వ్రాసినది: mohanrazz | 2010/09/15

తెలుగు సినిమా కి (మగధీర) రెండు జాతీయ అవార్డులు


ఇవాళ ప్రకటించిన జాతీయ అవార్డులలో తెలుగు సినిమా మగధీర కి రెండు అవార్డులు వచ్చాయి. ఒకటి కొరియోగ్రఫ్య్ విభాగానికి కాగా ఇంకొకటి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగానికి. కొరియోగ్రఫీ విభాగం లో శివశంకర్ మాస్టర్ కి అవార్డ్ వచ్చింది – ధీర ధీర సాంగ్ కి.
శివ శంకర్ మాస్టర్ అంటే ఎవరో అనుకునేరు టివి ప్రేక్షకులకి ఈయన బాగా తెలిసిన వ్యక్తే. మొదట్లో ఢీ ప్రొగ్రాం లో మాస్టర్స్ లో ఒకడుగా ఒక పార్టిసిపెంట్ తో వచ్చాడు. ఆ తర్వాత ఓం కార్ నిర్వహిస్తున్న ఒక ప్రోగ్రాం లో (బహుశా ఛాలెంజ్ అనుకుంటా) జడ్జ్ గా వచ్చాడు. (ఇప్పటికీ వస్తున్నాడనుకుంటా). ఈయన ఢీ ప్రోగ్రాం లొ వచ్చేటప్పుడు ఈయన్ని చూస్తే భలే నవ్వొచ్చేది నాకు. ఈయన్ని కానీ ఈయన డ్యాన్స్ ని కానీ ఎవరైనా తిడితే లేదా కామెంట్ చేస్తే వెంటనే ఏదుపొచ్చేది ఈయనకి. ఒక వేళ పొగిడేరో, అంత కంటే ఇంకా ఎక్కువగా ఏడ్చేసే వాడు. కళాకారులు సున్నిత మనస్కులంటారు. బహుశా ఆ కోవలోని వ్యక్తేమో.

ఇక రెండో అవార్డ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కి. తెలుగు సినిమా లోని స్పెషల్ ఎఫెక్ట్స్ కి జాతీయ అవార్డ్ రావడం ఇది రెండోసారి. గతం లో అంజి కి వచ్చింది. గతం లో మగధీర 300 కి పైగా కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శింపబడిందని టపా వేసినపుడొకాయనెవరో (click the link for old post) అవార్డుల గురించి, ప్రత్యేకించి జాతీయ అవార్డుల గురించి మాట్లాడి, మగధీర కేవలం కాస్ట్యూంస్ సెట్టింగ్స్ తప్ప ఏమీ లేని చెత్త సినిమా అనీ, ఏ మాత్రం క్వాలిటీ లేని ఇలాంటి సినిమాలని చూడటం దౌర్భాగ్యం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. బహుశా ఆయనంత ఇంటెలెక్చువల్స్ జ్యూరీ లో ఎవరూ లేకపోవడం వల్లే ఈ రెండు జాతీయ అవార్డులు తెలుగు కి వచ్చాయేమో.


Responses

 1. Well said!
  lets see in pooripaka

  welcome back mohanrazz!
  we miss you

 2. మోహన్ రాజు గారు స్వాగతం
  haapy to see you back

 3. welcome back mohan.. we are awaiting you..

 4. Welcome Back అని చెప్పవచ్చా మోహన్ గారు, ఇంకా బిజీ బిజీ అంటారా 🙂

  “ఏదో ఒకపాటలో చేసిన డ్యాన్స్ కి సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కి అవార్డ్స్ వచ్చాయి అంతే కదా సినిమా చెత్తదే అనడంలో ఏం సందేహం లేదు, అయినా ఈ మధ్య నేషనల్ అవార్డ్స్ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి.. వాటిని కొలమానంగా తీసుకోలేం” అని నిన్న ఓ కొలీగ్ వాదన. అవునవును కుందేలుకు మూడే కాళ్ళు అని నిశ్శబ్దంగా తప్పుకున్నా.

 5. welcome back!

 6. Thank u all..

  Welcome Back అని చెప్పవచ్చా మోహన్ గారు//

  partially 🙂

 7. మళ్ళీ మోహన్ గారి టపాలు. ఆనందంగా ఉంది.

 8. welcome back mohan garu,
  ika naina regular ga raayandi sir

 9. eea awads sandharbanga chala anadhanga unndi

 10. http://videos.teluguwebmedia.in/58631199
  వెలమకన్ని భరద్వాజ గాడి బతుకే గజ్జి కుక్క బతుకు.

 11. అరె భై నీ బతుకు ఎంది జర చూడరాదే. గసలే నువ్వు లావిష్ బతికెటోడివి. గీ మధ్యన గెదో బొచ్చు కుక్కతో జత గలిసావంట ఎంది సంగతి..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: