వ్రాసినది: mohanrazz | 2011/07/10

శ్రీ శ్రీ “సినీ” పాట లో “సిన్న” మిస్టేక్..

“తెలుగు వీర లేవరా
దీక్ష బూని సాగరా
దేశమాత స్వేచ్ఛ కోరి
తిరుగుబాటు చేయరా..!”

ఈ పాట వినని తెలుగువాడు ఉండకపోవచ్చు. “అల్లూరి సీతారామరాజు” చిత్రం కోసం శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాట అప్పట్లో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించింది.

   

 ఇంకొక విషయం “ఉర్రూతలూగించింది” లాంటి పదాలు ఇలాంటి పాటలకి ఉపయోగించవచ్చో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఆ మధ్య ఒక సారి ఇలాగే ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ అడిగాను “ఏం చేసావ్ వీకెండ్” అని. అతనన్నాడు- “చాలారోజులుగా చూడాలనుకుంటూ చూడలేకపోయిన మూడు సినిమాలు చూసాను” అన్నాడు.
“ఏ ఏ సినిమాలు?”
“ఒకటి పందెం కోడి, రెండోది దొంగ మొగుడు, మూడోది స్వాతికిరణం”
“అవునా? ఇంతకీ ఎలా ఉన్నాయి మరి నీకు?”
“మొదట దొంగమొగుడు చూసాను, మస్త్ అనిపించింది. ఆ తర్వాత పందెం కోడి చూసాను, ఇంకా మస్త్ అనిపించింది. చివర్లో స్వాతికిరణం చూసాను, మస్తుమస్తు అనిపించింది” అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. “బాబయ్యా. స్వాతికిరణం మంచి సినిమా. కాదనను. నీక్కూడా నచ్చిందనుకో. ఎక్సలెంట్ మూవీ అనో, అద్భుతం గా ఉంది సినిమా అనో, మాస్టర్ పీస్ అనో బ్రహ్మాండమైన సినిమా అనో అను. అంతే కానీ స్వాతి కిరణం లాంటి క్లాసిక్ మూవీ ని పట్టుకుని- మస్తుమస్త్ సినిమా, కెవ్వుకేక సినిమా,  పుచ్చెల్ పగిలేలా ఉంది అంటే కొంచెం ఆడ్ గా అనిపిస్తోంద”ని చెప్పా 🙂 . అంటే ఎవరి వే ఆఫ్ ఎక్స్ ప్రెషన్ వాళ్ళది, కరెక్టే కానీ, నాకెందుకో సింక్ అవలేదు మరి!!

                

సరే, తెలుగు వీర లేవరా పాట ని “ఉర్రూతలూగించింది” లాంటి పదాలతో చెప్పొచ్చా లేదా అనే దాన్ని పక్కన పెడితే, ఆ రోజుల్లో రాష్ట్రాన్ని ఈ పాట కుదిపేసిన మాట వాస్తవమే. అయితే ఈ పాట లో ఒక చోట ఒక లైన్ ఇలా వస్తుంది..

“…ప్రతి మనిషీ – సింహాలై గర్జించాలి…
సింహాలై గర్జించాలి”       

గుర్తొచ్చిందా ఈ సెంటెన్స్. అయితే ఇందులో చిన్న మిస్టేక్ ఏంటంటే – “ప్రతి మనిషీ సింహమై గర్జించాలి” అని ఉండాలి వ్యాకరణశుద్ది గా అయితే! ఈ విషయాన్ని నేనేదో పెద్ద పిస్తా లాగా కనుక్కున్నానని అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు 🙂 . శ్రీ శ్రీ గారే ఈ పాట రిలీజయ్యాక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పటికే సినిమా రిలీజ్ అయి పాట జనం లోకి బాగా వెళ్ళిపోయింది. ముందుగా గమనించుకోకపోవడం నాదే తప్పు అని శ్రీ శ్రీ గారన్నారు. అయినా, ఆ పాట తెలుగు వాళ్ళతో ఎంతగా మమేకమైపోయిందంటే ఇలాంటి ఒకటీ అరా పొరపాట్లు ఎవరూ పట్టించుకోలేదు.

ప్రకటనలు

Responses

 1. మీ వ్రాస్తున్న snippets అన్నీ బాగుంటున్నాయి, ఒకప్పుడు రావి కొండలరావు గారు వ్రాసినట్టు.

 2. “నేనేదో పెద్ద పిస్తాలాగా ….”సినిమా భాషే!
  అర్రె, శ్రీ శ్రీ పాటలో తప్పు నేనెప్పుడో కనుక్కున్నాను కానీ నాకంటే ముందు శ్రీ శ్రీయే కనుక్కున్నారని తెలీలేదు.

 3. ఒక్కో మనిషీ వంద సింహాల రేంజిలో గర్జించాలని శ్రీశ్రీ భావమేమో 🙂

 4. c. Narayanareddy garu koodaa oka paatalo “noorellu nindugaa” badulu “noorellu nindagaa”ani raasaaru.Ardham enthalaa maaripoyindo kadaa?

 5. దేశమాత “ప్రగతి” – “స్వేచ్ఛ” కదూ!

  • ఓహ్..అలా ఎలా వ్రాసానో తెలీట్లేదు. థాంక్స్ 🙂 . టపా లో పైన అప్-డేట్ చేసాను !!

 6. […] కూడా బద్దకిస్తే ఇలాగే జరుగుతుంది. శ్రీ శ్రీ గారి పాట లో వ్యాకరణపరమైన ఒక చిన్న పొరపాటు […]

 7. ఈ టపా చదువుతుంటే ఈ మధ్యనే చదివిన డి.వి.నరసరాజు గారి ఆత్మకథ లో వ్రాసిన ఒక ముచ్చట గుర్తొచ్చింది. రంగుల రాట్నం సినిమాకి దాశరథి గారు “నడిరేయి ఏ ఝాములో…” అని వ్రాసారు కదా!, వారికే తరువాత అనుమానం వొచ్చిదంట , నడిరేయికి ఉండేది ఒకటే ఝాము కద అని. దానికి నరసరాజు గారు “ఎవ్వరికి అనుమానం రాదు లెండి” అన్నారుట. నిజంగానె ఎవ్వరు పెద్ద అభ్యంతర పెట్ట లేదు…పాట సూపర్ హిట్టు.

 8. ‘ఉర్రూతలూగించింది’ అనే పదం ఒక పాటలో వాడటం జరిగింది, రచయిత ఎవరో తెలీదు కానీ అది హిట్ పాటే, అది మంచిమనసులు సినిమా నుండి ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ మేల్ వెర్షన్ పాటలో పాడిందైతే బాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: