వ్రాసినది: mohanrazz | 2011/07/13

యమహానగరి కలకత్తా పురీ…

“చూడాలని ఉంది” సినిమా ఆడియో రిలీజ్ అవడానికి కొన్నిరోజుల ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు డైరెక్టర్ గుణశేఖర్. షరామామూలు గా “సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. చిరంజీవి గారు బాగా సహకరిస్తున్నారు, నిర్మాత గారు బాగా ఖర్చు పెడుతున్నారు” లాంటి కబుర్లు చెప్పాక, ఇక ఆడియో విషయానికి వస్తే ఇందులో మణిశర్మ గారు స్వర పరిచిన ఒక పాట చాలా అద్భుతంగా వచ్చింది, దానికి వేటూరి గారందించిన లిరిక్స్ కూడా ఎక్స్ట్రార్డినరీ గా ఉన్నాయి, “యమహా నగరీ, కలకత్తా పురీ” అంటూ మొదలయ్యే ఆ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఆ తర్వాత ఇచ్చిన ఒకటిరెండు ఇంటర్వ్యూల్లోనూ మరిచిపోకుండా ఈ పాట ని ప్రస్తావించారాయన. సరే, గుణ శేఖర్ అంత గొప్పగా చెబుతున్నాడు కదా, ఇంతకీ ఆ పాట ఎలా ఉందో అన్న కుతూహలం కొద్దీ ఆడియో రిలీజ్ అయిన మొదటి రోజే పాటలు విన్నాం. ఈ ఒక్క పాటనే కాదు, మిగతా పాటలు కూడా అన్నీ బాగున్నాయి. అయితే అన్నింటిలోకీ బెస్ట్ సాంగ్ మాత్రం “యమహా నగరీ” యే అనిపించింది. గుణశేఖర్ గారు చెప్పినదానికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయనిపించింది వేటూరి గారు వ్రాసిన లిరిక్స్ కూడా.

 

సరే, ఈ పాట పదే పదే విని నాకూ ఆ చరణాలు కూడా అలా గుర్తుండి పోయాయి. అయితే ఒకసారెప్పుడో సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఆర్టికిల్ ఏదో చదువుతూంటే- “సుభాష్ చంద్ర బోస్ ఒరిస్సా లోని కటక్ లో జన్మించాడు” అని ఉంది. సరే అని ఒకట్రెండు చోట్ల కన్ ఫర్మ్ చేసుకుంటే, అది కరక్టే- నేతాజీ పుట్టింది ఒరిస్సాలో ని కటక్ లోనే!  వేటూరి గారు ఈ పాట లో వ్రాసినట్టు కలకత్తా లో కాదు. ఇంతకీ వేటూరి గారేం వ్రాసారంటే “యమహా నగరీ” పాట చరణం లో- 

 

నేతాజీ పుట్టిన చోట,
గీతాంజలి పూసిన చోట,
పాడనా తెలుగులో…

 

కాబట్టి ఈ లెక్కన కలకత్తా గురించి వర్ణిస్తూ, ‘గీతంజలి పూసిన చోట’ అనడం సబబే కానీ “నేతాజీ పుట్టిన చోట” అని అనడం సబబు కాదన్నమాట.అయితే నేతాజీ పుట్టింది కటక్ లో నే అయినా ఆయనకి కలకత్తా తోనూ అనుబంధం ఉంది. దానివల్లే వేటూరి గారు పొరబడివుండొచ్చేమో మరి. కొన్ని వేల ఆణిముత్యాల్లాంటి పాటలు వ్రాస్తున్నపుడు ఎక్కడో ఒకటీ అరా మానవసహజమైన పొరపాట్లు దొర్లడం సహజమైన విషయమే అనిపించింది నాక్కూడా!!!


Responses

 1. http://en.wikipedia.org/wiki/Subhash_Chandra_Bose

 2. వేటూరి ఇంకో పప్పుగిన్నెలో కూడా కాలు వేశాడు ఇందులో. ఈ పాట బేసిగ్గా పట్నం సుబ్రమణ్యయ్యరు రచించిన రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ అనే కృతి బాణీలో మొదలవుతుంది. పాట సాహిత్యంలో త్యాగరాజు ప్రస్తావన తెస్తాడు.

 3. సుభాష్ చంద్రబోసు పుట్టింది కతక్ లోనైనా….’నేతాజీ పుట్టింది మాత్రం కలకత్తా లోనే….నేతాజి పొలిటికల్ గా ఎదిగింది కలకత్తా లో కాబట్టి అలా రాశారేమో….

  • నాకు కూడా ఈ అభిప్రయము సరైందిగా తోస్తున్నది. కాని ఈ విషయం వేటూరి గారికి తెలుసునో లేదోనని చిన్న అనుమానం.

  • yes, meeru cheppindi nijam.

 4. ide baani ni srivariki premalekha cinemalo oka paataki kodaa vaadaru

 5. […] పొరపాటు దొర్లిందంటే అర్థముంది. వేటూరి గారు కొన్ని కారణాల వల్ల నేతాజీ కి […]

 6. వేటూరి వారు ఇదే బాణీ తో శ్రీవారికి ప్రేమలేఖ లో పరహింస పరాయణ చంద్ర శ్రీ అనే పాట కూడా రాశారు. ఇది రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ అనే మాటల తోనే మొదలౌతుంది.
  ఇవ్వాళే మీ బ్లాగు చూస్తున్నా. శైలి బాగుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: