వ్రాసినది: mohanrazz | 2010/10/28

బ్లూ – Lady in blue

blue

పోయిన వారం చూసానీ సినిమాని. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, లారా దత్త, జాయేద్ ఖాన్,కత్రినా కైఫ్ ఉన్నారీ సినిమాలో. కొంతమంది 2/5, ఇంకొంతమంది 1/5 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ని “ఏమీ తోచని” ఒకానొక మొమెంట్ లో చూడాల్సి వచ్చింది.

స్వాతంత్ర్యం వచ్చిన కొత్త లో బ్రిటిష్ వాళ్ళు మన కొంత సంపదని Lady in Blue అనే ఒక షిప్ లో ఇండియాకి పంపిస్తారు 🙂 . అది ఎక్కడో మునిగిపోతుంది. అక్కడ టైటిల్స్. After 60 years, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ఫ్రెండ్స్. అక్షయ్ కుమార్ సంజయ్ దత్ ని అడుగుతూంటాడు- నీకు ఈ సముద్రం మొత్తం బాగా తెలుసు. ఈ సముద్రం లో ఆ Lady in blue ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు. వెళ్ళి తెచ్చుకుందాం అని. సంజయ్ దత్ ఈ విషయం మీద ఇంటరెస్ట్ చూపడు. సంజయ్ దత్ భార్య లారాదత్త. తమ్ముడు జాయేద్ ఖాన్. తమ్ముడు జాయేద్ ఖాన్ మాఫియా డాన్ రాహుల్ దేవ్ చెప్పిన “ఫలానా డ్రగ్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడిస్తే నీకు 50 వేల డాలర్లు” అన్న ఒక చిన్న పనిచేస్తూ పోలీస్ ఛేజ్ లో డ్రగ్స్ మిస్ చేస్తాడు. ఆ డ్రగ్స్ మొత్తం విలువ 50 మిలియన్ డాలర్లు నాకు ఇచ్చేయి అని రాహుల్ దేవ్ జాయేద్ ఖాన్ వెంటపడుతూంటాడు. ఇంతే ఫస్టాఫ్. సెకండాఫ్ లో మాఫియాడాన్ జాయేద్ ఖాన్ ని ట్రేస్ చేసి, లారాదత్తా ని కిడ్నాప్ చేసి, 24 గంటల్లో 50 మిలియన్ డాలర్లు తెచ్చివ్వకపోతే  చంపేస్తానని బెదిరిస్తే అప్పుడు సంజయ్ దత్, అక్షయ్ కుమార్, జాయేద్ ఖాన్ కలిసి సముద్రం లోకి వెళ్తారు ఆ షిప్ ని అందులో వచ్చిన నగల్ని తీసుకురావడానికి. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింటేంటే- సినిమా మొత్తం నిడివి రెండు గంటలే, కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇక రెండో అతిపెద్ద ప్లస్ పాయింటేంటే- ఒక పాటని క్లైమాక్స్ అయిపోయాక లాస్ట్ లో పెట్టుకున్నారు. కాబట్టి మనం సినిమా అవ్వగానే లేచి వచ్చేసెయ్యొచ్చు. అదే మధ్యలో పెట్టి ఆ పాట కూడా చూడాల్సి వచ్చేది. ఇక నటీ నటుల గురించి చెప్పాలంటే- మొదట్లో అక్షయ్ కుమార్ లేడీ ఇన్ బ్లూ గురించి అడిగినప్పుడల్లా సంజయ్ దత్ ఆ మ్యాటర్ మీద అసలు ఇంటరెస్ట్ చూపడు. సంజయ్ దత్ కి ఆ నిధి మీద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటాం ముందు. కానీ తర్వాత సినిమా అంతా అయ్యాక అర్థమవుతుంది మనకి – సంజయ్ దత్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు అని.

సినిమాలో అండర్ వాటర్ సీన్లు చాలా బాగా తీసారు. అయితే మీకు నిజంగా ఆ అండర్ వాటర్ సీన్లే కావాలంటే డిస్కవరీ ఛానెల్ చూడండి. సరిపోతుంది. చివర్లో రెండు ట్విస్ట్ లు ఉన్నాయి. సినిమా మొదలైన మొదటి పదిహేను నిముషాల్లో అవేంటో మీకర్థమై పోతాయి . సినిమా చాలా రిచ్ గా తీసారు. ఫోటోగ్రఫీ ఎక్స్ట్రార్డినరీ గా ఉంది. కానీ సరైన కథ తో సరైన ట్విస్ట్స్ తో తీసి ఉంటే ఖచ్చితంగా జనాలు ఆ అండర్ వాటర్ సీన్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ కథ లేకుండా ఎంత రిచ్ గా తీసినా లాభం లేదు అని చెప్పడానికి ఈ సినిమా ఇంకో ఉదాహరణ.


Responses

 1. >> “సంజయ్ దత్ భార్య లారాదత్త. తమ్ముడు జాయేద్ ఖాన్”

  Hmm..

 2. ఎందుకో గాని విజయేంద్రవర్మ గుర్తొచింది ఈ సినిమా చూస్తుంటే.
  బతికుంటే బాలయ్యబాబు సినిమాలు చూసుకుంటూ బతుకుతా కానీ మళ్ళీ Anothony D’Souza సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్నా. అసలు తక్కువ హడావుడి ఎక్కువా.

 3. “sanjay dut ki acting meeda interest ledani”…adirindi 😉

 4. story ప్రకారం అరవయ్యేల్లకు పైగా వయసు వుండే పాత్ర కావాలి సంజయ్ దత్ కి ఆ పాత్ర ఇచ్చారు పాతిక ఏళ్ల పాత్రకు తన భార్య గా లారా దత్తా 😀

  • వీటికితోడు ఇరవయ్యేళ్ళ తమ్ముడు పాత్రకి జాయేద్ ఖాన్.. 🙂

   • అంటే జాయెద్ ఖాన్ కి సంజయ్ దుత్త్ కి నలభై ఏళ్ళు తేడా ఈ లెక్కన వాళ్ళ నాన్న అరవైఎల్లప్పుడు కాపురం చేస్తే జాయెద్ ఖాన్ ని పుట్టించాడు ఇప్పడు తన వయసు లో వున్న లారా దత్తా ని వదిన అని పిలవాలా..ఈ లెక్కన ప్రవీ నీకు మంచి స్టొరీ దొరికింది పండగ చేసుకో

   • అంటే జాయెద్ ఖాన్ కి సంజయ్ దుత్త్ కి నలభై ఏళ్ళు తేడా ఈ లెక్కన వాళ్ళ నాన్న అరవైఎల్లప్పుడు కాపురం చేస్తే జాయెద్ ఖాన్ ని పుట్టించాడు ఇప్పడు తన వయసు లో వున్న లారా దత్తా ని వదిన అని పిలవాలా..ఈ లెక్కన ప్రవీ నీకు మంచి స్టొరీ దొరికింది పండగ చేసుకో 😀

    • హ హ, అతనికి కథలు, విషయాలు కాపీ చెయ్యల్సిన అవసరమేమొచ్చిందండీ. అతని బుర్రే ఓ కథలపుట్ట, అందులో నుండి వచ్చే కథలు అనన్యసామాన్యం. నవీన్ గారు చెప్పినట్టు ఆయన కథలనే ఎవరైనా కాపీ చేసుకోవలి :

 5. అందుకే నాకు బోర్ కిట్టినా, మిన్ను విరిగి మీద పడినా కూడా హిందీ సినిమాలు చూడను, మరీ చాలా మంచి సినిమాలు అయితే తప్ప. బద్రిగారు చెప్పినట్టు బాలయ్యబాబు సినిమాలు చూసుకుని కాలక్షేపం చెయ్యడం మేలు.

  మీరు ఇలాంటి సినిమా చూసి, దాని గురించి పోస్ట్ కూడా రాసారంటే, మీకు చాలా చాలా ఓపికండీ మోహన్ గారు….అబ్బో, మిమ్మలని చేసుకునే అమ్మయి చాలా సుఖపడుతుంది 😀

  • హ హ.. 🙂 🙂 అయినా సినిమాల విషయం లో ఓపికకేమీ కొదువలేదు కానీ- పెళ్ళి విషయం లో మాత్రం -నాకెందుకో సినిమాలంటేనే బొత్తిగా పడని, సినిమాల పేరెత్తితేనే విరుచుకుపడే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుందేమోనని డౌట్ 😀

   • అమ్మో, అలా అయితే, మీ ఇంట్లో రణరంగమే ఎప్పుడూ!!!
    అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త వహించండి.
    పెళ్ళి కి ప్రకటన ఇచ్చినప్పుడే (లేదా మీ ఇష్టాఇష్టాలు ఇంట్లో చెప్పినప్పుడో) చెప్పేయండి, నాకు ఎటువంటి బార్స్ లేవు, ఒక్క సినిమా బార్ తప్ప‌. అమ్మయికి సినిమాలంటే పిచ్చి ఇష్టం ఉండాలి అని.
    ఏమంటారు? :

    • మీరు చాలా తెలివిగలవారు సౌమ్య గారు కర్ర విరగకుండా పాముని చంపేసినట్టు బాగా మీ అభిప్రాయం చెప్పారు కేక 🙂

     • కాంట్రావర్సి లు ఏంటి ఇక్కడ నాకు తెలియాలి తెలియాలి

     • ఏదో మీ అభిమానం 😀

     • కానీ అంత లోతైన అర్థం వచ్చేట్టు నేనేం రాసానబ్బా!!! :O

    • అమ్మో అమ్మో పూణే లో వున్న మోహన్ గారినే 🙂
     SVU వాళ్ళతో మీ ఆటలా హమ్మా 🙂

     • వాళ్ళు SVU వాళ్ళయితే, మేము HCU వాళ్ళం 🙂

    • హ హ.. 🙂 అయినా ఈ పెళ్ళిప్రయత్నాల తంతు మీద ఓ టపాయే వ్రాద్దామనుకున్నా కానీ…కొన్ని సాంకేతిక కారణాల వల్ల అట్టాంటి ప్రయత్నాన్ని విరమించా 😀 !!

     • ha ha సాంకేతిక కారణాలు అంటే కంప్యూటర్ వా ? 🙂
      పర్సనల్ ఆ

      • హ హ మంచి ప్రశ్న వేసారు తారక్ 🙂

      • tarak..కంప్యూటర్ వి కాదు. ఎందుకంటే “సాంకేతిక కారణాలు” అంటే ఎప్పుడూ జనరల్ గా సాంకేతిక విషయాలకి సంబంధించినవి అయి ఉండవు 🙂

       • ఒహో, అయితే ఆ పెళ్ళి ప్రయత్నాలు చేసినవాళ్ళో లేదా ఆ పెళ్ళిచూపులలో చూసిన అమ్మయిలో రాయొద్దు అని ఉంటారు. అవేనా మీ సాంకేతిక కారణాలు? 😀

        • పెళ్ళిచూపులలో చూసిన అమ్మయిలో రాయొద్దు అని ఉంటారు
         అంటే పెళ్లి చూపులు అయిపోయాయా 🙂
         congrats

 6. ఏమో సౌమ్య గారు ఇటువంటి సినిమాలు అన్నీ చూడాలి అనుకుంటా ఇప్పుడు ఒంటరి గా వెళ్తున్నారు
  పెళ్ళైతే కలసి వెళ్తారు

 7. బాలయ్య: ఒహ్ ప్రవీణ్ నేను సంవత్సరానికి రెండు సార్లు పిచేక్కిస్తే నువ్వు రోజూ మన బ్లాగ్గేర్లకు పిచ్చి ఎక్కిస్తున్నావంట కదా ఏంటి కధ
  ప్రవీణ్ : నిన్ననే విమోచనం కధ రాసాను
  బాలయ్య: చదివాను నాయనా అందుకే రైట్స్ తీసుకోవడానికి నీ దగ్గరకి వచ్చా
  ప్రవీణ్:అందరూ విరోచనం అని మార్చేసారు నా కధని ఒక్కడూ ఫీడ్బాక్ ఇవ్వడం లేదు
  బాలయ్య: ఎందుకు ఇస్తరయా అందుకే నే సినిమా తీస్తున్నా జీవి అనే జీవి రివ్యూ తో పటు రాటింగ్ కూడా ఇస్తాడు పండగ చేసుకో
  ప్రవీణ్: మీకు నా కధ ఇంత బాగా నచడానికి కారణం ఏంటి
  బాలయ్య: తేరా మీద నువ్వే చూడు నయనతార అయిపొయింది నా చేతిలో

  • @నవీన్
   అదరగొట్టేసారు, అబ్బ నా మనసు లో ఉన్న కసి అంతా దిగిపొయినట్టనిపించింది మీ సంభాషణలు చదివి…సూపరురురురురురురురురు, కేక‌క‌క‌క‌క‌క‌క‌క‌క‌క‌క‌కక 😀

   • నాకు special mail ఇచ్చాడు తన “విరోచనం’ కథ చదవమని. నా విమర్శలు అన్ని గుర్తు పెట్టుకుని మరీ modify చేసాడట‌ కథ ని, తన site ని.

    • ఇప్పుడే అతని విరోచనానికి ఒక గుళిక ఇచ్చా, ఒప్పుకుంటాడో ఏమో చూడాలి 🙂

     • 😀 😀 😀

     • సౌమ్య గారు, దున్నపోతుమీద వర్షం కురిసినట్టే. తుడిచేసుకుంటాడు సారు.

 8. మీ మెయిల్ id ఇచ్చారా వాడికి లేకపోతే వాడే కనుక్కున్నాడా స్పాం వుందనే వుంది కదా ఫిల్టర్ చేసేయండి పీడ పోతుంది

  • నేను mail ID ఇస్తానని మీరెలా అనుకున్నరండీ, నాకేమైనా పిచ్చా?
   వాడే కనుక్కున్నాడు. అసలు ఊహించలేదు వాడి దగ్గర నుండి mail 😮

   • అందుకే ఫిల్టర్ చేసేయండి జిమెయిల్ అయితే హాయిగా వుండొచ్చు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: