వ్రాసినది: mohanrazz | 2011/08/12

హీరో చెల్లెలు

toli

తెలుగు సినిమాల్లో హీరో చెల్లెలు అంటేనే – ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. రివెంజ్, స్మగ్లింగ్, హీరోయిక్ కథలు తెలుగు సినిమాల్ని డామినేట్ చేసిన 80,90 దశకాల్లో – హీరో చెల్లెల్ని దారుణంగా చంపేస్తే కానీ దర్శక రచయితలకి మనశ్శాంతి ఉండేది కాదు. ఒక నటి ఉండేది వరలక్ష్మి అని చెల్లెలి పాత్రకి స్టాండర్డ్ గా. ఎన్ని సినిమాల్లో చచ్చిపోయేదో!!! 

తర్వాత్తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారాయి. ప్రేమికుడు సినిమాలో హీరో, హీరో వాళ్ళ నాన్న కలిసి మందు కొట్టి, ఫ్రెండ్స్ లా మాట్లాడుకునే సీన్ చూసాక మన రచయిత దర్శకుల్లో నెమ్మదిగా మిగతా కుటుంబ పాత్రలనీ ఫ్రెండ్స్ గా చేయడం మొదలైంది. మృగం అని జెడి సినిమా వచ్చింది. అందులో- హీరో హీరోయినూ; హీరో చెల్లెలు-ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి పబ్ కి వెళ్ళే సీన్ ఉంటుంది. ఆ రకంగా సురేష్ వర్మ/జెడి ఒకడుగు అలా ముందుకి (?) వేశారు. అయితే తొలిప్రేమ లో హీరో చెల్లెలు పాత్ర జనాల్ని బాగా ఆకట్టుకుంది. హీరో తో బాగా అటాచ్మెంట్ ఉండి, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేలా కరుణాకరన్ ఆ క్యారెక్టర్ ని తీర్చి దిద్దిన విధానం ఆ సినిమా సక్సెస్ కి బాగా దోహదపడింది. అయితే తొలిప్రేమ తర్వాత వచ్చిన సత్యం, వాసు తదితర సినిమాలన్నీ తొలిప్రేమ ట్రెండ్ ని కంటిన్యూ చేశాయే తప్పించి “సిస్టర్ క్యారెక్టరైజేషన్” లో తొలిప్రేమ తర్వాత తెలుగు సినిమాల్లో మళ్ళీ పెద్ద మేజర్ బ్రేక్ త్రూ ఏమీ ఇప్పటిదాకా రానట్టే.

సిస్టర్ సెంటిమెంటే ప్రధానంగా వచ్చిన రక్త సంబంధం, హిట్లర్ లాంటి సినిమాల్లో ఉండే డ్రామా కూడా జనాల్ని బాగా ఆకట్టుకునేదే. పుట్టింటికి రా చెల్లీ అనే సినిమా కి బిసి సెంటర్లలో బుధవారం రోజు మార్నింగ్ షో కి జనాలు క్యూలో నిలబడి టికెట్స్ తీసుకోవడం చూసి నాకు దిమ్మతిరిగిపోయింది అప్పట్లో.

ఆమధ్యెపుడో – జిద్ది(అనుకుంటా) అని సన్నీ డియోల్ సినిమా ఒకటి చూస్తున్నాము. ఒక సీన్లో హీరో చెల్లెల్ని ఎవడో అల్లరి చేస్తాడు. మా ఫ్రెండొకడు ఆ సీన్ చూస్తూ భయంకరంగా పగలబడి పగలబడి నవ్వుతూన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు అంటే ..అట్టాగే నవ్వుతూ- “చూడండి.. మీరు సినిమా చూడండి చెప్తా”. “నువ్వు ఆల్రెడీ ఈ సినిమా చూశావా” అనడిగితే..లేదు అన్నాడు..మరెందుకు నవ్వుతున్నావు అంటే- ” మామా..వాడు చెయ్యేసింది ఎవరి మీద…సన్నీ డియోల్ చెల్లెలి మీద..సన్నీ డియోల్ చెల్లెలు..హ్హ హ్హ హ్హ..సన్నీ డియోల్ చెల్లెలు మీద చెయ్యేసింది ..హ్హ హ్హ హ్హ…నెక్స్ట్ సీన్ ఎలా ఉంటదో ఊహించుకుంటూంటేనే భయంకరంగా నవ్వొస్తోంది ”

నిజంగానే నెక్స్ట్ సీన్ మావాడు చెప్పినదానికి మించి ఉండింది- సన్నీ డియోల్ వచ్చి వాడి చెయ్యి పూర్తిగా నరికవతల పడేస్తాడు.. 😀

ప్రకటనలు

Responses

 1. సినిమాల్లో సహాయక పాత్రలుండేది హీరో హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి. పితృస్వామిక భావజాలం అతిగావున్న సమయంలో తల్లీ,చెల్లెలు,పెళ్ళాలకు ఎన్ని కష్టాలుంటే హీరోగారి హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది.

  కాలంతోపాటూ ఒక మెట్రోసెక్సువల్ మేల్ గా హీరో మారుతున్నాడు. కాబట్టి తన హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి స్త్రీపాత్రలతో ఎంత సన్నిహితంగా,ఎంపతెటిక్ గా ఉంటే అంత మంచిది. చెల్లెలి పాత్రలతోపాటూ తల్లి పాత్రల్లోకూడా మార్పు వచ్చింది చూడండి. అలాగే హీరోయిన్లు యాక్షన్ పరంగా కాకున్నా కనీసం మాటలపరంగా “సమానం” అయిపోతున్నారు.

  • @@కాలంతోపాటూ ఒక మెట్రోసెక్సువల్ మేల్ గా హీరో మారుతున్నాడు. కాబట్టి తన హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి స్త్రీపాత్రలతో ఎంత సన్నిహితంగా,ఎంపతెటిక్ గా ఉంటే అంత మంచిది–

   అవును కరక్టే- తెలుగు వరకు చూసుకుంటే “నిన్నే పెళ్ళాడతా” సినిమా – మీరు చెప్పిన విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ and starting point!!

 2. హ హ హ బాగుంది నాకు ఒక జోక్ గుర్తు వస్తోంది. మా అక్క తన అమ్మాయికి పేరు కోసం వెతుక్కుంటోంది, స తో మొదలవ్వాలి మేమందరం లిస్ట్ ల నుంచి చదువుతున్నాము వరుసగా, సరోజ అనో సరళ అనో అనగానే మా అక్క చీదర గా మొహం పెట్టీ చీ ఆ పేరు అన్ని సినిమాలలో చెడిపోయిన చెల్లికి వుంటుంది నాకొద్దు అని నిర్ద్వందం గా తోసి పుచ్చింది, అంత పేరు కదా చెల్లెలంటే ఒకప్పుడూ…

  • చివరకి ఏ పేరు పెట్టారో చెప్పలేదు మీరు

  • హీరో చెల్లెలిని విలన్ లేదా విలన్ తమ్ముడు రేప్ చేస్తాడు. అప్పుడు హీరో రేప్ చేసిన వాడిని పట్టుకుని తన్ని తన చెల్లెలిని రేపిస్ట్ కే ఇచ్చి పెళ్ళి చేస్తాడు. రేప్ కి పెళ్ళి మాత్రమే పరిష్కారం అనుకుంటే భగ్న ప్రేమికులు యాసిడ్ దాడులు చెయ్యరు. నచ్చిన అమ్మాయిని రేప్ చేసి పెళ్ళి చేసుకుంటారు.

   • మీ ఉద్దేశ్యంలో సినిమాల్లో ఇప్పుడు విలన్ ఇద్దరు ని ఒకే సారి రేప్ చేస్తే ఇద్దరినిచ్చి పెళ్లి చెయ్యాలా ?

    • విలన్, విలన్ తమ్ముడూ ఇద్దరూ కలిసి హీరో చెల్లెలిని రేప్ చేస్తున్నట్టు చూపిస్తే అప్పుడు సినిమా వాళ్ళు హీరో చెల్లెలు ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటున్నట్టు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ లాజిక్ ప్రకారమే రేప్ కి పెళ్ళి పరిష్కారం. నిజ జీవితపు లాజిక్ ప్రకారం రేప్ కి పెళ్ళి పరిష్కారం కాదు.

   • సింహాద్రి సినిమా లో బేబీ సునయన ని ఆరుగురు రేప్ చేస్తారు అప్పుడు సునయన వాళ్ళ అరుగురుని పెళ్లి చేసుకోవాలి కదా నీ లాజిక్ ప్రకారం

    • భోగరాజు గారు,
     అది నరసింహుడు, సింహాద్రి కాదు. ఆ చెత్త స్టొరీ కి కోట్లు ఇచ్చి పక్క రాష్ట్రం నుండి తీసుకున్నారు. ఫలితం అందరికి తెలిసిందే, నిర్మాత హుస్సేన్ సాగర్ లో జంప్.
     తికమక

 3. అంటే సన్నీ డియోల్ హీరోయిన్ ని అల్లరి పెట్టొచ్చా ..హీరో చేస్తే చిలిపితనం అదే హీరో చెల్లలి మీద చేస్తే రాక్షసత్వమా…ఈ లెక్కన సన్నీ డియోల్ కి ప్రతి సినిమా లో తీసయాలి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య

 4. సినిమా సిస్టర్ కారెక్టర్లు నిజజీవితానికి పనికి రావు. సినిమాలో హీరో గారి అక్క లేదా చెల్లి సర్వసాధారణంగా పతివ్రత అయ్యి ఉంటుంది. భర్త పనికిమాలిన వాడో, దుర్మార్గుడో అయినా అతన్ని భరిస్తుంది. ఆ భర్త చివరిలో మంచి వాడిగా మారుతాడు. కొన్ని సినిమాలలో హీరో చెల్లెలు ఏరికోరి విలన్ గాడి తమ్ముడినో, కొడుకునో ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. వాడు పెళ్ళైన తరువాత తాను కూడా దుర్మార్గుడేనని బయట పెట్టుకుంటాడు. హీరో కూడా విలన్ చెల్లెలినో, కూతురినో ప్రేమిస్తాడు కానీ విలన్ చెల్లెలు/కూతురు మంచిది అయ్యి ఉంటుంది. విలన్ తమ్ముడు హీరో చెల్లెలిని మోసం చేసినట్టు విలన్ చెల్లెలు హీరోని మోసం చెయ్యదు.

 5. రాక్షస చెల్లెళ్ళు కూడా వున్నారండీ. సీమ సింహంలో అనుకుంటా, బాలయ్య చెల్లెలు దేవయాని కట్టుకున్న మొగుడ్ని నరికేసి “వాడెంతన్నా, మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే పోతాడు”(సరిగ్గా గుర్తులేదు కానీ ఇలాంటిదే ఏదో) అని దిమ్మతిరిగే డైలాగోటి చెపుతుంది. ఈదెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వటం అంటే ఏమిటో పండుగాడు రాకముందే నాకు తెలిసిపోయింది.

  • అవునవును…చెన్న కేశవరెడ్డి లో అనుకుంటా ఈ సీన్. దేవయాని భర్త ని చంపేసాక చెప్తుంది ఆ డైలాగ్..నేనూ సీమ లో పుట్టినదాన్నే అంటూ..బహుశా ఇది కూడా “పాత్ బ్రేకింగ్” 😀 😀 క్యారెక్టరైజేషనే అప్పటికి. కాకపోతే జనాలు “అంత పవర్ ఫుల్ క్యారెక్టర్” ని ఆదరించలేకపోవడం వల్ల మళ్ళీ ఆ మూస లో ఏ పాత్రా రాలేదు.. 🙂

  • భర్త పనికిమాలిన సోమరి పోతు లేదా దుర్మార్గుడు అయితే వాడ్ని వదిలెయ్యొచ్చు. కానీ చాలా సినిమాలలో హీరో చెల్లెలు అలాంటి భర్తని భరించే పతివ్రతగా చూపిస్తారు. మర్డర్ చేస్తున్నట్టు చూపించడం కూడా దారుణమే.

   • నువ్వు సాంబ అనే సినిమా చూసి కామెంటు అప్పుడు మీ కామెంట్ వెనక్కి తీసుకుంటారు

   • ఏదో సినిమా లో బేబీ సునయన ని ఆరుగురు రేప్ చేస్తారు అప్పుడు సునయన వాళ్ళ అరుగురుని పెళ్లి చేసుకోవాలి కదా నీ లాజిక్ ప్రకారం

 6. మూస పద్దతిలో కాకుండా చెల్లెల్లు పాత్ర ని కొంత‌ different గా తీర్చిదిద్దిన సినిమాలుగా “సీతారామరాజు”, “లాహిరి లాహిరి లో” అని చెప్పుకోవచ్చేమో. రెండు సినిమాలలో కూడా చెల్లెలు హీరో లతో close గా ఉంటుంది, పైగా తన ప్రేమ కథ ని success చేస్తారు అన్నదమ్ములు కలిసి.”సీతారామరాజు” లో రవితేజ మొదట విలన్ సైడ్ ఉన్న తరువాత మారి హీరో ల చెల్లెలిని పెళ్ళి చేసుకుంటాడు. ఆ concept ఆ రోజుల్లొ నాకు కొత్త గా, హాయి గా అనిపించింది. పైన‌ చెప్పిన రెండు సినిమాలకి Y.V.S. చౌదరి దర్శకుడూ కావడం విశేషం.

  • సీతారామరాజు, లాహిరి లాహిరి లో – ఈ రెండు సినిమాలూ నేను చూడలేకపోయాను కానీ పోయిన వారం టివి లో సీతారామరాజు వస్తూంటే కొంత మేరకు చూసాను. జనరల్ గా తెలుగు సినిమాల్లో మొదటి భార్య కొడుకులు హీరోలు అయి ఉంటారు, రెండవ భార్య కొడుకులు విలన్స్ అయి ఉంటారు ఇలాంటి సినిమాల్లో – కానీ సీతారామరాజు లో దీన్ని కూడ రివర్స్ చేసారనుకుంటా. కొంత డిఫరెంట్ గా ట్రై చేసాడనుకుంటా వైవిఎస్.అయితే బేసిక్ లైన్ క్షత్రియ పుత్రుడు తరహా లొ ఉన్నట్టనిపించింది.

   • అవును, ఈ సినిమాకి baseline concept ‘క్షత్రియపుత్రుడు’ నుండే తీసుకున్నరు. మీ observation కరక్టే, ఇందులో రెండవ భార్య పిల్లలని హీరో లుగా, మంచివాళ్ళగా చూపించారు.

  • సౌమ్య గారు sowmya writes బ్లాగ్ మీదేనా మొన్న ఈనాడు పేపర్ లో వసుంధర లో చూసాను అది మీరే అయితే కంగ్రాట్స్ ..

   • అవునా??? ఈనాడు పేపర్ ఏ తేదీన???

    • బాబోయ్, నాది కాదండీ. నాకు బ్లాగ్ లేదు. వేరే ఎవరో సౌమ్య అయిఉండవచ్చు. నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు మీ అందరికి తప్పకుండా చెప్తాను 🙂

     • బ్లాగ్ కంటే ముఖ్యమైనది కామెంట్ లకు moderation,moderation పెట్టుకుంటే వితండ వాదాల దాడి నుండి తప్పించుకోవడానికి కొంచెం అవకాశం వుంటుంది ..విచ్చల విడిగా రాసుకుపోతున్నాడు ఇక్కడ ఒకడు ఇక్కడేమిటి..కనబడిన ప్రతి చోటా.. వాడి నుండి విముక్తి కోసం ఆయినా మనకు తప్పదు

      • ఇక్కడ కాదండీ, ఎక్కడికెళ్ళినా వాడి బెడద తప్పట్లేదు మన‌కి…చెప్పి చెప్పి, వాదించి వాదించి, నోరు నొప్పెట్టి ఊరుకోవడం తప్ప చేయగలిగినది ఎమీ లేదు…అయినా ఇలాంటివాళ్ళు ఉంటే మనకి కూడా కాస్త ఆటవిడుపు గా ఉంటుందిలెంది. అప్పుడప్పుడూ మనం కూడా నవ్వుకోవద్దూ :)…ఏమంటారు?

     • సౌమ్యగారూ అవునా? మీకు బ్లాగ్ లేదా? పోనీ నవతరంగం లో సమీక్షలు,వ్యాసాలు వ్రాసింది కూడా మీరు కాదంటారా ఏంటి? 🙂

      • నేను కాదే 🙂

       • బావుంది మీ ఆట ..సెంట్రల్ university లో పి హెచ్ డి చేసింది కూడా మీరు కాదా 😀

        • సెంట్రల్ యునివర్సిటీ లో PhD చేసింది మాత్రం నేనే, నిజం, మీమీదొట్టు 😀

         • ఆ ఒట్టు ఏదో ప్రవీణ్ శర్మ మీద వేసేయండి పీడా విరగడ అవుతుంది 🙂

          • నేను అబద్దం చెప్తే కదండీ ఒట్టు కి పీడా విరగడయ్యేది, కాని నేను నిజమే చెప్తున్నానే!!! 😀
           సెంట్రల్ యూనివర్సిటి లో నిజంగానే PhD చేసాను, నమ్మరా!!!!! 😮

          • హ్మ్… నవతరంగం లో వ్యాసాలు వ్రాసిందీ మీరేననుకున్నా. కానీ రాఘవేంద్ర రావు సినిమాలో మనిషిని పోలిన మనుషులు ఏడు మంది ఉన్నట్టు బ్లాగ్లోకం లో సినీ అభిమానులైన సౌమ్యలు చాలామంది ఉన్నారన్నమాట…

          • లేదండీ, ఆ వ్యాసాలు రాసేది, ‘sowmya writes’ అనే బ్లాగు ఉన్నది V.B. సౌమ్య. నేను A.సౌమ్య ని. ఇద్దరం ఇంటి పేర్లు రాయకపోవడం వలన వచ్చింది చిక్కంతా :). V.B. సౌమ్య, హైదరాబాదు లో IIIT లో ఉంది, ఏ ఊరమ్మాయో తెలీదు. నేను మాత్రం విజయనగరం అమ్మయిని, HYD central university లో Ph.D చేసిన అమ్మాయిని. ఇప్పటికైనా మీ అందరి డౌటు తీరిందనుకుంటాను.

           నాకు తెలిసినంతవరకు V.B. సౌమ్య మీ బ్లాగు లో comments రాయలేదు. మీకు ఎప్పుడూ కామెంటేది నేనే 😀

          • ఇప్పుడు డాక్టర్ సౌమ్య అనాలా ? విజయనగరం సౌమ్య అనాలా ?జురాన్ సౌమ్య అనాలా ఇప్పుడు ?
           చిరంజీవి లా మన చిరంజీవి అని ఫాలో అవ్వాలా

          • మీరెలా పిలిచినా పలుకుతాను, నాకేమీ అభ్యంతరం లేదు 😀

 7. అవును క్షత్రియపుత్రుడు నుండి కొన్ని ఎపిసోడ్లకు ఎపిసోడ్లే ఎత్తేసాడు చౌదరి, సీతారామరాజు సినిమా ఎందుకో ఫ్లాప్ అయ్యింది కాని నాకు మాత్రం ఆ సినిమా నచ్చింది, ఇప్పటికి ఓ మూడు, నాలుగు సార్లు చూసుంటా.

 8. అసలు ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు గుర్తుందా? తన పెళ్ళి చెయ్యకపోతే పోస్ట్ మాన్ తో, పాలవాడితో, కూరల వాడితో జెండా ఎత్తేస్తానని ప్రతి సీన్లో బెదిరిస్తూ ఉంటుంది.

  బ్లాగాగ్ని గారూ, ఇలాంటి మరో రాక్షస చెల్లెలు , పల్నాటి పౌరుషం సినిమాలో కృష్ణంరాజు చెల్లెలు రాధిక, అన్న మీద ప్రేమతో భర్త చరణ్ రాజుని అడ్డంగా నరికిపారేస్తుంది.

  కాస్త ఈ మధ్య అన్నలతో ఫ్రెండ్ లాగా క్లోజ్ గా ఉండే చెల్లెల్ని చూపిస్తున్నారు. మరీ పాత సినిమాలైతే సెంటిమెంట్ పేరుతో అన్న చేతిలో కూడా హీరోయిన్ స్థాయిలో కౌగిలింతలకు గురయ్యే చెల్లెళ్ళే అందరూ! వీళ్ళ దుంపలు తెగ!

  • ఈ రకం వావివరసలు లేని వాళ్ళని చూస్తోంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

  • హ హ హ ..బాగా చెప్పారు సుజాత గారు ..పిండి చేసేసేవాడు నోట్లో పిడికిలి పెట్టుకొని

  • ఆ ఒక్కటి అడక్కు చెల్లి పాత్ర కి కొనసాగింపు కితకితలు సినిమాలో చెల్లి పాత్ర. రెండిటిలో ఆ చెల్లి పెళ్లి కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటుంది.
   తికమక

 9. హ హ హ భలే టాపిక్.
  అసలీ సిస్టరు సెంటిమెంటుకి తెరతీసింది, గీతాంజలి .. 70ల్లో అనేక నాగేశ్వర్రావు సినిమాల్లో ఆయన చెల్లెలు. కొన్నిట్లో గుడ్డిది కూడా ..
  తరవాత్తరవాత హీరో చెల్లెల్లు అంటే రేప్ కి గురయ్యే ఒక బొమ్మ అన్న అర్ధంతో నడిచింది కొంతకాలం.
  సుజాత గారూ .. ఈ అన్నా చెల్లెళ్ళ కౌగిలింతలు సూపరోసూపరు. కార్టూనిస్టు మల్లిక్ సినిమాల్ని వెక్కిరిస్తూ ఒక సెటైరు నవల రాశాడు. అందులో కాలేజిలో చదువుతున్న హీరో తోటి విద్యార్ధినికి ఏదో సాయం చేస్తాడు. ఆమె అన్నయ్యా అంటూ అతనికి అతుక్కు పోతుంది. అతను వెనక్కి తిరిగి చూస్తే అతని అనుచరులందరూ వెనకాల లైన్లో నించోనుంటారు. ఎందుకురా అంటే, మేం కూడా చెల్లెమ్మని కౌగలించుకుని ఓదారుస్తాం అంటారు. చాల్లెండి వెధవల్లారా మీ అందరి బదులూ నేనే కావిలించుకున్నాలే .. అని హీరో ఉవాచ!!!

  • అవునండీ! ఆ నవల పేరు “సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథ”! సినిమా టాపిక్ వచ్చిన ప్రతి సారీ తల్చుకోవలసిన నవల!

  • మీరు మీ బ్లాగ్ లో సాహిత్యం గురించే కాకుండా సినిమాల గురించి కూడా వ్యాసాలు వ్రాయండి కొత్తపాళీ గారు.

 10. నైసో!

 11. nice/funny discussion………….

 12. హీరో హీరోయిన్ తో రొమాన్స్ చేయోచు అదే హీరో గారి చెల్లెలు చేస్తే అది చుసిన
  మన హీరో కట్టలు తెంచుకున్న నది ప్రవహంవలె తన ఆవేశం అక్కడి అక్కడే
  హీరో తననీ చంపేస్తాడు ………
  అది చుసిన పిచ్చి జనం వంద అంటూ …………హిట్ చెస్తరూ…………….

 13. @సౌమ్య: HCU నా….అయితే మన బ్యాచ్చే! మనమూ HCU నే 2000 కమ్యూనికేషన్ పాసౌట్. మీది ఏ డిపార్ట్మెంట్?

  • @మహేష్ కుమార్

   ఒహ్, మీది HCU నా, నేను 2000 లో నే join అయ్యాను. 2009 వరకు అక్కడే ఉన్నాను 🙂
   Economics లో M.A, M.Phil, PhD కూడా అక్కడే చేసాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: