వ్రాసినది: mohanrazz | 2011/07/25

థియేటర్లలో జనాల క్రియేటివ్ కామెంట్స్

Oy-ayan

సినిమా బాగా బోర్ కొడుతున్నపుడో లేక సినిమా లో ఏదైనా లాజిక్ మిస్సయినప్పుడో జనాలు భలే కామెంట్లు విసురుతుంటారు. జనాల క్రియేటివిటీ బయటపడుతూంటుంది అలాంటప్పుడు. ఈ టాపిక్ మీద వ్రాయాలంటే కొంచెం గుర్తు తెచ్చుకుంటే చాలా గుర్తు వస్తాయి కానీ ప్రస్తుతానికి – ఒకట్రెండు లేటెస్ట్ వి మాత్రం వ్రాస్తాను.

ఈ మధ్య వచ్చిన “ఓయ్” సినిమా తో బేబీ షామిలి హీరోయిన్ అయింది. సినిమా పబ్లిసిటీ లో కూడా షామిలి ని ఎక్కడా పోస్టర్స్ లో క్లియర్ గా చూపించకుండా పబ్లిసిటీ చేయడం వల్ల షామిలీ ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత తో వెళ్ళిన ప్రేక్షకులకి కొంచెం బొద్దుగా, లావుగా ఉన్న షామిలీ నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఈ సినిమాలో ఒక సీన్లో సిద్దార్థ షామిలీ కి ఫుడ్ తెస్తాడు. అన్నీ నార్త్ ఇండియా ఐటమ్స్ ఉంటాయి అక్కడ. షామిలీ ఉండి- నాకు ఇవేవీ ఇష్టం ఉండవు, అన్నం పప్పు ఉంటే చాలు నాకు అంటుంది. నిజానికి దర్శకుడు హీరోయిన్ ఎంత సంప్రదాయపద్దతుల్లో ఉంటుందో చెప్పడానికి ఆ సీన్ వ్రాసుకున్నాడు. ఎవడో చిర్రెత్తిన ప్రేక్షకుడనుకుంటా-గట్టిగా అరిచాడు- “అందుకే, నువ్వట్లా ఉండేది”   :D(షామిలీ లావుగా ఉండటం గురించి).

అలాగే వీడొక్కడే అని ఇంకో సినిమా వచ్చింది. సూర్య, తమన్నా లది(తమిళ్ ‘అయన్’). మిగతా చాలా తెలుగు తమిళ సినిమాల్లో లాగే ఇందులో కూడా ఇంటర్వల్ బ్లాక్ అప్పుడు హీరో హీరోయిన్లు అపార్థాలతో విడిపోతారు. ఇంటర్వల్ అయ్యాక సూర్య వచ్చి రోడ్డు మీద వెళ్తున్న తమన్నా ని క్షమించమంటూ వెంటపడుతూంటే తమన్నా పట్టించుకోకుండా వెళ్తూంటుంది. సూర్య వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తూంటే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి- ఈవ్ టీజింగ్ బాపతనుకుని-సూర్యని గదమాయిస్తుంది. సూర్య “అదేం కాదు మేడం, తను నాకు తెలుసు” అంటాడు.

కానిస్టేబుల్ తమన్నాని అడుగుతుంది- “ఏమ్మా, ఇతను నీకు తెలుసా?” అని.

తమన్నా ఏమీ చెప్పకుండా అలాగే చూస్తుంటుంది. తెలుసని చెప్పమన్నట్టు ప్రాధేయపూర్వకంగా చూస్తుంటాడు సూర్య.
“చెప్పమ్మా, తెలుసా, లేదా?” రెట్టించి అడుగుతుంది కానిస్టేబుల్.
కాసేపలాగే చూసి చివరికి చెబుతుంది తమన్నా – “తెలుసు…..నిన్నటిదాక” .


ఎవరో అరిచారు- “దాన్నే , ‘తెలుసు ‘అంటారు” 🙂

ప్రకటనలు

Responses

 1. haha..

 2. హహహ

 3. ఇలాంటి సంఘటన ప్రేమ దేశం సినిమా అప్పుడు జరిగింది, నాకు బాగా గుర్తుండి పోయింది. అబ్బాస్, టబ్బు రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉంటే టబ్బు కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోతుంది. షరా మాములుగా అదే టైం లో ట్రైన్ వస్తుంటుంది, అబ్బాస్ ఆమే కాలు ఎలాగైనా బయటకి తియాలి అని ట్రై చేస్తా ఉంటాడు. మేమందరమూ నోట్లో వేలు పెట్టుకుని వీర టెన్షన్ పడిపోతుంటే వెనకనుండి ఎవరో అరిచారు “మంచిగైందా బిడ్డా, మళ్ళెప్పుడన్నా పెడతవా ట్రాక్ లో కాలు?” అని. ఒక్క సారిగా అక్కడ అంతా ఘొల్లున నవ్వులు

 4. 🙂 🙂

 5. హ హ, బావున్నాయి. ఇవి అన్నీ చదివాక నా చిన్నతనం లో జరిగిన సంఘటన గుర్తొస్తోంది. నేను 7 వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా, మా ఊళ్ళో (విజయనగరం) NTR ది ” సీతారామకల్యాణం (1961)” రిలీజ్ అయింది. మంచి సినిమా కదా అని మా కుటుంబమంతా ఒక పది మంది వరకు కలిసి వెళ్ళాము. ఆ సినిమాలో రావణాసురుడు (NTR) , శివుని పూజిస్తూ “కానరార కైలాసనివాస” అనే పాట, “జయద్వదభ్రవిభ్రమ” అనే స్తోత్రం, “పరమ శైవాచారపరుద….” అనే పద్యం పాడిన తరువాత కూడా శివుడు కరుణించలేదని పేగులు తీసి వాయిస్తాడు.

  ఆ సినిమా నేను అదే మొదటిసారి చూడడం. ఆ సీను ఎంతో ఉత్కంఠం గా ఉంటుంది. థియేటర్ లో అందరు అంటే ఆ సినిమా అంతకు ముందే చూసినవారు NTR నటనకౌశలాన్ని తిలకిస్తూ, చూడనివాళ్ళు ఏమి జరుగుతుందో అని ఎంతో ఆత్రుత గా చూస్తున్నారు. ఇంతలో మా వెనుక వరుసలో కూర్చున్న ఒక ఆవిడ, ఆ పాట‌, పద్యం అయిపోగానే గట్టిగ‌ ఒక 4-5 వరుసలకు వినబడేలా “ఇప్పుడు చూడు పేగులు తీసి వాయిస్తాడూ” అన్నారు. వెంట‌నే పక్కనున్న ఆవిడ భయంతో వణికిపోతూ “ఎవరివి” అని అడిగింది. అంతే అంత ఆర్దమైన సీను లో కూడా జనాలందరూ ఘొల్లున నవ్వేసారు. ఆ సంఘటన‌ని మా ఇంట్లో మేము ఇప్పటికి తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాం.

  • >> “నేను 7 వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా, మా ఊళ్ళో (విజయనగరం) NTR ది సీతారామకల్యాణం (1961) రిలీజ్ అయింది”

   1961 నాటికే ఏడో తరగతి ….
   మీరు అంత పెద్దవారు అనుకోలేదు!

   • మీరు మరీనూ….బాలకృష్ణ, రజనీలతో జంధ్యాల కూడా ఒక ‘సీతారామకళ్యాణం’ తీశాడు..దానితో కన్‌ఫ్యూజ్ అవకూడదని 1961 అని వ్రాసారనుకుంటా సౌమ్యగారు….

    • మీరు మరీ మరీనూ .. నాకా సంగద్దెల్వదా ఏటీ? 😀

     • మీరు మరీ మరీ మరీనూ…మీకు తెలీకుండా ఉంటుందని నేనెలా అనుకుంటాను.. ఏదో సరదాకి 😀

      • మీరిద్దరి మరీ మరీ ….(infinite) నూ
       నేను ఏడవ‌తరగతి చదివిన సంవ‌త్సరం కోసం మరీ ఇంత ఇది అయిపోతున్నారు 😀

 6. మా చిన్నప్పుడు ఎంటీఆర్ హీరో, రాజనాల విలన్ గా బోల్డన్ని జానపద, రాజుల సినిమాలు వచ్చేవి. వాట్ని మిస్ కావడానికి వీల్లేదు. మాకు మా పెద్దమ్మ ఇంట్లో పనిచేస్తూండే ఒక పనిమనిషి అచ్చమ్మ ని తోడిచ్చి పంపేవారు. తనకి సినిమా అంటే గొప్ప ఇష్టం. మేము కత్తి ఫైటింగులూ వాటిల్లో సీరియస్ గా లీనమైపొతే, అచ్చమ్మ మాత్రం.. ‘ఎంటీ వోడా – నీ వెనకాలే, ఆ రాజనాల గాడున్నాడు, ఓలమ్మో కత్తెట్టి పొడిసేస్తున్నడు బాబూ.. ఒరే నీ వెనకాల చూడు !’ అని కేకలు పెట్టేది. అచ్చమ్మ తో సినిమా కి వెళ్ళాలంటే సిగ్గు గా ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు తను ఎస్కార్టు లేకుండా పంపరు !

  మళ్ళీ కుతంత్రాలూ – కుట్రలూ జరుగుతున్నపుడు – అవేమీ తెలియని హీరో అమాయకంగా ఆ ట్రాప్ లో దిగుతున్నపుడు – తను హీరో కి ఏదో రకంగా కుట్ర గురించి చెప్పీసి, రక్షించేయలని చూసేది. ఎంటీఅయార్ కి – కేకలేస్తూ కుట్ర గురించి చెప్పేసేది. మిగతా వాళ్ళు విసుక్కునే వారు. మేము ఊరుకో అచ్చమ్మ ! అని బ్రతిమలాడేవాళ్ళం. లాస్టు కి హీరో కి ఏ గండశిలో లాంటి శిక్ష పడినపుడు ‘దరమ పెబువు కి ఎంత కష్టం వచిందీ!’ అని శోకాలు పెట్టేది. ఇవి క్రియేటివ్ రెమార్క్స్ కావు. పూర్వకాలపు పల్లె వాళ్ళు ఎంత అమాయకంగా సినిమా చూసేవారో అని చెప్పడానికే !

  • ఒక జంధ్యాల గారి సినిమా లో (ఆనంద భైరవి అనుకుంటా, సరిగ్గా గుర్తు లేదు.) శ్రీలక్ష్మి సినిమా చూసి వచ్చాక వాళ్ళ అమ్మ తో “ఆ సినిమా లో NTR చనిపోయాడే అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ” అయ్యో ఎంత కష్టమొచ్చిందే నా తల్లి” అని ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళ ఏడుపు చూసి నూతన్ ప్రసాద్ జుట్టు పీక్కుంటూ ఉంటాడు.

  • సో మీది కూడా విజయనగరం అన్నమాట

   • అవును, మీది కూడా ఇజీనారమేనా? 🙂

    • హ హ నాకు తోడు ఉన్నారు ,అవ్నును సౌమ్య గారు గంట స్థంభం దగ్గర 😀

     • అబ్బ, భలే ఆనందం గా ఊంటుంది కద మన ఊరివాళ్ళని కలిస్తే [:D]. మాది గుంచి దగ్గర, పొత్తూరివారి వీధి.

      • అవను సౌమ్య గారు బాగా చెప్పారు, అచ్ఛమ డి సునీత గార్లది కూడా మన ఈజాయనారమే అని నా డౌట్ 🙂

 7. ఈమధ్యనే జరిగిన ఇంకొక latest సంఘటన:
  ఈ నెల మొదటి వారం లో మేము మా ఊరు వెళ్ళాము. అక్కడ‌, మా cousins అందరం కలిసి “మగధీర” సినిమా కి వెళ్ళాము. ఆ సినిమా లో యువరాణి (కాజల్) కి, విలన్ పై వస్త్రం (దుప్పట్టా) తొలగించి భారీ డైలాగ్స్ చెప్పి కాలబైరవుడికి (చరణ్), తనకి మధ్య గుర్రప్పందెం పెట్టిస్తాడు కద. అందులో బైరవుడు గెలిచి రాకుమారి వస్త్రాన్ని తెచ్చి ఇచ్చాక చెలికత్తెలు అది యువరాణి కి అలంక‌రిస్తారు కద. ఆ సీను అవ్వగానే మా cousin “పెద్ద తేడా ఏముంది” అనేసాడు. అంతే మాతో పాటూ మా ముందు, వెనుక వరుసల వాళ్ళు కూడా ఫక్కున నవ్వేసారు.

 8. మరో చిన్న జోకు.. తొలిప్రేమ సినిమా చూస్తున్నప్పుడు. కీర్తి రెడ్డి లోయలోకి పడిపోతుంటే పవన్ కళ్యాన్ రక్షించేప్రయత్నం చేస్తాడు.
  సపోర్ట్ ఇవ్వడానికి పవన్ కళ్యాన్ కీరిరెడ్డిని పుష్ చేయడానికి తన హిప్స్ దగ్గర చేయిపెడతాడు. వెనక వరసలో ఎవరో “చెయ్యి తియ్యరరేయ్” అని అరవడం అంత ఉత్కంఠ సీనులోనూ అందరం గొల్లుమని నవ్వడం. నైస్ బ్లాగ్.

 9. ఇలాంతిదే నెను జానీ సినిమా చూస్తున్నప్పుడు జరిగింది సినిమా ఐతే అంతగా గుర్తులేదు గానీ అదిమాత్రం గుర్తుండి పోయింది.
  హీరో హీరోయిన్ని చూడటానికి వచ్చి ఆమెకు కాఫీ పెట్టి తీసుకు వస్తాడనుకుంటాను. కాఫీ బెడ్ పక్కన పెట్టి (ఆరోగ్యం) “ఎలావుంది” అనడుగుతాడు. వెనకనుంచి రివ్వున వచ్చింది సమాధానం “ఇంకా తాగ లేదు కదరా” అని.

 10. నేను రెండు మూడు బ్లాగులు చూశాను కత్తి గారు అన్ని చోట్లా హహహ అంటున్నాడెమిటి?

  • హల్వా హలీం హార్మోని ??? 🙂 😀

   • అవును. కత్తి గారు అన్ని చోట్లా హహహ అంటున్నారు. ఎమయినా తేడా చేసిందెమో ?? 🙂

 11. అదేదో మురళీమోహన్, జయసుధ నటించిన సినిమా. పేరు గుర్తులేదు. సినిమా బోర్ కొట్టేస్తుంది. ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. జయసుధ దగ్గరికి పిల్లలు చేరి మారాం చేస్తుంటారు. జయసుధ పిల్లలను “కథ చెప్పనా? పాట పాడనా? మీకేం కావాలి?” అని అడుగుతుంది.
  అప్పటికే విసిగిపోయిన నా మిత్రుడు “మాకు ఇంటర్వెల్ కావలి” అని అరిచాడు. సినిమాహాలంతా ఘొల్లుమంది.

 12. ఇలాంటిదే నాకు కూడా ఒకసారి జరిగింది.
  మేము ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్ సప్తగిరి ధియేటర్లో ‘చక్రం’ అనే చిత్ర రాజనికి మంచి వేసవిలో రెండో ఆటకి వెళ్ళాము. మాకెందుకో సినిమా అసలు నచ్చలేదు. ఆ సినిమాలో హీరోకి ఏదో జబ్బు చేస్తుంది. అది తెలియని హీరోయిన్ ఛార్మి ఒక సీన్లో హీరోకి దొరక్కుండా పరుగెడుతున్నప్పుడు వెనక నుండి మా ఫ్రెండ్ ఒకడు గట్టిగా “ఒసేవ్, వాడికి అసలే రోగం వచ్చింది, వాడిని అలా పరిగెత్తించి పరిగెత్తించి చంపేస్తావా ఏంటి?” అని అరవడంతో హాల్ అంతా గొల్లుమన్నారు.

 13. nice incidents…………..

  చాలా చాలా బాగున్నాయి………….

  especially from srinivas,shankar…

  thx man………….for sharing……

 14. చాలా బాగుంది బ్లాగు మిత్రమా..అందరి కామెంట్లు కూడా బావున్నాయి…నేను ప్రతి రోజు క్రమం తప్పకుండా చూస్తున్నాను…
  “మగధీర” లో పతాకస్తాయి సన్నివేశాలలో ఓ చోట శ్రీ హరి జీపు తో హెలికాప్టర్ ని గుద్దుతూనే ..వెనక నుండి ఎవడో “బాలయ్యా..బాలయ్య…” అని అంటూనే ..జనాలు అందరూ బలే నవ్వేసారు..

 15. మంచి టాపిక్ మోహన్ రాజ్ గారు. కామెంట్స్ కూడా బాగున్నాయి. హాయిగా నవ్వుకున్నాను 🙂

 16. సమర సింహ రెడ్డి / నరసింహ రాయుడు (ఒకప్పుడు గుర్తుండేది ఇప్పుడు మర్చి పోయాను) ఫేమస్ డైలాగ్ “కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను” వచినప్పుడు
  మా ఫ్రెండ్ ఒక్కడు సీరియస్ గా
  “చేతబడి గాని చేస్తాడేమో”…. అని అనగానే అంత సీరియస్ సీను(?) లో కూడా గొల్లు మని నవ్వుకున్నాం 🙂

 17. నా చిన్నప్పుడు శృతిలయలు సినిమాకి వెళ్ళాము ఫేమిలీ అంతా. సినిమాలో సుమలత కాళ్ళు ఇలా పైకి మడిచి, పాదాలకున్న అందెలు కనపడేలా కూర్చుంటూ ఉంటుంది. ఒకటీ రెండూ కాదు, ఎన్నో సందర్భాలు. ఆ అందెలు కూడా మెరిసిపోతూ బాగా కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ప్రేక్షకుల్లోంచి ఒక పెద్దాయన ఘోష – “అంతంత పెద్ద పెద్ద అందెలెట్టుకుని అట్టా సూపెడుతూ కూసోమాకు తల్లీ… మా ఆడోళ్ళు అయి సూసారంటే ఆనక కొనలేక మేం సావాల”

 18. ఢీ సినిమాలో ఒక సన్నివేశం లో జెనీలియా “ఇక్కడున్న వాళ్ళంతా జంతువుల్లా నువ్వొక్కడివే మనిషిలా కనిపిస్తున్నావ్ ” అని విష్ణుతో అంటుంది. అప్పుడు మా friend ఒకడు “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” అని పాడాడు. నవ్వలేక చావడం మా వంతయింది

 19. ఉషాకిరణ్ వారి “ఆనందం” సినిమా చూశారా? అందులో ఆకాష్, రేఖా హీరో హీరోయిన్లు. చనిపోయిన వారి స్నేహితుల వలన వీరిద్దరూ ప్రేమించుకొంటారన్నమాట. అందులో క్లైమాక్సులో వారి స్నేహితుల సమాధుల జంట ముందు నిల్చుకొని నివాళి అర్పిస్తూఉంటారు… ఇంతలో ఒకడు “వారి చావు..వీరి పెళ్ళికి వచ్చిందన్న మాట” అని అరిచాడు. అంత భారమైన సీన్లోనూ రూమంతా నవ్వుతో నిండిపోయింది 🙂

 20. “దిల్ తో పాగల్ హై” చూశారా? అందులో ఒక సన్నివేశంలో మాధురీ దీక్షిత్ మనస్సు గాయపడేలా షారుక్ మాట్లాడతాడు. కొన్ని క్షణాల పాటూ కన్నీళ్ళతో నిండిన కనులతో షారుక్‌ని చూస్తూ వెనక్కు తిరిగి పరిగెడుతుంది. ఇలా జరుగుతుందని ముందే ఊహించినట్లు ఉన్నాడు ఎవడో… కరెక్టుగా .. సీన్‌తో sync అయ్యే విధంగా “గెట్..సెట్..గో…” అని గట్టిగా అరిచాడు. అంటే గో అనే అరిచిన వెంటనే మధురి పరిగెడుతుందన్న మాట…. 🙂
  ఆ అఙ్ఞాత వ్యక్తి హాస్య స్పూర్తికి నా జోహార్లు 😀

 21. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో, త్రిషా చుడీదార్ హుక్ ఊడిపోయింది అని చెప్పటానికి, సిద్ధార్థ్ “నీ వీపుమీద పుట్టుమచ్చ ఉంది” అని చెప్తాడు.

  అప్పుడు మా ఫ్రెండ్ “ఆ నేనూ చూశాను” అని అరిచాడు
  (Its Trisha, if you remember some scandal 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: