి- వాళ్ళ శక్తి చాలకపోయినా, సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంటే-ఆడియెన్స్ అందరూ వాళ్ళ పక్షానే బలంగా emapthise అయ్యేలా చేయడమే – కేక అసలు..అయినా వ్రాస్తూ పోతే అలాగే మొత్తం వ్రాసేట్టున్నాను….అర్జంటుగా చూసేయండి ముందు..మళ్ళీ మాట్లాడుకుందాం..


స్పందనలు

  1. అగ్రీడ్!

  2. Yes

  3. Saturday I Saw it in 2D. Unluckily I didnt get tickets for 3D. As RGV said in his blog – James made all other directors as ANTS(read Choothia) :). My opinion is not to just watch it – Experience it – It has a message also – Conserve the Nature. Its a life time movie of our era. I rate this is one above the Ben-Hur.

    • me too didn’t get tickets in 3D..and watched in 2D but in a good theatre..planning to watch it again soon 🙂

  4. రివ్యూ బాగుంది

  5. నాకు –
    గ్రహాంతరవాసుల సినిమాలంటేనే ఎలర్జీ, అసహ్యం.
    సైన్స్ ఫిక్షన్ అంటే భరించలేనంత తలనొప్పి.
    గ్రాఫిక్స్ అంటే మాత్రం ఇష్టమే.

    నాకు ఈ సినిమా నచ్చలేదు. 🙂

  6. నాకు గ్రహాంతరవాసుల సినిమాలంటేనే పరమ ఎలర్జీ, అసహ్యం, సైన్స్ ఫిక్షన్ అంటే భరించలేనంత తలనొప్పి, గ్రాఫిక్స్ అంటే ఏవగింపు…

    కానీ నాకీ సినిమా నచ్చింది.. 🙂
    IMAX-3D లొ చూసా.. మళ్ళి real-3D లొ చూద్దామనుకుంటున్నా

  7. anyway this telugu avatar break the original avatar records.

    http://manchupallakee.blogspot.com/2009/12/blog-post_21.html

  8. Itz not a hollywood movie. JAMES CAMERON. Mind it! 😀

    Itz a James Cameron movie, and Our film makers can not even think of it. Hehehe

  9. నాకు –
    గ్రహాంతరవాసుల సినిమాలంటేనే ఎలర్జీ, అసహ్యం.
    సైన్స్ ఫిక్షన్ అంటే భరించలేనంత తలనొప్పి.
    గ్రాఫిక్స్ అంటే మాత్రం ఇష్టమే.

    will wait for DVD

    • Then you’re missing the experience 🙂

      Btw, ‘Avatar’ is not science-fiction. There’s hardly any science in it. It’s pure fiction. And, it’s not about aliens either…. not the stereo-typical aliens we’re used to anyway.

      • True. This movie is not a typical alien movie, not a sci-fi and not about just graphics..!!! I recommend every FILM BUFF – NOT to miss this experience and watch this movie in an excellent theatre … whether u like it ot not…experience it by yourself!!!

  10. రికార్డులు బద్దలు చేసే దిశలోనే వెళ్తుంది ప్రస్తుతానికి. మొదటి వారాంతం వసూళ్లు (3 రోజులకు) అమెరికాలో $73 మిలియన్; ప్రపంచవ్యాప్తంగా $220 మిలియన్. ఈస్ట్ కోస్ట్‌లో మంచు తుఫాను లేకుంటే అమెరికాలో వసూళ్లు మరో $20 మిలియన్ ఉండేవని ఫాక్స్ స్టుడియో వర్గాల ఉవాచ. తుఫాను పుణ్యాన ఒకే వారాంతంలో అత్యధిక వసూళ్ల రికార్డు, $77 మిలియన్‌తో ‘ఐ యామ్ లెజెండ్’ పేరుతో ప్రస్తుతానికి భద్రంగానే ఉంది.

    • Correction: ‘Avatar’s domestic (US & Canada) opening week gross is $77 million; worldwide gross is $242 million; and the snow storm loss is $2 million.

  11. ఈ సినిమా 3 లో చూశా. బాగా నచ్చింది. ఇంకోసారి చూడాలి :).

    అసలు IMAXలో చూడాలని plan కాని మా దేశంలో ఉన్న ఒకే ఒక్క IMAX కి ఏదో రోగమొచ్చి screen చెయ్యలేదు 😦

    btw, మా friends ki సినిమా చూసిన రోజు రాత్రి కలలో అవతార్లు కనిపించారంట 😀

  12. జనాలు అరుంధతిని అవతార్ కి కంపేర్ చెయ్యడం మొదలెట్టేసారు ఖర్మ ఖర్మ 😦

    http://booksandgalfriends.blogspot.com/2009/12/blog-post_22.html

    • compare chesindi ikkada
      http://navatarangam.com/2009/12/హాలివుడ్-శ్యాం-ప్రసాద్-ర/
      😛

      • ఎక్కడ చేసారన్నది కాదన్నయా ….చేసారా లేదా అనేది పాయింటు 😀

        • ఆ కంపారిజను చూసి నేను బాధపడి అక్కడ రాసుకుంటే కనీసం కామెంటన్నా పెట్టకుండా నేనే ఆ కంపారిజను చేశానని జనులు భ్రమసేలా చేస్తారా? మీరు బలవంతంగా వంద బాలయ్య సినిమాలు చూసెదరుగాక. ఇదే నా శాపం

          • అయ్యబాబోయ్ అంతపని చెయ్యకండి…ఛ చ మిమ్మల్ని అనలేదు…ఆ లింకు దొరికింది కాబట్టి అది పెట్టేసా అంతే 😛

  13. అవతార్ సినిమా ఇంకా చుడలేదు గాని, అది చూడల్సిన సినిమా అని మాత్రం తెలుసు. అవతార్ సినిమాగురించి ఒక గణిత సాస్త్రవేత్త చెప్పిన విషయాన్ని నా బ్లాగు లొ రాసేను….చదవండి.
    http://meeandarikosam.blogspot.com

  14. http://indralokam.wordpress.com/
    నేను చూసిన ‘అవతార్ ‘

  15. అవతార్ ఈ సంవత్సరం లో వచ్చిన ఒక అద్భుతం. 3D దొరకలెదు 2D ఒక excellent theater లో చూసాను. అసలు ఈ సినిమా గురించి చెప్పతరం కాదు. బ్రహ్మాడభాండం అంతే. the best part is : It all boils down to humanity ! It is beautifully shown in the movie….wonderful !

    ఈ వారంలో 3D కి టికెట్లు దొరికాయోచ్…3D చూడబోతున్నానోచ్ 🙂
    🙂

  16. హైదరాబాదులో 3d లో చూద్దామనుకుంటే టికెట్లు దొరకలే. అందుకే మాటినీ టూడీ లో చూసి సరిపెట్టుకున్నా. అయితే టైమ్ బాగుండి సాయంత్రం ఫస్ట్ షో త్రీడీలో టికెట్లు ఒక ఫ్రెండు సంపాదిస్తే ఆ అనుభూతినీ స్వంతం చేసుకున్నాను. 🙂

  17. Hindu beliefs are fascinating – James Cameron Avatar Director



స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: