వ్రాసినది: mohanrazz | 2011/07/30

“మ”న టి.రాజేందర్ “M.A”

T.Rajendar

ప్రేమ సాగరం, నా చెల్లెలు కళ్యాణి, మైథిలీ నా ప్రేయసి లాంటి డబ్బింగ్ సినిమాలతో ఆ రోజుల్లో తెలుగువాళ్ళకి పరిచయమయ్యాడు టి.రాజేందర్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, సినిమటొగ్రఫీ, కొరియోగ్రాఫర్, దర్శకత్వం – ఇలా ఇన్ని క్రెడిట్స్ టైటిల్స్ లో ఈయన పేరు మీద వేయడానికి 35mm స్క్రీన్ సరిపోక ఈయన సినిమాలన్నీ 70mm లో వేసేవారని ఒక టాక్ :-). పాటలు, కొరియోగ్రఫీ లాంటి మిగతా డిపార్ట్‌మెంట్లన్నీ ఘోస్ట్స్ ని పెట్టి లాగించేసాడనుకున్నా అది కూడా ఈయన దర్శకత్వ ప్రతిభే కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్ హి ఈజ్ వెరి టాలెంటెడ్ అనే చెప్పాలి. టాలెంట్ సంగతి పక్కన పెడితే ఈయన ఆరోజుల్లో చాలా విన్యాసాలే చేసేవాడని అంటారు. ఏదో సినిమాలో ఒక పాట కోసం లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేసి, ఆ పాట షూటింగ్ అయిపోగానే- ఆ సెట్ లో ఇంకెవరూ షూటింగ్ చేయకుండా, ఆ సెట్ ని ఇంకెవరూ కాపీ కొట్టకుండా లక్షలు పోసి వేసిన సెట్ ని పెట్రోల్ పోసి తగలెట్టేవాడట. అలాగే ఒకానొక సమయం లో ఈయన ఇమేజ్ రజనీకాంత్ తో సమానంగా ఉన్నప్పటికీ (??) ఆ తర్వాత రజనీ, ఈయన లాంటి వాళ్ళు  అందుకోలేనంతగా ఎదిగి పోవడం వల్ల రజనీకంత్ అంటే ఈయనకి ఒక రకమైన అక్కసని కూడా అంటూంటారు. చీటికి మాటికీ సింబు కూడా రజనీ మీద, అవాకులు చెవాకులు పేలడానికి నేపథ్యం కూడా ఇదేనని అంటారు. సరే, ఆ గొడవలన్నీ ప్రక్కన పెడదాం.

 

ఈ మధ్య జీ తెలుగు లో ఒక షో కి టి.రాజేందర్ జడ్జి గా వస్తున్నాడు. తెలుగూ పర్వాలేదన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. కాక పోతే ప్రాబ్లెం ఏంటంటె “ప్రేమ” అని వినబడకూడదు ఈయనకి. “ప్రేమ” అంటే పడి చచ్చిపోతాడు. మనల్ని సంపేత్తాడు. “సార్, ప్రేమ గొప్పది సార్”, “సార్, ప్రేమ గ్రేట్ సార్” అని చావగొడతాడు. ఆయన చెప్పేది వింటూంటే నాకు- ప్రేమికులని కలిపే క్యారెక్టర్ లో ఈయన్ని పెట్టి ఎవరైనా “ప్రేమా, నీకో నమస్కారం, నమస్కారం” అనే టైటిల్ తో మాంచి సినిమా ఒకటి తీస్తే పోతుందనిపించింది.

 

సరే, నిన్న షో లో కూడా ఇలాగే అదీ ఇదీ చెబుతూ ఓ మాటన్నాడు- “సార్, నాకు “మ” అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే- “అమ్మ” లో “మ” ఉంది సార్. “ప్రేమ” లో “మ” ఉంది సార్. ఇంకా….”సినిమా” లో కూడా “మ” ఉంది సార్. అందుకే సార్ నాకు “మ” అంటే చానా చానా ఇష్టం సార్”

మా ఫ్రెండ్ అంటున్నాడు- “అంత ఇష్టం ఉన్నవాడు “మా టివి” కే పోవచ్చు గా “జీ” లో ఎందుకు ఇంకా ఉండటం 😀  ” .


స్పందనలు

 1. hahhhahahaah excellent comment in the last line……………………..

 2. “అంత ఇష్టం ఉన్నవాడు “మా టివి” కే పోవచ్చు గా “జీ” లో ఎందుకు ఇంకా ఉండటం “ .
  ide sooper undi…..

 3. > అంత ఇష్టం ఉన్నవాడు “మా టివి” కే పోవచ్చు గా “జీ” లో ఎందుకు ఇంకా ఉండటం
  hahaha…

 4. 🙂 🙂

 5. athadu great person inthavaraki heroin ni ea movie lonu touch cheyyaledu.

 6. నాకెందుకో టి. రాజేందర్ అవసరానికి మించి ( ఆమాట కొస్తే జీటీవీ లో చాలా కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలందరూ) ఎమోషన్స్ ప్రదర్శిస్తున్నాడేమో అనిపిస్తుంది.

 7. ee mundhi, ee Blog chadivithe ‘ZEE’ ante naku chala istam andhuke ‘Zee’ vallu conduct chese program ki vastunnanu antadu!:)
  Kalikalam:)

 8. మీ కొన్ని హెడ్డింగ్స్ అబ్రకదబ్రగారిని గుర్తుకు తెస్తున్నాయి.

  • yeah..i always enjoyed going thru his blog…ఆయన గడియారం కథ మీద ఒక తప్పొప్పుల పట్టిక (రివ్యూ) 🙂 వ్రాద్దామని అనుకుంటూనే ఉన్నా, కాలం అలా గడిచిపోతూ ఉంది..

 9. 🙂 😀

 10. t rajendar choodadaniki comedy gaa unnanu , chaala talented person. nijamga aasu kavitvam , patalu baga cheputadu.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: