ఆ మధ్య RB చౌదరి సూపర్ గుడ్ సినిమాలు వరసగా హిట్ అయ్యాయి. కాస్టింగ్ నో లేదంటే కాంబినేషన్లనో లేదంటే ఇతరరకాల పైపై మెరుగుల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని వరస హిట్లిచ్చాడు RB చౌదరి. కథల్లో కూడా ఆయన మరీ మాస్ సినిమాల జోలికి పోకుండా సెంటిమెంట్ కామెడీ కలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లనిచ్చాడు. ఆయా కథల్లో సెంటిమెంట్ పండించడానికి హీరో పాత్రల్ని ఉదాత్తంగా, త్యాగపూరితంగా చిత్రిస్తూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. అయితే ఆ మధ్య ఏమైందంటే ఆయనకి తెలీకుండానే కథల్లో ఒకరకమైన ట్రాప్ లో పడిపోయి, కొన్నిరోజులు ఒకేతరహా కథల్నిచ్చాడు.
నువ్వు వస్తావని సినిమాలో సిమ్రన్ కి “కళ్ళు” పోతాయి. నాగార్జున “కిడ్నీ” అమ్మి ఆమె ఆపరేషన్ కి డబ్బు సర్దుతాడు. తర్వాత “నిన్నే ప్రేమిస్తే” సినిమా లో (ఈ సినిమా కి తమిళ్ ఒరిజినల్ కి టైటిల్ “నీ వరువాయరే” అంటే నువ్వు వస్తావని అని. అయితే ఆ టైటిల్ ని “తుళ్ళాదు మానం తుళ్ళుం” రీమేక్ అయిన నాగార్జున ప్రీవియస్ సినిమాకి వాడేసుకోడం వల్ల దీనికి నిన్నే ప్రేమిస్తా అని పెట్టుకోవాల్సి వచ్చింది )నాగర్జున “కళ్ళు” శ్రీకాంత్ కి పెడతారు. సౌందర్య గతం లో నాగార్జున ని ప్రేమించి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శ్రీకాంత్ కి పెట్టిన కళ్ళు నాగార్జునవే కాబట్టి శ్రీకాంత్ వెంటపడుతూంటుంది. ఇక శ్రీను సినిమా లో వెంకటేష్ “నాలుక” కోసివేసుకుంటాడు. అంటే హీరోయిన్ వెంకటేష్ ని మూగవాడు అనుకుంటూంది ముందు నుంచి. మూగవాడు కాదని తెలిస్తే తనతో చనువు గా ఉండదేమోనని హీరో కూడా అలాగే మెయింటెయిన్ చేస్తాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ అబద్దాన్ని నిజం చేద్దామని హీరోయిన్ కోసం నాలుక త్యాగం చేస్తాడు. అయితే తర్వాత ఆలోచిస్తే సిల్లీ గా అనిపిస్తాయేమో కానీ ఇవన్నీ అప్పట్లో మంచి హిట్ సినిమాలే. అయితే ప్రాబ్లెం ఈ సినిమాలతో కాదు. ఈ సినిమాల్ని చూసి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు తయారు చేసుకున్న కథలతో.
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రోజుల్లో తను తయారు చేసుకున్న కథ చెప్పాడు. (ఈ కథ ఇప్పటికి స్టేల్ అయిపోయింది కాబట్టి ధైర్యంగా ఇక్కడ వ్రాస్తున్నా) హీరోయిన్ డాక్టర్. హీరో వెంటపడుతూ ఉంటుంది. ఎప్పుడూ హీరో తో మాట్లాడాలని ఆయన ప్రక్కనే ఉండాలని ట్రై చేస్తుంటుంది. కానీ హీరో అడ్వాంటేజ్ తీసుకోబోతే దూరం జరుగుతూంటుంది. ఓవరాల్ గా ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే హీరో కి ఒక ప్రాబ్లెం వల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఉంటుంది. అది చేసిన డాక్టర్ కూడా హీరోయినే. ఆ హార్ట్ ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ది. చిన్న వయసు లో చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె హార్ట్ ని హీరో కి ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు. హీరోయిన్ కి ట్విన్ అయిన ఆమె హీరోయిన్ కి క్లోజ్ కాబట్టి హీరోయిన్ ఆ హార్ట్ ఉన్న హీరో తో గడపడానికి ఇష్టపడుతూంటుంది. చివరికి క్లైమాక్స్ లో ఇంకో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు స్టోరీకి.ఇదైనా ఒక రకం. ఇంకొకాయన ఇంకో స్టోరీ చెప్పాడు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బ్యాక్ డ్రాప్ లో. హమ్మో.
అప్పట్లో జోగి బ్రదర్స్ అని జెమిని లో ఒక ప్రోగ్రాం వచ్చేది. ఈ “పార్ట్‌లు పార్ట్‌లు” త్యాగం చేసే కాన్సెప్ట్ మీద ఒక “భయంకరమైన” సెటైర్ వేశారు. అఫ్ కోర్స్ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రోగ్రాం ఆగిపోయింది, అది వేరే విషయం!!
మీరు చెప్పిన కథ చదవగానే నాకు ఒక క్లింట్ ఈస్ట్ ఉడ్ సినిమా గుర్తోస్తోందే!
By: కె.మహేష్ కుమార్ on 2009/08/21
at 12:35 సా.
అవునా..అయినా నాకీ కథ చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ కి క్లింట్ ఈస్ట్ ఉడ్ తెలీదులెండి. ఎప్పుడొ ఏడెనిమిదేళ్ళ క్రితం చెప్పాడాయన మాకీ కథని!
By: mohanrazz on 2009/08/21
at 12:46 సా.
హమ్మో brain transaplantion ? నయం అలాంటి కథ సినిమా గా తీయలేదు, అంతవరకు సంతోషం. మీ topic selection అమోఘం.
By: sowmya on 2009/08/21
at 2:11 సా.
ఇదే హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కథతో ఓ ఏడెనిమిదేళ్ళ క్రితం భీమనేని శ్రీనివాసరావు చార్మి(ఇది ఆమె మొదటి సినిమా అనుకుంటా), దీపక్ లని పెట్టి ఏదో సినిమా తీసినట్లు గుర్తు.
By: బ్లాగాగ్ని on 2009/08/21
at 2:32 సా.
“నీ తోడు కావాలి” అనుకుంటా ఆ సినిమా పేరు. అయితే దానికంటే ముందే హార్ట్ ట్రాన్స్ప్లంటేషన్ మీద “సర్వర్ సుందరం గారి అబ్బాయి” అని ఒక సినిమా వచ్చింది. కోకిల, కీచురాళ్ళు, సంకీర్తన, ప్రియతమా, టైం లాంటి సినిమాలు తీసిన గీతా కృష్ణ దీనికి డైరెక్టర్. “హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద వచ్చిన మొదటి భారతీయ సినిమా” అని చెప్పేవాళ్ళు సినిమా ట్రైలర్ లో.
By: mohanrazz on 2009/08/21
at 2:38 సా.
మీరు వ్రాసే విధానంలోని సున్నిత హాస్యం సూపర్ బాసూ …
By: వెంకటరమణ on 2009/08/21
at 3:08 సా.
థాంక్యూ బాస్
By: mohanrazz on 2009/08/21
at 3:17 సా.
హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద కూడా శ్రీకాంత్, రాశి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర ధారులుగా “ప్రేయసి రావే!” అని సినిమా వచ్చింది.
అప్పుడు శ్రీకాంత్ హిట్లు రాక చాలా కష్టాల్లో ఉన్నాడు. అందుకని చిరంజీవి దాన్ని మోడరన్ దేవదాసు అని కూడా పొగిడేసినట్లు గుర్తు.
By: రవి చంద్ర on 2009/08/21
at 3:46 సా.
jagapathi babu ,maheswari,ruchita prasad, vanisri,combination lo inko kalakhandam vachindi. edo part naku correct ga gurthu ravadam ledu ..kani chustee entha comedy no.. evv direction anukunta..
By: sudheer on 2009/08/21
at 4:45 సా.
అయ్యా ఆ కళా ఖండం పేరు “జాబిలమ్మ పెళ్ళి”.. సర్రొగేట్ మదర్ అనే కాన్సెప్ట్ మీద కోదండరామిరెడ్డి గారు తీసిన సినిమా అది..
By: mohanrazz on 2009/08/21
at 5:06 సా.
అవును, ఆ సినిమా TV లో వస్తే నేను కూడా కష్టపడి చూసాను…. surrogate mother concept గురించి ఈ మధ్య మనకి తెలిసిందిగానీ, కోదండరామిరెడ్డి గారు ఎప్పుడో expect చేసేసారు India లో…నిజం గా కళాఖండమే, అద్భుత స్రుష్టి కూడాను!!!
By: sowmya on 2009/08/21
at 5:22 సా.
కాన్సెప్ట్ ని ఊహించడం వరకూ కోదండరామిరెడ్డి గొప్పతనం కరక్టే కానీ ఆ సినిమా ఎగ్జిక్యూషన్ చాలా దారుణం గా ఉంటుంది. సర్రొగేట్ మదర్ కాన్సెప్ట్ ని ఆ పల్లెటూరి జనాలకి అర్థం అయేలా చెప్పడానికి ఒక ప్యారలల్ స్టోరీ నడుపుతారు. ఒక గుడి ఉంటుంది ఊళ్ళొ. అది పాడుపడిపోతే అందులోని విగ్రహాన్ని మాత్రం వేరే గుడి లోకి మారుస్తారు. ఇది తప్పుకానపుడు సర్రొగేట్ మదర్ కాన్సెప్ట్ కూడా తప్పు కాదు అని చెప్పడానికి అన్నమాట. అయితే అసలు కథ కంటే ఈ కొసరు కథ ఎక్కువవడం వల్లా, ఇంకొన్ని ఎబ్బెట్టు సన్నివేశాల వల్లా దారుణంగా ఫ్లాపయింది. అయితే సర్రొగేట్ మదర్ కాన్సెప్ట్ మీద సీరియస్ గా వచ్చిన సినిమా క్రాంతికుమార్ సౌందర్యని పెట్టి తీసిన 9 నెలలు. నేను చూడలేదీ సినిమాని.
By: mohanrazz on 2009/08/21
at 5:40 సా.
@ సుధీర్
ఆ మహేశ్వరీ, జగపతిబాబుల సినిమా “జాబిలమ్మ పెళ్ళి”.
ఎప్పటిలానే మీ టపా బాగుంది.
By: bhavani on 2009/08/21
at 5:05 సా.