వ్రాసినది: mohanrazz | 2011/07/09

యండమూరి ఝలక్:

మొన్నీమధ్య ఏదో ఛానెల్ లో “పెళ్ళి పుస్తకం” అనే ప్రోగ్రాం కి యండమూరి& ఫ్యామిలీ వచ్చారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే – ప్రతివారం ఒక సెలెబ్రిటీ (లేదా లెజెండ్) ఫ్యామిలీ ని తీసుకుని ఆ భార్యాభర్తల మధ్య అనుబంధం, వాళ్ళ “జీవన వికాసం” , “విజయం లో వాళ్ళ భాగస్వామ్యం” లాంటి అంశాలన్నీ సరదాగా ముచ్చటిస్తారన్నమాట. ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాత గా ఝాన్సీ వ్యవహరిస్తారు. బేసిక్ గా రొమాంటిక్ నవలలు లేదా ప్రేమకథా సినిమాల్లాగే ఇలాంటి షో లు కూడా అంతిమంగా ఒక చక్కటి డ్రీం ని ‘ప్యాక్’ చేసి జనాలకి అందివ్వడానికి ట్రై చేస్తాయి. దాని వల్ల  చూసిన వాళ్ళు కూడా “అబ్బ, వాళ్ళెంత ముచ్చటగా ఉన్నారో అనో లేదంటే ఎంత చక్కగా చెఫ్ఫారు వాళ్ళు అనో లేదా పెళ్ళై ఇన్నేళ్ళైనా ఎంత ఆనందంగా ఉన్నారనో” అనుకుంటూంటారు. ఈ ప్రోగ్రాం లో అడగడానికి ప్రశ్నలు తయారు చేసే స్క్రిప్ట్ రైటర్, నిర్వహించే వ్యాఖ్యాత – వీళ్ళందరి లక్ష్యం కూడా జనాలు అలా అనుకునేలా చేయడమే. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న ఝలక్ లు తగులుతూంటాయి. ఈ మధ్య యండమూరి, వాళ్ళ భార్య తో జరిగిన పెళ్ళి పుస్తకం ప్రోగ్రాం లో జరిగినట్టుగా.
 

ఒక ప్రశ్న అడిగింది ఝాన్సీ – “సార్, మీ ఇద్దరి లో కోపం ఎవరికి ఎక్కువగా వస్తుంది?” అని. చక్కటి ప్రశ్న. సింపుల్ ప్రశ్న. చిలిపి ప్రశ్న. ఇలాంటి ప్రశ్న కి ప్రోగ్రాం నిర్వాహకులు ఎక్స్ పెక్ట్ చేసే ఆన్సర్ లేదా డిజైర్డ్ ఆన్సర్ ఏంటంటే – “తనకే కొంచెం కోపం ఎక్కువ, నేను కూల్ గానే ఉంటాను” అని ఆయనంటే, “అదేం లేదు, నేను కూల్ గానే ఉంటాను, ఆయనే ఒక్కొసారి షార్ట్ టెంపర్ అయిపోతుంటారు” అని ఆవిడంటే- “కాదు నీకే”, “లేదు నీకే” అని వాళ్ళిద్దరూ కాసేపు స-ర-దా-గా ఝాన్సీ ముఖం మీద చెరగని చిరునవ్వు సాక్షి గా తగువాడి, చివర్లో “ఎవరికి కోపం వచ్చినా వెంటనే ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పేసుకుని ఇద్దరూ సర్దుకుపోతుంటామండీ” అని లైట్ గా తడి కళ్ళతో ఫినిషింగ్ టచ్ ఇస్తే అప్పుడు ఝాన్సీ కి గానీ, ప్రోగ్రాం నిర్వాహకులకి గానీ, చూసే వాళ్ళకి గానీ ఫుల్ పండగ. ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడం లోనూ, అడగడం లో నూ వాళ్ళ ఉద్దేశ్యం కూడా అదే. అయితే దీనికి యండమూరి ఇచ్చిన సమాధానం ఆల్ మోస్ట్ ఝాన్సీ కి ఝలక్ అనే చెప్పాలి. ఆయన ఇచ్చిన సమాధానం – “మనిషికి కోపం అనేది రెండు కారణాల వల్ల వస్తుంది. (1) మనం ఎవరి మీదైనా ఎక్స్ పెక్టేషన్ పెట్టుకుంటె అది రీచ్ కానపుడు వస్తుంది. (2) మనం చేయాలని అనుకున్న పని చేయలేక పోతే వస్తుంది. నాకు కోపం అనేది ఎందుకు రాదంటే – ఎవరిమీదైనా నాకు ఎక్స్ పెక్టేషన్స్ జీరో ఉంటది. కాబట్టి వాళ్ళు నాకు కొంచెం చేసినా నాకు అది బోనస్ అనిపిస్తుంది. అంతే కానీ నాకు కోపం రాదండీ. రాదు” అని ఏ ఎక్స్ ప్రెషన్ లేకుండా ఫుల్లు ఫిలాసఫీ చెప్పాడు. పాపం ఝాన్సీ కి దిక్కు తోచలేదు.

 

సరేలే, కొంచేం బరువైన ప్రశ్న అడుగుదామని – “భార్యా భర్తలు ఒకరికొకరు చివరిదాకా తోడుగా ఉండాలి అంటారు..మీ ఐడియా ఏంటి ఈ విషయం లో” లాంటి క్వొశ్చెన్ అడిగింది ( ఈ సారి గ్యారంటీ గా మాంచి సెంటిమెంట్ పండించొచ్చని కాన్ ఫిడెన్స్ తో). కానీ యండమూరి మళ్ళీ దెబ్బకొడతాడని ఊహించలేదు ఝాన్సీ. యండమూరి అన్నాడు ” ఒకరికి ఒకరు తోడు ఉండాలి అనేది నేను నమ్మను. మనిషి కి చివరి దాకా తోడుండేది తన సెల్ఫ్ కాన్ ఫిడెన్సే..” అని మళ్ళీ ఝాన్సీ ఆశల్ని అడియాసలు చేసాడు.

 

అక్కడికి చివర్లో కూడా ఝాన్సీ – “సార్, మీరు ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇస్తారా” అని అడిగింది కనీసం మాంచి సెల్ఫ్ హెల్ప్ స్టఫ్ దొరుకుతందనే ఆశ తో. లాభం లేదు. యండమూరి చాలా సింపుల్ గా “మీరు ముసలి వాళ్ళయాక మందూ మాకూ కోసం కూడా పిల్లల డబ్బు మీద ఆధారపడకుండా మీకంటూ కొంత సేవింగ్స్ పెట్టుకోండి” అన్నాడు.

 

ఇదనే కాదు మధ్య లో కూడా “ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది” అనేది కరెక్టే అని యండమూరి తో చెప్పించాలనో, యండమూరికి ప్రూవ్ చెయ్యాలనో ఝాన్సీ తెగ తాపత్రయపడింది కానీ యండమూరి మళ్ళీ మొండిచేయి చూపించారు ఝాన్సీ కి.      

       
అయితే ఇంకో మాట కూడా చెప్పాలి – ఎందుకో తెలీదు, ఈ ప్రోగ్రాం అయ్యాక యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది!!!


Responses

 1. Hi, “ఎందుకో తెలీదు, ఈ ప్రోగ్రాం అయ్యాక యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది!!!” enduku anipinchindi.

  • ప్రవల్లిక గారూ..ఇది చెప్పాలంటే..ఇంకో టపా వ్రాయాలనుకుంటా నేను..

 2. ఎందుకో తెలీదు, ఈ ప్రోగ్రాం అయ్యాక యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది!!!
  Really, u r right.

 3. ప్రోగ్రాం ఉన్నంత సేపూ ఝాన్సీ ని చూసి జాలి, అయిన తర్వాత యండమూరి వాళ్ళావిడను చూస్తే జాలి !! అయినా వాళ్ళావిడక్కూడా ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ చచ్చి పోయి ఉంటాయి, ఇన్ని రోజులు తనతో వేగి.

 4. 🙂

 5. యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది!!!

  hmm…meeru bAne rAsAru ….kAni ee last word meeru manspoorthi gA antE, pApam mee paina jAli vestundi …(take it easy ..)

  meeru inkO tapA rAstE bAguntundi comments lO cheppinatlu gA…

 6. ఆమె కూడా ఆయనలానే ఆలోచించడం ఎప్పుడో స్టార్ట్ చేసి వుంటుంది.

  I liked his answers.

  1) don’t attach to any one. attachements leads to expectations, expectations leads disppointment.

  2) ప్రతి జీవి ఎప్పటికైనా ఒంటరే .. మనతో పాటు ఎవరైనా వున్నారనుకుంటే అది మన భ్రమ.

  ఆ స్టేజ్ కు నేను ఎప్పుడు వెళ్ళతానో, అసలు వెళ్ళగాలనో లేదో .. (మగధిర ఆడియో ఫంక్షన్ చిరంజీవి స్టైల్ లో)

 7. Eee blog ki “zurancinema” ani enduku peru pettarandi…kaasta chepatara please..

  • “జురాన్ అంటే” అని పైన ప్రత్యేక పుట జతచేసాను.. 🙂

 8. మోహన్‌రాజ్ గారూ, నేనా కార్యక్రమం చూళ్ళేదుగానీ.., గతంలో ఆయనిచ్చిన ఓ ఇంటర్వ్యూ చూసా. ఆయన గురించి మీరు సరిగ్గానే చెప్పారు. ఆయనంతటి మెటీరియలిస్టును నేను చూళ్ళేదు. ఆయన భార్య మీద మీరు చూపిన జాలి కూడా సబువే!

  ఈ కార్యక్రమం గురించి మీరు రాసిన విధానం బాగుంది.

 9. ” ఎందుకో తెలీదు, ఈ ప్రోగ్రాం అయ్యాక యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది!!!” నాకూ అలాగే అనిపించిందండీ ..

 10. Please see latest interview with Yandamuri on Telugulo.com

 11. I did not see that program. Did Jhansi address any questions to his wife? What was her response? Just curious:)

  • మంచి ఇంటర్వ్యూ రెఫర్ చేసారు..థ్యాంక్సండీ!! నేను టపా చివర్లో ”
   ఈ ప్రోగ్రాం అయ్యాక యండమూరి గారి భార్య ని చూస్తే “పాపం” అనిపించింది
   ” అన్న వాక్యం చాలా లైటర్ వీన్ లో నే అన్నాను 🙂

   ఇక ఝాన్సీ ఆవిడని అడిగిన ప్రశ్న అంటే..”మీరు ఏదైనా విషయం లో ఆయన్ని కన్విన్స్ చేయాల్సివస్తే ఎలా చేస్తారు” లాంటి ప్రశ్న ఏదో అడిగింది. ఆవిడ ఒకటే అన్నారు – “ఆయన్ని కన్విన్స్ చేయలేమండీ, మనమే కన్విన్స్ అవ్వాలి కానీ ఆయన్ని అస్సలు కన్విన్స్ చేయలేం” అని..!

 12. Hi,

  then i will be waiting for ur next post.

 13. Keep working ,great job!

 14. యండమూరి గారి రచనల్ని మొత్తం చదివితే గానీ ఆయన వ్యక్తిత్వం
  అర్థం గాదు. విషయం తెలియకుండా అనవసర కామెంట్లు చేయకూడదని నా మనవి.

  • స్కూల్ రోజుల్నుంచీ యండమూరి రచనలు చాలానే చదివాను…కొన్ని అద్భుతంగా నచ్చాయి..కొన్ని అస్సలు నచ్చలేదు… సరే, ఇక మీరు చెప్పిన వ్యక్తిత్వం అంటే రెండు రకాలుగా వస్తుంది- ఆయన రచనల్లో వ్యక్తమయ్యే ఆయన వ్యక్తిత్వం..ఆయన రచనల్లో కాకుండా రేడియో ప్రోగ్రాముల్లోనూ, టివి ప్రోగ్రాముల్లోనూ చూస్తున్నపుడు వ్యక్తమయ్యే ఆయన వ్యక్తిత్వం..ఈ రెండూ కాకుండా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడితే అర్థమయ్యే ఆయన వ్యక్తిత్వం మళ్ళీ వేరుగా ఉండొచ్చు. కాబట్టి నేను వ్రాసిన టపా లో (లేదా కామెంట్లలో) వ్యక్తం చేసిన అభిప్రాయం ఆయన మొత్తం వ్యక్తిత్వం గురించి కాదు..ఆ మాటకొస్తే పైన చెప్పినట్టుగా (రెండోరకం) టివి/రేడియోల్లోని ప్రోగ్రాముల్లో వ్యక్తమయ్యే ఆయన మొత్తం వ్యక్తిత్వం గురించీ కాదు- కేవలం ఝాన్సీ తో కలిసి నిర్వహించబడిన ఒక ప్రోగ్రాం లో వ్యక్తమైన, నా దృక్కోణం లో నాకు అర్థమైన కొన్ని అబ్జర్వేషన్స్ మాత్రమే!!

 15. మంచి టపా అందించారు . ధన్యవాదాలు .
  ఈ ప్రోగ్రాం నేను చూడలేక పోయాను.
  యండమూరి చెప్పిన సమాధానాలు సూటిగా లేకపోయినా అందులోనే జవాబు ఉంది. ఆయన భార్య కూడా ఆయన సాహచర్యంలో ఆ స్థాయిని అందుకొనే ఉంటారు. కాబట్టి ‘పాపం’ అని అనుకోలేక పోతున్నాను.

 16. యండమూరి రచనలు నేను చాలానే చదివాను. ఆయన్ని తెలుసుకోవడం కోసమే చదివాను. నాకు ఆయన రచనలేమీ నచ్చలేదు. అందుకే interview విన్నాక‌ వాళ్ళ ఆవిడని చూస్తే ఇంకా ఎక్కువ జాలి వేస్తున్నాది.

  • @సౌమ్య: అదేంటండి యండమూరి గారి ఏ నవలా నచ్చలేదా ! సర్లెండి మీ అభిప్రాయం మీది. అంతర్ముఖం, పర్ణశాల నవలలు చాలా బాగుంటాయి. అందులో ఆత్మ శోధన కనిపిస్తుంది. మెటీరియలిస్ట్ లా అనిపించినా, దాని నుంచి బయట పడే ప్రయత్నం కనిపిస్తుంది .

   • అంతర్ముఖం నేను చదవలేదండి, చాలాసార్లు చదువుదామనుకున్నాను కాని కుదరలేదు.
    తులసిదళం, నల్లంచు తెల్లచీర, వెన్నెల్లో ఆడపిల్ల, యుగంతం లాంటివి చదివి చాలా విసుగొచ్చిందండి.
    ఆయన తో వచ్చిన చిక్కేమిటంటే, ఒక నవల్ లో సైన్సు ని, ఇంకో నవల లో మూడనమ్మకాలని, మరొక నవల ల లో రెండిటిని, అలగే ఒక నవల లో మగవాళ్ళని, ఇంకో నవల లో ఆడవాళ్ళని, మరొక నవల లో ఇద్దరిని support చేస్తారు. ఇలా చాలామటుకు నవలలో ద్వంద్వ అభిప్రాయాలు ఉంటాయి. ఒక నవల ని, ఇంకో నవల compare తో చేస్తే వ్యతిరేఖాభిప్రాయాలు కనిపిస్తాయి. రచయిత అనేవాడికి ఒక stand ఉండాలి కద. ఎప్పుడు కావాలంటే అప్పుడూ, దేనిలోకి కావాలంటే దానిలోకి జంప్ అయిపోతే ఎలా?

    • తులసిదళం, వెన్నెల్లోఆడపిల్ల నవలలను కమర్షియల్ నవలలు . మూఢ నమ్మకాల మీద వ్రాయటం, ఎక్కువ పుస్తకాలు అమ్ముడు పోవాలని కావచ్చు. దానిని చాలా మంది విమర్శించారు . అది వేరే విషయం.
     ఇక ఇద్దర్నీ సపోర్ట్ చేయటం, ద్వంద్వ అభిప్రాయాల గురించి అంత బాగా అబ్సర్వ్ చేయలేదండి. ఎప్పుడో పదో తరగతి తర్వాత కొన్ని చదివా. బాగా గుర్తు లేవు. ఈ మధ్య చదివిన వాటి గురించి అయితే చెప్పగలను.

     • అదే అంటున్నాను….డబ్బు కోసం ఒకరకంగాను, కీర్తి కోసం ఒకరకంగాను, ఇంక‌దేనికోసమో మరోరకంగాను రాయడం రచయిత కి ఉండవలసిన మ‍ంచి లక్షణం కాదు కద !!!

      • //రచయిత కి ఉండవలసిన మ‍ంచి లక్షణం కాదు కద !!!
       అవును నిజమే.
       కానీ తులసిదళం రాసిన అదే రచయిత ‘విజయానికి ఆరో మెట్టు’ రాసారు. ఇది ఆయన లోని పరిణామ క్రమానికి నిదర్శనం అనుకోవచ్చు కదా !

 17. ఈ మధ్య Dairy సినిమా లో చివర్న యండమూరి వచ్చి దెయ్యాలు లేవు అని స్పష్టం గా చెప్పరు. చెప్పరో, చెప్పించారో తెలియదు కానీ, కనీసం ఈ సినిమా కోసమైనా ఒక స్పష్టమైన అభిప్రయన్ని వెల్లడించారు, అతని కథల మాదిరి కాకుండా. ఇన్నాళ్ళకైన ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు…అటు, ఇటు అని వదిలేయకుండా, సంతోషం.

  • డైరీ సినిమాకి యండమూరి రచయిత కానీ దర్శకుడు కానీ కాదు కాబట్టి కేవలం నటుడిగా దర్శకుడు చెప్పమన్నది యాజిటీజ్ గా చెప్పిఉంటాడంతే!

   • నిజమే…..అందుకే కనీసం నటన కోసమైనా (సినిమా కోసమైనా) ఒక ఖఛితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు అన్నాను. యండమూరి కి ఉన్న ఫేమ్ కి, డైరెక్టర్, ప్రొడూసర్ లు కన్విన్స్ అయ్యే అవకాసం వుంది కద. అలా కన్విన్స్ చేసేసి, శివాజి ని దెయ్యాలు ఉన్నట్ట నమ్మించి, హర్షవర్థన్ ని దెయ్యాలు లెవన్నట్టగా నమ్మించి, ఏమో దెయ్యాలు ఉన్నయ్యో, లేవో అని ప్రేక్షకులకే వదిలేయకకుండా, నేను పైన్ చెప్పినట్టు సినిమా కోసమైనా ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పారు.

 18. ముందు ఈ పెళ్ళి పుస్తకం అనే కార్యక్రమాన్ని మీరు వర్ణించిన తీరు అద్భుతం! వీటి ప్రకారమే అయితే ప్రతి కుటుంబమూ ఆనంద సాగరమే!

  ఈ కార్యక్రమం నేను కూడా చూశానండీ! మీలాగే నాకూ, నాలాగే చాలా మందికీ ఆయన భార్య అనూగీత గారిని చూస్తే “పాపం” అనే అనిపించింది.చాలా ప్రాక్టికల్ గా చెప్పాననుకుంటూ

  “ముసలి తనంలో కాష్ దగ్గర పెట్టుకోవడం అవసరం” అని చెప్పడం చూస్తే నాకేమనాలో తోచలా!(ప్రతి వాక్యం గుర్తుంది ఈ ఇంటర్వ్యూలో)

  ఇంటర్వ్యూ మొత్తం ఆయేదాకా ఏమీ తోచలా! టీవీ 9 లో ఆ మధ్య ఆయన నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికీ, ఈ ఇంటర్వ్యూకి తేడా బొత్తిగా లేదనిపించింది.

  మొత్తం మీద స్వోత్కర్ష ఎక్కువ…ఇదొక్కటే అర్థమైంది.

  వ్యక్తిత్వం గురించి బాగా చెప్పారు. కమర్షియల్ రచయితల వ్యక్తిత్వాన్ని వారి రచనల ద్వారా అంచనా వేయడం ఎలా సాధ్యమవుతుంది?

  @సౌమ్య,

  కమర్షియల్ రచయితలు ఒక్కో పుస్తకం ఒక్కోరకంగా రాయడంలో ఆశ్చ్యర్యమేముంది? వాళ్ళకి కమిట్ మెంట్ ఉండదు కదా! పైగా చేయి తిరిగిన ప్రతిభాశాలి కదా! నాకు పర్ణశాల, అనైతికం బాగా నచ్చుతాయి.

  వెన్నెల్లో ఆడపిల్ల కూడా!

 19. No need a number of discussions…. because according to me Mr.Yandamoori is pakka practical person. His views are like that we born as individuals and die as individual… in between this we have to live, to live we have to eat, to eat we have to earn, to earn we have to do some job or business. As we are social beings, we have to follow the rules like marriage, human relations etc.

  For getting success as writer and dominate the lady writers at that time, he must wrote some thing special to attract readers, so that he wrote Tulasi Dalam, etc., When he became a popular writer, after that he started novels to suit cinemas. After that some readers converted into TV audience, then he want to enter into cinemas, tv’s etc. But, he could not get success.. and when psychiatrists become popular he turned his power of knowledge to this type of novels, attended for programmes etc. At any time, earning is important, more than other things. That is not wrong… he is using his power of knowledge and speaking…. No need to pity on his wife know him and his thoughts. Number 1 Kavadam yela, Tappu cheddam Randi, Antarmukham, etc. novels shows his nature and his practicality.
  Nothing is wrong with him… he is correct…as a human being….

 20. yandamoori profiessional writer. AnandO bramha lO anukunTa, “professional writer anEvADu, cinema tickets kosam queue lo nilabadi ayinA sarE vrAyagalagAli” ani cheptadu. he is yandamoori, professional writer, not SriSri or gadhdhar. vALLa bhAvAlanu panchukOvaDAniki, pATalu, kavitalni mAdhyamamgA upayOginchinaTTu, eeyana navalalu upayOginchukOvAlani meeru expect chestunnAru. exactly, meeru mention chEsina, yandamoori samAdhAnamE, meeku vartistundi. meeru yanDamoori kathalannI okE bhAvAnni pratibimbinchAlani expect chestunnAru. Ayana adi follow kAkapOyE sariki, meeku Ayana nachchalEdu. asalu E rachayita ayinA sarE, alA enduku cheyyAli. vALLu vrAsEdi Dabbu kOsam, manam chadivEdi entertainment kOsam. that’s all.

  treat him like a writer. personality development books pakkana pedite, he wrote novels, not to educate people. That’s his profession.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: