తేడాల సంగతి ప్రక్కన పెడితే, నిజానికి వీళ్ళిద్దరి మధ్యా చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కూడా కామెడీ సినిమాలు తీయడం లో ఒక తమకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. జంధ్యాల, రేలంగి ల తర్వాత హాస్య దర్శకుల విషయం లో ఏర్పడిన ఒక ఖాళీ స్లాట్ ని వీళ్ళిద్దరూ భర్తీ చేసారు. ఇద్దరూ చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీసి హిట్లు కొట్టి ఆ తర్వాత పెద్ద హీరోల తో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఇద్దరూ పెద్ద హీరోలతో కూడా కామెడీ చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పోలికలు. కాకపోతే ఇద్దరి మధ్య ఉన్న తేడా అనగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చే పాయింట్ ఒక్కటే. ఎస్వీ సినిమాల్లో బూతు కానీ డబల్ మీనింగులు కానీ లేకుండా చిన్నపిల్లలతో సహా ఇంటిల్లిపాది ధైర్యంగా చూడగలిగేలా ఉంటుంది. ఇవివి సినిమాల్లో ఒక్కోసారి కొంచెం డబల్ మీనింగులు గట్రా మోతాదు మించుతుంటాయి అప్పుడప్పుడు. డబల్ మీనింగుల సంగతి ప్రక్కన పెడితే అప్పట్లో నేను ఇవివి కి భీబత్సమైన ఫ్యాన్ ని. ఆయన డైలాగుల్లో పంచ్ లు కేక అనిపించేవి. కొన్ని శ్లేషలైతే చాలా ఇంటలెక్చువల్ గా ఉండేవి. ఇవివి సినిమాల్లో పంచ్ ల గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం కానీ, ప్రస్తుతానికి – ఓసారి మా ఫ్రెండ్స్ తో ఎస్వీ కి ఇవివి కి మధ్య తేడా ఏంటి అనే టాపిక్ మీద జరిగిన ఒక సరదా డిస్కషన్ ని మీతో పంచుకుందామని ఈ టపా 🙂 .
“ఇవివి కి ఎస్వీ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది ఒక్క ఎగ్జాంపుల్ తో చెప్పేయచ్చు”
“ఎట్లా”
“ఇప్పుడు.. ఎస్వీ డైరెక్షన్ లో శ్రీకాంత్, సంగీత హీరో హీరోయిన్లుగా ‘పెళ్ళాం ఊరెళితే ‘ అని ఒక సినిమా వచ్చింది. సపోజ్..జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్..ఇదే సినిమా ఇదే టైటిల్ తో ఇవివి కూడా తీసాడనుకుందాం..అంటే జస్ట్ వాళ్ళిద్దరి థాట్ ప్రాసెస్ లో డిఫరెన్స్ ఎలా ఉంటుందీ చెప్పడానికి- ఇద్దరూ సేం టైటిల్ తో, సేం హీరో హీరోయిన్లతో సినిమా తీసారని అనుకుందాం….”
“ఊ..”
” పెళ్ళాం ఊరెళ్ళాక- ఇక్కడ శ్రీకాంత్ ఏమి చేస్తాడు లేదా ఏమి చేయడానికి ట్రై చేస్తాడు అనేదానిమీద ఫోకస్ చేసి సినిమా తీస్తే అది ఎస్వీ కృష్ణారెడ్డి.
అలా కాకుండా,
శ్రీకాంత్ ని ఇక్కడే పెట్టేసి- పెళ్ళాం ఊరెళ్ళాక- ఏం చేస్తుంది లేదా ఆమె కి ఆ ఊళ్ళో ఏమేమి ఎక్స్‌పీరియెన్స్ లు ఎదురవుతాయి అనేదాని మీద ఫోకస్ చేసి సినిమా తీసాడనుకో..అది ఇవివి అన్నమాట.. 😀 “
అలా తీశాడే అనుకుందాం! బాబోయ్ అది మరో “ఆరుగురు పతివ్రతలు” అయినా అవచ్చు.
By: రవి చంద్ర on 2009/08/17
at 2:17 సా.
😀
By: mohanrazz on 2009/08/17
at 2:21 సా.
కేక!
By: గీతాచార్య on 2009/08/17
at 5:21 సా.
😀
By: రానారె on 2009/08/18
at 3:31 ఉద.