వ్రాసినది: mohanrazz | 2011/08/10

ఐ నో హిందీ బెటర్ దెన్ హిం.

నా ఫ్రెండ్స్ లో చాలా మంది తమిళియన్స్ వున్నారు. వాళ్ళందరికీ కామన్ గా తమిళ బాష లో నచ్చని ఒకే ఒక్క డైలాగు – ‘హిందీ తెరియుమా?’ . వీళ్ళందరూ ఈ పుణె శహర్ లో ఇన్నేసి నెలలు/సంవత్సరాల నుండి ఎలా నెట్టుకొచ్చేస్తున్నారని నాకు తెగ డౌట్ వుండేది. ..!!

అప్పట్లో చెన్నై లో ఒకబ్బాయి తగిలాడు. పుణె లో జాబ్ వచ్చింది- నాతో పాటు -అతనూ సేం డే జాయినింగ్, సేం ఫ్లైట్. సరే, ఎయిర్-పోర్ట్ లో కలుద్దాం అని చెప్పా. ఉదయం 7కి ఫ్లైట్ అయితే 5:30 కి నేను మా ఫ్రెండ్ ఒకబ్బాయి (మాత్రమే) ఎయిర్-పొర్ట్ కి వెళ్ళాం. అక్కడికెళ్ళగానే R.B చౌదరి సినిమా లొ క్లైమాక్స్ షాట్ లాగా ఫ్రేం నిండా జనాలు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళూ వీళ్ళూ అబ్బో. అందరూ సేం క్వొశ్చన్ నన్ను – హిందీ తెరియుమా అని. నాకేమో హిందీ తెరియుం. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పడానికి తమిళే తెరియాదు. .! సరే, వాడేమో పుణె వచ్చాక – ‘భయ్యా, సైడ్ పే రుకో’ అన్న ఒకే ఒక్క సెంటెన్స్ నేర్చేసుకుని – దాంతోనే, వున్నన్ని రోజులూ పుణె ఆటో వాళ్ళని ‘గడగడలాడించి’ తర్వాత US వెళ్ళిపోయాడు. .!

మా రూం లో ఇంకొక అబ్బాయి వుండేవాడు. తెలుగే కానీ- కుర్రాడి బాల్యము, విద్యాభ్యాసము, బారిష్టర్ చదువులూ మొత్తం చెన్నై లో జరగడం వల్ల హిందీ ఒక్కముక్క కూడా రాకుండా పోయింది. జాబ్ సెర్చింగ్ గురించి పుణె వచ్చాడు. మేమంతా ఆఫీస్ కెళ్తే రూం లో ఒక్కడే వుండేవాడు. వాడికి హిందీ లో ‘క్యా’ అనే ఒకే ఒక్క పదం (సారీ.. అక్షరం) తప్ప ఏమీ రాదు. అసలు మేమెవరూ లేనప్పుడు పనామె తో హిందీ ఎలా మేనేజ్ చేస్తాడనేది మా పాలిటి కో సస్పెన్స్ థ్రిల్లర్. కూపీ లాగడానికి ఎన్ని సార్లు ఎంత స్ట్రాంగ్ గా ట్రై చేసినా అంత కంటే ‘స్ట్రాంగ్’ గా ఎదుర్కొనేవాడే తప్పించి విషయం చెప్పేవాడు కాదు. అట్టాంటిది ఒకానొక ‘వీక్’ఎండ్, రూం లో కరెంట్ పోయి, ‘పిల్ల ‘ గాలి కోసం మిద్దె మీదకెళ్ళినప్పుడు విషయం చెప్పాడు- మొదట్లో ఆమె ఏమడిగినా క్యా, క్యా అని తప్ప మరో మాట మాటాడకపోవడం తో ఆమే సూక్ష్మం గ్రహించేసి ఒక పుష్పకవిమానం టైప్ సైగబాష కి ఫిక్స్ అయిపోయిందంట. ఇప్పుడూ..రూం లో నీళ్ళు అయిపోయాయనుకోండి..ఆమె డైరెక్ట్ గా వెళ్ళి ఖాళీ బకెట్ ఒక దాన్ని పైకి ఎత్తి ధభేల్ మని కింద పడేసి (నీళ్ళు లేవన్నట్టుగా) చేతులు వూపుతుందంట (మా రూం లో నీళ్ళకు – బోర్ . మేమే మోటార్ వేయాలి). అప్పుడూ..మా వాడేమో గబగబా ఫ్యాన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ వేసి – తిరగని ఫ్యాన్ వైపు చూపిస్తూ(కరెంట్ లేదన్నట్టు) చేతులు వూపుతాడంట. అదీ సంగతి. అలా మా వాడు కొన్నాళ్ళు ‘డంబ్ చారడ్శ్ ‘ లో ప్రావీణ్యం సంపాదించాక చివరికి బెంగళూర్ వెళ్ళిపోయాడు.

ఇక ఆఫీస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ వున్నారు. ఇద్దరూ తమిళే. వాళ్ళిద్దరూ ఆపుడప్పుడూ హిందీ లో మాట్లాడుకుంటారు – లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందామని. అబ్బో. వాళ్ళు ‘నీఛే’ ప్లేస్ లో ‘పీఛే’ , ‘పీఛే’ ప్లేస్ లో ‘నీఛే’ పెట్టి మాట్లాడే హిందీని ఏ ఇ.వి.వి సత్యనారాయణ లాంటోడో గనక వింటే ..చచ్చారే.. సెన్సార్ వాళ్ళు..!! వాళ్ళిద్దరికీ మళ్ళీ కాంపిటీషన్. నా హిందీ బాగుందంటే నాది బాగుందని.
ఒక సారి వాళ్ళలో ఒకతనన్నాడు మాతో , రెండో అతన్ని ఉద్దేశ్యించి – ‘హే, ఐ నో హిందీ బెటర్ దెన్ హిం యార్ ‘ అని.
“ఒరే నువ్విదే ముక్క హిందీ లొ చెప్పరా – మేమంతా ఒప్పేసుకుంటాం, యు నో హిందీ బెటర్ దెన్ హిం అని” అని చెప్పా. ఖంగుతిన్నాడు.!!


Responses

 1. 🙂
  అవును మన తమిళ సోదరులకి హిందీ నాలెడ్జ్ కొద్దిగా తక్కువే.
  టపా బాగుంది సరదాగా. కామెడీ టచ్ తో మరిన్ని టపాలు రాయండి.

 2. 🙂

  తమిళ సోదరులకి హిందీ నాలెడ్జ్ కొద్దిగా కాదు పూర్తిగా తక్కవ. పైగా వాళ్ళకి హిందీ అంటే అదో రకమైన ఏహ్య భావం.

 3. Good one.
  My Pune experience was that, those people also don’t know Hindi too well. My be the scene changed after 20 years.

 4. మీరు అంతకుముందెప్పుడైనా ఈ విషయమ్మీద వేరే చోట ఎక్కడైనా వ్రాసారా..!? అంతకుముందెప్పుడో రెండు, నాలుగు paragrahs మక్కి కి మక్కి ఇవే చదివినట్లు గుర్తు..

  • అవునండీ..నా పాత బ్లాగ్ లో ఒకసారి వ్రాసాను..గుర్తున్నందుకు థ్యాంక్స్ 🙂

 5. నాక్కూడా హిందీ రాదు. ఎందుకో హిందీ అంటే నాక్కూడా అదోరకమైన ఏహ్యభావం. కొద్ది మంది హిందీ వాళ్ళు,(మన ఆంధ్రా వాళ్ళు కూడా ముఖ్యంగా హైదరాబాదు వాళ్ళు) భారతదేశంలో మనిషై పుట్టిన తర్వాత, ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి, లేకపోతే వాడు భారతీయుడే కాడు అన్నంతగా బిల్డప్ ఇవ్వడంతో, నాకు ఎక్కడలేని చిరాకు వచ్చి, వాళ్ళను రివర్స్‌లో ఏకేశా. ఫలితంగా నేను హిందీ నేర్చుకోవడం అన్న సంగతి అటుంచి, వాళ్ళే తెలుగు నేర్చుకున్నారు. :).

  నాకు తెలిసి అనవసరంగా మన రాష్ట్రం వాళ్ళే హిందీని నెత్తికెక్కించుకున్నారు. హిందీ ఎందుకురా అని ఎవణ్ణయినా అడిగితే, “నీకేం తెలుసురా, మనం నార్త్ సైడ్ జాబ్ కోసం వెళ్ళినప్పుడు అవసరమవుతుందిరా” అంటారు. మరి నార్త్ వాళ్ళు మన రాష్ట్రానికి జాబ్ కోసం రారా? వాళ్ళేమన్నా మనలాగా బాల్యం నుంచి మన భాషను నేర్చుకుంటున్నారా? అని నేనడిగితే “ప్రాబ్లెం ఏముందిరా? మనకు హిందీ వచ్చు కదా?” అంటారు? అంటే ఎటుతిరిగి లాభం వాళ్ళే పొందుతున్నారన్నమాట.

  క్షమించండి. మీ టపా సరదాగా ఉన్నప్పటికీ, నేను కొంచెం సీరియస్‌గా తీసుకున్నాను.

  • జాతీయ భాష గా హిందీ ని చేయాలా ఇంగ్లీష్ ని చేయాలా అన్న తీర్మానం చేసినపుడు కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు అధికంగా రావడం వల్ల హిందీ జాతీయ భాష అయిందట. లేదంటే ఇంగ్లీష్ భారతీయ జాతీయ భాష అయిఉండేది కాబోలు. .take it easy boss 🙂

   • జాతీయ భాష విషయంలో పోటీ పడింది తెలుగు, హిందీ అని చెబుతారు చాలా మంది. అంతేకాని ఇంగ్లీష్ కాదు. అయినా ఇదంతా ట్రాష్. అసలు మనకు జాతీయ భాష అంటూ ఏదీ లేదు. ఉన్నదల్లా Official Languages మాత్రమే. 18 భాషలూ కూడా జాతీయభాషలే. ఏదీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఉన్నతేడా అల్ల, ఆయా భాషలు మాట్లాడే ప్రజల సంఖ్యలో మాత్రమే. కాకపోతే, హిందీ వాళ్ళు వాళ్ళ భాషను బాగా ప్రచారం చేసుకున్నారు. హిందీ భాషా ప్రచారోద్యమాన్ని చేపట్టారు. దానితో ఆ భాషను తెలిసినవాళ్ళు పెరిగారు. అలాగే అదే జాతీయ భాష అనే భ్రమను కూడా ప్రజల్లో కల్పించగలిగారు.

    మరిన్ని వివరాలకు ఇక్కడ చదవండి: http://factsaboutbharat.blogspot.com/2008/07/hindi-is-not-national-language.html

    మన భారతదేశంలోని ఏ భాషనైనా కొంచెం దృష్టి పెడితే, నెలరోజుల్లో చాలా వరకు అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు. అంతేకాని, జాతీయభాష పేరుచెప్పి అనవసరంగా స్కూళ్ళలో విద్యార్థులకు బలవంతంగా నేర్పించడం నాకు నచ్చలేదు.

 6. GOOD COMEDY

 7. అన్ని భాషలలోకెల్లా సులభమైన భాష హిందీ.
  తమిళులు వ్యతిరేఖిస్తున్నారని మనం కూడా అసహ్యించుకోవడం తప్పు.
  అయినా ఇప్పటి తరానికి ఇలాంటి హిపోక్రసీ ఎమీ లేదు.
  ఇంగ్లీషు, హిందీ వస్తే ఎక్కడైనా బతికేయచ్చు.
  వెంకయ్యనాయుడు గారిని చూడండి. వీలైనన్ని తెలుగు పదాలు కలిపేసి హిందీ మాట్లాడేస్తారు.

 8. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు గాని, పుణెలో ఉంటేమాత్రం జరా భద్రం. స్వైన్ ఫ్లూ అక్కడ అందరినీ బెంబేలెత్తిస్తున్నది. అసలు విషయానికి వస్తే, తమిళులకు మాతృ భాష మీద మమకారం చాలా ఎక్కవ. ఎంత ఎక్కువంటే అసలు వేరే భాషలను నేర్చుకోవడానికి కూడా అంతగా ఇష్టపడరు. మంచి హాస్యాన్ని పంచారు.

 9. బాసు ! నేను కూడా పూణేలొ ఉంటున్నాను. కాని హిందీ తెరియుము 🙂 మిమ్మల్ని ఒకసారి కలుసుకోవచా

 10. One thing to clarify – HINDI IS NOT A NATIONAL LANGUAGE. NEVER it was. Never it will be.

  Friends, you all must be surprised. There are only Official languages in India – English and Hindi are official languages and others are recognized languages and official in their respective States. That means you can pass bills or communicate on paper in your regional language to Pariament – the only condition is the language must be recognized by Govt. Please check wikipedia. English has same stature as Hindi as per constitution. If you say Official language is national language then English also would become National Language – what our leaders would never do as they may lose votes.
  ====
  The bill clause is like – Hindi would become National Language only after it becomes prominent languae through out India by 85% acceptability. 85 is huge. As long as Tamil people’s reproduction system is good, the number would never become 85%. So, 85% of people must be able to speak and read Hindi. They did not mention about writing.

  Then, to promote Hindi, “Hindi Prachaara Samiti” was started – we used to study in childhood – Prathamika, Madhyama, Raashtra, Visaarada etc. That is the committee that decides how many certificates have been given and how many people had enrolled for the certification etc – which are parameters for them to calculate the acceptance of Hindi through out India.

  When I showed this to North guys in India.gov.in portal they really went on blue and red and they denied it. They suddenly became one group 🙂 and I kept showing the same thing on India Govt’s official website and shown Wiki as reference. They did not accept. From then on, I wanted to spread this like anything. 😉 That evening I spent time in composing mail and sent to my friends asking them to send it to as many people as possible. Stallin lo Chiranjeevi laa… 🙂

  So… friends Hindi is not national language. We never have National Langaue. As long as Tamil-language-terrorism prospers in our country, Hindi would never become national language. 🙂 🙂 🙂 In fact, I am happy for this. Because North guys do feel we are inferior.

  P.S.: I like to talk in Hindi. It sounds good. But I never talk intentionally. 🙂 NO hard feelings.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: