వ్రాసినది: mohanrazz | 2011/08/14

ముందా క్లైమాక్స్ మార్చు..

climax

సినిమా కి క్లైమాక్స్ ఆయువుపట్టు అంటారు. అసలు కథారచయిత కి కూడా ముందు క్లైమాక్స్ ఏమి చేయాలి అనేది ఐడియా ఉంటే ఆ కథని డెవెలప్ చేయడం ఈజీ అంటారు.  ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా రేంజ్ ని బాగా పెంచిన సందర్భాలు చాలా ఉన్నాయి.  అయితే హీరోల కాల్షీట్లు, ఇతరత్రా అంశాలూ కుదిరితే-  క్లైమాక్స్ తర్వాతయినా వ్రాసుకోవచ్చనే ధైర్యంతో, సగమే తయారైన కథ తో ముందు సినిమా మొదలెట్టేసి ఆ తర్వాత సరైన క్లైమాక్స్ కుదరక ఇబ్బంది పడి తూతూ మంత్రం క్లైమాక్స్ తో సరిపుచ్చిన సందర్భాలు తెలుగులో కోకొల్లలు. కానీ కొన్ని సార్లు క్లైమాక్స్ పకడ్బందీ గా ముందే వ్రాసుకుని, సినిమా తీసి, ఆ తర్వాత ప్రివ్యూ చూసాక అది అది తమకి నచ్చకో లేక జనాలకి ఎక్కదనో క్లైమాక్స్ మార్చిన సందర్భాలు లేదంటే ఇంకొన్ని సార్లు పూర్తిగా సినిమా తీసేసి, రిలీజ్ కూడా చేసేసాక- జనాలకి క్లైమాక్స్ నచ్చలేదన్న ఫీడ్ బ్యాక్ తెలిసాక – క్లైమాక్స్ మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి తెలుగు లో.

 
భారతీరాజా సీతాకోక చిలుక కి ముందు తీసిన ట్రాజెడీ క్లైమాక్స్- ప్రివ్యూ చూసాక ఎవరికీ నచ్చలేదుట. భారతీరాజా ఏమో ట్రాజెడీ క్లైమాక్స్ ఉన్న ప్రేమకథలే కలకాలం నిలిచిపోతాయనే కాన్సెప్ట్ లో ఆ క్లైమాక్స్ ని అలా డిజైన్ చేసుకున్నాట్ట. అయితే యూనిట్ సభ్యుల సూచనలమేరకు క్లైమాక్స్ మార్చాట్ట. అయితే అప్పటికీ పూర్తి సుఖాంతమైన క్లైమాక్స్ వ్రాయడానికి మనసొప్పక- ఇటు పూర్తి ట్రాజెడీ గానూ కాకుండా..అలాగని పూర్తి “సుఖాంతం” గానూ చేయకుండా క్లైమాక్స్ ని మార్చి తీసి విడుదల చేశార్ట.

 
మణిరత్నం గీతాంజలి విషయం లో – మరీ క్లైమాక్స్ పూర్తిగా మార్చడం కాదుగానీ- హీరో హీరోయిన్లిద్దరూ త్వరలో చావబోయే వాళ్ళుగా నటించిన ఈ సినిమా ని ప్రివ్యూ చూసాక – “మరీ నెగటివ్ మూడ్ లో ప్రేక్షకులని వదిలివేయకుండా- చివరి ఫ్రేం లో వీళ్ళిద్దరూ ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు కానీ బ్రతికినంత కాలం ఆనందం గా బ్రతుకుతారు- అని ఒక చిన్న వాక్యం చేరిస్తే- ఒక పాజిటివ్ ఫీల్ తో ముగించినట్టు  బాగుంటుందని” నాగార్జున ఫ్రెండ్/అభిమాని ఒకతను ఇచ్చిన సూచన మేరకు క్లైమాక్స్ లో ఆ ట్యాగ్ జతచేసార్ట. ఇవన్నీ చిన్న విషయాలే కానీ అంతిమ ఫలితాన్ని పెద్ద స్థాయి లో ప్రభావితం చేయగల విషయాలు.

 
ఇక చిరంజీవి విజేత సినిమాలో చిరంజీవి కిడ్నీ దానం చేసి ఆ డబ్బు తీసుకువస్తూంటే- దొంగలెవరో ఆ డబ్బునెత్తుకుపోతారు. సెంటిమెంట్ బాగా పండించొచ్చని వ్రాసుకున్న ఆ సీన్ ని ప్రివ్యూ లో చూసాక- చూసిన వాళ్ళంతా గట్టి సూచనలే చేసార్ట. కిడ్నీ అమ్మిన డబ్బు ఎవరో ఎత్తుకుపోతే ఆ తర్వాత వేరే రకంగా డబ్బు అందితే అసలు హీరో చేసిన త్యాగం (కిడ్నీ అమ్మడం) అర్థం లేకుందా పోతుందని చెప్పడం తో అక్కడ ( అతికించినట్టుగా ఉండే )ఒక ఫైట్ పెట్టి ఆ డబ్బు తిరిగి తీసుకువచ్చినట్టుగా మార్చార్ట.

 
ఇలా ప్రివ్యూ తర్వాత – రిలీజ్ కి ముందే క్లైమాక్స్ మార్చిన సందర్భాలు ఇంకొన్ని ఉన్నాయి కానీ- అసలు సినిమా రిలీజై-జనాల్లోకి వెళ్ళిన తర్వాత- జనాలకి నచ్చలేదని క్లైమాక్స్ మార్చడమో, ఇంకొకటో రెండో సీన్లు జత చేయడమో చేసిన సినిమాలూ ఉన్నాయి తెలుగులో. నాకు గుర్తున్న వాటిలో – రౌడీ దర్బార్ అని దాసరి నారాయణరావు సినిమా ఒకటి, బాబీ అని మహేష్ బాబు సినిమా ఒకటి- అలా రిలీజయ్యాక క్లైమాక్స్ మార్చుకున్నాయి.

ఏది ఏమైనా మంచి క్లైమాక్స్- సినిమా విజయానికి దోహదం చేసే అంశాల్లో ఖచ్చితంగా ముఖ్యమైనదే!


Responses

  1. పై రెండు విధాలుగా కాకుండా మా ఊళ్ళో మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎంటియార్ చనిపోయి, మళ్ళీ బ్రతికేశాడు. 🙂

  2. // చివరి ఫ్రేం లో వీళ్ళిద్దరూ ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు కానీ బ్రతికినంత కాలం ఆనందం గా బ్రతుకుతారు- అని ఒక చిన్న వాక్యం చేరిస్తే-

    ఇది మాత్రం అద్భుతమైన ఆలోచన. దీని ప్రభావం ప్రేక్షకుల చాలా ఉంది.

  3. నాకు మాత్రం మోహన్ బాబు హీరోగా వుండే సినిమా లో ఎంత తొందరగా వాడిని చంపేసి సినిమా ముగిస్తారో అన్నంత కంపరం వస్తుంది

  4. చాలామంది యువ దర్శకులు క్లైమాక్స్ విషయంలో తప్పటడుగు వేస్తారు.
    విశ్వనాథ్ లాంటి వాళ్ళే అద్భుతంగా తీస్తారు.

  5. మంచి రివ్యూ. అయినా ఇప్పుడా బాధ లేదులెండి. అప్పుడంటే కధంటూ ఒకటుంటుంది కనుక ప్రయోగాలకు వీలుండేది. స్టార్స్, ఫాల్స్ స్టార్ డం, ఫ్యామిలీ స్టార్ డం వచ్చాక ఆ గొడవేలేదు. కధ గురించి, క్లైమాక్స్ గురించి బెంగేలేదు. సాంగ్స్, ఫైట్స్, ఓవర్ హీరోయిజం సీన్స్, హీరో ఫ్యామిలీ, రక్తం, వంశం గురించి ( కులం అని అర్ధం చేసుకునేవారు అజ్ఞానులు ) ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేసే సీన్స్ ( ఎన్ని సార్లు ఒప్పుకున్నా సరే మళ్ళా మళ్ళా అదే సోది. ఈ సోది ఫ్యాన్స్ ను ఓటుబ్యాంకుగా మారుస్తుందని పిచ్చి ఆశ ) వీటన్నింటి మధ్య కధ ఉండేదే పిసరంత. అదికూడా హీరో ఏం చేసినా కరక్టే అన్న సింగిల్ ఎజెండాతో. ఇక క్లైమాక్స్ మార్చడం, దానికోసం బుర్రబద్దలు కొట్టుకోవడం out of question.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: