శోభన్ బాబు..తెలుగు సినిమా చరిత్రలో తనకో ప్రత్యేక స్థానముంది. తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులని, ముఖ్యంగా మహిళాభిమానులని సంపాదించుకున్న శోభన్ బాబు, తన లైఫ్ స్టైల్ తో పరిశ్రమ లో ఇంకెంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. శోభన్ బాబు పాటించే మితాహారం, యోగా, ఇంకొన్ని ఆరోగ్యపరమైన అలవాట్లు- ఈనాడు లో మంగళవారం “సుఖీభవ” రెగ్యులర్ గా చదివే పాఠకుల టైప్ జనాలకి శొభన్ బాబు ని రోల్ మోడల్ చేస్తే, రియల్ ఎస్టేట్ లో ఆయన విజయాలు, సలహాలు – ఈనాడు లో “సిరి” చదివే టైప్ జనాలకి ఆయన్ని డెమీగాడ్ ని చేసాయనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మురళీ మోహన్, శ్రీధర్ లాంటి వాళ్ళెందరో రియల్ ఎస్టేట్ లో తమ విజయాలకి స్ఫూర్తి, గైడేన్స్ శోభన్ బాబుదే అని బహిరంగంగానే చెబుతారు.
ఆయన నటన ని కూడా కేవలం “ఉద్యోగం” లాగానే చేసేవాణ్ణని చెప్పేవాడు. ప్రజాదరణ కరువయ్యాక కూడా నటించడానికి తపించే నటుల మధ్యా, పూర్ ఫినాన్షియల్ ప్లానింగ్ తో ఇండస్ట్రీ లో ఎత్తులుపల్లాలు తరచూ ఎక్కిదిగే నటుల మధ్యా- పక్కా ప్లానింగ్ తో – నటనని కేవలం ఉద్యోగం లాగానే చేసి, నటన విరమించాక రియల్ ఎస్టేట్ లో శిఖరాలు అధిరోహించి మళ్ళీ నటించమన్నా నటించకుండా ఉండిపోయిన శోభన్ బాబు చాలా విలక్షణంగానే కనిపిస్తాడు. మొన్నా మధ్య శోభన్ బాబు బయోగ్రఫీ లాంటి పుస్తకమొకటి వచ్చింది- టైటిల్: పరుగు ఆపడం ఒక కళ. చాలా మంచి టైటిల్. శోభన్ బాబు జీవన విధానానికి భలే సూటయిన టైటిల్. అయితే నాకిక్కడ ఒక చిన్న irony కనిపిస్తుంది – జీవితం లో. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకుంటాము. ఆయన ఉపాధ్యాయుడిగా కెరీర్ మొదలెట్టి రాష్ట్రపతి దాకా ఎదిగిన వ్యక్తి.అయితే ఆయన రాష్ట్రపతి అవకుండా – ఉపాధ్యాయ వృత్తి లోనే ఉండి తన జీవితం మొత్తం విద్యాభోదనకే ధారవోసి ఎంతమంది విద్యార్థులని తీర్చిదిద్దినా సరే – ఆయన జన్మ దినోత్సవాన్ని టీచర్స్ డే గా జరిపే వాళ్ళమా అంటే నాకు సందేహమే. ఇదొక తరహా ఐరనీ. అలాగే శోభన్ బాబు నటన విరమించాక రియల్ ఎస్టేట్ లాంటివేవీ చేయకుండా వార్తల్లోనూ ఉండకుండా ఏ రాజకీయాలూ లేకుండా ప్రశాంతంగా తన నటనాంతర జీవితాన్ని వెళ్ళబుచ్చి ఉంటే – అప్పుడాయన జీవితాన్ని చూపిస్తూ – “పరుగు ఆపడం ఒక కళ” అని అనేవారా? ఒకవేళ అలా అన్నా జనాలకి “ఎక్కేదా”? . ఇదీ నా సందేహం. మానవ ప్రవృత్తి లోని ఈ తరహా irony చాలా చొట్లే కనిపిస్తుంది మనకి.
ఇక శోభన్ బాబు హెల్త్ టిప్స్ గురించి ఒకానొక లంచ్ బ్రేక్ లో అప్పుడెప్పుడో జరిగిన మా డిస్కషన్ ఇదీ. ఒకతనన్నాడు- “శోభన్ బాబు మితాహారం తీసుకుని, శాఖాహరం తీసుకుని, రోజు కి అరకప్పు కి మించి టీ/కాఫీ త్రాగకుండా, యోగా చేసి, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండి – ఇలా ఎన్నెన్నో చేస్తే – ఆయన జీవించింది – 69 యేళ్ళు. రఘువరన్ డ్రగ్ అడిక్ట్ అయి, రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మధ్యలో మానేసి వచ్చి, చైన్ స్మోకింగ్ చేసి, విపరీతంగా డ్రింక్ చేసి, భార్య తో డైవోర్స్ తీసుకుని, మెంటల్ టెన్షన్ తో లైఫ్ గడిపి- ఇన్ని చేస్తే ఆయన జీవించింది – 59 యేళ్ళు. డిఫరెన్స్ పదేళ్ళే”. అయితే నాకు తెలిసి మంచి ఆరోగ్య అలవాట్లు అనేవి ఎంతకాలం బ్రతుకుతామనే దానికి సంబంధించి కాకుండా- బ్రతికినంత కాలం ఎంత ప్రశాంతంగా, ఎంత సమాధానంగా బ్రతికి ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని గడుపుతున్నామనే దాన్ని నిర్ణయిస్తాయి అని. సరే, ఏది ఏమయినా శోభన్ బాబు ఒకానొక సందర్భం లో చెప్పిన ఒక చిన్న జీవన సూత్రం మాత్రం బాగా ఇష్టం నాకు. ఆయన చెప్పిన విషయం లోని మూడు వాక్యాలు-
1. పొట్ట ఎప్పుడూ (కొంచెం) ఖాళీగా ఉండాలి [దీఅర్థం మితంగా భోంచేయాలి అని]
2. పాదాలెప్పుడూ వెచ్చగా ఉండాలి [దీనర్థం, ఒకే చోట కూర్చోకుండా కాస్తో కూస్తో వాకింగో, జాగింగో, ఏదయినా పనో చేస్తూ ఉండాలి అని]
3. తల ఎప్పుడూ చల్ల గా ఉండాలి [దీనర్థం మెంటల్ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మనల్ని మనం ఉంచుకోవాలి అని]
అదండీ సంగతి- పొట్ట ఖాళీగా, పాదాలు వెచ్చగా, తల చల్లగా ఉండాలి అనేదే శోభన్ బాబు ఫిలాసఫీ.
శోభనుబాబును చూసే నేర్చుకోవక్కరలా – With all due respects to Sobhan Babu 🙂 –
మన చుట్టూరా చూస్తే ఆ మూడూ చక్కగా చేసి చూపించేవాళ్ళు ముగ్గురు – భిక్షగాళ్ళు, స్వాములు (దొంగ యోగులు, దొంగ స్వాములు, దొంగ పీఠాధిపతులు కలుపుకుని), రాజకీయనాయకులు….
By: Vamsi M Maganti on 2009/12/23
at 1:41 ఉద.
69 కాదు, 71 అనుకుంటా.
శోభన్ బాబు ఆకస్మిక మృతి గురించి ఎవరో అన్నారు, ‘ఆయన పోయింది ఆరోగ్యం లేక కాదు, ఆయుష్షు లేక’. నిజమే కదా.
By: అబ్రకదబ్ర on 2009/12/23
at 2:16 ఉద.
అయితే మీరు ఏమీ తినకుండా సాక్సులు వేసుకుని తలకి నవరతన్ తేల్ రాసుకొండి….చల్లచల్లని కూల్ కూల్ నవరతన్ ఆయిల్ 😛
By: sowmya on 2009/12/23
at 11:23 ఉద.
bagundi comment 🙂
..thx..
By: mohanrazz on 2009/12/23
at 2:24 సా.
hmm మంచిపని చేసారు 🙂
By: sowmya on 2009/12/23
at 2:55 సా.
మరి వివేకానందుడు ఎంతో నిష్టగా శాఖాహారము మాత్రమే తీసుకొని నిత్యం యోగాసనాలతో పాటు ప్రశాంత చిత్తం తో జీవించింది (39) ఏళ్ళే కదా.
ఇది ఒక సందేహం మాత్రమే. ఎవరైనా నివృత్తి చేయవచ్చు
By: sunnygadu on 2009/12/23
at 11:59 ఉద.
swami vevakananda survived for only 39 years
By: gowri kumar on 2009/12/23
at 4:47 సా.
Following good health practices is not necessarily for long life only – it is for one’s own sense of well-being. AFAIK, one of the main factors determining long life is heredity.
By: కొత్తపాళీ on 2009/12/23
at 5:00 సా.
ఇలాంటపుడే విధిని నమ్మాల్సి వస్తుంది. నిజమే! శోభన్ బాబు పోయింది ఆరోగ్యం లేక కాదు, ఆయుష్షు లేక! తాగుడుతో వొళ్ళంతా గుల్ల చేసుకున్న వాళ్ళు, అనేక రోగాలతో తీసుకుంటూ కూడా 80 దాటి బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
By: సుజాత on 2009/12/23
at 6:25 సా.
మీ అందరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙂
By: sowmya on 2009/12/24
at 5:13 సా.
mari n d tiwari 85 years ayana arogya rahasyam rojuku mudu putala ammayilato massage cheyyinchu kovadam .ippudu shobhan ni follow avvala tiwarinaa?
By: ravigaru on 2009/12/25
at 9:28 సా.
are you on vocation???
By: chandra on 2010/01/06
at 10:55 ఉద.
meeru inni rojulu blog update cheyyaka pothe elagandi… maakikkada bore kodthundhi 🙂
By: Madhu on 2010/01/07
at 9:07 సా.
nenu e roje me site open chesanu.chaala baagundi.very interesting.intervel twaraga mugiste manchidi
By: k.udaykiran on 2010/01/18
at 4:44 సా.
శోభన్ బాబు గారి కుటుంబసభ్యుల ఫొటో నెట్ లో ఎక్కడైనా దొరుకుతుందా?
By: nrahamthulla on 2011/03/31
at 4:31 సా.