ఈ టివి లో వచ్చే “ఢీ” ప్రోగ్రాం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. దానిలో వచ్చే జడ్జి తరుణ్ మాస్టర్ కూడా జనాలకి బాగా పరిచయం అయ్యాడు. నిజానికి తరుణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేసాడు. హిందీ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ లాంటి వాళ్ళకి, రజనీ “బాషా” లాంటి సినిమాలకి కొరియోగ్రఫీ చేసాడు. అయితే జనాలకి మన లారెన్స్ లాంటి వాళ్ళు తెలిసినంతగా మొదట్లో ఈయన తెలీదు. సరే, ఢీ ప్రోగ్రాం పుణ్యమా అని జనాలకిప్పుడు ఈయన బాగా తెలిసాడు. ఆ మధ్య “ఈనాడు” లో చిన్న ఇంటర్వ్యూ లాంటి ఆర్టికల్ వచ్చింది ఈయనది(మీ లో కొంత మంది చదివే వుంటారు) . ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే –
“నేను మొన్నొక సారి మంత్రాలయం వెళదామని బయలుదేరాను. మధ్యలో మదనపల్లి దగ్గర మంత్రాలయం వెళ్ళే రోడ్ కనుక్కుందామని దారి లో ఎవరినో అడిగాను. అతను కార్లో ఉన్న నన్ను గుర్తు పట్టి, ‘సార్, మీరు తరుణ్ మాస్టర్ కదా, మంత్రాలయం రోడ్డా?..ఊ..అదీ..సార్, మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది సార్, రోడ్డు..ఇలా నేరు గా వెళ్ళి..సార్, మీరు ఇచ్చే రేటింగ్ కూడా చాలా కరెక్ట్ గా వుంటుంది సార్…ఇలా నేరు గావెళ్ళి ఎడమ వెళ్ళండి సార్..’ ఇలా చెప్పాడు..నాకు చాలా ఆనందమనిపించింది. అలాగే కొంత దూరం వెళ్ళాక కర్నూల్ దగ్గర అనుకుంటా మళ్ళీ ఎవరినో అడిగాను..అక్కడా ఇంతే.. ‘సార్, తరుణ్ మాస్టర్ గారూ..మీ ఢీ ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తుంటాం సార్..మీ జడ్జిమెంట్ సింప్లీ సూపర్బ్ సార్ ‘..ఇలా.. అడిగిన ప్రతి చోటా ఇలాగే…సరే మొత్తానికి మంత్రాలయం వెళ్ళాను..దర్శనం కోసం జనరల్ క్యూ లో నుంచున్నాను. క్యూ లో వున్న వాళ్ళలో కొంతమంది నన్ను గమనించడం, వాళ్ళలో వాళ్ళే జడ్జి గారు అని గుసగుసలాడుకోవడం,ఆ తర్వాత కాసేపటికి అంతా నా చుట్టూ గుమికూడిపోవడం జరిగిపోయాయి..ఇలా అంత గోల గోల గా వుంటే అటు వచ్చిన పోలీసులు – జనాలంతా నన్ను జడ్జి గారు, జడ్జి గారు అంటూంటే చూసి, నేను ఏ జిల్లా జడ్జో అనుకుని జనరల్ క్యూ లో నుంచి తీసుకెళ్ళె వి.ఐ.పి. క్యూ లో నుంచోబెట్టి దర్శనం చేయించి మరీ పంపారు..”
అయితే అంతా బాగానే ఉంది కానీ- ఇదంతా చదివాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే (జస్ట్ ఫర్ ఫన్) – “మంత్రాలయం పోలీస్ క్వార్టర్స్ లో కేబుల్ కనెక్షన్ లేదా?” అని. ఎందుకంటే ..ఢీ ప్రోగ్రాం ఎంతలా పాపులర్ అయిందంటే మదనపల్లి దగ్గర ఎవరో చదువురాని ఆయన, కర్నూల్ దగ్గర ఎవరో చదువుకున్నాయన..ఇంకా ఎక్కడికెళ్ళినా ఎవరో ఒకరు- ‘తరుణ్ మాస్టర్, మీ జడ్జిమెంట్ సూపర్, మీ రేటింగ్ హైలెట్’ అన్నారు..క్యూ లో అందరూ గుర్తు పట్టారు..(వీటన్నిటి ద్వారా- నేను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాను అని చెప్పదల్చుకున్నారు తరుణ్ మాస్టర్..) మరి పోలీసులు మాత్రం ఈయన ఎవరో జిల్లా జడ్జి అయివుంటారని ఎలా అనుకున్నారో !!!
kummav baass
dharma sandheham
By: chichesh on 2009/07/03
at 4:21 సా.
🙂
By: mohanrazz on 2009/07/03
at 11:12 సా.
veellanta sonta dabbalu kottukunednuke puttaru saar!..plus, ee reality shows lo zee telugu punyama ani, dramatization entati level kaina vellipotundi…maname verri vallalla nammutuntaam..pchh!
By: Prashanth on 2009/07/03
at 4:54 సా.
ఏం చేస్తాం బాస్..టి.వి.ల్లో ఒకప్పుడు అంత్యాక్షరి ప్రోగ్రాం ల హవా నడిచింది..ఆ తర్వాత సీరియళ్ళ యుగం నడిచింది..ఇప్పుడు ‘స్క్రిప్టు ప్రకారం నడిచే రియాల్టీ షో లు ‘….జనాలందరికీ ఇలాగే వెగటు పుట్టే వరకూ ఇంతే!!!
By: mohanrazz on 2009/07/03
at 11:11 సా.
> జనాలందరికీ ఇలాగే వెగటు పుట్టే వరకూ ఇంతే!!!
🙂
By: panipuri123 on 2009/07/04
at 4:09 ఉద.
మంచి ప్రశ్న.
1) జనసామాన్యానికి తెలిసే సాధారణ సమాచారం కూడ పోలీసులకి తెలియదు.
2) ఎఫెక్టు బాగుందని తరుణ్ మాస్టర్ కథని కాస్త రసవత్తరం చేశాడు.
By: కొత్తపాళీ on 2009/07/03
at 9:14 సా.
కొత్తపాళీ గారు – నాకెందుకో ఇది పోలీసుల తప్పు గా కంటే, తరుణ్ మాస్టర్ స్క్రీన్-ప్లే లో డిఫెక్ట్ అనే అనిపించింది.. 🙂
By: mohanrazz on 2009/07/03
at 11:08 సా.
haha .. good catch .. 🙂
By: a2zdreams on 2009/07/04
at 2:11 ఉద.
😆
You got a very interesting doubt 🙂
By: జీడిపప్పు on 2009/07/04
at 8:55 ఉద.
Policesulu mari antha picchi vallu kadule bossu… ee Master ke Sonta dabba ekkuva anukunta…Kali Kalam..:)
By: Yogi on 2009/07/09
at 6:31 సా.